
2025లో భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య 358కి పెరిగింది. M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 తాజా నివేదిక ప్రకారం గత సంవత్సరంతో పోలిస్తే 24మంది కొత్త బిలియనీర్లు జాబితాలో చేరారు. 13 ఏళ్ల క్రితం హురున్‌లిస్ట్ మొదలైనప్పటి నుండి భారతదేశ బిలియనీర్ల సంఖ్య ఆరు రెట్లు పెరిగి 350కి చేరుకుంది.
ఈ జాబితాలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలు
M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 లిస్టలో చోటు సంపాదించుకున్న వారు ధనవంతులు రోజుకు 1,991 కోట్ల సంపదను ఆర్జించారు.
2025లో టాప్ 10 మంది మొత్తం సంపద జాబితాలోని మిగిలిన జాబితాలో 28 శాతానికి సమానం. ఒక్క ముఖేష్ అంబానీ , గౌతమ్ అదానీ సంపదే మొత్తం సంపదలో 12శాతం ఉందని ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. రూ.9.55 లక్షల కోట్ల (USD 105 బిలియన్లు) సంపదతో, ముఖేష్ అంబానీ & కుటుంబం అత్యంత ధనవంతులైన భారతీయుడిగా నిలిచారు. గౌతమ్ అదానీ & కుటుంబం రూ.8.15 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉంది.
M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 సంచిత సంపద INR 167 లక్షల కోట్లు. ఇది వార్షిక ప్రాతికపదికన ఇది 5 శాతం పెరుగుదల. ఇది స్పెయిన్ GDP కంటే ఎక్కువ . భారతదేశ GDPలో దాదాపు సగానికి సమానం.
సుంకాల ఎదురుదెబ్బ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో M3M హురున్ ఇండియా రిచ్ లిస్టర్ల సగటు సంపద 10,320 కోట్ల 9,850 కోట్లకు తగ్గింది.
నీరాజ్ బజాజ్ & కుటుంబం సంపద రూ. 2.33 లక్షల కోట్లు పెరిగి, నాలుగు స్థానాలు ఎగబాకి 6వ స్థానానికి చేరుకుంది.
మరో విధంగా చెప్పాలంటే, బజాజ్ గ్రూప్‌కు చెందిన నీరాజ్ బజాజ్ & కుటుంబం ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు, 69,875 కోట్లు పెరిగి వారి సంపద 2.33 లక్షల కోట్లకు చేరుకుంది.
చెన్నైలో జన్మించిన పెర్ప్లెక్సిటీ వ్యవస్థాపకుడు అరవింద్ శ్రీనివాస్, INR 21,190 కోట్ల సంపదతో 2025 M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో బిలియనీర్‌గా అరంగేట్రం చేశారు. జాబితాలో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ కూడా ఆయనే.
రోష్ని నాడార్ మల్హోత్రా & కుటుంబం రూ. 2.84 లక్షల కోట్ల సంపదతో టాప్ 3లో అడుగుపెట్టారు, భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళగా నిలిచారు. రోష్ని నాడార్ టాప్ 10లో అతి పిన్న వయస్కురాలు కూడా.
జాబితాలో ఉన్న పద్దెనిమిది మంది లక్ష కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నారు. గత సంవత్సరం కంటే ఆరుగురు ఎక్కువ. పదేళ్ల క్రితం దశాబ్దం ఇద్దరు మాత్రమే ఉన్నారు.
హురున్ ఇండియా యునికార్న్ & ఫ్యూచర్ యునికార్న్ లిస్ట్ 2025 నుండి అరవై ఐదు మంది యునికార్న్ వ్యవస్థాపకులు—13 మంది గజెల్( Gazelle founders) వ్యవస్థాపకులు , 5 మంది చీతా వ్యవస్థాపకులు (Cheetah founders)M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో చోటు సంపాదించారు.