breaking news
planes collide
-
రన్‌వేపై రెండు విమానాలు ఢీ.. వీడియో వైరల్
న్యూయార్క్‌లో లగార్డియా ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపై రెండు విమానాలు ఢీకొన్నాయి. రన్‌వే టాక్సీయింగ్ సమయంలో డెల్టా ఎయిర్‌లైన్స్ విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఒక విమానం రెక్క (wing) విరిగిపోయినట్లు స్పష్టంగా కనిపించింది.మరొక విమానం ముక్కు (nose) భాగం దెబ్బతింది. ఈ విమానాలు తక్కువ వేగంతో కదులుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో భారీ ప్రమాదమే తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. లాగార్డియా విమానాశ్రయం.. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత న్యూయార్క్ నగరంలో రెండో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం.At least one was injured after two Delta regional jets collided at low speeds while taxiing Wednesday evening at LaGuardia 🇺🇸The right wing of one @Delta plane collided with the nose of the other plane, according to Air Traffic Control audio.https://t.co/ICrgCP2ZsM… pic.twitter.com/ffx9i4xftV— Saad Abedine (@SaadAbedine) October 2, 2025 -
వైరల్ వీడియో : గాల్లోనే ఢీకొన్న 2 విమానాలు..
-
ఆకాశవిధిలో అనుకొని ప్రమాదం
-
టేకాఫ్ అవుతున్న సమయంలో..
జకర్తా: టేకాఫ్ అవుతున్న రెండు విమానాలు ఢీ కొన్న ఘటన ఇండోనేషియా రాజధాని జకర్తాలో చోటు చేసుకుంది. వెంటనే చర్యల చేపట్టిన ఎయిర్‌పోర్టు అధికారులు అన్ని విమాన సర్వీసులను తాత్కలికంగా నిలిపివేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణహాని సంభవించలేదు. ప్రధాన ఎయిర్‌పోర్టు నుంచి విమానాల రాకపోకల రద్దీని అదుపు చేసేందుకు దగ్గరలోని మిలటరీ విమానాశ్రయాన్ని వినియోగిస్తున్నారు. బతిక్ ఎయిర్‌కు చెందిన విమానం 49 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో టేకాఫ్ అవుతుండగా, అదే సమయంలో ట్రాన్స్నూసకు చెందిన ఎయిర్‌క్రాప్ట్ విమానం కూడా బయల్దేరడంతో రెండు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బతిక్ ఎయిర్‌కు చెందిన విమానం రెక్క తీవ్రంగా దెబ్బతింది.


