ఇంటి చిట్కాలకు మించి ఆలోచిద్దాం: హెయిర్ ఫాల్‌కి అసలైన పరిష్కారం ఏది?
కోల్‌కాతాకు చెందిన యానీ(28), ఢిల్లీకి చెందిన భావన(40) లకు, ఈ చిన్న చిన్న మార్పులే పెద్ద ఆందోళనగా మారాయి. వీరి కథ, ఈ రోజుల్లో చిన్న వయసులోనే జుట్టు రాలడం వల్ల ఇబ్బంది పడుతున్న ఎంతోమంది భారతీయ మహిళల కథ లాంటిదే.పోషకాహార లోపం, స్ట్రెస్ (stress), హార్మోన్ల మార్పుల వల్ల సిటీల్లో ఉండేవాళ్లకు హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువవుతోందని డెర్మటాలజీ స్టడీస్ చెబుతున్నాయి. అందరిలాగే వీళ్ళు కూడా మొదట్లో ఇంటి చిట్కాలు, రకరకాల నూనెలు వాడి చూసారు. కానీ చివరికి క్లినికల్ ట్రీట్మెంట్ (clinical treatment) అవసరమని తెలుసుకున్నారు.ఇంటి చిట్కాలు పనిచేయకపోతే?యానీ, భావన ఇద్దరూ హెయిర్ ఫాల్ లక్షణాలు స్పష్టంగా కనిపించాయని చెప్పారు.షాంపూ చేసుకున్నప్పుడు చేతి నిండా జుట్టు రావడం యానీకి గుర్తుంది. ''చేతిలో అంత జుట్టు చూసి నాకు భయమేసింది. అసలు ఏం జరుగుతోంది? నెక్స్ట్ ఏం చెయ్యాలి? అనిపించింది. ఆన్లైన్లో దొరికిన ప్రతి కిచెన్ రెమెడీ (kitchen remedy) ట్రై చేశాను. కానీ ఏదీ పనిచెయ్యలేదు. అవి ట్రీట్మెంట్ కోసం చేసినవి కాదు, జనరల్ చిట్కాలు మాత్రమే" అని అన్నారు.భావన కూడా ఇలాంటి కన్ఫ్యూజన్లోనే ఉండేవారు. తల స్నానం చేసాక దువ్వెన నిండా జుట్టు వచ్చేది. కరివేపాకు, ఉల్లిపాయ రసం.. అన్నీ ట్రై చేశాను, కానీ లాభం లేకపోయింది. ఏ హెయిర్ సీరమ్ (hair serum) వాడాలో తెలియక దాదాపు ఒక నెల రోజులు అయోమయంలో ఉన్నానని ఆమె చెప్పారు.వీరి అనుభవం డాక్టర్లు చెప్పేదాన్ని నిజం చేస్తోంది: ఇంటి చిట్కాలు సేఫ్‌గా అనిపించినా, అవి దీర్ఘకాలిక హెయిర్ ఫాల్‌ను తగ్గించలేవు.సైన్స్ వైపు మలుపువీళ్లు తీసుకున్న నిర్ణయం ఒక్క రోజులో జరిగింది కాదు. నెలల తరబడి ఇంటి వైద్యం, డాక్టర్ల చుట్టూ తిరిగి విసిగిపోయిన తర్వాత తీసుకున్న నిర్ణయం. యానీ స్వయంగా ఫార్మాస్యూటికల్ సొల్యూషన్స్ గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడే ఆమెకు ఆన్లైన్లో Bontress గురించి తెలిసింది."నేను ఒక మంచి ఫార్మా కంపెనీ ప్రొడక్ట్ కోసం వెతుకుతున్నాను. ఏదో పేరుకు కాకుండా.. నిజంగా ట్రీట్మెంట్ కోసం పనిచేసేది కావాలి." ఆమె అందులోని ఇంగ్రీడియంట్స్ (ingredients) చెక్ చేసి, గూగుల్‌లో రివ్యూస్ చదివిన తర్వాతే డిసైడ్ అయ్యాను'' అని యానీ చెప్పారు.భావనకు, ఆమె కజిన్ Bontress Pro+ గురించి చెప్పారు. జుట్టు పెరగడానికి ఇందులో సైంటిఫిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని తెలుసుకున్నారు. Nykaaలో రివ్యూస్ చూసాక ఆమె నమ్మకం ఇంకా బలపడింది. చాలామంది తమకు 'బేబీ హెయిర్' (baby hair) వస్తోందని, హెయిర్ ఫాల్ తగ్గిందని రాశారు. అది చూశాక నాకు నమ్మకం వచ్చింది" అని భావన అన్నారు.మార్పు నిశ్శబ్దంగా వచ్చినప్పుడుఇద్దరూ అద్భుతాలు జరుగుతాయని ఆశించలేదు. హెయిర్ ఫాల్ తగ్గడానికి 6-8 వారాలు, కొత్త జుట్టు రావడానికి కనీసం 3 నెలలు పడుతుందని సైన్స్ చెబుతోంది.యానీకి, నుదుటి దగ్గర సన్నని కొత్త వెంట్రుకలు రావడం కనిపించింది. మా అమ్మ నన్ను చూసి, 'నీకు చాలా బేబీ హెయిర్స్ వస్తున్నాయే' అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఇది నిజంగా పనిచేస్తోందని. ఆమె ప్రతి రాత్రి క్రమం తప్పకుండా (without fail) Bontress వాడారు.భావన ఎక్స్పీరియన్స్ కూడా అలాగే ఉంది. ''ఒకటిన్నర నెల తర్వాత, నాకు బేబీ హెయిర్ కనిపించింది. కానీ నాకు డౌట్ వచ్చింది. సో, పార్లర్‌కు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని చెక్ చేయమన్నాను. తను 'అవును మేడమ్, చిన్న వెంట్రుకలు వస్తున్నాయి'' అని చెప్పింది. అది వినగానే చాలా హ్యాపీగా అనిపించింది." దువ్వెనలో జుట్టు రావడం కూడా తగ్గిందని ఆమె గమనించారు.చిత్రం: Bontress Pro+తో భావన జుట్టు పెరుగుదల ప్రయాణంఎవరూ మాట్లాడని ఎమోషనల్ మార్పుజుట్టు పెరగడమే కాదు, ఇద్దరూ మానసికంగా కూడా చాలా రిలీఫ్ ఫీలయ్యారు. రిజల్ట్ రాకముందు పడ్డ టెన్షన్ గురించి.. ''ఇది పనిచేయడం మొదలుపెట్టాకే నేను ప్రశాంతంగా నిద్రపోగలిగాను. అంతకు ముందు వరకు చాలా కంగారుగా ఉండేది'' అని యానీ చెప్పారు.ఏ సీరమ్ కొనాలన్నా భావనకు మొదట్లో భయంగా ఉండేదట. "ఇవి చాలా కాస్ట్లీ (costly). డబ్బులు ఖర్చు పెట్టి రిజల్ట్ రాకపోతే బాధేస్తుంది కదా. Bontress వాడేటప్పుడు కూడా ఇది పనిచేస్తుందా లేదా అని డౌట్ ఉండేది. కానీ మార్పు కనిపించాక చాలా రిలీఫ్‌గా అనిపించింది'' అని అన్నారు.హెయిర్ ఫాల్ వల్ల ఆడవాళ్లు ఎంత ఎమోషనల్ స్ట్రెస్ ఫీలవుతారో వీరి కథలు చెబుతున్నాయి. అందుకే ఇప్పుడు చాలామంది సోషల్ మీడియా చిట్కాలను పక్కన పెట్టి, Bontress లాంటి క్లినికల్ సొల్యూషన్స్ వైపు వస్తున్నారు. యానీ చెప్పినట్టు: ట్రీట్మెంట్ అన్నాక టైమ్ పడుతుంది. మ్యాజిక్ లాగా జరగదు. కానీ ట్రీట్మెంట్ కోసం చేసిన ప్రొడక్ట్ అయితే కచ్చితంగా పనిచేస్తుంది. భావన కూడా.. టెన్షన్ పడకండి. సైన్స్ ప్రకారం పనిచేసే ప్రొడక్ట్ ఎంచుకోండని అన్నారు.
కదులుతున్న కారులో గ్యాంగ్‌రేప్: డ్యాష్ క్యామ్‌తో సీఈవో గుట్టు రట్టు
రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఉదయపూర్ సామూహిక అత్యాచార ఉదంతం కలకలం రేపింది. ఈ దురాగతానికి సంబంధించి అత్యంత దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కంపెనీ సీఈవో పుట్టినరోజు, లేట్-నైట్ పార్టీలో మహిళా ఉద్యోగిపై లైంగిక దాడి చేశారు. బాధితురాలిని ఇంట్లో దింపుతామని నమ్మించి, మార్గమధ్యలో మత్తు పదార్థం ఇచ్చి అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డారు. డాష్‌క్యామ్ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. పుట్టిన రోజు పార్టీ తర్వాత ఇంటి దగ్గర దింపుతామని చెప్పి కంపెనీ సీఈవో మరో ఇద్దరితో కలిసి కదులుతున్న కారులో మహిళా ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం చేశాడు. ఈ కేసులో కంపెనీ సీఈవో జయేష్, మరో ఎగ్జిక్యూటివ్ గౌరవ్, అతని భార్య శిల్ప సహా ముగ్గురిని ఉదయ్ పూర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను గురువారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకుని, తరువాత స్థానిక కోర్టు రిమాండ్‌కు తరలించారు.పోలీసుల ప్రకారం.. సీఈవో పుట్టిన రోజు సందర్భంగా శోభాగ్పురాలోని ఒక హోటల్లో రాత్రి 9 గంటల ప్రాంతంలో పార్టీ ప్రారంభమై దాదాపు తెల్లవారుజామున 1.30 గంటల వరకు కొనసాగింది. బాగా లేట్ అయింది కాబట్టి కారులో ఇంట్లో దింపుతామని ఆఫర్ చేశారు. దారి మధ్యలో సిగరెట్‌ను పోలిన మత్తు పదార్థాన్ని ఇచ్చారని బాధితురాలు ఆరోపించింది. అది తిన్న తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాననీ, అనంతరం తనపై కారులోనే అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. మెలకువ వచ్చిన తరువాత చెవిపోగులు, ముఖ్యంగా లోదుస్తులు మాయం కావడం ప్రైవేట్ పార్ట్స్‌పై గాయాలు ఆమెలో భయాన్ని రేపాయి. దీంతో కారు డాష్‌క్యామ్ ఫుటేజీలో పరిశీలించాక జరిగిన దారుణమంతా రికార్డ్ అయిందని గుర్తించింది. డిసెంబర్ 23న పోలీసులకు ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 21 తెల్లవారుజామున ఈ సంఘటన జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ ఆఫ్ యోగేష్ గోయల్ తెలిపారు. బాధితురాలు లైంగిక వేధింపులకు గురయినట్టు వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించినట్టు తెలిపారు. ఈ కేసు దర్యాప్తును అదనపు పోలీసు సూపరింటెండెంట్ మాధురి వర్మకు అప్పగించారు. దర్యాప్తును మరింతగా కొనసాగించడానికి పోలీసులు కారులో ఏర్పాటు చేసిన డాష్‌క్యామ్ నుండి ఆడియో, వీడియో రికార్డింగ్‌లను కూడా పరిశీలిస్తున్నారు.
‘పతంగ్’మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: పతంగ్నటీనటులు: వంశీ పూజిత్, ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ఎస్పీబీ చరణ్, వడ్లమాని శ్రీనివాస్,విష్ణు ఓఐ, అను హసన్ తదితరులురచన, దర్శకత్వం: ప్రణీత్ ప్రత్తిపాటినిర్మాతలు: విజయ్ శేఖర్ అన్నె, సంపత్ మాకా, సురేష్ రెడ్డి కొత్తింటి, నాని బండ్రెడ్డిసంగీతం: జోస్ జిమ్మిసినిమాటోగ్రఫి: శక్తి అరవింద్ఎడిటర్: చాణక్య రెడ్డి తూర్పువిడుదల తేది: డిసెంబర్ 25, 2025ఈ ఏడాది చివరి వారంలో తెలుగులో ఛాంపియన్, శంబాల, దండోరాతో పాటు మొత్తం ఎనిమిది సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వాటిల్లో ఒకటి పతంగ్. ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ బాగున్నప్పటికీ నటీనటులంతా కొత్తవారే కావడం.. ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయకపోవడంతో సినిమాపై బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. దీంతో ఎలాంటి అంచనాలు లేకుండానే డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘పతంగ్’ కథేంటంటే.. హైదరాబాద్‌లోని ఓ బస్తీకి చెందిన విజయ్ కృష్ణ అలియాస్ విస్కీ(వంశీ పూజిత్), అదే ప్రాంతంలో ఉండే రిచ్ కిడ్ అరుణ్(ప్రణవ్ కౌశిక్) చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఒక్క రోజు కూడా కలుసుకోకుండా ఉండలేరు. అలాంటి ప్రాణ స్నేహితుల జీవితంలోకి ఐశ్వర్య (ప్రీతి పగడాల) ప్రవేశిస్తుంది. ఆమెది కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్. ఏ విషయంలో అయినా సొంతంగా, త్వరగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటి అమ్మాయి మొదట విస్కీతో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత అరుణ్‌ని ఇష్టపడుతుంది. ఆమె వల్ల ప్రాణ స్నేహితులైన విస్కీ, అరుణ్‌ల మధ్య విబేధాలు వస్తాయి. ఐశ్వర్యను దక్కించుకునేందుకు ఇద్దరి మధ్య పతంగ్‌ల పోటీ పెడతారు. ఇద్దరి మధ్య పతంగ్‌ల పోటీనే ఎందుకు పెట్టారు? ఈ పోటీలో ఎవరు గెలిచారు? చివరకు ఐశ్వర్య ఎవరికి దక్కింది? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. కొన్ని సినిమా కథలలో కొత్తదనం ఉండదు. అలాంటి కథతో ఇప్పటికే చాలా సినిమాలే వచ్చి ఉంటాయి. అయినా కూడా తెరపై చూస్తుంటే ఎంజాయ్ చేస్తాం. అలాంటి సినిమానే పతంగ్. ఈ సినిమాలో చెప్పుకోవడానికి కథే ఉండదు. దర్శకుడు ప్రణీత్ ప్రత్తిపాటి ఎంచుకున్న ట్రయాంగిల్ లవ్‌స్టోరీ పాయింట్ కూడా చాలా రొటీన్. అయితే దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ చాలా ఫ్రెష్‌గా, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఆర్య, ప్రేమదేశం లాంటి ట్రైయాంగిల్ లవ్‌స్టోరీని హైదరాబాద్ స్టైల్లో చెబుతూ.. తనదైన స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేశాడు దర్శకుడు ప్రణీత్. సన్నివేశాలు పాతవే అయితే.. డైలాగ్స్ ఫ్రెష్‌గా, యూత్‌ని ఆకట్టుకునేలా ఉంటాయి. అలా అని బూతు సంభాషణలు, సన్నివేశాలేవి ఇందులో ఉండవు. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా సినిమాను తెరకెక్కించారు.ఫస్టాఫ్ మొత్తం ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఐశ్వర్య-విస్కీల లవ్‌స్టోరీతో పాటు అరుణ్‌తో ఐశ్వర్య క్లోజ్ అయ్యేలా సాగే సన్నివేశాలన్నీ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తాయి. అలా చూస్తుండగానే ఇంటర్వెల్ అవుతుంది. ఇక సెకండాఫ్ ప్రారంభంలో కాస్త సాగదీతగా అనిపించినప్పటికీ.. పతంగ్‌ల పోటీ మొదలైన తర్వాత పరుగులు పెడుతుంది. సెకండాఫ్ కథ మొత్తం పతంగ్‌ల పోటీ చుట్టూనే తిరుగుతుంది. అయినా కూడా ఒక్క చోట బోర్ కొట్టదు. విష్ణు ఇచ్చే కామెంటరీ నవ్వుల డోస్‌ని మరింత పెంచేస్తుంది. ఇక ముగింపులో దర్శకుడు ఇచ్చిన సందేశం కూడా యువతను ఆలోచింపజేస్తుంది. మొత్తంగా కొత్త కథను ఆశించకుండా పతంగ్ సినిమాకు వెళ్తే మాత్రం రెండున్నర గంటల పాటు హాయిగా ఎంటర్టైన్ అవ్వొచ్చు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన నటీనటులంతా కొత్తవారే.అయినా కూడా చక్కగా నటించారు. హైదరాబాద్‌లోని బస్తీ యువకుడు విస్కీగా వంశీ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రణవ్ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రీతి పగడాల ఇందులో హీరోయిన్గా నటించింది.కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్ ఉన్న ఐశ్వర్య పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేసింది. అరుణ్ చెల్లిగా నటించిన విజ్ఞాని తెరపై క్యూట్‌గా కనిపించింది. అరుణ్ తండ్రిగా నటించిన ఎస్పీ చరణ్.. ఎమోషనల్ సీన్లని బాగా పండించాడు. అరుణ్‌ని ఇష్టపడే లక్ష్మీ పాత్ర పోషించిన నటి కూడా బాగా చేసింది. ముఖ్యంగా పతంగ్‌లో పోటీలో ఆమె చేసిన డ్యాన్స్ నవ్వులు పూయిస్తుంది. అరుణ్-విస్కీల ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో పాటు మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. జోస్ జిమ్మీ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు వెరైటీగా, ఆకట్టుకునేలా ఉంటాయి. బీజీఎం అదిరిపోయింది. శక్తి అరవింద్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. చిన్న సినిమానే అయినా నిర్మాణ విలువలు బాగున్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
నకిలీ ఆరోగ్య ఉత్పత్తులతో జాగ్రత్త
నేటి కాలంలో ఆరోగ్యం మరియు పోషణ మన రోజువారీ జీవితంలో విడదీయరాని భాగాలుగా మారాయి. మనం తీసుకునే ఉత్పత్తులపై నమ్మకం గతంలో కంటే ఎంతో ముఖ్యమైంది. అయితే నకిలీ ఆరోగ్య ఉత్పత్తుల పెరుగుతున్న ముప్పు ఈ నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఇది అసలైన బ్రాండ్లకే కాదు, వినియోగదారుల ఆరోగ్యానికీ తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పోషణ మరియు వెల్నెస్ సంస్థ అయిన హెర్బలైఫ్ ఇండియా, నకిలీ ఉత్పత్తులపై అవగాహన పెంచేందుకు మరియు ఆరోగ్యం వెల్నెస్ రంగంలో అసలితనం యొక్క ప్రాధాన్యతను తెలియజేయేందుకు ఒక శక్తివంతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది.నకిలీ పోషక సప్లిమెంట్లు చాలాసార్లు నియంత్రణలేని కేంద్రాల్లో తయారవుతాయి. అక్కడ భద్రత, ప్రభావాన్ని నిర్ధారించడానికి అవసరమైన కఠినమైన పరీక్షలు మరియు నాణ్యత తనిఖీలు ఉండవు. ఇవి ఒకే విధమైన ప్యాకేజింగ్, లేబుళ్లతో అసలైనవిగా కనిపించవచ్చు; కానీ వాటిలో ధృవీకరించని లేదా హానికరమైన పదార్థాలు ఉండే అవకాశముంది. హెర్బలైఫ్ ఇండియా తాజా అవగాహన ప్రచారం వినియోగదారులకు ఈ ప్రమాదాల గురించి తెలియజేయడమే కాకుండా, నకిలీ ఉత్పత్తులు డబ్బు వృథా చేయడమే కాకుండా వ్యక్తిగత ఆరోగ్యం మరియు శ్రేయస్సును కూడా హానిచేయవచ్చని స్పష్టంగా తెలియజేస్తోంది.హెర్బలైఫ్ ఇండియా అసలితనంపై తన కట్టుబాటును సంస్థ కార్యకలాపాల పునాది నుంచే ప్రారంభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన “Seed to Feed” తత్వం ద్వారా. ముడి పదార్థాల సేకరణ నుంచి తుది తయారీ వరకు ప్రతి దశలో కఠినమైన నాణ్యత నియంత్రణను అమలు చేసే ఈ సమగ్ర ప్రక్రియ, అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తుంది. శాస్త్రీయ నవీనత మరియు పారదర్శకత సమన్వయంతో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన అత్యున్నత నాణ్యత గల పోషక ఉత్పత్తులనే వినియోగదారులకు అందిస్తున్నామని హెర్బలైఫ్ నిర్ధారిస్తుంది.ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా.. హెర్బలైఫ్ ఇండియా వినియోగదారులను అవగాహనతో కూడిన, బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకునేలా సాధికారత కల్పిస్తోంది. భారతదేశంతో పాటు ప్రపంచంలోని 90కు పైగా దేశాల్లో హెర్బలైఫ్ ఉత్పత్తులు కేవలం శిక్షణ పొందిన స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల ద్వారానే విక్రయించబడుతున్నాయని సంస్థ మరోసారి స్పష్టం చేస్తోంది. సరైన వినియోగం మరియు ఉత్పత్తుల అసలితనం గురించి వినియోగదారులకు మార్గనిర్దేశం చేయడానికి ఈ అసోసియేట్లకు శిక్షణ ఇస్తారు. హెర్బలైఫ్ ఏ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా లేదా అనధికార విక్రేతల ద్వారా తన ఉత్పత్తులను విక్రయించదు. కేవలం స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల నుంచి కొనుగోలు చేసి అసలితనాన్ని నిర్ధారించడం ద్వారా, వినియోగదారులు తమ ఆరోగ్య రక్షణలో చురుకైన పాత్ర పోషించవచ్చు.ఈ అవగాహన కార్యక్రమం బాధ్యతాయుత సంస్కృతిని పెంపొందించే ప్రయత్నం. నకిలీకరణ అనేది ఒక సామూహిక సామాజిక సమస్య. దీని పరిష్కారానికి వినియోగదారులు, బ్రాండ్లు మరియు సంబంధిత అధికారులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వెల్నెస్ రంగంలో మోసాల నుంచి ప్రజలను రక్షించడానికి అవగాహన మరియు సహకారం అత్యంత అవసరమని హెర్బలైఫ్ తీసుకున్న ఈ ముందడుగు స్పష్టంగా తెలియజేస్తోంది.ఆరోగ్యమే సంపదగా భావించే ఈ కాలంలో, అసలితనంపై ఎలాంటి రాజీకి అవకాశం లేదని హెర్బలైఫ్ ఇండియా మనకు గుర్తు చేస్తోంది. సందేశం స్పష్టమైనది: మీ ఆరోగ్యానికి అసలైనదే అర్హత. విద్య, నమ్మకం మరియు కట్టుబాటుతో, ప్రతి హెర్బలైఫ్ ఉత్పత్తి నాణ్యత, భద్రత మరియునిజాయితీకి ప్రతీకగా నిలవాలనే లక్ష్యంతో, వినియోగదారుల రక్షణలో కొత్త ప్రమాణాలను సంస్థ నెలకొల్పుతోంది.హెర్బలైఫ్ లిమిటెడ్ గురించిహెర్బలైఫ్ (NYSE: HLF) అనేది ప్రముఖ ఆరోగ్య మరియు వెల్నెస్ సంస్థ, సమాజం మరియు ప్లాట్‌ఫారమ్, ఇది 1980 నుంచి శాస్త్రీయ ఆధారాలతో కూడిన పోషక ఉత్పత్తులు మరియు స్వతంత్ర డిస్ట్రిబ్యూటర్లకు వ్యాపార అవకాశాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తోంది. ప్రపంచంలోని 90కు పైగా మార్కెట్లలో, ఆలోచన కలిగిన డిస్ట్రిబ్యూటర్ల ద్వారా హెర్బలైఫ్ ఉత్పత్తులు వినియోగదారులకు చేరుతున్నాయి. వ్యక్తిగత మార్గదర్శనం మరియు సహాయక సమాజం ద్వారా, ప్రజలను మరింత ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని అనుసరించేందుకు ప్రోత్సహిస్తూ వారు తమ ఉత్తమ జీవితాన్ని గడపేందుకు తోడ్పడుతోంది. మరింత సమాచారం కోసం దయచేసి Herbalife సందర్శించండి.
2026 కవాసకి వెర్సిస్ 650 లాంచ్: ధర ఎంతంటే?
వరుసగా రెండో మ్యాచ్‌లోనూ శతక్కొట్టిన పడిక్కల్
కేకేఆర్ స్టార్‌కు తీవ్ర గాయం.. స్ట్రెచర్‌పై ఆస్పత్రికి తరలింపు!
మెక్‌డొనాల్డ్స్‌లో పార్ట్‌టైం జాబ్ నుంచి..ఫ్లయింగ్ ఆఫీసర్ రేంజ్‌కి..!
‘తిరుమలలో భక్తుల భద్రతను గాలికొదిలేశారు’
H-1B ఆంక్షలు : భారీగానే ఇండియాలో అమెరికా టెక్ దిగ్గజాల ఉద్యోగాలు
స్టాక్ మార్కెట్.. నష్టాల ముగింపు
పలమనేరులో రెచ్చిపోయిన కూటమి నేతలు
మందు మానేశా.. ఇండస్ట్రీలో తాగుబోతులు లేరిక!
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్ ఎవరంటే?
రూ.10 నోట్లకు గుడ్‌బై..!
‘మా అబ్బాయి మీ దేశానికి భారమా?’.. న్యూజిలాండ్‌లో భారతీయ కుటుంబం ఆవేదన!
వెండి ఇప్పుడే ఇంతుంటే.. అప్పటికల్లా అంతే!
టీమిండియా కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా!
ప్రపంచకప్ జట్టులో జైస్వాల్, రుతురాజ్‌కు చోటు!
'అందరికీ ఇదే నా విజ్ఞప్తి'.. అనసూయ ఆసక్తికర ట్వీట్
పసిడి హ్యాట్రిక్.. వెండి త్రిబుల్ షాక్!
టీమిండియావైపు దూసుకొస్తున్న సరికొత్త పేస్ సంచలనం
పడిక్కల్ వీరోచిత పోరాటం.. ఇషాన్ కిషన్ సుడిగాలి శతకం వృధా
ఈ రాశి వారికి యత్నకార్యసిద్ధి.. స్థిరాస్తి వృద్ధి
సిఐడి - బాబుకేసుల మూత విభాగం
డివిలియర్స్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ
తిరుగులేని ఇషాన్ కిషన్.. వైభవ్ రికార్డు బద్దలు
వేళాకోళంగా ఉందా? వీళ్ల పేర్లు ‘రెడ్‌బుక్’లో రాయండి!!
'తనూజ'కు మర్యాద మనీష్ క్షమాపణలు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
100 ఖండాంతర క్షిపణులను మోహరించిన చైనా
‘శంబాల’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సార్ మనవాళ్లే! వీడేమో పేకాట కింగ్, వాడేమో మద్యం డాన్, ఆడేమో కబ్జా వస్తాద్!
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. పనుల్లో విజయం
2026 కవాసకి వెర్సిస్ 650 లాంచ్: ధర ఎంతంటే?
వరుసగా రెండో మ్యాచ్‌లోనూ శతక్కొట్టిన పడిక్కల్
కేకేఆర్ స్టార్‌కు తీవ్ర గాయం.. స్ట్రెచర్‌పై ఆస్పత్రికి తరలింపు!
మెక్‌డొనాల్డ్స్‌లో పార్ట్‌టైం జాబ్ నుంచి..ఫ్లయింగ్ ఆఫీసర్ రేంజ్‌కి..!
‘తిరుమలలో భక్తుల భద్రతను గాలికొదిలేశారు’
H-1B ఆంక్షలు : భారీగానే ఇండియాలో అమెరికా టెక్ దిగ్గజాల ఉద్యోగాలు
స్టాక్ మార్కెట్.. నష్టాల ముగింపు
పలమనేరులో రెచ్చిపోయిన కూటమి నేతలు
మందు మానేశా.. ఇండస్ట్రీలో తాగుబోతులు లేరిక!
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్ ఎవరంటే?
రూ.10 నోట్లకు గుడ్‌బై..!
‘మా అబ్బాయి మీ దేశానికి భారమా?’.. న్యూజిలాండ్‌లో భారతీయ కుటుంబం ఆవేదన!
వెండి ఇప్పుడే ఇంతుంటే.. అప్పటికల్లా అంతే!
టీమిండియా కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా!
ప్రపంచకప్ జట్టులో జైస్వాల్, రుతురాజ్‌కు చోటు!
'అందరికీ ఇదే నా విజ్ఞప్తి'.. అనసూయ ఆసక్తికర ట్వీట్
పసిడి హ్యాట్రిక్.. వెండి త్రిబుల్ షాక్!
టీమిండియావైపు దూసుకొస్తున్న సరికొత్త పేస్ సంచలనం
పడిక్కల్ వీరోచిత పోరాటం.. ఇషాన్ కిషన్ సుడిగాలి శతకం వృధా
ఈ రాశి వారికి యత్నకార్యసిద్ధి.. స్థిరాస్తి వృద్ధి
సిఐడి - బాబుకేసుల మూత విభాగం
డివిలియర్స్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ
తిరుగులేని ఇషాన్ కిషన్.. వైభవ్ రికార్డు బద్దలు
వేళాకోళంగా ఉందా? వీళ్ల పేర్లు ‘రెడ్‌బుక్’లో రాయండి!!
'తనూజ'కు మర్యాద మనీష్ క్షమాపణలు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
100 ఖండాంతర క్షిపణులను మోహరించిన చైనా
‘శంబాల’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సార్ మనవాళ్లే! వీడేమో పేకాట కింగ్, వాడేమో మద్యం డాన్, ఆడేమో కబ్జా వస్తాద్!
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. పనుల్లో విజయం
ఫొటోలు
బిగ్‌బాస్ శివజ్యోతి మరోసారి బేబీ షవర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
క్రిస్మస్ వేడుకల్లో సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)
ఈ ఏడాది మధుర జ్ఞాపకాలను షేర్ చేసిన సమంత.. (ఫోటోలు)
‘శంబాల’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
టీటీడీ ఘోర వైఫల్యం.. భక్తుల ఆగ్రహం (ఫొటోలు)
‘భర్త’ను మరోసారి పెళ్లి చేసుకున్న వీనస్ విలియమ్స్ (ఫొటోలు)
క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్ జగన్ (ఫొటోలు)
టాలీవుడ్ సెలబ్రిటీల క్రిస్మస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
శరత్ కుమార్-రాధిక క్రిస్మస్ లంచ్‌లో కోలీవుడ్ స్టార్స్ (ఫొటోలు)
కర్నూల్ ఇన్సిడెంట్ కర్ణాటకలో రిపీట్! (చిత్రాలు)
సినిమా
రెండో బిడ్డకు జన్మనిచ్చిన 'దేవర' నటి
బుల్లితెర నటి చైత్రరాయ్ గుడ్‌న్యూస్ చెప్పింది. రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించింది. తొమ్మిదో పెళ్లిరోజు సందర్భంగా ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. మా జీవితాల్లో ఓ అద్భుతం జరిగింది. మాకు రెండోసారి దేవుడి ఆశీస్సులు లభిచాయి. మా కుటుంబంలోకి మరో చిన్ని యువరాణి అడుగుపెట్టింది.9వ పెళ్లిరోజు.. పరిపూర్ణంమా పెళ్లయి తొమ్మిదేళ్లవుతోంది. మా ఆయన ఉత్తమ భర్త మాత్రమే కాదు గొప్ప తండ్రి కూడా! మేమిద్దరం ఇప్పుడు నలుగురమయ్యాం. ఈ పెళ్లిరోజుతో మా కుటుంబం పరిపూర్ణమైంది అని రాసుకొచ్చింది. ఈ మేరకు చిన్న బుజ్జాయి రాకను తెలియజేస్తూ తన చిట్టి చేతి ఫోటో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు చైత్ర దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సీరియల్స్.. సినిమాకాగా చైత్ర రాయ్.. కన్నడతో పాటు తెలుగులోనూ పలు సీరియల్స్ చేసింది. అష్టాచమ్మా సీరియల్‌తో తెలుగులో పేరు తెచ్చుకుంది. అత్తో అత్తమ్మ కూతురో, దట్ ఈజ్ మహాలక్ష్మి, ఒకరికి ఒకరు, మనసున మనసై, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు వంటి పలు సీరియల్స్‌లో నటించింది. జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీలోనూ యాక్ట్ చేసింది. ఈ నటి 2016లో ఇంజనీర్ ప్రసన్న శెట్టిని పెళ్లి చేసుకుంది. వీరికి 2021లో కూతురు నిష్క శెట్టి పుట్టింది. ఇప్పుడు ఆ చిన్నారితో ఆడుకునేందుకు మరో బుజ్జి పాప వచ్చేసింది. View this post on Instagram A post shared by Chaithra Rai (@chaithrarai17)చదవండి: సంజనాను ఆంటీ అనేసిన శివాజీ
ఎన్నికల కోసం 'దిల్ రాజు' మాయ మాటలు: నట్టి కుమార్
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. డిసెంబర్ 28న హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ ఆఫీస్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోని ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియోలు ఈ నాలుగు సెక్టార్ల కౌన్సిల్‌తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను ఈ ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు. ఎన్నికల నిర్వహణాధికారిగా దుర్గాప్రసాద్ వ్యవహరిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులలో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. అయితే, ఛాంబర్ ఎన్నికల్లో రెండు ప్యానెల్స్ మధ్యే వార్ ఉండనుంది. నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, సురేశ్ బాబు బలపరుస్తున్న 'ప్రోగ్రెసివ్ ప్యానల్' ఒకవైపు ఉంటే.. సి. కళ్యాణ్, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు బలపరుస్తున్న 'మన ప్యానెల్' మరోవైపు రేసులో వుంది. ఈ క్రమంలో తాజాగా మన ప్యానెల్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు.మన ప్యానెల్ నుంచి చదలవాడ శ్రీనివాసరావు ఇలా అన్నారు. ఆదివారం ఛాంబర్ ఎన్నికలు జరగనున్నాయి. చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఛాంబర్లో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒకరికొకరు సహకరించుకుని ముందుకు వెళ్లాలి. గత పదేళ్లుగా చిత్ర పరిశ్రమ అదుపు తప్పింది. గిల్డ్ అని పెట్టి ఇష్టారీతిన కొందరు వ్యవహరిస్తున్నారు. 20 రోజుల పాటు కార్మికులకు పనిలేకుండా చేశారు. నిజానికి గిల్డ్ సభ్యులే సినిమా చిత్రీకరణలు ఆపారు. వారు తమ స్వార్దంగా వ్యవహరించడంతోనే ఇబ్బందులు వచ్చాయి. ఛాంబర్ సభ్యుల పేరుతో ముఖ్యమంత్రులతో ఫోటోలు దిగాలనే ఆలోచనతో మాత్రమే వారు ఉన్నారు. చిత్ర పరిశ్రమ బాగు అనేది వారికి పట్టలేదు. సీఎం రేవంత్‌రెడ్డి యోగ్యులు కాబట్టి కార్మికుల సమస్యను పరిష్కరించారు. వాస్తవానికి ఫిల్మ్ ఛాంబర్ చేయాల్సిన పనిని సీఎం పూర్తి చేశారు. చిన్న హీరోలను బతకనివ్వడం లేదు. క్యూబ్, యుఎఫ్ఓ వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. వాటిని ఎవరూ పట్టించుకోలేదు. చిత్రపురికి సమస్య వస్తే చిన్న నిర్మాతలమే సపోర్ట్‌గా నిలిచాం. వారందరే మన ప్యానెల్ తరపున పోటీ చేస్తున్నాం. అందరికీ అర్ధరాత్రి కూడా అందుబాటులో ఉంటాం.' అని ఆయన అన్నారు.రామానాయుడు ఇంటిని పబ్‌కి ఇచ్చారు: సి కల్యాణ్ కామెంట్స్ప్రోగ్రెసివ్ ప్యానల్ (దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు) పేరుతో మన వారసత్వం మన స్వాభిమానం అంటూ ఏదో ప్రకటనలు వేశారు. నిజానికి వారికి ఎలాంటి స్వాభిమానం లేదు. వారు వ్యక్తిగత లాభం కోసం ఏదైనా చేస్తారు. మేము మొదటి నుంచి చిన్న నిర్మాతలకు అందుబాటులో ఉన్నాం. వాస్తవానికి వారిని రెండేళ్ల క్రితం మేము సపోర్ట్ చేసి గెలిపించాము. చదలవాడ నాడు అందరం కలిసి వెళదామని చెప్పటంతోనే సపోర్ట్ చేశాం. కానీ, పదవుల్లోకి వచ్చి కూర్చొన్నారు తప్ప పరిశ్రమ కోసం ఏమీ చేయలేదు. వారి నుంచి చిన్న సినిమాలకు ఎలాంటి సపోర్ట్ లేదు. గిల్డ్ సభ్యులు చెప్పెవన్నీ అబద్దాలే. దామోదర్ ప్రసాద్ కార్మికులకు ఏమి చెయలేకపొయాడు. గిల్డ్ ప్రొడ్యూసర్స్ కోసం మాత్రం చాలా చేశాడు. కామెడీగా లేబర్ కమీషనర్ వద్దకు నిర్మాతలు వెళ్లటం వీరి హయాంలోనే జరిగింది. విభజించు పాలించు అన్నట్టుగా గిల్డ్ సభ్యులు వ్యవహారశైలి ఉంది. ఛాంబర్ బిల్డింగ్ గురించి ఐకానిక్ టవర్ అంటూ కామన్సెన్స్ లేకుండా గిల్డ్ సభ్యులు మాట్లాడుతున్నారు. అది ఏ ఒక్కరిది కాదు. దాంట్లో మనం అద్దెకు ఉంటున్నాం. అది సినిమా ఇండస్ట్రీది కానేకాదు. సెకెండ్ ఫ్లోర్లో కొందరికి ఆఫీస్‌లు ఉన్నాయి కాబట్టి స్వార్దం కోసం ఎదెదో మాట్లాడుతున్నారు. ఫిలిం నగర్ సోసైటీ ఆస్తి అది. రామానాయుడు నివశించిన ఇంటిని పబ్‌కి ఇచ్చారు. బాధగా ఉంది. చిన్న నిర్మాతలందరు మన ప్యానెల్ వైపే ఉన్నారు. సినీ కార్మికులు, కృష్ణానగర్ ఆర్టిస్ట్‌లు బతకాలంటే చిన్న సినిమాలే ముఖ్యం. ఓటిటి విషయంలోనూ గిల్డ్ వారు మాయామాటలు చెప్పారు. టిక్కెట్ రేట్లు అడిగేది వారే.. వాటికి వ్యతిరేకం అనేది కూడా వారే కావడం విశేషం. నాలుగు సెక్టార్స్‌లలో మన ప్యానెల్ ఉంది. ఓట్లేసి గెలిపించండి' అని కల్యాణ్ అన్నారుదిల్ రాజు చెప్పేవి అన్నీ మాయ మాటలే: నిర్మాత నట్టికుమార్'గిల్డ్ నుంచి చిత్ర పరిశ్రమలోని వారికి ఎలాంటి సపోర్ట్ లేదు. గెలిచినవారు మీటింగ్‌లకు కూడా రాలేదు. పదిమంది స్వార్దం కోసం గిల్డ్ డబ్బు వాడారు. మేము 1600 మంది సభ్యుల మెడిక్లెయిమ్ కోసం కృషి చేశాం. దిల్ రాజు ఎన్నికలు కోసం మాయ మాటలు చెప్పారు. అతనికి చేతకాక ఏడాది తరువాత దిగిపోయారు. నాగవంశీ మాత్రం సినిమాలు తీయని వారికి ఎందుకు మెడిక్లెయిమ్ ఇవ్వాలని అంటాడు. సీనియర్లపై గౌరవం ఉండాలి. చిన్న సినిమాలకు థియేటర్స్ కావాలని ఎప్పటినుంచో అడుగుతున్నాం. ఛాంబర్ పదవుల్లో ఉండి.. వారి స్వార్దం కోసమే దామోదర్ ప్రసాద్ పని చేశారు. మన ప్యానెల్ తరపున మెడిక్లెయిమ్‌తో పాటు చిన్న సినిమాకు ఐదో షో ఉండేలా కృషి చేస్తాం. చిత్రపరిశ్రమలో దిల్ రాజు, వంశీ, సుప్రియ ఎవరికైనా సాయపడ్డారా..?' అంటూ నట్టి కుమార్ ప్రశ్నించారు.
ఆది సాయికుమార్ శంబాల.. తొలి రోజే ఊహించని వసూళ్లు
ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జోడీగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ శంబాల. యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్లో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా అభిమానుల అంచనాల మధ్య క్రిస్మస్ కానుకగా 25న థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ల పరంగా అదరగొట్టింది. బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే రూ.3.3 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో ఆది సాయికుమార్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మరిన్ని థియేటర్స్ యాడ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో రవి వర్మ, మీసాల లక్ష్మణ్, స్వాసిక విజయ్, షీజు మీనన్, శివకార్తిక్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతమందించారు. Thanks for your love and support plz do watch #Shambhala in Theatres 🙏❤️ pic.twitter.com/NPe07O79Us— Aadi Saikumar (@iamaadisaikumar) December 26, 2025
బిగ్‌బాస్ బజ్: సంజనాను ఆంటీ అన్న శివాజీ
బిగ్‌బాస్ ట్రోఫీ గెలుస్తానని తనూజ కాన్ఫిడెంట్‌గా ఉండేది. కానీ అది నిజం కాలేదు. టికెట్ టు ఫినాలే నాదే అని శపథం చేసిన పవన్.. మాట నిలబెట్టుకోలేకపోయాడు. అయితే సంజనా మాత్రం ఆత్మధైర్యంతో అనుకున్నది సాధించింది. బిగ్‌బాస్‌లో అడుగుపెట్టడానికి ముందే టాప్ 5 అని ఫిక్సయిపోయింది. అందుకోసం 100 రోజులకు సరిపడా బట్టలు రెడీ చేసుకుంది.గుడ్డు దొంగతనంతప్పోఒప్పో ఏదైనా ముఖం మీదే మాట్లాడేది. తను మాట్లాడింది తప్పని తెలుసుకున్నప్పుడు బేషరతుగా క్షమాపణలు చెప్పేది. ఒక్క గుడ్డు దొంగతనంతో సీజన్ 9పై బజ్ క్రియేట్ చేసింది. ఎన్నో అవమానాలు, గొడవల తర్వాత వెరీ గుడ్డు కంటెస్టెంట్‌గా ఫైనల్స్‌లో ఐదో స్థానంలో బయటకు వచ్చింది. ఫినాలే అయిపోయినవెంటనే బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఏ ఆంటీ కూడా టాప్5కి రాలేదుఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఏ ఆంటీ కూడా టాప్5కి రాలేదు. ఫైనల్స్‌కు వరకు ఉంటాననుకున్నారా? అని అడిగాడు. అందుకామె ఉంటాననుకున్నాను.. అందుకే కదా 15 వారాలకు సరిపడా డ్రెస్సులు బెంగళూరు నుంచి ప్యాకింగ్ చేసుకుని వచ్చాను అని బదులిచ్చింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. మన అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉన్నా.. చిన్న ఇంట్లో అయినా.. ఎక్కడైనా సంతోషంగా బతకొచ్చు. కానీ, మర్యాదకు భంగం కలిగితే ఎలా బతకగలం? నన్ను ఇలా గుర్తుపెట్టుకోవాలి2020లో నాపై పడ్డ నింద కారణంగా అందరూ నన్ను గుర్తు పెట్టుకోవద్దు.. బిగ్‌బాస్ 9లో టాప్ 5కి వెళ్లింది.. ఆవిడ సంజనా.. అని నన్ను గుర్తించాలి. నా పిల్లలు నన్ను అలాగే గుర్తుపెట్టుకోవాలి అని చెప్పింది. ఇక ప్రోమోలో శివాజీ ఆమెను ఆంటీ అనడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అతడికంటే సంజనా వయసులో చిన్నదని, ఆమెను పట్టుకుని ఆంటీ అంటాడేంటని ఆగ్రహిస్తున్నారు.
క్రీడలు
మూడు ఫార్మాట్లు ఆడగల టాప్-5 క్రికెటర్లు వీరే!
క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం పొట్టి ఫార్మాట్‌దే హవా. ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్‌కు ఉన్న ఆదరణ రోజురోజుకీ పెరుగిపోతోంది. న్యూజిలాండ్, సౌతాఫ్రికాకు చెందిన పలువురు కీలక ఆటగాళ్లు సైతం ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడేందుకు వీలుగా సెంట్రల్ కాంట్రాక్టు వదులుకుని.. జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నారు.ఇలాంటి తరుణంలో మూడు ఫార్మాట్లలో ఆడగల క్రికెటర్ల సంఖ్య తగ్గిపోవడం సహజమే. అయితే, నవతరంలో టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోయే ఆటగాళ్లకు సైతం కొదువలేదు. ఈ జాబితాలో టాప్-5లో ఉన్న ప్లేయర్లపై ఓ లుక్కేద్దామా?హ్యారీ బ్రూక్మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్ పతనావస్థకు చేరిన వేళ హ్యారీ బ్రూక్ రూపంలో ఓ యువ ఆటగాడు జట్టుకు ఊపిరిలూదాడు. టెస్టు, వన్డే, టీ20లలో అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అతడి రాకతో ఇంగ్లండ్ మిడిలార్డర్ సమస్య తీరిపోయింది. అంతేకాదు నాయకత్వ లక్షణాలు పుష్కలంగా కలిగి ఉన్న 26 ఏళ్ల బ్రూక్.. వన్డే, టీ20 జట్లకు కెప్టెన్ కూడా అయ్యాడు.ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్లో 34 టెస్టులు, 35 వన్డేలు, 52 టీ20లు ఆడిన హ్యారీ బ్రూక్.. ఆయా ఫార్మాట్లలో 3034, 1170, 1012 పరుగులు సాధించాడు. టెస్టుల్లో పది సెంచరీలు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వన్డేల్లో ఇప్పటికి రెండుసార్లు శతక్కొట్టాడు.యశస్వి జైస్వాల్రెండున్నరేళ్ల క్రితం టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్. టెస్టుల్లో అడుగుపెట్టగానే సెంచరీలు, డబుల్ సెంచరీతో సత్తా చాటిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఓపెనర్‌గా జట్టులో స్థిరపడిపోయాడు.అయితే, వన్డే, టీ20లలో ఆడే సత్తా ఉన్నా.. టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కారణంగా ఈ ఓపెనింగ్ బ్యాటర్‌కు జట్టులో చోటు కరువైంది. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 23 ఏళ్ల జైసూ 28 టెస్టుల్లో.. ఏడు శతకాలు, రెండు డబుల్ సెంచరీలు బాది 2511 పరుగులు సాధించాడు. ఇక నాలుగు వన్డేల్లో 171, 23 టీ20 మ్యాచ్‌లలో 723 పరుగులు చేశాడు. ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్ సందర్భంగా తన తొలి వన్డే శతకాన్ని నమోదు చేశాడు.మార్కో యాన్సెన్సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మార్కో యాన్సెన్. దిగ్గజ జాక్వెస్ కలిస్ వారసుడిగా జట్టులో అతడు లేని లోటును పూడుస్తున్నాడు. ఆరడుగుల ఎనిమిది ఇంచుల ఎత్తు ఉండే మార్కో.. మూడు ఫార్మాట్లలోనూ దుమ్ములేపుతున్నాడు.ఇప్పటికి సౌతాఫ్రికా తరఫున 25 ఏళ్ల రైట్ హ్యాండర్ బ్యాటర్.. 21 టెస్టుల్లో 624, 32 వన్డేల్లో 553, 23 టీ20లలో 195 పరుగులు చేశాడు. ఇక లెఫ్టార్మ్ పేసర్ ఖాతాలో టెస్టుల్లో 89, వన్డేల్లో 49, టీ20లలో 21 వికెట్లు ఉన్నాయి.జేకబ్ డఫీ31 ఏళ్ల జేకబ్ డఫీ న్యూజిలాండ్ తరఫున ఆల్ ఫార్మాట్ పేసర్‌గా సత్తా చాటుతున్నాడు. ఈ ఏడాదే టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం బౌలర్ ఇప్పటికి 4 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 25 వికెట్లు కూల్చాడు.అదే విధంగా.. 19 వన్డేల్లో 35, 38 టీ20 మ్యాచ్‌లలో కలిపి 53 వికెట్లు కూల్చిన డఫీ.. ప్రపంచ బ్యాటర్లకు సరికొత్త ముప్పుగా అవతరించాడు.కామెరాన్ గ్రీన్ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 26 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. ఇటీవల ఐపీఎల్ మినీ వేలం-2026లో సరికొత్త చరిత్ర సృష్టించాడు.కోల్‌కతా నైట్ రైడర్స్ ఇతడి కోసం ఏకంగా 25.20 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా.. వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ నిలిచాడు. టీ20 ఫార్మాట్‌తో పాటు వన్డే, టెస్టుల్లో కూడా గ్రీన్ రాణిస్తున్నాడు.ఇప్పటికి ఆస్ట్రేలియా తరఫున 36 టెస్టులు, 31 వన్డేలు, 21 టీ20లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 1658, 782, 521 పరుగులు సాధించాడు. అదే విధంగా ఈ రైటార్మ్ పేసర్ ఖాతాలో 38 టెస్టు, 20 వన్డే, 12 టీ20 వికెట్లు ఉన్నాయి.చదవండి: వైభవ్ సూర్యవంశీకి అత్యున్నత పురస్కారం
రింకూ సింగ్ విధ్వంసకర శతకం
టీమిండియా సెలక్టర్ల నమ్మకాన్ని రింకూ సింగ్ నిజం చేస్తున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు తన ఎంపిక సరైందేనని నిరూపిస్తున్నాడు. తాజాగా వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఫామ్‌ను కొనసాగిస్తున్న తీరు ఇందుకు నిదర్శనం.ఈ టోర్నమెంట్లో ఉత్తరప్రదేశ్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన రింకూ సింగ్ (Rinku Singh).. బుధవారం నాటి తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌పై 48 బంతుల్లో 67 పరుగులు సాధించాడు. ఇతడికి తోడు ధ్రువ్ జురెల్ (61 బంతుల్లో 80; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఆర్యన్ జుయల్ (96 బంతుల్లో 80; 9 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ గోస్వామి (81 బంతుల్లో 81; 10 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. ఫలితంగా యూపీ 84 పరుగుల తేడాతో గెలిచి శుభారంభం అందుకుంది.ఆర్యన్ జుయల్ సెంచరీగ్రూప్-బిలో భాగంగా తాజాగా చండీగఢ్‌తో శుక్రవారం నాటి రెండో మ్యాచ్‌లో రాజ్‌కోట్ వేదికగా టాస్ ఓడిన యూపీ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. గత మ్యాచ్‌లో అదరగొట్టిన ఓపెనర్ అభిషేక్ గోస్వామి (1) ఈసారి విఫలం కాగా.. ఆర్యన్ జుయల్ మాత్రం మరోసారి బ్యాట్ ఝులిపించాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ 118 బంతుల్లో ఏడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 134 పరుగులు సాధించాడు.రింకూ సింగ్ విధ్వంసకర శతకంఇక వన్‌డౌన్‌లో వచ్చిన ధ్రువ్ జురెల్ (57 బంతుల్లో 67) మరోసారి హాఫ్ సెంచరీతో మెరవగా.. సమీర్ రిజ్వి (32) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో ఐదో స్థానంలో బరిలో దిగిన కెప్టెన్ రింకూ సింగ్ విధ్వంసకర శతకంతో చండీగఢ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.కేవలం 56 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న రింకూ.. మొత్తంగా 60 బంతుల్లో 106 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అతడి శతక ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఇటీవల ఐపీఎల్ మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14.20 కోట్లు పెట్టి కొన్న ప్రశాంత్ వీర్ (14 బంతుల్లో 12).. రింకూతో కలిసి నాటౌట్‌గా నిలిచాడు.367 పరుగులుఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో యూపీ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 367 పరుగులు చేశాడు. చండీగఢ్ బౌలర్లలో తరణ్‌ప్రీత్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, నిషుంక్ బిర్లా చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఎంపిక చేసిన పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టులో రింకూకు చోటు దక్కిన విషయం తెలిసిందే.చదవండి: Virat Kohli: మళ్లీ సెంచరీ చేస్తాడనుకుంటే..
Ashes 4th Test: చెలరేగిన ఇరు జట్ల బౌలర్లు.. తొలి రోజే 20 వికెట్లు
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఇవాళ (డిసెంబర్ 26) యాషెస్ సిరీస్ 2025-26 నాలుగో టెస్ట్ (బాక్సింగ్ డే టెస్ట్) ప్రారంభమైంది. ఈ మ్యాచ్ తొలి రోజే 20 వికెట్లు కుప్పకూలాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తొలుత ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసింది. ఆతర్వాత ఆసీస్ బౌలర్లు కూడా అదే పని చేశారు. మొత్తంగా ఇరు జట్ల బౌలర్లు చెలరేగడంతో తొలి రోజే 20 వికెట్లు పడ్డాయి. ఆసీస్-ఇంగ్లండ్ మధ్య టెస్ట్‌ల్లో తొలి రోజే 20 వికెట్లు పడటం 1909 తర్వాత ఇదే తొలిసారి. చెలరేగిన టంగ్జోష్ టంగ్ (11.2-2-45-5) చెలరేగడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌటైంది. టంగ్‌కు అట్కిన్సన్ (14-4-28-2), బ్రైడన్ కార్స్ (12-3-42-1), స్టోక్స్ (8-1-25-1) సహకరించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో నంబర్ ఆటగాడు మైఖేల్ నెసర్ (35) టాప్ స్కోరర్ కాగా.. హెడ్ (12), జేక్ వెదరాల్డ్ (10), ఉస్మాన్ ఖ్వాజా (29), అలెక్స్ క్యారీ (20), కెమరూన్ గ్రీన్ (17) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. లబూషేన్ (6), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (9), స్టార్క్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితం కాగా.. బోలాండ్ డకౌటయ్యాడు.ఇంగ్లండ్ ఇంకా ఘోరంఅనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ సైతం ప్రత్యర్థి బౌలర్ల ధాటికి కుప్పకూలింగి. నెసర్ 4, బోలాండ్ 3, స్టార్క్ 2, గ్రీన్ ఓ వికెట్ తీసి ఇంగ్లండ్‌ను 110 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (41), అట్కిన్సన్ (28), స్టోక్స్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. జాక్ క్రాలే (5), డకెట్ (2), బేతెల్ (1), జేమీ స్మిత్ (2), విల్ జాక్స్ (5), కార్స్ (4) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. రూట్ డకౌటయ్యాడు.కీలకమైన 42 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసి, 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఇదివరకే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి మూడు టెస్ట్‌ల్లో గెలిచిన ఆ జట్టు ప్రస్తుతం 3-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.
చరిత్ర సృష్టించిన జోష్ టంగ్
ఇంగ్లండ్ యువ పేసర్ జోష్ టంగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో ఐదు వికెట్లతో చెలరేగిన ఈ కుడిచేతి వాటం బౌలర్.. అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ప్రసిద్ధ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో 21వ శతాబ్దంలో టెస్టులలో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఇంగ్లండ్ తొలి బౌలర్‌గా 28 ఏళ్ల టంగ్ నిలిచాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (Ashes 2025-26)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.3-0తో సిరీస్ సొంతం చేసుకున్న ఆసీస్ ఇందులో భాగంగా పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్ టెస్టుల్లో ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్.. ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయింది. ఈ క్రమంలో శుక్రవారం మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన కంగారూ జట్టు.. తొలి ఇన్నింగ్స్‌లో 45.2 ఓవర్లలో 152 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఆసీస్‌ను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేయడంలో జోష్ టంగ్దే ముఖ్య భూమిక. టాపార్డర్‌లో ఓపెనర్ జేక్ వెదరాల్డ్ (10), వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ (6) రూపంలో కీలక వికెట్లు తీసిన టంగ్... అద్బుతమైన డెలివరీతో కెప్టెన్ స్టీవ్ స్మిత్ (9) రూపంలో మరో డేంజరస్ బ్యాటర్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు.WHAT A DELIVERY!Steve Smith looks on puzzled after this peach from Josh Tongue.#Ashes | #PlayoftheDay | @nrmainsurance pic.twitter.com/NpkEgGxOQR— cricket.com.au (@cricketcomau) December 26, 2025తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా అదే విధంగా లోయర్ ఆర్డర్లో పట్టుదలగా నిలబడ్డ ఆసీస్ పేసర్ మైకేల్ నాసర్ (35)ను కూడా అవుట్ చేసిన టంగ్.. ఆఖరిగా స్కాట్ బోలాండ్‌ను డకౌట్ చేసి తన ఖాతాలో ఐదో వికెట్ జమచేసుకున్నాడు. తద్వారా ఎంసీజీలో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి.. 21వ శతాబ్దంలో ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా చరిత్రకెక్కాడు.ఇంగ్లండ్ ఇతర బౌలర్లలో గస్ అట్కిన్సన్ రెండు, బ్రైడన్ కార్స్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఫలితంగా 29.5 ఓవర్లలో కేవలం 110 పరుగులు చేసిన ఇంగ్లండ ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బౌలర్లలో నాసర్ నాలుగు, బోలాండ్ మూడు, స్టార్క్ రెండు, గ్రీన్ ఒక వికెట్ పడగొట్టారు.చదవండి: Virat Kohli: మళ్లీ సెంచరీ చేస్తాడనుకుంటే..
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు గ్రహణం. కేంద్ర నిధులపై బాబు సర్కారు ఆంక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ యూరియా కష్టాలు... చంద్రబాబు సర్కారు అలసత్వంతో రబీలోనూ రైతన్నకు తప్పని తిప్పలు
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుపై కేసుల కథ కంచికి... ‘స్కిల్’ కుంభకోణం కేసు మూసివేతకు కూటమి సర్కార్ పన్నాగం
రెవెన్యూ ఫిర్యాదులపై ఏమాత్రం స్పందించని చంద్రబాబు సర్కారు. కబ్జాలు, సరిహద్దు సమస్యలు, అక్రమాలతో లక్షలాది మంది సతమతం
పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు 'రేషన్ స్మగ్లర్లు'
రోడ్డెక్కితే బాదుడే... ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన వేల కోట్ల రూపాయల భారం
‘ఇంక్విలాబ్ మంచ్’ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో బంగ్లాదేశ్‌లో విధ్వంసం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మేం రాగానే పూర్తి చేస్తాం... తేల్చిచెప్పిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల పత్రాలు గవర్నర్‌కు అందజేత
ఆంధ్రప్రదేశ్‌లో కోటి సంతకాల సమరం... కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ మహా ఉద్యమం.. నేడు గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులు అందజేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఫేక్ సొసైటీతో భూములు కబ్జా చేయడానికి కుట్ర... విజయవాడలో 42 మంది పేదల ఇళ్ల కూల్చివేత బాబు సర్కారు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
బిజినెస్
మెయిల్ ఐడీ నచ్చలేదా? మార్చుకుందురులే..!
మనలో చాలా మందికి ఈమెయిల్ ఖాతాలు ఉంటాయి. అయితే ఈ మెయిల్ ఐడీల విషయంలో ఎక్కువ మందికి అసంతృప్తే ఉంటుంది. ఎందుకంటే చాన్నాళ్ల క్రితం వీటిని తెరిచేటప్పుడు సిస్టమ్ ఆటోమెటిక్‌గా సూచించిన ఏదో ఒక ఐడీని ఈమెయిల్ అడ్రెస్‌గా సెట్ చేసుకుని ఉంటారు. కానీ దాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నప్పుడు అరే ఈ మెయిల్ ఐడీ అంత బాగా లేదే.. దీన్ని మనకు నచ్చినట్టు మార్చుకునే అవకాశం ఉంటే బాగుండు.. అనుకుంటుంటారు.ఇప్పుడా అవకాశాన్ని గూగల్ కల్పించబోతోంది. టెక్ దిగ్గజం రాబోయే సిస్టమ్ మార్పును వివరించే హిందీ భాష సపోర్ట్ డాక్యుమెంటేషన్‌ను ఇటీవల అప్డేట్ చేసింది. అందులో జీమెయిల్ అడ్రస్‌లను మార్చుకునే వెసులుబాటు గురించి పేర్కొంది.ప్రసిద్ద ఫోర్బ్స్ ప్రచురించిన కథనం ప్రకారం.. గూగుల్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్‌తో యూజర్లు తమ జీమెయిల్ అడ్రెస్‌లను మార్చుకోవచ్చు. అయితే ఇందుకు నిర్దిష్ట పరిమితులు ఉంటాయి. ఇలా మెయిల్ ఐడీ మార్చుకోవడానికి ఏడాదికి ఒక్కసారి.. మొత్తంగా మూడు సార్లు అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇంతకుముందున్న మెయిల్ అడ్రస్ కూడా అలియాస్‌గా కొనసాగుతుంది. అంటే దానికి వచ్చే మెయిల్స్ అలాగే వస్తుంటాయి. ఇక ఖాతా డేటా అంటే ఫోటోలు, మెసేజ్‌లు, ఇమెయిల్‌లు వంటి వాటిపై ఎలాంటి ప్రభావం ఉండదు.కాగా ఇప్పటి వరకు గూగుల్ అకౌంట్‌కు థర్డ్ పార్టీ ఈమెయిల్ చిరునామాలతో సైన్ అప్ చేసిన వినియోగదారులకు మాత్రమే ఖాతా ఈమెయిల్ మార్పులను అనుమతిస్తోంది. కానీ జీమెయిల్ అడ్రెస్ల మార్పునకు అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు గూగుల్ అందిస్తున్న కొత్త ఫీచర్‌ను సోషల్ మీడియా యూజర్లు స్వాగతిస్తున్నారు.
రేషన్ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం
ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా ఒక కిలో బియ్యం సేకరించి, దాన్ని భద్రపరిచి, రవాణా చేసి లబ్ధిదారుడికి చేరవేసేసరికి దాదాపు రూ.40 వరకు ఖర్చు చేస్తోంది. అంటే, మనం ‘ఉచితం’ అని పిలుచుకుంటున్న ఈ బియ్యం వెనుక సామాన్యుడు పన్ను రూపంలో చెల్లించిన భారీ మూల్యం ఉంది. దురదృష్టవశాత్తు 2025 ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలోనే రవాణా, నిల్వ లోపాల వల్ల సుమారు 53,000 టన్నుల ఆహార ధాన్యాలు వృథా అయ్యాయి. ఒకవైపు ఆకలి కేకలు, మరోవైపు గోడౌన్లలో కుళ్లిపోతున్న ధాన్యాలు వెరసి ప్రభుత్వానికి ఆర్థిక భారం తప్పడం లేదు.ఈ భారీ నష్టాన్ని, లీకేజీలను అరికట్టడానికి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా ‘నగదు బదిలీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT)’ పరిష్కారంగా తోస్తుంది. ప్రభుత్వం భరిస్తున్న ఈ రూ.40 ఖర్చును నేరుగా పేదల ఖాతాల్లో వేస్తే వారు మార్కెట్లో తమకు నచ్చిన నాణ్యమైన బియ్యాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉందనే వాదనలున్నాయి. భారతదేశపు అతిపెద్ద ఆహార భద్రతా పథకంలో రావాల్సిన విప్లవాత్మక మార్పులపై విశ్లేషణ.ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా కార్యక్రమంగా పేరుగాంచిన భారత ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ప్రస్తుతం 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచితంగా బియ్యం, గోధుమలను అందిస్తోంది. అయితే, పేదల ఆకలి తీరుస్తున్న ఈ పథకం వెనుక ప్రభుత్వం భరిస్తున్న ఆర్థిక భారం, వ్యవస్థలోని లోపాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.ఒక కిలో ధాన్యం ధర ఎంత?సాధారణ పౌరులకు రేషన్ దుకాణాల్లో బియ్యం, గోధుమలు ఉచితంగా లభిస్తున్నప్పటికీ, ప్రభుత్వంపై పడుతున్న వ్యయం సామాన్యమైనది కాదు. ధాన్యాల సేకరణ, నిల్వ, రవాణా, వడ్డీ ఖర్చులను లెక్కలోకి తీసుకుంటే కిలో ధాన్యం రేషన్ షాపుకు చేరడానికి ప్రభుత్వానికి రూ.28 నుంచి రూ.40 వరకు ఖర్చవుతోంది.2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌సీఐ వ్యయంబియ్యం (కిలోకు): రూ.39.75గోధుమలు (కిలోకు): రూ.27.74మొత్తం ఆహార సబ్సిడీ బిల్లు: రూ.2.05 లక్షల కోట్లువ్యవస్థలోని లోపాలు.. వేల కోట్ల నష్టంప్రభుత్వం ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నా ఆ ఫలాలు పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందడం లేదనే అభిప్రాయాలున్నాయి. గణాంకాల ప్రకారం, సబ్సిడీ ధాన్యాల్లో సుమారు 28 శాతం లక్షిత గృహాలకు చేరడం లేదు. అంటే దాదాపు 20 మిలియన్ టన్నుల ధాన్యం పక్కదారి పడుతోంది లేదా వృథా అవుతోంది. దీనివల్ల ఏటా ప్రభుత్వానికి రూ.69,108 కోట్ల నష్టం వాటిల్లుతోంది. రవాణా, నిల్వ సమయంలో జరుగుతున్న నష్టం కూడా ఆందోళనకరంగా ఉంది. 2025 ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలోనే ఎఫ్‌సీఐ రవాణాలో 40,000 టన్నులు, నిల్వలో 13,000 టన్నుల ధాన్యాన్ని కోల్పోయింది.నగదు బదిలీ(DBT) పరిష్కారమేనా?ఈ లాజిస్టిక్స్ చైన్‌లోని లోపాలను సరిదిద్దడానికి నగదు బదిలీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT) ఒక బలమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ధాన్యం పంపిణీకి చేసే ఖర్చును నేరుగా లబ్ధిదారుల ఆధార్ అనుసంధిత బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల..సప్లై చైన్ లీకేజీలను అరికట్టవచ్చు.లబ్ధిదారులు తమకు నచ్చిన నాణ్యమైన ఆహారాన్ని స్థానిక మార్కెట్లలో కొనుగోలు చేయవచ్చు.కర్ణాటకలోని ‘అన్న భాగ్య’ నగదు బదిలీ పథకం ద్వారా లబ్ధిదారులు మెరుగైన ఆహారాన్ని కొనుగోలు చేయడమే కాకుండా, కొత్త బ్యాంక్ ఖాతాలు తెరవడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములయ్యారు.ముందున్న మార్గంపీడీఎస్ వ్యవస్థను నేరుగా నగదు బదిలీకి మార్చడం ఒకేసారి సాధ్యం కాకపోవచ్చు. దీనికోసం ప్రభుత్వం కొన్ని వ్యూహాలను అనుసరించాలి.లబ్ధిదారులే స్వచ్ఛందంగా నగదు లేదా ధాన్యం ఎంచుకునేలా 12-18 నెలల సమయం ఇవ్వాలి.ద్రవ్యోల్బణానికి అనుగుణంగా నగదు బదిలీ మొత్తాన్ని సవరించాలి.మౌలిక సదుపాయాలు లేని చోట్ల నగదుకు బదులు ఆహార కూపన్లను వినియోగించవచ్చు.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటే పెట్టి పుట్టాల్సిందే!
బంగారం, వెండి విశ్వరూపం!! రోజు మారేలోపు ఇంత రేటా?
దేశంలో బంగారం, వెండి ధరల దూకుడు తగ్గడం లేదు. వరుసగా ఐదో రోజూ ధరలు అమాంతం ఎగిశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు (Today Gold Price) మరింత భారీగా పెరిగాయి. వెండి ధరలు మరో కొత్త మార్కునూ దాటేశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
26,000 మార్కు వద్దకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:46 సమయానికి నిఫ్టీ(Nifty) 56 పాయింట్లు నష్టంతో 26,086 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 201 పాయింట్లు దిగజారి 85,209 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 26-12-2025(time: 9:50am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఫ్యామిలీ
క్రిస్మస్ పండుగ ఆరునెలల పాటు నిర్వహించే దేశం ఏది? ఎందుకు?
ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకుంటారు, చాలా దేశాల్లో ఆ రోజున సెలవుదినoగా పరిగణిస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక్క రోజో నాలుగైదు రోజులో కాదు... నెలల తరబడి క్రిస్మస్ వేడుకలు జరిగే దేశం ఒకటి ఉంది. ఆ దేశం ఫిలిప్పీన్స్, అక్కడ క్రిస్మస్ అంటే ఒక సెలవుదినం కంటే కూడా చాలా ఎక్కువ. దాదాపు సగం సంవత్సరం పాటు విస్తరించింది. తద్వారా ఫిలిప్పీన్స్ సుదీర్ఘ పండుగ అసాధారణమైన వేడుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.స్థానికంగా కపాస్కుహాన్ అని పిలువబడే పండుగ సీజన్ సెప్టెంబర్ ప్రారంభంలోనే రేడియో పెరోల్స్లో క్రిస్మస్ సంగీతం ప్లే చేయడంతో ప్రారంభమవుతుంది అప్పటి నుంచే అక్కడ ఇళ్లను ప్రకాశవంతమైన రంగుల నక్షత్ర ఆకారపు లాంతర్లతో అలంకరిస్తారు. ‘బెర్ నెలలు‘ (సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు)గా పేర్కొనే ఇవి సెలవుదినం వరకూ కొనసాగుతాయి. నిదానంగా ప్రారంభమై డిసెంబర్ నాటికి, మతపరమైన సేవలు, కుటుంబ సమావేశాలు అర్ధరాత్రి విందులు జరిగినప్పుడు ఉత్సవాలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి.అయితే ఈ వేడుకలు క్రిస్మస్ రోజున అంటే డిసెంబరు 25న కూడా ముగియకపోవడం గమనార్హం. నూతన సంవత్సరం తర్వాత కూడా, తరచుగా జనవరి మూడవ ఆదివారం శాంటో నినో విందులతో వేడుకలు కొనసాగుతాయి. ఇంకా, కొంతమంది కాథలిక్కులకు, ఈ సీజన్ ఫిబ్రవరి 2, కాండెలేరియా విందు వరకు కొనసాగుతుంది, చివరకు ఆ సమయంలో అలంకరణలు తొలగించడం మొదలవుతుంది.ఫిలిప్పీనో క్రిస్మస్ మూలాలు శతాబ్దాల క్రితం ఉన్నాయి. 16వ శతాబ్దంలో క్రై స్తవ మతం రాకముందు, స్థానిక కమ్యూనిటీలు మొక్కలు నాటడం, అలాగే వ్యవసాయ పంటలతో ముడిపడి ఉన్న ఆచారాలను నిర్వహించేవారు, విందులు, సంగీతం, ఆత్మలు, దేవతలకు అర్పణలు వీటిలో భాగంగా ఉండేవి. స్పానిష్ వలసరాజ్యం ఈ పద్ధతులను క్రమంగా ఆవాహన చేసుకుంటూ కాథలిక్ సంప్రదాయాలను తీసుకువచ్చింది విశ్వాసం పండుగ ల ప్రత్యేకమైన మిశ్రమాన్ని సృస్టించింది. రికార్డుల ప్రకారం, ఫిలిప్పీన్స్ లో మొట్టమొదటి క్రిస్మస్ వేడుక డిసెంబర్ 1565లో సెబులోని ఫోర్ట్ శాన్ పెడ్రోలో జరిగింది, కాలక్రమేణా, ఊరేగింపులు వంటి కాథలిక్ ఆచారాలు స్థానిక ఆచారాలతో విలీనం అయ్యాయి, ఇది నేటికీ పాటిస్తున్న సంప్రదాయాలకు దారితీసింది.అలాగే, శాశ్వతమైన ఫిలిప్పీన్స్ వేడుకలలో సింబాంగ్ గబీ ఒకటి, ఇది డిసెంబర్ 16 నుంచి 24 వరకు జరిగే తొమ్మిది తెల్లవారుజామున ప్రార్థనల శ్రేణి. మొదట 1668లో నమోదు చేయబడిన ఈ ఆచారాన్ని మిషనరీలు ప్రవేశపెట్టారు. 18వ శతాబ్దం నాటికి, సేవలు తెల్లవారుజామునకు మారాయి, ఇది రైతులు పొలాల్లో పని చేయడానికి ముందు హాజరు కావడానికి వీలు కల్పించింది. దీనిని మిసా డి గాల్లో (‘కోడి ప్రార్థన‘) అని పిలుస్తారు. ప్రార్థన తర్వాత, ఆరాధకులు బిబింకా (బియ్యం కేక్) పుటో బంబాంగ్ (ఊదా రంగులో ఉడికించిన బియ్యం) వంటి రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తారు. తొమ్మిది ప్రార్థనలను పూర్తి చేయడం వల్ల ప్రత్యేక ఆశీర్వాదాలు లేదా శుభాకాంక్షలు లభిస్తాయని నమ్మకం.
క్రిస్మస్ కాంతులు
అవి బెత్లహేము పొలాలు. చిమ్మ చీకటి రాత్రి కాపరులు గొర్రెలను కాస్తున్నారు. అడవి మృగాలు వాటికి హాని చేయకుండా కొందరు కావలిగా ఉండి, మరికొందరు నిద్రిస్తుండగా ఆకస్మికంగా పొలాలపై దేదీప్యమైన వెలుగు కనిపించి, మధురమైన గానాలు ఆకాశం నుండి వినిపించగా, గొర్రెల కాపరులు తత్తరిల్లారు. కాపరులు భయంతో ఆశ్చర్యంగా చూస్తుండగా ఒక గొప్ప శుభవార్త పరలోకము నుండి వచ్చిన దేవదూతలు సమూహముగా ఆకాశవాణి వలే వినిపింపచేశారు.‘‘భయపడకుడి ఇదిగో ప్రజలందరికి కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు.’’ (లూకా 2:10,11) మెస్సయ్య కొరకు ఎదురుచూస్తున్న యూదులకు ఆ సమాచారము సమాధానం, సంతోషం కలిగించింది. ఇట్లు ఏసుప్రభు జన్మించిన రాత్రి దూతల శుభ సమాచారం ద్వారా క్రిస్మస్ప్రారంభమైంది.దేవుని వాక్యం స్థితిగతులను సవాలు చేయు శక్తి గలదన్న విషయంలో ఇక్కడ రెండు విషయాలు చూస్తున్నాము. ఒకటి దేవుని వాక్యం, రెండు స్థితిగతులను సవాలు చేయగల శక్తి గలదన్న విషయం ఈ రెండు వాక్యాలుగా గమనార్హం. దేవుని వాక్యం అనేది చాలాప్రాముఖ్యంగా శక్తిగలదన్న విషయాన్ని పరిశీలించాలి. బైబుల్ గ్రంధంలో వాక్యం రెండు రకాలు గలదిగా ఒకటి దేవుని వాక్యాన్ని చూస్తాం. వాక్యము (వర్డ్) సజనాత్మకమైన దేవుని వాక్యము, మనతో మాట్లాడే దేవుని వాక్యం (వర్డ్ దట్ స్పీక్స్), ఈ రెండు విషయాలు తెలుసుకొనేందుకు ప్రయత్నించాలి. బైబుల్ గ్రంధం ΄ాతనిబంధన పరిశీలించినట్లయితే ఆదియందు దేవుడు భూమ్యాకాశములు సృజించబడ్డాయని స్పష్టీకరించింది. ఆది: 1:1). ఆదికాండం ఒకటి, రెండు అధ్యాయాలలో సృష్టి ఏ విధంగా సృజించబడిందో స్పష్టీకరించబడింది. అయితే ప్రత్యేకంగా యోహాను సువార్తీకుడు స్పష్టంగా చె΄్పాడు. అదేమనగా ఆదియందు వాక్యముండెనని వాక్యం దేవుని వద్ద ఉన్నదని, ఆ వాక్యం దేవుడై ఉన్నదని ఆయన ఆదియందు దేవుని వద్ద ఉన్నారని తెలియజేయబడింది. (పరి. యోహాను 1:1) ఇందులో మూడు విషయాలు గ్రహించగలిగితే యేసుక్రీస్తు ఎవరు? ఈ భూలోకంలో ఎలా జన్మించాడో అన్న విషయం తెలుసు కుంటాము. ఆ విషయం తెలుసుకున్నట్లయితే ‘‘క్రిస్టమస్‘ పండుగ గూర్చి స్పష్టంగా అర్థం చేసుకోగలం.క్రిస్టమస్ పండుగ గురించి, దైవజనుడైన ఆర్.ఆర్.కె. మూర్తి గురించి తెలియని ప్రజలుండరు. ఎందుకంటే రవి అస్తమించిన చోటను కూడా బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించబడినట్లు గతకాలంలో ఆయన చేసిన సువార్త క్రైస్తవులు వెళ్ళలేని క్రైస్తవేతరుల గృహాల్లో ఆయన ప్రసంగాలు ‘విశ్వవాణి’ అనే సువార్త మాధ్యమం ద్వారా (రేడియో) ప్రతి రాత్రి 7 గంటలకు ప్రసారం కాబడింది. ఆ విధంగా ప్రసారాలు ఆయన వాక్యం ద్వారా ఆంధ్ర ప్రజలు, అటు భారతదేశం అంతటా ప్రసారాలు వీక్షించారని గుర్తించబడిన దైవ సేవకుడు. అంతేకాదు సువార్తలో ‘‘మతం వద్దు, యేసు వాక్యం ముద్దు’’ అని చె΄్పారు. కొందరు మారు మనస్సు కూడా పొదారన్న విషయం తెలిసినదే.క్రిస్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన. ఆ లాగున క్రిస్మస్ అనే దైవారాధన దినోత్సవంగా జరుపుబడు పండుగే క్రిస్టమస్.మహా దేవదూతలు సైన్యాలకు అధిపతియైన యెహోవా ‘‘పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు’’ అని నిత్యం కొలువబడు దేవుడు అనగా ‘ఎలోహీం’ అనే హెబ్రూ పదం. దీనిని ఇశ్రాయేలీయులు ఉచ్చరించరు. ఎందుకంటే అది పవిత్రనామం. దాని అర్థం సర్వశక్తిగల దేవుడని అర్థం. ఆ పదానికి బదులు ‘ఎదోనాయ్’ అని సంబోధిస్తారు. అట్టి దేవుడైన సర్వేశ్వరుడి తనయుడు శరీరధారిగా జన్మించిన రోజు క్రిస్మస్. శరీరధారిగా జన్మించాడు కాబట్టి అత్యధిక సంవత్సరాలు అనగా 969 సంవత్సరాలు జీవించిన మెతూషలా చనిపోయాడు. (ఆది: 5:27. అంతేకాదు మరణం జయించి బతుకు నరుడెవ్వరు లేరు. అందుచేత నరావతారిగా ఆయన జన్మించినందుననే మరణించాడు, నీ, నా ΄ాపమనే దోష నిమిత్తం దోషరహితుడు చనిపోయాడు.వాక్ అనే వాక్య రూపకమైన శబ్దం వివిధ భాషలలో అనగా హెబ్రూ భాషలో ‘దాబార్’ అని, గ్రీకులో ‘లాగాస్’ అని, ఇంగ్లీషులో ‘వర్డ్‘ అని, సంస్కృతంలో ‘వాక్’ అని, తెలుగు లో వాక్యమని అంటారు. భారతీయతత్వంలో ‘ప్రణవనాదం’ అంటారు. ఆ శబ్దమనే ప్రణవనాదం యేసునాథుడుగా జన్మించాడు.ఈ రక్షకుడు జన్మించిన రోజైన క్రిస్మస్ పండుగను భక్తిశ్రద్ధలతో క్రై స్తవులు చర్చీలలో బాలయేసు భజన చేయుచు భక్తులు నూతన వస్త్రధారణతోనూ, సంగీతసునాదములతోను జరుపుకొంటారు. (మత్తయి: 1:21). సర్వేశ్వరుని తనయుడైన యేసుక్రీస్తు కృప మనందరికి తోడైయుండును గాక. ఆమెన్! – కోట బిపిన్ చంద్ర΄ాల్ఏటేటా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరుపుకొనుచున్నారు. పోప్ జూలియస్ వన్, క్రీస్తుశకం 353 డిసెంబర్ 25 నాడు క్రిస్మస్పే అధికారికంగా ప్రకటించారు. తేదీ ఏమైనా ప్రభువు జన్మ చరిత్రాత్మకం యేసును పశువుల శాలయందు తొట్టిలో మొదట ఆ రాత్రి కాపర్లు చూచి ఆయన జన్మ వార్తను మొదట మిషనరీలవలే ప్రకటించారు. దేవుడు సామాన్యులను తన పనిముట్లుగా ఎన్నుకుంటే అసమానంగా ఖ్యాతి లోనికి తెస్తారు. తదుపరి కాన్స్టంటైన్ చక్రవర్తి తల్లి హెలీన 328/30 బి.సి. యేసు జన్మస్థానాన్ని కొత్తగా నిర్మించి లాటిన్ భాషలో ‘ఇచ్చట కన్య మరియ కుమారుడు పుట్టాడు,’ అని వ్రాయించాడు. నేటికిని ఏసుప్రభు జన్మస్థానం బెత్లెహేములో ప్రపంచవ్యాప్తంగా యాత్రికులు దర్శించి ధన్యలగుచున్నారు .‘‘ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్ధము.’’ (యెషయా 7:14) (మత్తయి 1:22) పరిశుద్ధాత్మ శక్తి వలన మరియ క్రీస్తుకు జన్మనిచ్చుటచే ఆయనకు జన్మ ΄ాపము లేదు. ప్రభువు చెప్పినట్లు నాలో ΄ాపమున్నదని ఎవరు స్థాపించుదురు అన్నట్లు ఆయన జన్మ, కర్మ ΄ాపము లేని నరావతారుడు గనుక తన ప్రజలను వారి ΄ాపముల నుండి రక్షించును అని అర్థమిచ్చు విధంగా యేసు అను పేరు పెట్టబడింది. ΄ాపప్రాయశ్చిత్తం చేయగలిగిన దేవుని గొర్రెపిల్ల క్రిస్మస్ నాడు జన్మించిన యేసే. క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన క్రైసట్ మాస్. ప్రభువు ముప్పదిమూడున్నర సంవత్సరాల భూలోక యాత్రలో ఆయన దైవ కుమారునిగా సామర్థ్యము, సార్ధక నామము యెషయా ప్రవక్త 700 సంవత్సరాలకు పూర్వమే ప్రవచించెను. ‘‘ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.’’ (యెషయా 9:6)మానవులను మారుమనసు ద్వారా చనిపోయిన తర్వాత పరలోకానికి చేర్చుటకే భూలోకానికి యేసు క్రీస్తు క్రిస్మస్ నాడు అవతరించెను. సువార్తలలో యేసు చేసిన గొప్ప కార్యములు, సేవ ఫలితం చదివినప్పుడు ఇది ముమ్మాటికి నిజమని తెలియజేయుచున్నది.క్రిస్మస్ లో మానవాళి ఎడల దేవుని ప్రేమ మిళితమై ఉన్నది. ‘‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొదునట్లు ఆయనను అనుగ్రహించెను. (యోహాను 3:16)దేవుని కుమారుడు, మానవ కుమారులను దైవసుతులుగా చేయుటక జన్మించెనని పరిశుద్ధ అగస్టిన్ తెలిపెను. ప్రేమ లేనిచోట ప్రేమ విత్తటానికి, సమాధానం లేనిచోట సమాధానం ఇవ్వటానికి, దేవదూతలు వారి గాన ప్రతిగానములలో ΄ాడారు. ‘‘సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమను కలుగును గాక.’’(లుకా 2:14) హదయములో, కుటుంబములో, సమాజంలో, భూమిపై యుద్ధములు కలహములు లేక నెమ్మదిగా వర్ధిల్లుటయే క్రిస్మస్ యొక్క సంకల్పము.మదర్ థెరిస్సా కు ఒక విలేకరి ప్రపంచ శాంతికి సూత్రం అడిగాడు. అప్పుడు ఆమె ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ప్రేమించమని చె΄్పారట. యేసు సమాధానకర్త. ఆమె ఐదు రూ΄ాయలతో మానవసేవప్రారంభించింది. ప్రపంచ శాంతి బహుమతికి ఆమె యోగ్యురాలే. ΄ాపం, శాపం సాతాను వల్ల స్వార్థం, ఒత్తిడి, ధనాశ వల్ల అసమాధానం పొగుచున్న ఈ అల్పకాల జీవితంలో వెంట తీసుకుని వెళ్ళేది ఏమీ లేదు. మనము శూన్యమని గ్రహిస్తే శాంతికామకులము ప్రధాతలు అవుతాము. సమాధాన కుమారుడు లేకుండా దేవుడు కుమారుడు కాడని రిచర్డ్ బ్యాక్సా్టర్ అన్నారు.క్రిస్మస్ వేళ ఎక్కడ చూసినా నక్షత్రాలు చూస్తాము. దానికి కారణము బైబిల్ లో బిలాము ప్రవక్త ప్రవచించిన ప్రకారము ‘‘నక్షత్రం యాకోబులో ఉదయించును రాజ దండము ఇశ్రాయేలులో నుండి లేచును’’ (సంఖ్య 24:17). తూర్పున ఆకాశమందు ఆనాడు వెలసిన నక్షత్రము (మత్తయి 2:2) నందు నెరవేరినది. ఆ నక్షత్రం చూచి జ్ఞానులైన రాజులు బెత్లెహేములో యేసును దర్శించి వారు బంగారము, సాంబ్రాణి, బోళమును కానుకలుగా అర్పించి, సమర్పించి హేరోదు రాజు యేసుని చంపగోరుచుండగా వారు వేరొక మార్గమున స్వదేశమునకు వెళ్లి క్రిస్మస్ చరిత్రలో నిలిచిపోయారు. బంగారం దైవత్వానికి, సాంబ్రాణి యాజకత్వమునకు, బోళము ఆయన మరణమునకు సాదశ్యంగా ఉన్నది అని గ్రహించి దూరము నుండి వచ్చిరి.‘‘సత్యమైనది దూర ంగానూ బహులోతుగాను ఉన్నది’’ (ప్రసంగి7:24) అని గ్రహించారు. విలువైనవి రక్షణ, దైవ ఆరాధన ఉచితమే గాని మానవుని ఇష్టం, కొంత ప్రయాస అవసరము అని జ్ఞానుల వృత్తాంతము నందు బైబిల్లో తెలియజేస్తుంది. లోకంలో ఉన్న పలు విధాల నక్షత్రాలు ఉన్నను తోటి వారికి పరలోకం చూపగలిగితేనే చరిత్ర, నిజ నక్షత్రాలు. ‘‘బుద్ధిమంతులు అయితే ఆకాశమండలంలోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు.’’(దానియేలు 12:3). జీవించినప్పుడే కాక లోకానికి దారి చూపు ప్రకాశం కలిగియుండువారే నిజ నక్షత్రాలు. తత్కాల వుల్కల వల్ల ప్రయోజనం లేదు. ‘‘యోహాను ప్రజ్వలించు ప్రకాశించు దీపము (యోహాను 5:13). ఒకసారి ఒక పంది ఒక ఆవు, నేను సమాజానికి సేవ చేస్తున్నామని పోటీ పడినయట. అయితే ఆవు నేను బ్రతికుండగానే ΄ాలు ఇచ్చి లోకానికి మేలు చేస్తున్నాను, ఓ పంది నీవు చనిపోయిన తర్వాత మాత్రమే నీ యొక్క మాంసాన్ని ప్రజలకు ఇవ్వగలవు అని చెప్పిందట. నిజమే బ్రతికున్నప్పుడు చేయకుండా చనిపోయిన తర్వాత ఏదో చేస్తామనుకోవటం అది మిద్యమాత్రమే.క్రిస్మస్ అనగా మహా సంతోషం, మన అందరిలో మహా సంతోషం సమాదనం కలిగివుండుట. సాతాను క్రియలు విసర్జించుటవలన సమాధానకర్త ఏలును. నోవహు అనగా నెమ్మది. ఆయన కాలంలో జల ప్రళయం వచ్చినను తప్పించబడెను. గిద్యోను బైబిల్ లో సమాధాన కర్త. క్రిస్మస్ అనగా పంచుట, ఇచ్చుట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట. క్రిస్మస్ లో, దేవాది దేవుడు మానవుడిగా తగ్గించుకున్నారు. (మత్త 11:28); (ఫిలిప్పి 2:5–8). దీనులదే పరలోకం. అందం, ఆస్తి, ఆధికారం మొదలైన అతిశయాలు అనర్థాలవుతాయి. యేసు పశువుల తొట్టిలో పరున్నను నేడు పరలోకములో తండ్రి కుడి ΄ార్శ్వమున నుండి ఎలుచున్నాడు. క్రిస్మస్ అనగా చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చుట. కన్నులు పైకెత్తి చూచి పరలోక అశ్వర్యము పొదుట.చైనాలో మిషనరీ గా వెళ్ళిన హడ్సన్ టైలర్ ఇలా అన్నాడు – వెయ్యిపండ్లు వున్న చైనాకే. వెయ్యి జీవితాలున్న ఉన్న చైనాకే సమర్పిస్తాను. ఈనాడు అభాగ్యులు, నిరాశపరులు, వ్యాధి బాధ కరువు కాటకములలో వున్నవారి స్వరం మనం వినగలిగితే మన పరిధిలో త్యాగం, ప్రేమ, చూపగలిగితే అదే నిజమైన క్రిస్మస్. ఆ విధంగా భూమి మీద ఉన్న సమస్త ప్రజలకు ఈ సువార్త వల్ల మేలు చేయుటయే నిజ క్రిస్మస్.అందరికీ క్రిస్మస్ శుభములు.– తంటిపూడి ప్రభాకరరావు ‘‘ఆది’’ అనే వాక్యం గూర్చి ఆలోచన చేస్తే ‘‘ఆది’’ అనగా ఆది లేని ఆది (బిగినింగ్ లెస్ బిగినింగ్)గా చూస్తాం. ఇంకా లోతుగా ఆలోచన చేస్తే త్రిత్వంలోని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రిత్వ దైవత్వంలోని రెండవ (కుమారుడైన) వ్యక్తే యేసు క్రీస్తుగా గమనించగలం. యెహెూవా వాక్కు చేత భూమి, ఆకాశం సృజించబడ్డాయని, ఆయన (దేవుడు) వాక్కును పంపి వారిని స్వస్థపరచాడనిస్పష్టీకరించబడింది. ఆయన (దేవుడు)వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాడు. (కీర్తన 33:6, 107:20) వచనాలలో చూస్తాం. ఆ వాక్యమే సర్వేశ్వరుని తనయుడైన యేసుక్రీస్తుగా నరావతారిగా శరీరధారిగా దివి నుండి భువికి దిగివచ్చి అనేకులను స్వస్థపరచాడు. పడిన గోతిలో నుండి అనగా ΄ాపమనే దుష్కార్యాలను, ఉపమానాల ద్వారా ప్రబోధించి, తండ్రి ఆనుమతి ప్రకారం ఈ లోకంలో మన మధ్య నివసించిన కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తుగా జన్మించాడు. నేటికి 2025 సంవత్సరంలో ఆయన జయంతిని భారతదేశం, ΄ాశ్చాత్య దేశాల వారు జరుపుకొనే పండుగే క్రిస్మస్.యేసు అందరికీ రక్షకుడు గనుక అన్ని దేశముల వారికి, అన్ని తెగల, జాతుల, సకల మానవాళి కొరకై సిలువపై పాపప్రాయశ్చిత్తంగా, తన నిర్దోషరక్తము చిందించుట కొరకు వచ్చుటచే, క్రిస్మస్ లో యేసును ఆరాధించుట భావ్యమే. క్రిస్మస్ లో దేవదేవుని ప్రణాళిక ‘‘నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను. (లూకా 19:10) ఈనాడు, ఈ యుగంలో సమాజం పాలకు, వ్యసనాలకు బానిసయై, వ్యాధి బాధలకు లోనగుచు నశించుచున్నారు. అందుకే రక్షకుని అవసరత ఉన్నది. ఆయన పాపులను రక్షించుటకే పుట్టెను.
సర్వ మానవాళికి శుభ సందేశం క్రిస్మస్
దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. అందుకనే తొలి మానవుడిని తన స్వరూపంలో తన పోలిక చొప్పున నేలమంటితో నిర్మించాడు. తొలి భార్య భర్తలైన హవ్వ ఆదాములతో అందమైన ఏదెను తోట ఏర్పాటు చేసి స్నేహితునిలా కొనసాగాడు. అయితే దుష్టుడైన సాతాను ప్రభావంతో వారు దేవుని ఆజ్ఞ మీరారు. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వలన వచ్చే జీతం మరణం. ఫలితంగా మానవులకు మరణం సం్రపాప్తమైంది. భూమి శపింపబడింది. భూమిపై మానవ మనుగడ కష్టతరంగా మారింది.అయితే తాను సృష్టించిన మానవుడిని మాత్రం దేవుడు ఎప్పుడూ విడిచి పెట్టలేదు. భూమిపై అక్రమం, స్వార్థం, హింస పెరిగిన తరుణంలో మానవులను రక్షించేందుకు నాయకులను, న్యాయాధిపతులను, రాజులను, ప్రవక్తలను ఏర్పాటు చేసినా మానవుని స్వభావంలో ఎటువంటి మార్పు లేకుండా పోయింది. పాపానికి నరుడు బానిసగా మారిపోయాడు. మోసకరమైన హృదయంతో చీకటితో నిండిన జగతిలో నరకానికి వారసుడయ్యాడు. నరక పాత్రుడైన మానవుడ్ని రక్షించి నిత్య జీవం ఇచ్చేందుకు తిరిగి దేవునితో అనుసంధానం చేసేందుకు పరలోక దేవుడే నరరూపధారుడై రెండు వేల సంవత్సరాల క్రితం దివి నుంచి ఈ భువిపైకి వచ్చేందుకు సిద్ధ పడ్డాడు. మానవుల పట్ల దేవుని అపారమైన ప్రేమకు గొప్ప తార్కాణమే క్రిస్మస్.క్రీస్తు జననం సర్వాధికారియైన దేవాది దేవుని జననం ఎంతో ఆశ్చర్యం, ఆనందం, అద్భుతం. జగముల నేలే రారాజు అతి సామాన్యుడిగా, దీనుడుగా ఈ ధరిత్రిపై అరుదెంచాడు. అందుకు యూదా దేశంలోని బేత్లెహేము వేదికైంది. ఆ కాలంలో యూదా ప్రాంతం అంతా రోమా చక్రవర్తి కైసరు ఔగుప్తు ఏలుబడిలో ఉంది. హేరోదు యూదా ప్రాంతానికి అధినేతగా యూదుల రాజుగా కొనసాగుతున్నాడు. గలిలయ ప్రాంతంలో అతి సామాన్య కుటుంబంలో పుట్టి నజరేతు వాడైన యోసేపుకు ప్రదానం చేయబడిన పరిశుద్ధురాలైన కన్యక మరియ గర్భంలో జన్మించడానికి సిద్ధమయ్యాడు. క్రీస్తు జననం శుభవార్త దేవుని ప్రధాన దూతయైన గబ్రియేలు ముందుగా మరియకు తెలియచేశాడు. దయా్రపాప్తురాలా అంటూ శుభ వచనం పలికి దేవుని కృప పొందిన నీవు పురుష సంయోగం లేకుండా కన్యకగానే గర్భము ధరించి ఓ కుమారునికి జన్మనిస్తావు. ఆయనకు యేసు అని పేరు పెడతావు అతడు సర్వోన్నత దేవుని కుమారుడనబడతాడు అని దేవునిదూత చెప్పడంతో నవ యవ్వనంలో ఉన్న మరియ ఎంతో భయపడింది. ఇది ఎలా సాధ్యం అంటున్న తరుణంలో ‘మరియా భయపడకు ఇది కేవలం దేవుని పరిశుద్ధాత్మ శక్తితోనే జరుగుతుంది. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడతాడు...’ అన్న దూత పలుకులను మరియ వినయంగా స్వీకరించింది. మరియ తన ప్రమేయం లేకుండా గర్భవతి అయిందని తెలిసిన యేసేపు ఆమెను రహస్యంగా వదిలివేయాలని భావిస్తాడు. ఎందుకంటే ఆ రోజుల్లో వివాహం కాకుండా ఏ స్త్రీ అయినా గర్భవతి అయితే బహిరంగంగా రాళ్ళతో కొట్టి చంపడం యూదుల ఆచారం. అదే సమయంలో ఈ శుభ వర్తమానం దూత ద్వారా యోసేపుకు చేరుతుంది. యేసేపూ భయపడవద్దు మరియను చేర్చుకొనుటకు సందేహింప వద్దు. పరిశుద్ధాత్మ వలన ఈ కార్యం జరుగుతుంది. ఆమె కుమారునికి యేసు అని పేరుపెట్టాలి ఎందుకంటే తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షిస్తాడు. క్రీస్తు పుట్టుకకు వందల సంవత్సరాలకు ముందే యెషయా, మీకా లాంటి ప్రవక్తల ద్వారా చేసిన ప్రవచనాల నెరవేర్పు జరిగింది. మరియ సుతుడికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడుతుంది దానికి అర్థం ‘దేవుడు మనకు తోడు’. యెషయా క్రీస్తు జననాన్ని ప్రవచిస్తూ ‘ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింప బడెను, ఆయన భుజము మీద రాజ్య భారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని పేర్కొన్నాడు. క్రీస్తుకు ముందుగా నడవడానికి వృద్ధ దంపతులైన జెకర్యా, ఎలీసబెతులకు కుమారుడిగా బాప్తీస్మమిచ్చు యోహాను అనుగ్రహించ బడ్డాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఎటువంటి పాపము చేయకుండా పరిశుద్ధత కలవారినే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.చరిత్ర సాక్షిగా..మానవ చరిత్రలో యేసు నమోదు చేయబడ్డాడు. సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయాలని రోమా చక్రవర్తి కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ వచ్చింది. యోసేపు దావీదు వంశములో పుట్టిన వాడు గనుక తనకు ప్రదానం చేయబడిన నిండు చూలాలైన మరియను తీసుకొని గలలియలోని నజరేతు నుండి యూదాలోని బేత్లెహేముకు బయలు దేరాడు. ఎంతో ప్రయాసతో కూడిన ప్రయాణం ముగించుకొని బేత్లెహేము గ్రామం చేరుకున్నారు. అప్పటికే జనాభా సంఖ్యలో రాయబడటానికి వచ్చిన ప్రజలతో బేత్లెహేము గ్రామం క్రిక్కిరిసి పోయింది. ఓ సత్రపు యజమాని దయతలచి తన పశువుల కొట్టంలో ఉండటానికి వీరికి చోటిచ్చాడు. ప్రసవ దినములు నిండటంతో మరియ శిశువును కని పొత్తి గుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండ బెట్టింది. అవని అంతా ఆయనదే అయినా స్థలం లేక రాజుల రాజుకు చివరకు పశువుల తొట్టె పవళించే పాన్పుగా మారిపోయింది. మనలను ధనవంతులుగా చేసేందుకు ఆయన దరిద్రుడాయేను అన్న లేఖనాల నెరవేర్పు నిజమైంది.దివిలో భువిలో సంబరాలుయేసు జన్మించిన వెంటనే అటు పరలోకంలోనూ ఇటు ధాత్రిలోనూ సంబరాలు మొదలయ్యాయి. ముందుగా పొలంలో గొర్రెలు కాసుకుంటున్న గొర్రెల కాపరుల వద్దకు ప్రభువు దూత శుభవర్తమానం వెళ్ళింది. ఆ దూత ద్వారా కలిగిన ప్రకాశమైన వెలుగును చూసి వారు భయపడగా దూత భయపడ వద్దని చెప్పి ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము తెచ్చానని ‘దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడని ఆయనే ప్రభువైన క్రీస్తు’ అని ప్రకటించడం జరిగింది. అనంతరం పరలోకం నుంచి దూతల మహా సైన్యసమూహము ‘సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగును గాక‘ అంటూ స్తోత్ర గీతాలతో దేవుని మహిమ పరచారు. గొర్రెల కాపరులు వెళ్ళి పశువుల తొట్టిలో పండుకున్న శిశువును చూచి ఎంతో సంబరపడి శిశువును గూర్చి తాము చూసిన సంగతులన్నీ ఊరంతా ప్రచారం చేశారు. యేసు జననం సందర్భంగా ఆకాశంలో ఒక అరుదైన నక్షత్రం వెలసింది. అది చూసిన తూర్పుదేశపు జ్ఞానులు ముగ్గురు తారను వెంబడించి ముందుగా యెరూషలేము చేరుకొని హేరోదు రాజును కలిసి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగి తెలుసుకొని బేత్లెహేము చేరుకొని బాల యేసును చూసి అత్యానందభరితులై సాగిలపడి పూజించి తాము తెచ్చిన బంగారము, సాంబ్రాణి, భోళము ప్రభువుకు కానుకగా సమర్పించారు. అలా క్రీస్తు జననం దివిని భువిని ఏకం చేసింది. దేవుడితో మరల మానవుడు పోగొట్టుకున్న సమాధానం కల్పించింది. అందుకే క్రిస్మస్ సర్వ లోక వేడుకగా మారిపోయింది. సామాన్యులకు, జ్ఞానులకు ఒకే పీట వేసింది. అప్పటినుంచే ప్రపంచ చరిత్ర రెండుగా విభజింపబడింది. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకంగా పిలువబడింది.క్రిస్మస్ అంటే ఆరాధనక్రిస్మస్ అంటే దేవుని నిండు మనసుతో ఆరాధించడం. మనకోసం పరలోక భాగ్యాన్ని వదులుకొని పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఎలా జీవించాలో ఆచరణాత్మకంగా చూపించిన ఆ ప్రభువును వేనోళ్ళ స్తుతించడమే నిజమైన క్రిస్మస్. ఆరాధన అంటే అల్లరితో కూడిన ఆట, పాటలు కాదు అంబరాన్ని అంటే సంబరాలు జరపడం కాదు, విందులు వినోదాల్లో తెలియాడటం కాదు, హంగు ఆర్భాటం ఆడంబరాల్లో మునిగితేలడం కాదు.. దేవుని ఆరాధించు వారు ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించాలి. క్రీస్తును హృదయం లో కలిగి ఉండటమే క్రిస్మస్. అదే క్రీస్తుకు కావాల్సిన ఆరాధన. నశించి పోయే ఆత్మలకు నిత్యజీవము వర ప్రసాదంగా అందించాడు. నీతివంతమైన జీవితం, మారుమనస్సు, రక్షణ ద్వారా ఇది సాధ్యం అని చె΄్పాడు అంతేకాదు ఈ లోకాన్ని జయించడానికి కావలసిన ప్రేమ, కరుణ, జాలి, దయ, శాంతం, సహనం, తగ్గింపు, వినయం, ఓర్పు ఎలా కలిగి వుండాలో తన జీవితం ద్వారా నేర్పించాడు. అన్నిటికీ మించి చీకటిలో బతుకుల్లో గొప్ప వెలుగు నింపేందుకు యేసు ఈ లోకానికి వచ్చాడు. నేను లోకమునకు వెలుగునైయున్నాను అని ప్రకటించాడు. ఆయనతో నడిచే వారు జీవపు వెలుగు కలిగి ఉంటారు. ఈ క్రిస్మస్ శుభవేళ మనందరం క్రీస్తు స్వారూప్యంలోకి మారాలన్నది ఆ కరుణామయుని అభిలాష. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక! ఆమేన్ !!!మీ అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు.దేవుడే ఎందుకు దిగి వచ్చాడు?క్రీస్తు రాకకు ప్రధాన కారణం పాపులను రక్షించుటకే. తొలి మానవుడు ఆదాము ద్వారా వచ్చిన పాపపు బీజం తీసివేయడానికి తన పరిశుద్ధ రక్తం ద్వారా సిలువపై బలిదానం ద్వారా ధరవాసులందరికి పాప విమోచన కోసం మనుషుల మధ్య నివసించేందుకు సర్వాధికారియైన దేవుడు శరీరధారి అయ్యాడు. అంతేకాదు యేసు ప్రభు ప్రజలందరికీ రక్షణ సువార్త అందించడం, పాపపు చెరలో వున్న వారికి విడుదల, అంధకారమైన జీవితాల్లో వెలుగు నింపడం, బాధల్లో నలిగి పోయినవారికి ఓదార్పు విడుదల ఇచ్చేందుకే నేను వచ్చానని ప్రకటించాడు.– స్టెర్జి రాజన్ బందెల సీనియర్ పాత్రికేయులు
ఇయర్‌ఫోన్ వాడకం ఇంత పరేషాన్ చేస్తుందా..?
హెడ్‌ఫోన్ ధరించడం కొందరికి ఫ్యాషన్ అయితే మరికొందరు ఏకాగ్రత, పనితీరు కోసం ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా చుట్టూ గందరగోళంగా ఉంటే..ఈ హెడ్ఫోన్లు ఎంతో హెల్ప్ అవుతాయి. అదీగాక సౌకర్యవంతమైన స్థాయిలో వాల్యూమ్‌ని ఎడ్జెస్ట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అయితే అవే హెడ్ఫోన్లు సుదీర్ఘకాలం లేదా గంటల తరబడి ఉపయోగిస్తే..చాలా ఆరోగ్య సమస్యలు ఫేస్ చేయక తప్పదని హెచ్చరిస్తున్నారు ..ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతిర్మయి హెగ్డే. మరి అవేంటో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.వినికిడి నష్టం (NIHL)అధిక వాల్యూమ్‌లో ఎక్కువ సేపు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని వింటే వినికిడి సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది పరిశోధనలు చెబుతున్నాయి. గంటల తరబడి వినయోగించకపోవటమే మేలని చెబుతున్నారు.టిన్నిటస్ఇలా ఎక్కువసేపు హెడ్‌ఫోన్ ఉపయోగించడం వల్ల చెవులో వింత వింత శబ్దాలు వినిపించే టిన్నిటిస్ లక్షణాలు ఎదుర్కొనాల్సి వస్తుందట.అలసటకు గురవ్వడంఎక్కువసేపు హెడ్‌ఫోన్ ఉపయోగించడం వల్ల చెవి, మెదడు అలసటకు గురై..దృష్టి కేంద్రీకరించడం, లేదా ప్రసంగించడంలో సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందట. ఇది వైద్య పరమైన రుగ్మత కానప్పటికీ..ప్రభావం మాత్రం తారాస్థాయిలో ఉంటుందంటున్నారు.మిగతా శబ్దాలపై అవగాహన లోపం..అదేపనిగా హెడ్‌ఫోన్స్ ఉపయోగించటం వల్ల ఆ శబ్దాలకే అలవాటుపడి చుట్టుపక్కల పరిసరాల శబ్దాలను గ్రహించలేని పరిస్థితి ఎదురవ్వుతుందని ఆడియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. మతిమరుపు వచ్చే అవకాశంఅతిగా ఇయర్ ఫోన్స్ ఉపయోగించే వారిలో శ్రద్ధ లోపించి..జ్ఞాపకశక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని పలు అధ్యయనాల్లో తేలిందని హెచ్చరిస్తున్నారు.సురక్షితంగా ఎలా ఉపయోగించాలంటే..ఇయర్ ఫోన్‌ని సురక్షితమైన పద్ధతిలో వాడుకుంటూ..వినికిడి, జ్ఞాపకశక్తిని కోల్పోయే సమస్యల బారిన పడకూడదంటే ఈ సింపుల్ చిట్కాలు అనుసరిస్తే చాలట.తక్కువ వాల్యూమ్‌తో వినడం.తప్పనిసరి అయితే తప్ప.. హెడ్‌ఫోన్ వినియోగాన్ని పరిమితంగా ఉపయోగించేలా చూడటం. సరైన హెడ్‌ఫోన్స్‌ని ఉపయోగించి..వాల్యూమ్ నేరుగా చెవిలోకి చొచ్చుకుపోనివ్వని సురక్షితమైనవి వాడటం మేలుఅంతేగాదు వినికిడి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో లేదో గమనించుకోవడంచివరగా ఏ వస్తువైనా సరైన మార్గంలో పరిమితంగా వినియోగిస్తే ఎలాంటి సమస్యలు దరిచేరవు..పైగా మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని బేషుగ్గా లీడ్ చేయగలుగుతామని చెబుతున్నారు ఈఎన్టీ నిపుణులు డాక్టర్ జ్యోతిర్మయి. --డాక్టర్ జ్యోతిర్మయ్ ఎస్ హెగ్డే, ఈఎన్టి స్పెషలిస్ట్, ఆస్టర్ వైట్‌ఫీల్డ్ ఆస్పత్రి (చదవండి: Travel Trends 2026: కొత్త ఏడాది టాప్-10 ప్రదేశాలు ఏవంటే..?)
అంతర్జాతీయం
Bangladesh: ఆగని మత హింస: మరో యువకుని హత్య
ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల పరిస్థితి అంతకంతకూ ఆందోళనకరంగా మారుతోంది. మైమెన్సింగ్లో దీపు చంద్ర దాస్ అనే యువకుడిని హత్యచేసి.. మృతదేహాన్ని దహనం చేసిన ఘటన మరువక ముందే.. తాజాగా రాజ్‌బారి జిల్లాలో మరో హిందూ యువకుడు మూకదాడికి బలయ్యాడు. బుధవారం రాత్రి పాంగ్షా ఉపజిల్లా హోసైన్‌డంగా పాత మార్కెట్ వద్ద 29 ఏళ్ల అమృత్ మండల్ (సామ్రాట్) అనే యువకుడిని కొందరు కొట్టి చంపడం తీవ్ర కలకలం రేపింది.పోలీసుల కథనం ప్రకారం.. అమృత్ మండల్ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో స్థానికులు అతడిపై దాడి చేసి, హత్య చేశారు. మృతుడు ‘సామ్రాట్ బహినీ’ అనే స్థానిక బృందానికి నాయకుడని పాంగ్షా పోలీస్ స్టేషన్ అధికారి షేక్ మొయినుల్ ఇస్లాం తెలిపారు. దర్యాప్తు ప్రారంభించిన అధికారులు, అల్లర్లు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు. వారం రోజుల వ్యవధిలో ఇది రెండో మూకహత్య కావడం గమనార్హం. డిసెంబర్ 18న మైమెన్సింగ్లోని భలుకాలో దీపు చంద్ర దాస్ అనే ఫ్యాక్టరీ కార్మికుడిని ఇస్లాం మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే నెపంతో కొట్టి చంపారు. మరోవైపు, దేశంలో రాజకీయ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య తర్వాత ఢాకాలో హింసాత్మక నిరసనలు మిన్నంటాయి. కొందరు యువ నేతలు భారత వ్యతిరేక ప్రకటనలు చేయడంతో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి.
విష్ణు విగ్రహం కూల్చివేత.. థాయ్ వివరణ
బ్యాంకాక్: థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దుల్లొ విష్ణుమూర్తి విగ్రహం కూల్చివేతపై థాయ్‌లాండ్ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ చర్య భద్రతా కారణాలతో కూడుకున్నదని, మతపరమైన ఉద్దేశాలు ఏవీ లేవని అధికారులు తెలిపారు. సరిహద్దు నిర్వహణ, నియంత్రణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు థాయ్-కంబోడియన్ సరిహద్దు ప్రెస్ సెంటర్ మీడియాకు వెల్లడించింది.2014లో నిర్మితమైన ఈ విగ్రహాన్ని థాయ్ సైనిక సిబ్బంది బ్యాక్‌హో లోడర్‌తో కూల్చివేస్తున్న దృశ్యాలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. ఈ నిర్మాణం తమ భూభాగంలోని చోంగ్ అన్ మా ప్రాంతంలో ఉందని, సార్వభౌమత్వాన్ని తెలియజేసేందుకే కంబోడియా సైనికులు దీనిని నిర్మించారని థాయ్ అధికారులు చెబుతున్నారు. హిందూ మతంతో తమకు ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను గౌరవిస్తామని, అయితే సరిహద్దు ఉద్రిక్తతలను పెంచే చిహ్నాలను నిరోధించడమే తమ ప్రాధాన్యతని వారు తెలిపారు.ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. థాయిలాండ్ మరియు కంబోడియా దేశాలు రెండూ సంయమనం పాటించాలని, వివాదాలను చర్చలు మరియు దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది.మరోవైపు, కంబోడియా ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. తమ భూభాగంలోని ప్రీహ్ విహార్ ప్రావిన్స్‌లో ఉన్న విగ్రహాన్ని థాయ్ దళాలు ధ్వంసం చేశాయని ఆరోపించింది. ఈ సరిహద్దు వివాదం కారణంగా గతంలో ఘర్షణలు ఏర్పడి పలువరు ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో మౌలిక సదుపాయాలు, మతపరమైన కట్టడాల రక్షణపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఇది కూడా చదవండి: టీచర్‌పై తూటాల వర్షం.. వర్శిటీలో దారుణం
Australia: బాండీ బీచ్ ఘటన మరువకముందే..
సిడ్నీ: ఆస్ట్రేలియాలో యూదు సమాజం లక్ష్యంగా జరుగుతున్న దాడులు ఆ దేశంలోని శాంతిభద్రతలను ప్రశ్నిస్తున్నాయి. సిడ్నీలోని బాండీ బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటన మరువక ముందే, మెల్బోర్న్లో మరో విద్వేషపూరిత ఘటన వెలుగుచూసింది. హనుక్కా పండుగ గుర్తు ఉన్న ఒక కారుపై దుండగులు పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. ఇంటి డ్రైవ్‌వేలో పార్క్ చేసి ఉన్న కారుపై జరిగిన ఈ దాడిని యూదు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి, గత రెండేళ్లుగా పెరుగుతున్న యూదు వ్యతిరేకతే ఇందుకు కారణమని వారు ఆరోపిస్తున్నారు.డిసెంబర్ 14న బాండీ బీచ్ సమీపంలోని యూదుల సమావేశంపై జరిగిన కాల్పుల ఘటన దేశాన్ని ఒక్కసారిగా వణికించింది. సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ అక్రమ్ జరిపిన ఈ దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, 38 మందికి పైగా గాయపడ్డారు. 1996 తర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన అత్యంత భయంకరమైన కాల్పుల ఘటనగా దీనిని అధికారులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో ఈ తండ్రీకొడుకులు మారుమూల ప్రాంతాల్లో ముందస్తుగా తుపాకీ ప్రాక్టీస్ చేసినట్లు షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.ఈ విపత్కర పరిస్థితులపై ఆస్ట్రేలియన్ జ్యూయిష్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే మత విద్వేషాలు పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెల్బోర్న్ కారు దహనం వెనుక మతపరమైన కోణాన్ని అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించనప్పటికీ, స్థానిక యూదు సమాజం మాత్రం తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. యూదు వ్యతిరేక సంక్షోభం ఆస్ట్రేలియాలో ఒక సవాలుగా మారిందని వారు పేర్కొన్నారు.కాగా ఈ దాడుల సమయంలో ప్రాణాలకు తెగించి ఇతరులను కాపాడిన వారిని గౌరవించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ గురువారం ఒక కొత్త ‘జాతీయ ధైర్యసాహసాల అవార్డు’ను ప్రకటించారు. అసాధారణ ధైర్యం ప్రదర్శించిన పౌరులు, అత్యవసర సేవా సిబ్బందికి ఈ గౌరవం దక్కుతుందని ఆయన తెలిపారు. సమాజంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి; ఐటీ ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ క్రిస్మస్ కానుక
ప్రళయం పోస్ట్‌పోన్.. యుగాంతం ఇప్పట్లో లేనట్లే!
ప్రళయాన్ని మానవమాత్రులైనా అంచనా వేయగలరా?.. అదేం సినిమానా? పోస్ట్‌పోన్ కావడానికి అనుకుంటున్నారా?. లక్షల మందిని మోసం చేసిన ఓ వ్యక్తి మాటల గురించే ఇక్కడ చెప్పబోతున్నాం. డిసెంబర్ 25వ తేదీన పెద్ద ప్రళయం పుట్టుకొస్తుందని.. దాని ప్రభావంతో యుగాంతం తప్పదని ప్రచారం చేసిన ఆ వ్యక్తి ఇప్పుడేమో మాట మార్చేశారు మరి!.. ఘనాకు చెందిన మత గురువు ఎబో(Eboh Noah) లెక్క తప్పింది. క్రిస్మస్ నాడే మహా జలప్రళయం మొదలుకాబోతోందని హెచ్చరికలు జారీ చేసిన ఇతగాడు.. ఇప్పుడు అబ్బే దేవుడు కొంతకాలం దానిని వాయిదా వేశాడంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. తనను తాను దైవ దూతగా ప్రకటించుకున్న నోహా.. ఈ ప్రళయం పేరు చెప్పుకునే లెక్కలేనంత విరాళాలు సేకరించడం ఈ ఎపిసోడ్లో కొసమెరుపు. 30 ఏళ్ల ఎబో.. ఈ ఏడాది ఆగస్టులో ‘‘జరిగేది.. జరగక మానదు’’ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ క్రిస్మస్ తేదీన ప్రపంచమంతా జోరు వాన మొదలవుతుందని.. అది మూడేళ్లపాటు ఆగకుండా కురిసి ప్రపంచం మునిగిపోతుందని, అయితే ఆ జల ప్రళయంలో మూడేళ్లపాటు తట్టుకోగలిగే పడవలను నిర్మించే బాధ్యత దేవుడు తనకు(నోహానని చెబుతూ) అప్పగించాడని అనుచరుల్ని నమ్మ బలికాడు. ఆ అనుచరులు ఆ ప్రచారం విస్తృతంగా జరపడంతో.. ఎబోకి ఎబో జీససగా, ఎబో నోహాగా పేరు దక్కింది. ఈ మాటలు నమ్మిన లక్షల మంది తమ వద్ద ఉన్నవాటిని అమ్మేసి డబ్బులు ఇచ్చారు. తీరా.. ఆ తారీఖు వచ్చేసరికి.. ఆ యుగాంతం వాయిదా పడిందని చెబుతున్నాడు. దేవుడు మానవాళికి ఇంకొంత సమయం ఇచ్చాడని.. అలాగే మరింత మందిని రక్షించేలా ఆర్క్ ప్రాజెక్టు(భారీ పడవల నిర్మాణం) విస్తరించాలని ఆదేశించాడని చెబుతున్నాడు. అయితే ఎబో డూమ్స్‌డే హెచ్చరికలపై పలువురు మండిపడుతున్నారు. బైబిల్ ప్రకారం.. ప్రళయం ఏనాడో వచ్చిందని, మరొకటి వచ్చే ప్రసక్తే లేదని.. మత విశ్వాసాలను అడ్డుపెట్టుకుని జనాలను మోసం చేయడం సరికాదని ఎబోకు హితవు పలుకుతున్నారు. ఇంకోవైపు.. జనాల నుంచి సేకరించిన సొమ్ముతో ఎబో విలాసాలు అనుభవిస్తున్నాడంటూ పలువురు మండిపడుతున్నారు. BIG UPDATE 🔴Ghanaian self styled prophet Eboh Noah said God would end the world in a new flood on December 25, 2025, urging followers to fund the construction of 8 arks. Many sold their belongings and handed over the money.He has now said the apocalypse has been postponed.… pic.twitter.com/2aX6F2FVN3— Open Source Intel (@Osint613) December 24, 2025Just after buying a new Benz pic.twitter.com/aIAq6IhDtk— Richy Rich (@richyrich) December 24, 2025
జాతీయం
ఇండియన్ రైల్వే.. టికెట్ ఛార్జీలు పెరిగాయ్.. ఎంతంటే?
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు గమనిక. నేటి నుంచి పెరిగిన కొత్త ట్రైన్ టికెట్ ధరలు అమల్లోకి వచ్చాయి. రైల్వే శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ఆధారంగా.. సాధారణ తరగతి ప్రయాణికులకు 215 కి.మీ. దూరం వరకు ఎలాంటి పెంపు ఉండదు. అయితే 216 కి.మీ (కిలోమీటర్) దూరం దాటిన తర్వాత ప్రతి కిలోమీటర్‌కు ఒక పైసా అదనంగా వసూలు చేస్తోంది. రైల్వే అధికారులు మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లు, అన్ని ఏసీ తరగతులలో ప్రతి కిలోమీటర్‌కు రెండు పైసలు పెంపు అమలు చేశారు. ఈ పెంపుతో ఈ ఏడాదిలో రెండో సారి ట్రైన్ టికెట్ ధరలను పెంచినట్లైంది. తొలిసారి ఈ ఏడాది జులైలో రైల్వే టికెట్ ధరలు పెంచిన విషయం తెలిసిందే. సవరించిన ధరల ప్రకారం, సబర్బన్ సేవలు, సీజన్ టికెట్లకు ఎలాంటి మార్పులు లేవు. సాధారణ నాన్-ఏసీ (నాన్-సబర్బన్) సేవల్లో రెండో తరగతి, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ టికెట్లలో ధరలు దశలవారీగా పెంచింది. సెకండ్ క్లాస్ సాధారణ టికెట్లలో 215 కి.మీ. వరకు ఎలాంటి పెంపు లేదు. 216 కి.మీ. నుండి 750 కి.మీ. వరకు ప్రయాణానికి రూ.5 పెంపు ఉంటుంది. 751–1250 కి.మీ. మధ్య ప్రయాణానికి రూ.10, 1251–1750 కి.మీ. మధ్య ప్రయాణానికి రూ.15, 1751–2250 కి.మీ. మధ్య ప్రయాణానికి రూ.20 పెంపు అమలు చేసింది. స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ సాధారణ టికెట్లలో ప్రతి కి.మీ.కు 1 పైసా చెల్లించాల్సి ఉంది. ఇది నాన్-సబర్బన్ ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్-ఏసీ, ఏసీ తరగతులన్నింటిలో ప్రతి కి.మీ.కు 2 పైసా పెంపు ఉంది. ఉదాహరణకు, 500 కి.మీ. ప్రయాణం చేసే ప్రయాణికుడు నాన్-ఏసీ మెయిల్/ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో సుమారు రూ.10 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. రాజధాని, శతాబ్దీ, దురంతో, వందే భారత్, హంసఫర్, అమృత భారత్, మహామనా, గతిమాన్, అంత్యోదయ, గరీబ్ రథ్, జన శతాబ్దీ, యువ ఎక్స్‌ప్రెస్, నమో భారత్ రాపిడ్ రైల్ వంటి ప్రధాన రైళ్లలో కూడా ఈ పెంపు వర్తిస్తుంది. ఏసీ ఎంఈఎంయూ/డీఈఎంయూ సేవలు మాత్రం మినహాయింపు పొందాయి. సవరించిన ధరలు డిసెంబర్ 26, 2025 నుండి బుక్ చేసిన టికెట్లకు మాత్రమే వర్తిస్తాయి. ఆ తేదీకి ముందు బుక్ చేసిన టికెట్లకు అదనపు ఛార్జీలు ఉండవు
తెలంగాణలో తగ్గిన విదేశీ విద్యార్థులు
సాక్షి, న్యూఢిల్లీ: ఒకప్పుడు విదేశీ విద్యార్థులతో కళకళలాడిన తెలంగాణలోని యూనివర్సిటీలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. దశాబ్ద కాలంలో దేశంలో అత్యధిక విదేశీ విద్యార్థులను ఆకర్షించే టాప్–10 రాష్ట్రాల జాబితా నుంచి తెలంగాణ కనుమరుగైంది. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘నీతి ఆయోగ్’తన తాజా నివేదికలో కుండబద్దలు కొట్టింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన ‘ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా రిపోర్ట్’(2025) ప్రకారం..2012–13 విద్యా సంవత్సరంలో తెలంగాణలో 2,700 మంది విదేశీ విద్యార్థులు ఉండగా, 2021–22 నాటికి ఆ సంఖ్య దారుణంగా 1,286కు చేరుకుంది. పదేళ్లలో విదేశీ విద్యార్థుల సంఖ్య సగానికి పైగా పడిపోయింది.తెలంగాణ వెనకడుగు.. ఓవైపు తెలంగాణలో విదేశీ విద్యార్థుల సంఖ్య పాతాళానికి పడిపోతుంటే, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ విషయంలో దూసుకుపోతోంది. 2012–13లో కేవలం 679 మంది విదేశీ విద్యార్థులు మాత్రమే ఉన్న ఏపీలో, 2021–22 నాటికి ఆ సంఖ్య ఏకంగా 3,106కు చేరింది. తద్వారా ఏపీ దేశంలోనే 7వ స్థానంలో నిలిచింది. ఒకప్పుడు 4వ స్థానంలో వెలుగొందిన తెలంగాణ ఇప్పుడు కనీసం టాప్–10లో కూడా చోటు దక్కించుకోలేక చతికిలపడింది.పశ్చిమ బెంగాల్‌తో పాటే..దశాబ్ద కాలంలో (2012–2022) అంతర్జాతీయ విద్యార్థుల ఎన్రోల్మెంట్లో టాప్–10 రాష్ట్రాల నుంచి వైదొలిగిన రెండే రెండు రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, తెలంగాణ కావడం గమనార్హం. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు తమ సామర్థ్యాన్ని పెంచుకుని విదేశీ విద్యార్థులకు గమ్యస్థానాలుగా మారుతుంటే, తెలంగాణ మాత్రం ఉన్న గుర్తింపును కోల్పోయింది.
మెదడు ఆరోగ్యంలోనూ తేడాలు
మహిళల కంటే వేగంగా పురుషుల మెదళ్లు కుంచించుకుపోతున్నాయి...వయసు పెరిగే కొద్దీ ఈ మార్పు బయటపడుతోంది...ఇది మెదడు ఆరోగ్యంలో తేడాలు, చిత్త వైకల్యం ప్రమాదం గురించి కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది...పురుషుల మెదళ్లు వయసు పెరిగే కొద్దీ మహిళల కంటే వేగంగా కుంచించుకుపోతున్నాయని తాజాగా ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురించిన ఈ పరిశోధనలో భాగంగా... పురుషులు– మహిళల మెదడు వయస్సు ఎలా భిన్నంగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి వేలాది ఎమ్మారై స్కాన్లను విశ్లేషించారు. కాలక్రమేణా మెదడు నిర్మాణంలో మార్పులను ట్రాక్ చేయడానికి పరిశోధకులు 17 నుంచి 95 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యకరమైన పెద్దల నుంచి 12,000 కంటే ఎక్కువ ఎమ్మారై స్కాన్లను పరిశీలించారు. ముఖ్యాంశాలు... ⇒ పురుషులలో కార్టెక్స్ (మెదడు పైభాగాన పొరగా కప్పబడిన పదార్థం), సబ్కార్టెక్స్ ప్రాంతాలతో సహా అనేక మెదడు ప్రాంతాలలో నిర్మాణాత్మక క్షీణత ఎక్కువగా ఉంది.⇒ మహిళలలో మొత్తం సంకోచం తక్కువగా కనిపించింది. అయినా వృద్ధాప్యంలో ద్రవంతో నిండిన జఠరికల విస్తరణ పెరుగుదల ఉంది.⇒ లింగాల మధ్య మెదడు పరిమాణంలో తేడాలను సర్దుబాటు చేసిన తర్వాత ఈ మార్పులు గమనించారు. ⇒ పురుషుల మెదళ్లు మహిళల కంటే నిర్మాణ స్థాయిలో త్వరగా వృద్ధాప్యం చెందుతాయని నిర్ధారించారు.⇒ ఆయురార్థంలో తేడాలను పరిగణించిన తర్వాత, పురుషులు, స్త్రీల మధ్య అనేక మెదడు–వృద్ధాప్య అసమానతలు తగ్గాయి.⇒ ఇది వృద్ధాప్య స్త్రీ మెదడుపై మరింత సూక్ష్మ పరిశోధన అవసరాన్ని సూచిస్తుంది.ఇది ఎందుకు కీలకం ? మెదడు సంకోచం తరచుగా క్షీణత అని పిలుస్తారు, ఇది వృద్ధాప్యంలో సహజమైన ప్రక్రియే అయినా ఈ సంకోచం యొక్క వేగం, నమూనా విస్తృతంగా మారొచ్చు. ఈ ప్రక్రియలో లింగ వ్యత్యాసాలను అర్థం చేసుకోవడం వల్ల, చిత్తవైకల్యం అల్జీమర్స్ వ్యాధి వంటి కొన్ని వయస్సు సంబంధిత పరిస్థితులు పురుషులు–మహిళలను భిన్నంగా ఎందుకు ప్రభావితం చేస్తాయో శాస్త్రవేత్తలు గుర్తించడంలో ఈ అధ్యయనం సహాయపడుతుంది. ఆసక్తికరంగా, పురుషుల మెదళ్లు వేగంగా కుంచించుకుపోతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, మహిళల్లోనే అధికంగా అల్జీమర్స్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అల్జీమర్స్ కేసులలో దాదాపు మూడింట రెండు వంతుల మంది మహిళలే.పురుషుల మెదడుల్లో నిర్మాణాత్మక వృద్ధాప్యం వేగంగా ఉన్నప్పటికీ, ఈ తేడాలు మహిళలకు అల్జీమర్స్ వచ్చే అవకాశం ఎందుకు ఎక్కువగా ఉందనే దానికి కారణాలు కనుక్కోలేకపోయారు. హార్మోన్లు, జన్యుశాస్త్రం, జీవనశైలి లేదా జీవరసాయన మార్పులు వంటి ఇతర అంశాలు మహిళల చిత్తవైకల్య ప్రమాదంలో పెద్ద పాత్ర పోషిస్తాయని ఈ పరిశోధన సూచిస్తోంది. ‘మహిళల మెదళ్లు మరింత క్షీణించి ఉంటే, అది వారి అధిక అల్జీమర్స్ ప్రాబల్యాన్ని వివరించడానికి సహాయపడి ఉండేది’అని నార్వే ఓస్లో విశ్వవిద్యాలయంలో న్యూరో సైంటిస్ట్, సహ పరిశోధకురాలు అన్నే రావ్డాల్ పేర్కొన్నారు. అయితే మెదడులో వచ్చే మార్పులు, జ్ఞానం, ఆరోగ్యానికి అర్థం ఏమిటో పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని పరిశోధకులు గుర్తించారు.అధ్యయన పరిమితులు...⇒ ఎమ్మారై– ఆధారిత విశ్లేషణ మెదడు వృద్ధాప్య నమూనాలను చూపుతుంది కానీ అంతర్లీన జీవసంబంధమైన కారణాలను వివరించలేదు.⇒ ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై దృష్టి సారించారు. పాల్గొనేవారికి నాడీ సంబంధిత వ్యాధి నిర్ధారణ కాలేదు.⇒ ఈ మార్పులు అల్జీమర్స్ పురోగతికి ఎలా సంబంధం కలిగి ఉన్నాయనే దానిపై అంతర్దృషు్టలను పరిమితం చేస్తాయి.⇒ఈ అధ్యయనం అభిజ్ఞా పనితీరు లేదా జ్ఞాపకశక్తి ఫలితాలను కాకుండా మెదడు వాల్యూమ్ మార్పులను అంచనా వేసింది.⇒ ముఖ్యమైన ప్రమాద కారకాలు కొలవలేదు.. హార్మోన్ల స్థితి, జన్యుపరమైన ప్రమాదం, జీవనశైలి ప్రభావాలను నేరుగా విశ్లేషించలేదు.
‘370’ గోడను బద్దలుకొట్టే భాగ్యం మాకే దక్కింది
లక్నో/న్యూఢిల్లీ: భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి సందర్భంగా ఆయన భారీ కాంస్య విగ్రహంతో కూడిన జాతీయ స్మారకం ‘రాష్ట్రీయ ప్రేరణ స్థల్’ను లక్నోలో ఆవిష్కరించిన సందర్భంగా విపక్ష కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విమర్శల జడివాన కురిపించారు. దశాబ్దాలుగా అభివృద్ధికి అవరోధంగా తయారైన ‘ఆర్టీకల్ 370’గోడను బద్ధలు కొట్టే అదృష్టం తమ ప్రభుత్వానికి దక్కడంపై బీజేపీ ఎంతో గర్విస్తోందని మోదీ వ్యాఖ్యానించారు. గురువారం లక్నోలో 65 అడుగుల ఎత్తయిన శ్యామప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయీల కాంస్య విగ్రహాలను, 98,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో తామర పుష్పాకృతిలో నిర్మించిన అత్యాధునిక మ్యూజియంను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. విపక్ష కాంగ్రెస్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ‘‘బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం సుపరిపాలనకు కొత్త నిర్వచనం ఇచ్చింది. ఇప్పుడా సుపరిపాలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సమున్నత శిఖరాలకు చేరింది. అయితే స్వాతంత్య్రం తర్వాత దేశంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా, మంచి పనులు పూర్తియినా కేవలం ఒకే ఒక్క కుటుంబం(గాం«దీల) కారణంగా అవన్నీ జరిగాయనే భ్రమలు కల్పించారు. పాఠ్యపుస్తకాలు కావొచ్చు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వరంగ సంస్థలు, వీధులు, రోడ్డు, కూడళ్లు.. అన్నింటికీ ఆ ఒకే ఒక్క కుటుంబం పేర్లు పెట్టేశారు. వాళ్ల విగ్రహాలే నెలకొల్పారు. ఇదే ఆనాటి నుంచి అలాగే కొనసాగింది. ఈ కుటుంబ బంధనాల నుంచి భారత్‌ను బీజేపీ విముక్తం చేసింది. దేశం కోసం ప్రాణత్యాగాలకు సైతం సిద్ధపడిన ప్రతి ఒక్క భరతమాత బిడ్డను బీజేపీ నేడు సమున్నత స్థాయిలో గౌరవిస్తోంది. వీటికి కొన్ని ఉదాహరణలూ చెప్తా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఢిల్లీలో కీలక కర్తవ్యపథంలో ప్రతిష్టించాం. నేతాజీ త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన అండమాన్ నికోబార్ దీవుల్లోని ఒక దీవికి నేడు ఆయన పేరును పెట్టాం’’అని మోదీ అన్నారు. ‘‘బాబా సాహెబ్ అంబేడ్కర్ ఘనతను మరుగునపరిచే కుతంత్రాలను మీరంతా చూశారు. కాంగ్రెస్ రాజకుటుంబం ఢిల్లీలో ఎన్నో దారుణాలకు ఒడిగట్టింది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అదే పనిచేసింది. అంబేడ్కర్ గొప్పతనాన్ని తగ్గించే కుట్రలను ఇప్పుడు బీజేపీ అడ్డుకుంటోంది. ఢిల్లీ నుంచి లండన్ దాకా అంబేడ్కర్‌కు సంబంధించిన ఐదు పుణ్యక్షేత్రాలను మేం అద్భుతంగా అభివృద్ధిచేశాం’’అని మోదీ గుర్తుచేశారు. ‘‘బీజేపీని కాంగ్రెస్ ఎప్పుడూ అంటరాని పార్టీగా తప్పుడు ప్రచారంచేశాయి. కానీ బీజేపీ ఎల్లప్పుడూ అన్ని పార్టీలు, నేతలను గౌరవించింది. పీవీ నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీలకు మేమే భారతరత్న ఇచ్చాం. ములాయం సింగ్ యాదవ్, తరుణ్ గొగోయ్ ఇలా ఎందర్నో గౌరవించాం. ఇలాంటి మర్యాదలను కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల నుంచి ఎన్నడూ ఆశించలేం. వాళ్ల హయాంలో బీజేపీ దారుణ అవమానాలను ఎదుర్కొంది’’అని మోదీ అన్నారు.ఈ స్మారకం దేశ ఆత్మగౌరవానికి తార్కాణం ‘‘రాష్ట్రీయ ప్రేరణ స్థల్ జాతీయ స్మారకం.. దేశం చూపిన ఆత్మగౌరవ, సమగ్రత, సేవా మార్గానికి నిదర్శనం. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్‌దయాళ్, వాజ్‌పేయీల నిలువెత్తు విగ్రహాలు మనకు సమున్నత స్ఫూర్తినిస్తున్నాయి. మనసావాచా ప్రజాసంక్షేమం కోసం పాటుపడాలని, ఆ ప్రయత్నంలో వందల సార్లయినా త్యాగాగ్నిలో కాలిపోయినా ఫర్వాలేదని గతంలో వాజ్‌పేయీ అన్నారు. ఇప్పుడీ ప్రేరణ స్థల్ సైతం అదే సందేశం ఇస్తోంది. మన ప్రతి అడుగు దేశ నిర్మాణానికి ఉపయోగపడాలి. అభివృద్ధి చెందిన భారత్‌గా దేశం మారాలంటే ప్రతి ఒక్కరూ ఆ దిశగా సంకల్పించాలి. నూతన జాతీయస్మారకం ద్వారా ఆధునిక స్ఫూర్తిస్థల్‌కు చిరునామాగా నిలిచిన యూపీకి శుభాకాంక్షలు. ఇప్పుడీ ప్రేరణ స్థల్ నిర్మించిన 30 ఎకరాల ప్రాంతంలో గతంలో దశాబ్దాలపాటు భారీ చెత్తకుప్పలుండేవి. వాటిని పూర్తిగా తొలగించి అధునాతన నేషనల్ మెమోరియల్ కాంప్లెక్స్‌ను సాకారంచేసిన కారి్మకులు, కళాకారులు, ప్రణాళిక కర్తలు, సీఎం యోగిజీకి నా మనస్ఫూర్తిగా అభినందనలు’’అని మోదీ అన్నారు.
ఎన్ఆర్ఐ
మరోసారి అందరి మనసులు దోచేసిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యుఏఈ ఉప ప్రధాని మరియు రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఓ రెస్టారెంట్లో అందరి బిల్లులు చెల్లించి దాతృత్వాన్ని చాటుకున్న ఆయన.. తాజాగా తన సింప్లిసిటీతో మరోసారి అందరి మనసులు దోచేశారు.సామాజిక సంబంధాలను బలపరిచేందుకు దుబాయ్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ‘దుబాయ్ లంచ్’ ప్రాజెక్ట్‌లో భాగంగా షేక్ హమ్దాన్ బిన్, దెయ్రా ప్రాంతంలోని 200 కుటుంబాలను కలిశారు. అల్ ఖవానీజ్ మజ్లిస్ వద్ద జరిగిన సమావేశంలో వారితో చాలాసేపు గడిపారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ అయినా ఏమాత్రం ఆడంబరాలకు పోకుండా సాధారణ వ్యక్తిలా ప్రజలతో మమేకమైపోయారు. లంచ్ చేస్తూ వారిలో ఒకరయ్యారు. అందరిని పలకరిస్తూ విశేషాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన ఓ చిన్నారిని కౌగిలించుకున్న హృద్యమైన దృశ్యం సోషల్ మీడియాలో వైరలవుతుంది. షేక్ హమ్దాన్ సింప్లిసిటీకి నెటిజన్లు ముగ్దులవుతున్నారు. షేక్ హమ్దాన్ను అతని తండ్రి, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్‌తో పోలుస్తున్నారు. రాజకుటుంబం మంచితనాన్ని, సింప్లిసిటీని కొనియాడుతున్నారు. షేక్ హమ్దాన్ తండ్రి షేక్ మహమ్మద్ కూడా దుబాయ్ వాసులందరితో సాధారణ వ్యక్తిలా కలిపోతారు. తాను రాజునన్న అహంకారాన్ని ఎక్కడా ప్రదర్శించరు.దుబాయ్ లంచ్ కార్యక్రమ లక్ష్యం ఏంటంటే..?దుబాయ్ లంచ్ కార్యక్రమ లక్ష్యం స్థానిక కమ్యూనిటీ మజ్లిస్ల ద్వారా సామాజిక ఐక్యతను పెంపొందించడం. పరస్పర సహకారం, స్నేహాన్ని బలపరచడం. మజ్లిస్ల పూర్వపు సంప్రదాయ ప్రాధాన్యాన్ని తిరిగి తీసుకురావడం. ప్రజలతో నేరుగా సంభాషణకు వేదిక కల్పించడం.దుబాయ్ లంచ్ సందర్భంగా షేక్ హమ్దాన్ వ్యాఖ్యలు..దుబాయ్ లంచ్ కార్యక్రమ సందర్భంగా షేక్ హమ్దాన్ ఇలా అన్నారు. దుబాయ్ శక్తిని భవనాలతో కాదు, ప్రజల మధ్య ఐక్యతతో కొలవాలి. దుబాయ్ చరిత్రను కారుణ్యం, అతిథి సత్కారం, బాధ్యతా భావం నిర్మించాయి. ఈ విలువలను భవిష్యత్ తరాలకు అందించడానికి ఇలాంటి సమావేశాలు అవసరం.2026.. కుటుంబ సంవత్సరంకమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ జనరల్ హెస్సా బింత్ ఈసా బుహుమైద్ తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ 2026ను కుటుంబ సంవత్సరంగా జరుపుకోడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో దుబాయ్‌లోని వివిధ ప్రాంతాల్లో ‘దుబాయ్ లంచ్’ కార్యక్రమాలు జరుగుతాయి.
ప్రవాస భారతీయులకు ప్రాణ గండం.. అసలేం జరుగుతోంది?
విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రత ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సిడ్నీ నుండి టొరంటో వరకు.. అక్కడి ప్రవాస భారతీయులు భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. విదేశాలకు వెళ్లడమంటే ప్రాణాలను పణంగా పెట్టడమేనా? అనే విధంగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా సిడ్నీలోని బోండి బీచ్‌లో భారతీయ విద్యార్థులపై జరిగిన దాడి అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఇటువంటి ఘటనల నేపధ్యంలో విదేశాల్లో ఉంటున్న తమవారు ఎలా ఉన్నారోనని భారతదేశంలోని వారి కుటుంబ సభ్యులు అనునిత్యం ఆవేదన అనుభవిస్తున్నారు.జాత్యహంకార కోరలుకొన్ని పాశ్చాత్య దేశాల్లో జాత్యహంకారం అధికంగా కనిపిస్తుంది. ఈ జాబితాలోని దేశాలలో అమెరికా, కెనడా పేర్లు ముందుగా వినిపిస్తాయి. ఈ దేశాల్లో ఇటీవలి కాలంలో భారతీయులపై ద్వేషపూరిత నేరాలు (Hate Crimes) మునుపెన్నడూ లేనంతగా పెరిగాయి. కెనడాలో భారతీయుల పట్ల విద్వేషం మరింతగా పెరగడం వెనుక సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారం ప్రధాన పాత్ర పోషిస్తోంది. అమెరికాలో 2024 నుంచి ఇప్పటివరకు 11 మందికి పైగా భారతీయ విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఇది స్థానిక భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. డబ్లిన్‌లో ఒక భారత సంతతి వ్యక్తిపై జరిగిన పాశవిక దాడి, సభ్య సమాజం తలదించుకునేలా చేసింది.అభద్రతా భావంవిద్యా కేంద్రాల్లో అభద్రతా భావం మరింతగా పెరిగిపోయింది. భారతీయ విద్యార్థులు ఎక్కువగా వెళ్లే ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల్లో ఇది ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఆయా దేశాల్లో భారతీయ విద్యార్థులకు క్యాంపస్ భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల టెహ్రాన్‌లోని భారతీయ వైద్య విద్యార్థులు తమపై దాడులు జరుగుతున్నాయని మొరపెట్టుకున్నా, స్థానిక అధికార యంత్రాంగం స్పందించలేదనే వార్తలు వచ్చాయి. ఈ ఘటన దౌత్యపరమైన వైఫల్యంగా కనిపిస్తోంది. విద్యాభ్యాసం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి, వెళ్తున్న విద్యార్థులు, అక్కడ కనీస రక్షణ లేక జాత్యహంకార దాడులకు బలవుతుండటం గమనార్హం.సైద్ధాంతిక విద్వేషంవిదేశాల్లో భారతీయులపై దాడులకు జాత్యహంకారం ఒక్కటే కాదు.. రాజకీయం, మతం లేదా సామాజిక పరమైన అసహనం కూడా కారణంగా నిలుస్తోంది. ఈ తరహా దాడులు కేవలం దొంగతనాలు లేదా స్థానిక గొడవలకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఆన్లైన్ వేదికలపై భారతీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాలు పలుచోట్ల హింసకు దారితీస్తున్నాయి. దీనికి తోడు నేరస్తులకు సరిహద్దులు దాటి ఉన్న సంబంధాలు దర్యాప్తు సంస్థలకు పెద్ద సవాలుగా మారాయి. సిడ్నీ ఘటనలో హైదరాబాద్ లింకులు బయటపడటం దీనికి ఉదాహరణగా నిలిచింది. విదేశాంగ శాఖ అప్రమత్తం విదేశాలలో పెరుగుతున్న ఈ హింసాత్మక ధోరణిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తీవ్రంగా పరిగణిస్తోంది. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే భారతీయులపై దాడులు క్రమంగా పెరుగుతున్నాయనే విషయాన్ని ప్రభుత్వం అంగీకరించింది. ఇటువంటి సందర్భాల్లో విదేశీ ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మార్పు అనుకున్నంతగా కనిపించడం లేదు. భారతీయ రాయబార కార్యాలయాలు విద్యార్థులకు, వలసదారులకు రక్షణ కల్పించడంలో మరింత చురుకైన పాత్ర పోషించాలని పలువురు అంటున్నారు.భద్రతా సంక్షోభం?ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఆయా దేశాలు తక్షణ చర్యలు తీసుకోకుంటే ఇవి పునరావృతం అవుతాయని పలువురు అంటున్నారు. ప్రవాస భారతీయులు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముకగా నిలుస్తున్నారనడంలో సందేహం లేదు. దీనిని గుర్తించి అయినా అక్కడి ప్రభుత్వాలు వారికి రక్షణ కల్పించాలనే వాదన వినిపిస్తుంటుంది. ప్రవాస మేధావులు, విద్యార్థులపై దాడులు కొనసాగితే, అది ప్రపంచ భద్రతా సంక్షోభానికి దారితీస్తుందనేవారూ ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో కేవలం నిరసనలు తెలపడమే కాకుండా, అంతర్జాతీయ చట్టాలను బలోపేతం చేయడం ద్వారా ఇటువంటి ఘటనలను నివారించవచ్చని పలువురు సూచిస్తున్నారు. లేనిపక్షంలో విదేశీ కలలు కనే వేలాది మంది భారతీయుల భవిష్యత్తు అంధకారంలో పడిపోయే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: బోండి బీచ్ ఘటన: వృద్ధ దంపతుల త్యాగం.. వీడియో వైరల్
గేదెల దాముకు సేవారత్న అవార్డు
అమెరికాలో నివసిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రవాసాంధ్ర వాసి, మన అమెరికా తెలుగు అసోసియేషన్- మాట కో కన్వీనర్ దాము గేదెలను సేవారత్న అవార్డుతో సత్కరించారు. విజయనగరం జిల్లాలోని రాజాంకు చెందిన పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం నెలవారీ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పద్మశ్రీ యడ్ల గోపాలరావు... శ్రీకాకుళం జిల్లా కత్తులకవిటికి చెందిన ఎన్నారై, సామాజిక సేవా కార్యకర్త గేదెల దాము దంపతులను సేవారత్న అవార్డుతో సత్కరించారు.అవార్డు అందుకున్న దాము మాట్లాడుతూ… తనకు చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలు అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. కుటుంబీకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ఉత్సాహం రెట్టింపు అయ్యిందని, సేవా కార్యక్రమాలు బాధ్యతను, సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెట్టాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దామును పలువురు కళాకారులు సత్కరించారు.అంతకు ముందు జగన్మోహిని పద్య నాటక ప్రదర్శన, కేవీ పద్మావతి శిష్య బృందంతో భరత నాట్య నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. స్థానిక జీఎంఆర్ వరలక్ష్మీ కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం కమిటీ సభ్యులు, రాజాంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.(చదవండి: ఘనంగా శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి)
అంతర్జాతీయ వేదికపై డా. తెన్నేటి సుధాదేవికి ఘన నివాళి
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వంశీ ఇంటర్నేషనల్ & శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, అంతర్జాలంలో శనివారం సాయంత్రం, ప్రఖ్యాత కథా నవలా రచయిత్రి, తెలుగు అకాడమీ పూర్వ ఉపసంచాలకులు, వంశీ అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధాదేవి సంస్మరణ సభ నిర్వహించారునవంబర్ 23వ తేదీ హైదరాబాదులో స్వర్గస్తులైన, డా. తెన్నేటి సుధాదేవి (Dr.Tenneti Sudha Rani), వంశీ సంస్థల వ్యవస్థాపకులైన డా. వంశీ రామరాజు ధర్మపత్ని. "సుధాదేవి స్మరణలో, వివిధ దేశాల తెలుగు ప్రవాస సంస్థల ప్రతినిధులు, భారతదేశంలో చెన్నై ముంబై విశాఖపట్నం మొదలైన ప్రాంతాలలో ఉండే ప్రముఖులు ఆప్తులు కలిసి ఆమెకి నివాళులు అర్పించే విధంగా ఈ అంతర్జాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని నిర్వహకులు వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు, శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, కార్యక్రమ సమన్వయకర్త రాధిక మంగిపూడి తెలియ జేశారు.సుమారు నాలుగు గంటల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో శిరోమణి డా వంశీ రామరాజు అంతర్జాల వేదిక మాధ్యమంగా అన్ని దేశాలనుండి తమ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ నుండి మాత్రమే కాక సుమారు పది దేశాల నుండి 50 మంది వరకు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.భారతదేశం నుండి వంశీ సంస్థలతో అవినాభావ సంబంధం ఉన్న పద్మభూషణ్ డా.యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, డా. మేడసాని మోహన్, సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, సినీ రచయిత భువనచంద్ర, సంగీత విద్వాంసులు గరికపాటి ప్రభాకర్, గాయకులు గజల్ శ్రీనివాస్, గాయని సురేఖ మూర్తి, హాస్యబ్రహ్మ శంకరనారాయణ, సినీ నటులు సుబ్బరాయశర్మ, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, రచయిత్రి జలంధర చంద్రమోహన్, రాజకీయవేత్త వామరాజు సత్యమూర్తి, అవధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, జుర్రు చెన్నయ్య, పొత్తూరి సుబ్బారావు తదితర వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అమెరికా, సింగపూర్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, ఉగాండా, మలేషియా, హాంకాంగ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల నుండి కృష్ణవేణి శ్రీ పేరి, సుచిత్ర, బూరుగుపల్లి వ్యాసకృష్ణ, సత్య మల్లుల, పద్మ మల్లెల, జయ పీసపాటి, స్వాతి జంగా, విక్రమ్ సుఖవాసి, వెంకప్ప భాగవతుల, సీతాపతి అరికరేవుల , తాతాజీ & పద్మజ ఉసిరికల, శ్రీసుధ, మాధవీలలిత, సాహిత్య జ్యోత్స్న, కోనేరు ఉమామహేశ్వర రావు, శారదా పూర్ణ శొంఠి, శారద ఆకునూరి, రాధిక నోరిరాధ కాసినాథుని, కె ధర్మారావు గుణ కొమ్మారెడ్డి, డా. సత్యమూర్తి , డా. సుజాత కోటంరాజు, డా. బి కె మోహన్ పాల్గొని వంశీ సంస్థలతో సుధ గారితో తమకున్న అనుబంధాన్ని గురించి నెమరు వేసుకుంటూ ఆమెను స్మరించు కున్నారు. కల్చరల్ టీవీ వారు సాంకేతిక సహకారం అందించగా ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేశారు.
క్రైమ్
రెండు కుటుంబాల్లో అలుముకున్న చీకట్లు
ఆ రెండు కుటుంబాల్లో ఒకేసారి చీకట్లు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదం.. వాళ్ల ఏకైక బిడ్డలను బలిగింది. బాల్యమిత్రులైన ఇద్దరు స్నేహితుల జీవిత ప్రయాణం అనూహ్యంగా.. అర్ధాంతరంగా ముగిసిపోయింది. సాక్షి, కామారెడ్డి: మాచారెడ్డి మండలం లచ్చాపేట గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. జక్కుల సాయికిషోర్(21), మిరిదొడ్డి అజయ్(21) అనే స్నేహితులు గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరణించిన వారు తమ కుటుంబాలకు ఏకైక కుమారులే. యువకుల తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మాచారెడ్డి చౌరస్తా నుంచి లచ్చాపేటకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న వీరిద్దరూ శివారులో రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానికులు కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కొంపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మొదట సాయికిషోర్, తర్వాత కొంతసేపటికి అజయ్ మరణించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. బాధితుల్లో ఒకరి కాలి ఎముక.. ఆ లారీ చక్రానికి తగిలి టైరు పంక్చర్ అయ్యిందంటే.. ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు!. అందుకే అతివేగం అత్యంత ప్రమాదం అని చెప్పేది.
రాజోలులో విషాదం.. ముసలమ్మతల్లి ఉత్సవ ప్రారంభంలో అపశ్రుతి
సాక్షి, రాజోలు: పొట్టకూటి కోసం ఉత్సవాల్లో వేషధారణలు వేసి భక్తులను ఆనందింపజేసే కళాకారిణి ప్రమాదవశాత్తు భవనం మెట్లపై నుంచి జారిపడి మృతి చెందింది. ఈ ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన పాలపర్తి భవ్యశ్రీ (17) ప్రాణాలు కోల్పోయింది. రాజోలు మండలం శివకోటి ముసలమ్మతల్లి ఉత్సవాల ప్రారంభంలో ఈ అపశ్రుతి చోటుచేసుకుంది. గురువారం శివకోటి ముసలమ్మతల్లి అమ్మవారి ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం నుంచి పలువురు కళాకారులు శివకోటి చేరుకున్నారు.వీరంతా వేషధారణల కోసం ఆలయానికి ఎదురుగా ఉన్న మూడు అంతస్తుల కల్యాణ మండప భవనంలోనికి వెళ్లారు. ఈ క్రమంలో తెల్లవారుజామున భవ్యశ్రీ ప్రమాదవశాత్తు కల్యాణ మండపం మెట్లపై నుంచి జారిపడి తలకు బలమైన గాయమైంది. ఆమెను హుటాహుటీన రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సహ కళాకారిణి మృతిపై సహచరులు, మృతురాలి తల్లి చినపాప ఆస్పత్రి వద్ద రోదించిన తీరు కంటతడి పెట్టించింది. యువతి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజేష్‌కుమార్ తెలిపారు. యువతి మృతదేహానికి రాజోలు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించారు. అసంపూర్తి భవనంలో బసపై అగ్రహం అసంపూర్తిగా నిర్మించిన కల్యాణమండపంలో కళాకారులకు బస ఏర్పాటు చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనం మెట్లకు రెయిలింగ్ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఉత్సవ కమిటీ నిర్లక్ష్యం వల్లే కళాకారిణి మృతి చెందిందని వారు వాపోయారు.
మావోయిస్టు అగ్రనేత గణేశ్ ఎన్కౌంటర్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరుస ఎన్కౌంటర్లు..లొంగుబాట్లతో వెనక్కి తగ్గిన మావోయిస్టుల సాయుధ పోరాటానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలోని కందమాల్ జిల్లాలో గురువారం చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హన్మంతు అలియాస్ గణేశ్ ఉయికే (69) మరణించారు. నల్లగొండ జిల్లాచండూరు మండలం పుల్లెంల ఆయన స్వగ్రామం. ఎస్ఓజీ ఆపరేషన్‌లో..: ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల సాయుధ పోరాటంపై నిర్బంధం పెరిగింది. దీంతో పదిమంది లోపు సభ్యులతోనే దళాలు సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో ఒడిశాలోని గంజాం–కందమాల్ జిల్లాల సరిహద్దులో చకపాద పోలీస్‌స్టేషన్ పరిధిలో రంభా అడవుల్లో కీలక మావోయిస్టు నేత ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఒడిశాలో యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ చేపట్టే స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్ఓజీ), సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ జవాన్లతో కూడిన 23 మంది సభ్యుల జాయింట్ టాస్‌్కఫోర్స్ బృందం ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టింది. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇరువర్గాలు ఎదురుపడటంతో కాల్పులు చోటుచేసుకున్నాయి. అర్ధగంట పాటు పలుమార్లు కాల్పులు కొనసాగాయి. ఆ తర్వాత ఘటనా స్థలిలో నలుగురు మావోయిస్టుల మృతదేహాలతోపాటు ఏకే 47, రెండు ఇన్సాస్లు, 303 తుపాకీని పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. మూడు రోజుల ఉత్కంఠ ఒడిశా కేడర్‌కు చెందిన 22 మంది మావోయిస్టులు ఈ నెల 23న మల్కన్‌గిరిలో ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఆ మరుసటి రోజు కందమాల్ జిల్లాలో గుమ్మ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులు రాకేశ్, అమృత్ చనిపోయారు. వీరిలో ఒకరు పార్టీ సరఫరా వ్యవస్థలో కీలకమైన వ్యక్తిగా తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో లభించిన వివరాల ఆధారంగా సమీప అడవుల్లో గురువారం గాలింపు చర్యలు చేపట్టగా, మరో నలుగురు మావోలు మృత్యువాత పడ్డారు. అందులో ఒక మహిళా మావోయిస్టుతోపాటు గణేశ్ ఉయికే కూడా ఉన్నారు.44 ఏళ్ల పాటుఅజ్ఞాత జీవితం రాజేశ్ తివారీ, చమ్రుదాదా, రూపా అనే ఇతర పేర్లతోనూ అజ్ఞాతంలో గణేశ్ పనిచేశారు. వివిధ రాష్ట్రాల్లో కలిపి మొత్తం రూ.1.20 కోట్ల రివార్డు ఆయనపై ఉంది. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ద్వారా ఆయుధం పట్టిన గణేశ్ దాదాపు 44 ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపారు. ఒడిశాతోపాటు కేకేటీ (కేరళ, కర్ణాటక, తమిళనాడు), ఎంఎంసీ (మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్), దండకారణ్యం జోన్లలో ఆ పార్టీ విస్తరణకు ఆయన కృషి చేశారు.జగదల్పూర్లో మొట్టమొదట ఆర్గనైజర్‌గా పనిచేశారు. 1990లో సౌత్ బస్తర్ జిల్లా కమిటీ సభ్యునిగా ఫీల్డ్ వర్క్ చేశారు. ఆ తర్వాత వెస్ట్ బస్తర్ డివిజనల్ కమిటీ కార్యదర్శిగా (డీసీఎస్) 2003 వరకు పనిచేశారు. ఆపై పార్టీ ఆయన్ను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలోకి (ఎస్జెడ్సీ) తీసుకుంది. తర్వాత సౌత్ జోన్ బ్యూరోకు (రీజినల్ కమిటీ) ఇన్చార్జ్ అయ్యారు. 2017లో కేంద్ర కమిటీలోకి వచ్చారు. దక్షిణ బస్తర్ ప్రాంతంలో గోండు భాషలో(దేవనగరి లిపి) ఆయన పలు పత్రికలు నడపడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. గిరిజనులకు అర్థమయ్యేలా జిల్లా స్థాయి, ప్రాంతీయ స్థాయిలో ఆ పత్రికలను నిర్వహించారు. తద్వారా గిరిజనులను ఉద్యమంవైపు నడిపించడంలో కీలకంగా వ్యవహరించారు. ఆయన ఉద్యమ ప్రస్థానం అంతా దండకారణ్యం కేంద్రంగానే కొనసాగింది.పార్టీలోనే ఆయన హుస్నాబాద్‌కు చెందిన శారదను వివాహం చేసుకున్నారు. ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో పార్టీని వీడి 2007లో బయటకు వచ్చారు. ఆ తరువాత హన్మంతు మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఒడిశాలో పార్టీ ఖతం? కరోనా తర్వాత మావోయిస్టు పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒడిశాలోని ఏవోబీతోపాటు కందమాల్, కలహంది, కోరాపూట్, గంజాం జిల్లాల్లో మావోయిస్టులకు పట్టుంది. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఏవోబీ బాధ్యతలు చూస్తున్న ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవితోపాటు మరో కీలక నేత చైతో మరణించారు. తాజాగా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఒడిశా బాధ్యతలు చూస్తున్న గణేశ్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. ‘గణేశ్ మరణంతో ఒడిశాలో మావోయిస్టు పార్టీ వెన్ను విరిగింది. ఇక్కడితో మా రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు దాదాపుగా ఆగిపోయినట్టే’అని ఆ రాష్ట్ర డీజీపీ యోగేశ్ బహదూర్ ఖురానీయా గురువారం మీడియాతో అన్నారు. ‘మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారేందుకు అడుగు దూరంలో ఒడిశా నిలిచింది. 2026 మార్చి 31 కల్లా దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తాం’అని ఎక్స్ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. ఆర్ఎస్యూ నుంచి.. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హన్మంతు అలియాస్ గణేశ్‌ది వ్యవసాయ కుటుంబ నేపథ్యమే. ఆయనకు ఇద్దరు తమ్ముళ్లు, ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. 1961లో జని్మంచిన హన్మంతు 7వ తరగతి వరకు స్వగ్రామమైన పుల్లెంలలో చదువుకున్నాడు. చండూరులో పదో తరగతి వరకు, ఇంటర్ నల్లగొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివారు. ఆ తర్వాత నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీఎస్సీలో చేరారు. 1983లో డిగ్రీ చదువుతున్న సమయంలోనే హన్మంతు మావోయిస్టు పార్టీ పట్ల ఆకర్షితుడయ్యారు. రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో (ఆర్ఎస్యూ) పనిచేశారు. డిగ్రీ చదువును మధ్యలోనే వదిలేని అజ్ఞాతంలోకి వెళ్లారు. నల్లగొండ ఏబీవీపీ నేత ఏచూరి శ్రీనివాస్ హత్య కేసులోనూ హన్మంతు నిందితుడిగా ఉన్నాడు. డిగ్రీ చదివే సమయంలో ఆర్ఎస్యూ అధ్యక్షుడిగా వ్యవహరించిన హన్మంతు మావోయిస్టు పార్టీలో చేరి కేంద్ర కమిటీ సభ్యునిగా ఎదిగారు. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు... విద్యార్థి దశ నుంచే మావోయిస్టు పార్టీలోకి వెళ్లిన హన్మంతు ఆ తర్వాత ఇంటికి వచ్చింది లేదు. తల్లిదండ్రులు ఏళ్ల తరబడి ఎదురుచూసినా ఒక్కసారి కూడా రాలేదని గ్రామస్తులు చెప్పారు. నాలుగేళ్ల కిందట ఆయన తండ్రి చంద్రయ్య, రెండేళ్ల కిందట తల్లి ఎట్టెమ్మ మృతి చెందారు. అయినా హన్మంతు వారిని చివరిసారిగా చూసేందుకు కూడా రాలేదు. కుటుంబ సభ్యులకు హన్మంతు ఎక్కడ ఉన్నది తెలియదు. హన్మంతు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకొచ్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు పోలీసులు తెలిపారు. వారు శుక్రవారం ఒడిశాకు బయలుదేరే అవకాశముంది. మా అన్న ఎలా ఉంటాడో కూడా తెలియదు మా అన్న నా చిన్నతనంలోనే ఉద్యమంలోకి పోయాడు. చిన్నప్పుడు చూశాం. ఆ తర్వాత ఎక్కడకు పోయిండు. ఎక్కడ ఉంటుండు అనేది మా కుటుంబానికి తెలియదు. మా అన్న వస్తాడని అమ్మానాన్న ఎంతో కాలం ఎదురు చూశారు. కానీ, వారు చనిపోయినప్పుడు కూడా రాలేదు. పోలీసుల ఎన్కౌంటర్లో హన్మంతు మృతి చెందాడనే విషయం నాకు తెలియదు. – హన్మంతు పెద్ద తమ్ముడు అశోక్మావోయిస్టు కేంద్ర కమిటీ ఖాళీ !ఆ సభ్యులే లక్ష్యంగాకగార్ ఆపరేషన్లు ఈ ఏడాది 11 మంది ఎన్కౌంటర్, ఐదుగురు సరెండర్ ప్రస్తుతం నామ్ కే వాస్తేగా మారిన కేంద్ర కమిటీ ? సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సాయుధ విప్లవ పోరాట పంథాను అనుసరించే పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసీసీ) పార్టీలు విలీనమై 2004లో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఏర్పాటైంది. ఆరంభంలో ఆ పార్టీ థింక్‌ట్యాంక్, పెద్దతలగా పేర్కొనే సెంట్రల్ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య 42గా ఉండేది. అయితే ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత ఆ పార్టీ థింక్ ట్యాంక్ ఖాళీ అయ్యే పరిస్థితి ఎదురైంది. యాక్టివ్‌గా ఉంది నలుగురే.. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఆ పార్టీ కేంద్ర కమిటీలో కేవలం ఆరుగురే మిగిలి ఉన్నారు. అందులో ముప్పాళ్ల లక్ష్మణరావు, తిప్పిరి తిరుపతి, మిసిర్ బెహ్రా పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఉన్నారు. వీరే కాకుండా పసునూరి నరహరి, మల్లా రాజిరెడ్డి వంటి తెలంగాణ నేతలతోపాటు జార్ఖండ్‌కు చెందిన తుపాన్దా అలియాస్ అనల్‌దా సెంట్రల్ కమిటీలో ఉన్నారు. ఇందులోనూ ముప్పాళ్ల లక్ష్మణరావు, మల్లా రాజిరెడ్డి వయోభారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సమాచారం. వీరిద్దరినీ మినహాయిస్తే కేంద్ర కమిటీలో నలుగురు నేతలే ఉన్నట్టుగా పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇందులో ఇద్దరు పొలిట్‌బ్యూరోలో, మరో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. లొంగుబాట్లు.. పోతుల సుజాత అలియాస్ కల్పన, పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న పార్టీకి ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. ఇలా కాకుండా ఆయుధాలు, తమ వెంట ఉన్న కేడర్‌తో లొంగిపోయిన మావోయిస్టుల్లో మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నతోపాటు రామ్‌ధేర్ ఉన్నారు. అంతకుముందు అనారోగ్య కారణాలతో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుల్లో రావుల శ్రీనివాస్, హరిభూషణ్æ, అక్కిరాజు హరగోపాల్, కటకం సుదర్శన్ ఉన్నారు. కగార్తో నష్టాలు.. ఆపరేషన్ కగార్‌ను 2024 జనవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్రమంలో 2024 ఆగస్టులో చివరిసారిగా కేంద్ర కమిటీ సమావేశమైంది. ఇందులో మడ్వి ఇడుమా (హిడ్మా)తో పాటు తక్కళ్లపల్లి వాసుదేవరావును కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత దాడుల ఉధృతి పెరిగింది. సెపె్టంబర్ 4న ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మాడ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈరోజు వరకు ఇదే అతి పెద్ద ఎన్కౌంటర్. ఇందులో ఇడుమా (హిడ్మా) స్థాయి కలిగిన ఆదివాసీ మహిళా మావోయిస్టు నీతి అలియాస్ ఊర్మిళ చనిపోయింది. అప్పటి నుంచి మావోయిస్టు కేంద్ర కమిటీ సమావేశం కావడం వీలు కాలేదు. 2025 ఏప్రిల్‌లో శాంతి చర్చల ప్రతిపాదన దశలోనూ కేంద్ర కమిటీ సమావేశం అయ్యేందుకు అవకాశం కల్పించాలని మావోయిస్టులు డిమాండ్ చేసినా కేంద్రం అంగీకరించలేదు. విస్తరణ కష్టమే..: ఆ పార్టీకి చెందిన వేర్వేరు రాష్ట్ర కమిటీల్లో కీలక నేతలు ఉన్నారు. అయితే, తీవ్ర నిర్బంధం మధ్య కొత్త వారిని కేంద్ర కమిటీలోకి ప్రమోట్ చేయడానికి కనీసం మావోయిస్టులు సమావేశమై, చర్చించు కునే పరిస్థితులు లేవు. దీంతో కేంద్ర కమిటీని విస్తరించడమనేది ఆ పార్టీకి కలగా మారింది. చివరకు ఆ పార్టీ చీఫ్‌గా తిప్పిరి తిరుపతిని ఎన్నుకున్నామని కొందరు చెప్పగా.. అలాంటిదేమీ లేదని మరికొందరు మావోయిస్టులు అంటున్నారు.
పురుగుల మందు తాగించి, గొంతు నులిమి..
సైదాపూర్: ఓ పెళ్లయిన యువకుడు తమ కూతురు వెంటపడుతున్నాడని... ఎక్కడ అతడితో ప్రేమలో పడితే కుటుంబ పరువు పోతుందని భావించిన తల్లిదండ్రులు తమ పేగుబంధాన్ని తుంచుకున్నారు. కూతురుకు బలవంతంగా పురుగుల మందు తాగించి, చావకపోవడంతో గొంతు నులిమి చంపేశారు. మొదట ఆత్మహత్యగా చిత్రీకరించగా.. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గత నెల 14న కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లిలో చోటు చేసుకుంది. గురువారం హుజూరాబాద్ ఏసీపీ మాధవి నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని శివరాంపల్లి గ్రామానికి చెందిన రెడ్డి రాజు, లావణ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు డిగ్రీ చదువుతోంది. చిన్న కూతురు(16) మండలంలోని ఓ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. బాలికను అదే గ్రామానికి చెందిన పోలు అనిల్(27) కొంతకాలంగా ప్రేమపేరిట వేధిస్తున్నాడు. అనిల్‌కు అప్పటికే వివాహమైందని, అతనితో మాట్లాడొద్దని తన కూతురును రాజు పలుమార్లు మందలించాడు. అయినప్పటికీ ఆ యువకుడు తరచూ ఇంటికి వస్తూ, బాలికతో మాట్లాడుతుండడంతో తల్లిదండ్రులు ఆవేశానికి గురయ్యారు. చిన్న కూతురు వ్యవహారంతో తమ పరువుపోతోందని భావించారు.ఈ క్రమంలోనే కూతురును చంపాలని నిర్ణయించుకున్నారు. విష పురుగు కుట్టిందని.. ఆత్మహత్య చేసుకుందని..నవంబర్ 14న రాత్రి కుటుంబసభ్యులందరూ భోజనం చేసి నిద్రపోయారు. రాజు, లావణ్య బాలికను వేరే గదిలోకి తీసుకెళ్లారు. మొదట బలవంతంగా పురుగుల మందు నోట్లో పోశారు. చావకపోవడంతో రాజు తన కూతురు గొంతు నులిమి చంపేశాడు. మరునాడు ఉదయం 4గంటలకు కూతురు నిద్ర లేవడం లేదని, నోట్లోంచి నురగలు వచ్చాయని, ఏదైనా విషపురుగు కుట్టవచ్చని తండ్రి గ్రామస్తులకు చెప్పుకుంటూ రోదించాడు. తన కూతురు థైరాయిడ్, ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతోందని, పురుగుల మందు తాగి చనిపోయి ఉంటుందని నవంబర్ 15న పోలీసుస్టేషన్‌కు వెళ్లి పిటిషన్ ఇచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. బాలికను అదే గ్రామానికి చెందిన అనిల్ ప్రేమపేరుతో వేధించాడని, ఈ విషయమై బాలిక ఇంట్లో గొడవలు జరిగినట్లు తెలుసుకున్నారు. దీంతో రాజు, లావణ్యను పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. పెళ్లయిన వ్యక్తికి తమ కూతురు దగ్గరైతే.. తమ పరువు పోతుందని భావించి, తామే తమ కూతురును చంపేశామని ఒప్పుకున్నారు. దీంతో నిందితులను అరెస్టు చేసి, రిమాండ్ చేశామని ఏసీపీ తెలిపారు. ప్రేమ వ్యవహారాల్లో కన్న పిల్లలను చంపుకోవద్దని, ఆడ పిల్లలను ఎవరైనా వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేస్తాయని అన్నారు. ఈ సమావేశంలో హుజూరాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్, ఎస్ఐ తిరుపతి, ఏఎస్ఐ తిరుపతి పాల్గొన్నారు.
వీడియోలు
కారులో నుండి రాకెట్ షాట్స్.. అప్పుడే న్యూయర్ రచ్చ షురూ జేసిండ్రు
పిల్లలను వెంటాడి చంపేస్తా..! తిరుమలలో సైకో హల్ చల్..
మాచర్లలో చీలిన టీడీపీ
అన్నంత పని చేసిన కిమ్.. షాక్ లో ప్రపంచ దేశాలు
అనంతలో గన్ కల్చర్
శ్రీశైలంలో ఘోరం.. 200 కేజీల మాంసం.. లిక్కర్ స్వాధీనం.. కార్లు సీజ్
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. క్రేజీ అప్డేట్!
నన్ను లక్షకు అమ్మేశాడు.. కాపాడండి సార్
మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ఏఎస్సై
భార్యపై అనుమానంతో నిప్పు పెట్టిన భర్త

