
నవంబర్ 28న ప్రారంభం
దోహా: ప్రముఖ భారతీయ చిత్రకారుడు మక్బూల్ ఫిదా (ఎంఎఫ్) హుస్సేన్‌కు ఖతార్‌లో అరుదైన గౌరవం దక్కనుంది. ఎంఎఫహుస్సేన్ పేరుతో ఏర్పాటుచేసిన ప్రత్యేక మ్యూజియంను నవంబర్ 28న ఖతార్ రాజధాని దోహాలో ప్రారంభించనున్నారు. ఖతార్ ఫౌండేషన్ సంస్థ ‘లాహ్ వా ఖ్వాలం: ఎంఎఫ్ హుస్సేన్ మ్యూజియం’పేరుతో దీనిని ఏర్పాటుచేసింది.
ఆర్ట్ అండ్ కల్చర్ ద్వారా ఎవరైనా స్ఫూర్తి పొందేందుకు, నేర్చుకునేందుకు, ఆనందంగా గడిపేందుకు ఈ మ్యూజియం వేదికగా ఉంటుందని ఖతార్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కమ్యూనిటీ వ్యవహారాలు) ఖలౌద్ అల్ అలీ మంగళవారం తెలిపారు. ఖతార్ సంస్కృతికి ఈ మ్యూజియం అదనపు హంగుగా మారు తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ మ్యూ జియంలో ఎంఎఫ్ హుస్సేన్ వేసిన చిత్రాలు, ఆయన జీవిత విశేషాలు పొందుపరిచినట్లు వివరించారు.
అరబ్ నాగరికతపై ఎంఎఫ్ హు స్సేన్ వేసిన పెయింటింగ్స్‌లో కొన్నింటిని ఈ మ్యూజియంలో ప్రదర్శిస్తారు. మ్యూజికం అద్దాలను కూడా హుస్సేన్ తన పెయింటింగ్స్‌లో చిత్రించిన చిత్రాల స్ఫూర్తితోనే రూపొందించటం విశేషం. ఆధునిక భారతీయ చిత్ర కారుల్లో ఎంఎఫ్ హుస్సేన్ ఒకరు. ఆయన బాంబే ప్రోగ్రెస్సివ్ ఆర్టిస్ట్స్ గ్రూప్ వ్యవస్థాపకుల్లో ఒకరు.
ఆయన చిత్రాల్లో భారతీయ నగర, గ్రామీణ జీవితం ఉట్టిపడుతుంది. ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. 2006లో హిందూ దేవతలు, భారత మాతను నగ్నంగా చిత్రించినందుకు ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఖతార్‌కు వెళ్లిపో యారు. 2010లో ఖతార్ పౌరసత్వం తీసుకున్నారు. 2011 జూన్ 9న 95 ఏళ్ల వయసులో లండన్‌లో తుదిశ్వాస విడిచారు. భారతీయ చిత్రకళకు ఆయన ఎనలేని సేవ చేశారు.