
భోపాల్: మధ్యప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. దుర్గమ్మ నిమజ్జనోత్సవంలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. దుర్గమ్మను నిమజ్జనానికి తీసుకెళ్తుండగా ట్రాక్టర్ చెరువులోకి దూసుకెళ్లింది.
మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో దుర్గమ్మ నిమజ్జనోత్సవం విషాదంగా మారింది. గురువారం జరిగిన ఈ దుర్ఘటనలో ట్రాక్టర్ చెరువులోకి దూసుకెళ్లి 11 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 20 నుంచి 25 మంది భక్తులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.
VIDEO | Madhya Pradesh: At least nine devotees died after a tractor-trolley carrying idols of Goddess Durga for immersion on Vijayadashmi plunged into a lake in Khandwa district.#Khandwa #DurgaPuja2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/ipqVplGJus— Press Trust of India (@PTI_News) October 2, 2025
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దుర్ఘటన ఖండ్వా జిల్లా అర్దాలా గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గమ్మ విగ్రహ నిమజ్జనం కోసం చెరువుపై తాత్కాలిక వంతెనపై ఆపి ఉంచిన ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడటంతో అందులో ఉన్న వారందరూ నీటిలో మునిగిపోయారు. గురువారం సాయంత్రం 5:00 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. జేసీబీ సహాయంతో వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6:00 గంటల సమయానికి 11 మృతదేహాలను వెలికి తీశారు.
బాధితులను పంధానా ఆసుపత్రికి తరలించడానికి సంఘటనా స్థలంలో పది అంబులెన్స్‌లను మోహరించారు. జిల్లా కలెక్టర్ రిషబ్ గుప్తా, పోలీసు సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ రాయ్ సంఘటన స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రాణాలతో బయటపడిన ముగ్గురు పిల్లలను చికిత్స కోసం ఖాండ్వా ఆసుపత్రికి తరలించారు.