రన్‌వేపై రెండు విమానాలు ఢీ.. వీడియో వైరల్‌ | Laguardia Airport Crash, Two Delta Planes Collide While Taxiing, Watch Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

రన్‌వేపై రెండు విమానాలు ఢీ.. వీడియో వైరల్‌

Oct 2 2025 10:29 AM | Updated on Oct 2 2025 11:11 AM

Laguardia Airport Crash: Two Delta Planes Collide While Taxiing

న్యూయార్క్‌లో లగార్డియా ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపై రెండు విమానాలు ఢీకొన్నాయి. రన్‌వే టాక్సీయింగ్‌ సమయంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానాలు ఢీకొన్నాయి. ఈ  ఘటనలో ఒకరికి  గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఒక విమానం రెక్క (wing) విరిగిపోయినట్లు స్పష్టంగా కనిపించింది.

మరొక విమానం ముక్కు (nose) భాగం దెబ్బతింది. ఈ విమానాలు తక్కువ వేగంతో కదులుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో భారీ ప్రమాదమే తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. లాగార్డియా విమానాశ్రయం.. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత న్యూయార్క్‌ నగరంలో రెండో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement