
న్యూఢిల్లీ: గురువారం విజయ దశమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనాదిగా చెడుపై ధర్మానిదే విజయమనే సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుందని ప్రధాని పేర్కొన్నారు. విజయ దశమి రోజు ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. మంచి, ధర్మం అనేవి ఎల్లప్పుడూ చెడు, మోసాలను అధిగమిస్తాయన్నారు. ఈ పండుగ.. ధైర్యం, జ్ఞానం, భక్తి మొదలైనవాటిని జీవితంలో మార్గదర్శక శక్తులుగా స్వీకరించడానికి ప్రేరణనిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
विजयादशमी बुराई और असत्य पर अच्छाई और सत्य की विजय का प्रतीक है। मेरी कामना है कि इस पावन अवसर पर हर किसी को साहस, बुद्धि और भक्ति के मार्ग पर निरंतर अग्रसर रहने की प्रेरणा मिले।
देशभर के मेरे परिवारजनों को विजयादशमी की बहुत-बहुत शुभकामनाएं।— Narendra Modi (@narendramodi) October 2, 2025
ఈ పవిత్ర దినం మనల్ని సత్యం, ధర్మ మార్గంలో స్థిరంగా నిలిచేందుకు ప్రోత్సహిస్తుందని ప్రధాని అన్నారు. దసరా అంటే రావణుడిపై రాముడు సాధించిన విజయాన్ని గుర్తుచేసుకోవడమే కాకుండా, ప్రతికూలతలను జయించి న్యాయం, ధర్మాన్ని నిలబెట్టడానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. భారతీయులంతా ఒక పెద్ద జాతీయ కుటుంబంలోని సభ్యులుగా అభివర్ణించారు. ఇటువంటి పండుగలు ఐక్యతను బలోపేతం చేస్తాయని, ప్రజలను దగ్గర చేస్తాయని, దేశ సాంస్కృతిక స్ఫూర్తిని వ్యాపింపజేస్తాయని ప్రధాని పేర్కొన్నారు.
గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. సోషల్ మీడియా ‘ఎక్స్’ పోస్టులో ఆయన.. ధైర్యం, సరళత అనేవి మనిషి మార్పునకు సాధనాలుగా ఎలా మారుతాయనేది గాంధీ చూపారని పేర్కొన్నారు. ప్రజలకు సాధికారత కల్పించడానికి సేవ, కరుణ ముఖ్యమైన సాధనాలని అన్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా విజయ్ ఘాట్‌లో ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. సమగ్రత, వినయం, దృఢ సంకల్పాల బలంతో భారతదేశాన్ని బలోపేతం చేసిన అసాధారణ రాజనీతిజ్ఞుడిగా ఆయనను ప్రధాని మోదీ ప్రశంసించారు.