తల్లిదండ్రులకు శుభవార్త.. దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలు | Modi Government Approves Opening Of 57 New Kendriya Vidyalayas | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులకు శుభవార్త.. దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలు

Oct 1 2025 5:32 PM | Updated on Oct 1 2025 7:20 PM

Modi Government Approves Opening Of 57 New Kendriya Vidyalayas

న్యూఢిల్లీ, సాక్షి: తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలను (కేవీ) స్థాపించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ స్కూళ్ల నిర్మాణానికి కేంద్రం రూ. 5,863 కోట్లు కేటాయించింది.ఇందుకోసం రూ.5863కోట్లు కేటాయించనుంది. వాటిల్లో ఏడు కేంద్రియ విద్యాలయాల నిర్మాణం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో..మిగిలిన 50 కేవీ స్కూల్స్‌ వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అందుబాటులోకి రానున్నాయి.

తాజాగా కేంద్రం ప్రకటించిన 57కేవీ స్కూల్స్‌లలో ఇప్పటివరకు కేంద్రీయ విద్యాలయం లేని 20 జిల్లాల్లో కేంద్రం స్థాపించనుంది. మిగిలిన 14 అభివృద్ధి చెందాల్సిన (Aspirational) జిల్లాల్లో, నాలుగు ఎల్‌బ్ల్యూఈ (Left Wing Extremism) అంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో, మిగిలిన ఐదు విద్యాలయాలు ఈశాన్య రాష్ట్రాలు (NER),పర్వత ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చేలా కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ కొత్త కేంద్రియ విద్యాలయాలు 17 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్థాపించనుంది.  

దీంతో పాటు కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంచింది. 57 నూతన కేంద్రీయ విద్యాలయాలకు కేబినెట్‌  ఆమోదం తెలిపింది. ఆత్మ  నిర్భర భారత్ కింద పప్పు దినుసుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి కోసం రూ. 11,440 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ మొత్తాన్ని క్వాలిటీ సీడ్స్, ట్రైనింగ్, మౌలిక వసతుల పెంపు, పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెంపు , ధర స్థిరీకరణ నిధి తదితర అంశాలపై కేంద్రం ఖర్చు చేయనుంది.  

రబీ సీజన్లో  పంటలకు మద్దతు ధర కోసం రూ. 84,263 కోట్ల రూపాయలు కేటాయింపు. గోధుమకు రూ.2,585 రూపాయలు, బార్లీ రూ. 2150, శనగపప్పు రూ.5875,  ఎర్ర పప్పు  రూ.7000, ఆవాలు రూ. 6200, కుసుమ రూ. 6540 కేటాయించింది.  కలియ బోర్ నుంచి నుమాలీఘర్ సెక్షన్ మధ్య జాతీయ రహదారి నిర్మాణానికి రూ.6957 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపింది.  

బయో మెడికల్ రీసెర్చ్ కెరీర్ ప్రోగ్రాం ఫేజ్ 3 కి ఆమోదం తెలిపిన కేంద్ర క్యాబినెట్.. ఈ ప్రాజెక్టులో 1500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. వందేమాతరం గేయం 150 సంవత్సరాల ఉత్సవాలకు క్యాబినెట్ ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement