
ఆస్ట్రేలియా బ్రిస్బేన్ నగరంలోని గ్రేటర్ స్ప్రింగ్ ఫీల్డ్‌లో బతుకమ్మ సంబరాలను తెలుగు ప్రజలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మలను పేర్చి అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరీ మాత పూజను నిర్వహించారు.

‘బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్’ ఆధ్వర్యంలో స్థానిక స్ప్రింగ్ ఫీల్డ్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు, ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో మహిళలు చిన్నపిల్లలు పాల్గొని తెలంగాణ సాంప్రదాయ నృత్యాలను కనుల విందుగా ప్రదర్శించారు.
దసరా నవరాత్రులతో పాటు తెలంగాణలో బతుకమ్మ వేడుకలు కూడా ఘనంగా జరుగుతాయి. ఈ వేడకలు భాద్రపద బహుళ అమావాస్య– అంటే మహాలయ అమావాస్య నుంచి మొదలవుతాయి. అంటే బతుకమ్మ వేడుకలు దుర్గాష్టమి నాటితో ముగుస్తాయి. అప్పుడే ఈ బతుకమ్మ వేడుకలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ వెన్నముద్ద బతుకమ్మని ఆరాదిస్తారు. ఈ రోజున నువ్వులు, వెన్న, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.;
(చదవండి: మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు)