హీరోయిన్ మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ తదితర హీరోలతో వరస సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ లీడ్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉంది. ఈమె కూతురు కూడా ఐదేళ్లకే బాలనటిగా చేసింది. ప్రస్తుతం చదువుకుంటోంది. అయితే మీనా కూతురి లేటేస్ట్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్రిస్మస్ సందర్భంగా సెలబ్రిటీలు చాలామంది తమ ఇంట్లో సెలబ్రేషన్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. మీనా కూతురు నైనిక కూడా తల్లితో కలిసి దిగిన ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన చాలామంది అప్పుడే ఇంత పెద్దది అయిపోయిందా అని అనుకుంటున్నారు. ప్రస్తుతం నైనిక వయసు 14 ఏళ్లు. ఐదేళ్ల వయసున్నప్పుడు దళపతి విజయ్ 'తెరి' (తెలుగులో పోలీసోడు) మూవీలో బాలనటిగా చేసింది. తర్వాత మరేం మూవీస్ చేయలేదు. ఇప్పుడు మాత్రం హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత అందంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మీనా విషయానికొస్తే.. 1982లో 'నెంజంగళ్' సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టింది. తమిళ దిగ్గజ హీరో శివాజీ గణేశన్ చిత్రాల్లో ఎక్కువగా కనిపించేది. 1990లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో అప్పటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. చంటి, అల్లరిపిల్ల, అల్లరి మొగుడు, సుందరకాండ, ప్రెసిడెంట్ గారి పెళ్లాం తదితర మూవీస్‌తో ఫేమ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా వెంకటేశ్‌తో చాలా సినిమాలు చేసింది.


