Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page
breaking news

ప్రధాన వార్తలు

India and China to resume direct flights1
ఈ నెల్లోనే భారత్‌-చైనాల మధ్య నేరుగా విమాన సర్వీసులు!

న్యూఢిల్లీ: కోవిడ్‌ సంక్షోభం, గల్వాన్‌ ఉద్రిక్తతలతో బీటువారిన చైనా, భారత్‌ బంధానికి భారతీయ విమానాలు మళ్లీ ఆకాశ మార్గాన స్నేహవారధి నిర్మించనున్నాయి. సుమారు ఇరుదేశాల మధ్య ఐదేళ్ల నుంచి ఆగిపోయిన భారత్, చైనా నేరుగా విమానసర్వీసులను అతి త్వరలో పునరుద్ధరించబడనున్నాయి. ఈ నెల చివరి నాటికి ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు పునరుద్ధరించే అవకాశం ఉంది. ఈ మేరకు భారత్‌-చైనాల మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎడాపెడా టారిఫ్‌ల మోత మోగించడంతో విసిగి పోయిన భారత్, చైనాలు మళ్లీ స్నేహగీతాన్ని ఆలపిస్తున్నాయి. అందులో భాగంగానే నేరుగా విమానసర్వీసుల పునర్‌ప్రారంభానికి శ్రీకారం చుట్టబోతున్నాయి.గల్వాన్‌ నుంచి గట్టిబంధం దిశగా2020 మేలో తూర్పు లద్దాఖ్‌లో ఇరు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తతకు బీజం పడింది. జూన్‌లో గల్వాన్‌ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ముష్టిఘాతం, పిడిగుద్దులు, ఘర్షణ కారణంగా ఇరువైపులా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సరిహద్దు వెంట గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించి ఉద్రిక్తతలను మరింత పెంచారు. దీంతో భారత్, చైనా సత్సంబంధాలు అడుగంటాయి. పాస్‌పోర్ట్‌లు, దిగుమతులు, అనుమతులు మొదలు మరెన్నో రంగాల్లో సత్సంబంధానికి బీటలు పడ్డాయి.అయితే ట్రంప్‌ ఇష్టారీతిన విధించిన దిగుమతి సుంకాల భారంతో ఇబ్బందులు పడుతున్న భారత్, చైనాలు ఉమ్మడిగా ఈ సమస్యను పరిష్కరించుకుందామని భావిస్తున్నాయి. ఇందుకోసం మళ్లీ స్నేహగీతం పాడక తప్పని నెలకొంది. గత కొద్దినెలలుగా ఇందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చైనా జాతీయులకు పర్యాటక వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం గత నెలలో అంగీకారం తెలిపింది. దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటనకు సిద్ధపడ్డారు.చైనాతో బంధం బలపడాలని తాము కోరుకుంటున్నామని ఆదేశ పర్యటనను ఖరారుచేసి మోదీ సూచనప్రాయంగా చెప్పారు. భారత్‌ వంటి దేశాలపై టారిఫ్‌ను అమెరికా పెంచడాన్ని చైనా సైతం తీవ్రంగా పరోక్షంగా ఖండించింది. ఇలా నెమ్మదిగా బలపడుతున్న మైత్రీ బంధాన్ని నేరుగా విమానసర్వీసుల ద్వారా మరింత పటిష్టంచేయాలని భారత్‌ ఆశిస్తోంది. చివరిసారిగా మోదీ చైనాలో 2018 జూన్‌లో పర్యటించారు. ఆ తర్వాతి ఏడాది అక్టోబర్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భారత్‌లో పర్యటించారు. ఇటీవల టియాన్‌జిన్‌లో జరిగిన 25వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన పలు కీలక అంశాలపై చర్చించారు: అందులో ఇరు దేశా మధ్య విమాన సర్వీసుల పునరుద్ధరణ అంశం ఒకటి.

Severe storm hits coast At Paradip Gopalpur2
తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం

విశాఖ: కళింగపట్నం వద్ద కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం నెమ్మదిగా పారాదీప్‌-గోపాల్‌పూర్‌ మధ్య తీరాన్ని దాటింది. ఈ విషయాన్ని ఐఎండీ స్పష్టం చేసింది. అయితే ఈ తీవ్ర వాయుగుండం బలహీనపడినా దీని ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుగుతుందని వెల్లడించింది. ఫలితంగా రేపు కూడా పలు ప్రాంత్లాఓ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తీరం దాటే సమయంలో 55 కి.మీ నుంచి 75 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి.కాగా, ఈ తీవ్ర వాయుగుండ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వాయుగుండ ప్రబావంతో సముద్రం అలజడిగా మారింది. మత్స్యకారులు వేటకు వెళ్ళ రాదని ఐఎండీ ముందుగానే హెచ్చరికలు పంపింది. ఉత్తరాంధ్రలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరక కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. గాలి వానకు భారీ చెట్లు నేలకొరిగాయి.పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్‌ కుప్పకూలాయి. ద్వారకానగర్ రోడ్డులోని ఫార్చునర్ కారుపై చెట్టు కూలిపోయింది. కారు పార్క్ చేసి.. ఓనర్ షాపింగ్‌కు వెళ్లడంతో ప్రమాదం తప్పింది.

Over 100 Maoists surrender in Chhattisgarhs Bijapur3
వందకు పైగా మావోయిస్టుల లొంగుబాటు

రాయ్‌పూర్‌: వివిధ కేడర్‌లకు చెందిన 100కు పైగా మావోయిస్టులు.. పోలీసులకు లొంగిపోయారు. చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బిజాపూర్‌ జిల్లాలో 103 మంది మావోయిస్టులు తమకు సరెండర్‌ అయినట్లు పోలీసులు స్పష్టం చేశారు. గురువారం( అక్టోబర్‌ 1వ తేదీ) తాము లొంగిపోతున్నట్లు తెలిపిన మావోయిస్టులు.. పారామిలటరీ అధికారులు, సీనియర్‌ పోలీసులు సమక్షంలో వీరు లొంగిపోయారు. ఆ మేరకు ఆయేధాలను విడిచిపట్టి సాధారణ సంఘ జీవితంలో కలిసి బ్రతకడానికి సిద్ధమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. లొంగిపోయిన వారంతా 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు వారే ఉన్నారని, వారు చేపట్టిన ఉద్యమాన్ని వదిలి సంఘ జీవితంలో కలిసే బ్రతుకుతామంటూ లొంగిపోయినట్లు సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Sheikh Hasina aide handcuffed to hospital bed before death,Outrage over viral photo4
ఆసుపత్రిలో అమానుష దృశ్యం.. మాజీ కేంద్ర మంత్రి మృతిపై దేశవ్యాప్తంగా నిరసనలు!

ఢాకా: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనా సన్నిహితుడు, బంగ్లాదేశ్ పరిశ్రమల శాఖ మాజీ మంత్రి నూరుల్ మాజిద్ మహమ్మద్‌ హుమాయున్ మృతిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన నూరుల్‌ మాజిద్ చేతికి హ్యాండ్‌కప్స్‌ బిగించి చికిత్స చేయడం వివాదాస్పదంగా మారింది. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నూరుల్‌ కన్నుమూయడం, ఆసమయంలో చేతికి బేడీలు ఫొటోలు సోషల్‌ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. దీంతో షేక్‌ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్‌ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నేతలతో పాటు సామాన్య ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షేక్‌ హసీనా ప్రధానిగా విధులు నిర్వహించే సమయంలో నూరల్‌ బంగ్లాదేశ్‌ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల, బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్‌ ‌ యూనస్‌ ప్రభుత్వం నూరల్‌ను అదుపులోకి తీసుకుంది. 2024లో వివక్ష వ్యతిరేక ఉద్యమం సందర్భంగా జరిగిన దాడుల్లో నూరుల్ మాజిద్ పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. తాజాగా, నాటి కేసులకు సంబంధించి ఆయనను గత నెల 24న బంగ్లాదేశ్‌ పోలీసులు అరెస్టు చేశారు.వయోభారం రిత్యా అరెస్టయిన స్వల్ప వ్యవధిలో పలుమార్లు ఆస్పత్రి పాలయ్యారు. ఈ క్రమంలో నూరుల్ మాజిద్ సోమవారం ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రి (డీఎంసీహెచ్‌) ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. జైలు కస్టడీలో నూరుల్ మాజిద్ మరణించాడని జైలు అధికారులు సైతం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆ ఫొటోలు సైతం బహిర్ఘతమయ్యాయి. నెట్టింట్లో వైరలైన ఫొటోల్లో నూరుల్ మజీద్ చేతికి బేడీలు ఉండడంపై యూనస్‌ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. మానవ హక్కుల సంఘాలు, రాజకీయ నేతలు అమానుషమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. మరోవైపు,పోలీసు అధికారులు మాత్రం నూరుల్ మజీద్‌పై పలు కేసులు ఉన్నాయని.. పారిపోవడం, ఇతర ప్రమాదాలను నివారించేందుకు ఈ చర్య తీసుకున్నాం’అని పేర్కొన్నారు. కానీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని ఇలా బేడీలు వేయడం అవసరమా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి ఈ దుమారంపై యూనస్‌ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. Nurul Majid Mahmud Humayun, a 75-year-old veteran of Bangladesh’s 1971 Liberation War, former Industries Minister, and senior Awami League leader, passed away while undergoing treatment in jail custody at Dhaka Medical College Hospital (DMCH).The day before his death, he was… pic.twitter.com/t582kBShJY— Mohammad Ali Arafat (@MAarafat71) September 30, 2025

Tragedy in Madhya Pradesh During Durga Idol Immersion5
దుర్గమ్మ నిమజ్జనోత్సవంలో పెను విషాదం.. 11 మంది మృతి

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. దుర్గమ్మ నిమజ్జనోత్సవంలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. దుర్గమ్మను నిమజ్జనానికి తీసుకెళ్తుండగా ట్రాక్టర్‌ చెరువులోకి దూసుకెళ్లింది. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో దుర్గమ్మ నిమజ్జనోత్సవం విషాదంగా మారింది. గురువారం జరిగిన ఈ దుర్ఘటనలో ట్రాక్టర్ చెరువులోకి దూసుకెళ్లి 11 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 20 నుంచి 25 మంది భక్తులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. VIDEO | Madhya Pradesh: At least nine devotees died after a tractor-trolley carrying idols of Goddess Durga for immersion on Vijayadashmi plunged into a lake in Khandwa district.#Khandwa #DurgaPuja2025 (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/ipqVplGJus— Press Trust of India (@PTI_News) October 2, 2025ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దుర్ఘటన ఖండ్వా జిల్లా అర్దాలా గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గమ్మ విగ్రహ నిమజ్జనం కోసం చెరువుపై తాత్కాలిక వంతెనపై ఆపి ఉంచిన ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడటంతో అందులో ఉన్న వారందరూ నీటిలో మునిగిపోయారు. గురువారం సాయంత్రం 5:00 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. జేసీబీ సహాయంతో వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6:00 గంటల సమయానికి 11 మృతదేహాలను వెలికి తీశారు. బాధితులను పంధానా ఆసుపత్రికి తరలించడానికి సంఘటనా స్థలంలో పది అంబులెన్స్‌లను మోహరించారు. జిల్లా కలెక్టర్ రిషబ్ గుప్తా, పోలీసు సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ రాయ్ సంఘటన స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రాణాలతో బయటపడిన ముగ్గురు పిల్లలను చికిత్స కోసం ఖాండ్వా ఆసుపత్రికి తరలించారు.

Kantara Chapter 1 Budget And Remuneration Details6
'కాంతార 1' రెమ్యునరేషన్స్.. ఈసారి ఎవరికి ఎంత?

దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత 'కాంతార' ఫ్రాంచైజీ నుంచి మరో సినిమా థియేటర్లలోకి వచ్చింది. అదే 'కాంతార ఛాప్టర్ 1'. తొలి పార్ట్ కంటే ఈసారి భారీ హంగులు, స్టోరీలో మరిన్ని ఎలిమెంట్స్ జోడించారు. దసరా కానుకగా అక్టోబరు 02న పాన్ ఇండియా లెవల్లో రిలీజైంది. అయితే ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ అయితే రాలేదు. కొందరు ప్రేక్షకులు ఆహా ఓహో అంటుండగా.. మరికొందరు మాత్రం ఓకే ఓకే అని అంటున్నారు.మరోవైపు తొలి పార్ట్ కేవలం రూ.15-20 కోట‍్లతో నిర్మిస్తే ఏకంగా రూ.400 కోట్ల వరకు కలెక్షన్ అందుకుంది. ఇప్పుడు మాత్రం భారీగా బడ్జెట్ పెట్టారు. ఏకంగా రూ.125 కోట్ల వరకు నిర్మాతలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే ప్రతి సీన్‌లోనూ రిచ్‌నెస్ కనిపించింది. అడవిలో సెట్ కావొచ్చు, బాంగ్రా రాజ్యం సెట్ కావొచ్చు స్క్రీన్‌పై అద్భుతంగా కనిపించాయి. కంటెంట్‌తో పాటు విజువల్స్, సెట్స్‌కి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు.(ఇదీ చదవండి: Kantara Review: 'కాంతార ఛాప్టర్ 1' సినిమా రివ్యూ)ఈ సినిమా రెమ్యునరేషన్ విషయానికొస్తే తొలి పార్ట్ కోసం హీరో, దర్శకుడిగా చేసినందుకు రిషభ్ శెట్టి అప్పట్లో కేవలం రూ.4 కోట్లు తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈసారి మాత్రం రూపాయి పారితోషికం తీసుకోకుండానే దాదాపు మూడేళ్ల పాటు కష్టపడ్డాడని అంటున్నారు. అలా అని ఫ్రీగా ఏం చేసేయలేదు. రిలీజ్ తర్వాత లాభాల్లో వచ్చే వాటాని తీసుకోవాలని ముందే నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నాడట.సినిమాలో రిషభ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య లీడ్ రోల్స్ చేశారు. వీళ్లందరికీ తలో రూ.కోటి వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. వీళ్లు తప్పితే అందరూ పెద్దగా పేరున్న యాక్టర్స్ అయితే కనిపించలేదు. అయితే సినిమాలో అటు రిషభ్ ఇటు రుక్మిణి వసంత్ యాక్టింగ్‌ జనాలకు బాగా నచ్చుతోంది. పబ్లిక్ టాక్‌లోనూ ఎక్కువ మంది వీళ్లిద్దరినే మెచ్చుకుంటుండటం విశేషం. (ఇదీ చదవండి: కొడుకుని పరిచయం చేసిన వరుణ్ తేజ్.. పేరు ఏంటంటే?)

PM Modi Greets Nation on Vijaya Dashami Festival7
అనాదిగా ధర్మానిదే విజయం: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: గురువారం విజయ దశమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనాదిగా చెడుపై ధర్మానిదే విజయమనే సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుందని ప్రధాని పేర్కొన్నారు. విజయ దశమి రోజు ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. మంచి, ధర్మం అనేవి ఎల్లప్పుడూ చెడు, మోసాలను అధిగమిస్తాయన్నారు. ఈ పండుగ.. ధైర్యం, జ్ఞానం, భక్తి మొదలైనవాటిని జీవితంలో మార్గదర్శక శక్తులుగా స్వీకరించడానికి ప్రేరణనిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. विजयादशमी बुराई और असत्य पर अच्छाई और सत्य की विजय का प्रतीक है। मेरी कामना है कि इस पावन अवसर पर हर किसी को साहस, बुद्धि और भक्ति के मार्ग पर निरंतर अग्रसर रहने की प्रेरणा मिले। देशभर के मेरे परिवारजनों को विजयादशमी की बहुत-बहुत शुभकामनाएं।— Narendra Modi (@narendramodi) October 2, 2025ఈ పవిత్ర దినం మనల్ని సత్యం, ధర్మ మార్గంలో స్థిరంగా నిలిచేందుకు ప్రోత్సహిస్తుందని ప్రధాని అన్నారు. దసరా అంటే రావణుడిపై రాముడు సాధించిన విజయాన్ని గుర్తుచేసుకోవడమే కాకుండా, ప్రతికూలతలను జయించి న్యాయం, ధర్మాన్ని నిలబెట్టడానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. భారతీయులంతా ఒక పెద్ద జాతీయ కుటుంబంలోని సభ్యులుగా అభివర్ణించారు. ఇటువంటి పండుగలు ఐక్యతను బలోపేతం చేస్తాయని, ప్రజలను దగ్గర చేస్తాయని, దేశ సాంస్కృతిక స్ఫూర్తిని వ్యాపింపజేస్తాయని ప్రధాని పేర్కొన్నారు.గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. సోషల్ మీడియా ‘ఎక్స్‌’ పోస్టులో ఆయన.. ధైర్యం, సరళత అనేవి మనిషి మార్పునకు సాధనాలుగా ఎలా మారుతాయనేది గాంధీ చూపారని పేర్కొన్నారు. ప్రజలకు సాధికారత కల్పించడానికి సేవ, కరుణ ముఖ్యమైన సాధనాలని అ‍న్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా విజయ్ ఘాట్‌లో ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. సమగ్రత, వినయం, దృఢ సంకల్పాల బలంతో భారతదేశాన్ని బలోపేతం చేసిన అసాధారణ రాజనీతిజ్ఞుడిగా ఆయనను ప్రధాని మోదీ ప్రశంసించారు.

Its Station Bail Case: Kadapa Court To Police In Khaja Arrest Case8
టీడీపీ శ్రీనివాసులురెడ్డికి కడప కోర్టు షాక్‌

వైఎస్సార్ జిల్లా: మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పీఏ ఖాజాను అరెస్ట్ చేసిన ‍కేసులో పోలీసులకు కడప కోర్టు షాకిచ్చింది. స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాల్సిన కేసులో రిమాండ్‌ కోరతారా? అంటూ కడప మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే 41ఏ నోటీసులు ఇచ్చి విడుదల చేయాలని ఆదేశించారు ఈ క్రమంలోనే పోలీసుల తీరుపై మొట్టికాయలు వేశారు మెజిస్ట్రేట్‌. దాంతో ఖాజాను విడుదల చేశారు పోలీసులు.సోషల్ మీడియాలో ఎమ్మెల్యే మాధవీరెడ్డి తీరును టీడీపీ సీనియర్ మహిళలు ఎండగట్టారు. ఇది సోషల్‌ మీడియాలో షేర్‌ కావడంతో దాన్ని అంజాద్‌ భాషా పీఏ ఖాజా షేర్‌ చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. దీన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి ఫిర్యాదు చేశారు. ఓవరాక్షన్‌, హైడ్రామా నడిపి ఖాజాను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే కడప మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. ఈ కేసు చూసి కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేసిస మేజిస్ట్రేట్‌.. ఏదో ఒక పోస్ట్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తే అరెస్ట్‌ చేస్తారా? మళ్లీ రిమాండ్‌ కోరతారా? టూ మొట్టికాయలు వేసింది. ఇది స్టేషన్‌ బెయిల్‌ కేసని, 41 ఏ కింద నోటీసులు ఇచ్చి ఖాజాను విడుదల చేయాలని ఆదేశించింది దాంతో ఖాజాను విడుదల చేయడంతో పోలీసులతో పాటు శ్రీనివాసులురెడ్డికి షాక్‌ తగిలినట్లయ్యింది.

IND VS WI 1st Test: India Are 121 For 2 At Day 1 Stumps, KL Rahul Stays At Crease On 53 Runs9
చెలరేగిన బౌలర్లు.. రాణించిన కేఎల్‌ రాహుల్‌.. భారీ స్కోర్‌ దిశగా టీమిండియా

అహ్మదాబాద్ వేదిక‌గా వెస్టిండీస్‌తో (West Indies) జ‌రుగుతున్న తొలి టెస్టులో టీమిండియా (Team India) మంచి స్కోర్‌ దిశగా సాగుతుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (36; 7 ఫోర్లు), సాయి సుదర్శన్‌ (7) ఔట్‌ కాగా.. కేఎల్‌ రాహుల్‌ (Kl Rahul) (53), శుభ్‌మన్‌ గిల్‌ (18) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్‌ బౌలర్లలో జేడన్‌ సీల్స్‌, రోస్టన్‌ ఛేజ్‌ తలో వికెట్‌ తీశారు. విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు భారత్‌ ఇంకా 41 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ 162 ప‌రుగుల‌కే ఆలౌటైంది. సిరాజ్‌ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్‌ (6.1-0-25-2), వాషింగ్టన్‌ సుందర్‌ (3-0-9-1) ధాటికి విండీస్‌ ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది.విండీస్‌ ఇన్నింగ్స్‌లో ఏడో నంబర్‌ ఆటగాడు జస్టిన్‌ గ్రీవ్స్‌ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్‌ కాకుండా అలిక్‌ అథనాజ్‌ (12), బ్రాండన్‌ కింగ్‌ (13), కెప్టెన్‌ రోస్టన్‌ ఛేజ్‌ (24), షాయ్‌ హోప్‌ (26), ఖారీ పియెర్‌ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో జాన్‌ క్యాంప్‌బెల్‌ 8, తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ డకౌట్‌, జోమెల్‌ వార్రికన్‌ 8, జోహన్‌ లేన్‌ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్‌లో భారత వికెట్‌కీపర్‌ ధృవ్‌ జురెల్‌ 4 క్యాచ్‌లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: రుతురాజ్‌, ఇషాన్‌ కిషన్‌ విఫలం.. పోరాడుతున్న రజత్‌ పాటిదార్‌

Govt campaign to unlock Rs 80000 crore unclaimed funds10
పడిఉన్న రూ.80,000 కోట్లను పట్టించుకోండి..

డిపాజిట్లు, డివిడెండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర పొదుపు సాధనాలలో దాదాపు రూ.80,000 కోట్ల సొమ్ము.. ఎవరూ క్లెయిమ్ చేయకపోవడంతో అనామకంగా పడిఉంది. ఈ సొమ్మును దాని హక్కుదారులు, వారసులు గుర్తించి, తిరిగి పొందటానికి సహాయపడటానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది.యువర్ మనీ.. యువర్ రైట్కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అక్టోబర్ 4న గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 'యువర్ మనీ, యువర్ రైట్' అనే మూడు నెలల అవగాహన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్ఏ)తో ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) ఈ ప్రచారాన్ని సమన్వయం చేస్తోంది."బీమా పాలసీ క్లెయిమ్‌లు, బ్యాంక్ డిపాజిట్లు, డివిడెండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్ ఆదాయంతో సహా క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులు అవగాహన లేకపోవడం లేదా కాలం చెల్లిన ఖాతా వివరాల కారణంగా అన్‌క్లెయిమ్‌గా మిగిలిపోతున్నాయి. ప్రజలు ఆదా చేసే ప్రతి రూపాయిని వారు లేదా వారి చట్టపరమైన వారసులు, నామినీలు సముచితంగా క్లెయిమ్ చేసుకునేలా చూడటానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది" అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీలు), సంబంధిత ఫండ్ రెగ్యులేటర్లు అభివృద్ధి చేసిన తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్ఏక్యూలు) ద్వారా తమ సొమ్మును ఎలా గుర్తించాలో, క్లెయిమ్ చేయాలనే దానిపై ప్రజలకు స్పష్టమైన సమాచారాన్ని అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.డిజిటల్ క్లెయిమ్ ప్రక్రియకస్టమర్లు ఆర్బిఐకి చెందిన ఉద్గమ్‌ (UDGAM) పోర్టల్ ద్వారా అన్‌క్లెయిమ్ చేయని డిపాజిట్లను చెక్‌ చేయవచ్చు. అయితే క్లెయిమ్‌ ప్రక్రియను పూర్తి చేయడానికి వారు సంబంధిత బ్యాంకు శాఖను సందర్శించాలి. బ్యాంకులు చేపట్టబోయే ప్రతిపాదిత మార్పులు ఈ ప్రక్రియను డిజిటలైజ్ చేస్తాయి. ఆ తర్వాత ఆన్‌లైన్లో డిపాజిట్‌ను తిరిగి పొందటానికి అనుమతిస్తాయి.కాగా బ్యాంకింగ్ చట్టాల (సవరణ) చట్టం, 2025.. ప్రతి బ్యాంకు ఖాతాకు అంగీకరించిన నామినీల సంఖ్యను ఒకటి నుండి నలుగుకు పెంచింది. ఖాతా డార్మాంట్‌గా ఉంటే లబ్ధిదారులను సులభంగా గుర్తించడానికి అనుమతిస్తుంది. చట్టం ముఖ్య నిబంధనలు ఆగస్టు 1 నుండి అమల్లోకి వచ్చాయి.ఇదీ చదవండి: డీఏ పెరిగింది.. మరి జీతమెంత పెరుగుతుంది?

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement