
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో దుర్గా పూజ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. అది ఒక భావోద్వేగం.. నగరమంతా మిరిమిట్లుగొలిపే లైట్లతో వెలిగిపోతూ, గల్లీ గల్లీలో మధురమైన సంగీతం మారుమోగుతూ, ఆశ్చర్యపరిచే దుర్గామాత కళాఖండాలతో అత్యంత ఉత్సాహపూరిత వాతావరణ కనిపిస్తుంది. కోల్‌కతాలో ఆకట్టుకుంటున్న దుర్గామాత పందిళ్లలలో కొన్ని..(ఇండియా టీవీ సౌజన్యం)
చల్తాబాగన్ దుర్గా మాత: సృజనాత్మక కళాకృతులకు ప్రసిద్ధి చెందిన చల్తాబాగన్‌లోని దుర్గామాత వేదికను ఈ ఏడాది సంప్రదాయ అలంకరణ, ఆధునిక కళల మేళవింపుతో అద్భుతంగా తీర్చిదిద్దారు.
కాశీ బోస్ లేన్ దుర్గా మాత: కాశీ బోస్ లేన్‌లో దుర్గామాతను ప్రతి ఏటా ఎంతో కొత్తగా రూపొందిస్తుంటారు. ఇక్కడి కళాత్మక విగ్రహాలు, వినూత్న లైటింగ్ హైలెట్‌గా నిలుస్తాయి. ఉత్తర కోల్‌కతాలోని ఈ పూజా వేదిక ఎంతో పేరుగాంచింది.
సిక్దర్ బాగన్ దుర్గా మాత: ఈ పందిరిలో సంక్లిష్టమైన హస్తకళలు దర్శనమిస్తున్నాయి. సమకాలీన ఆలోచనలనకు ఇక్కడ దృశ్యరూపం కనిపిస్తుంది.
నళిన్ సర్కార్ వీధి: నళిన్ సర్కార్ వీధి మండపం ప్రయోగాత్మక వేదికలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది థీమ్‌లో అద్భుతమైన కళాత్మకత, సృజనాత్మకత, సామాజిక సందేశాలు ప్రతిబింబిస్తున్నాయి.
తాలా ప్రాత్రోయ్: తాలా ప్రాటోయ్ వేదికపై భారీ విగ్రహం దర్శనమిస్తుంది. ఇక్కడి దుర్గా విగ్రహం ఎంతో కొత్తగా కనిపిస్తుంది.