
వైఎస్సార్ జిల్లా: మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పీఏ ఖాజాను అరెస్ట్ చేసిన కేసులో పోలీసులకు కడప కోర్టు షాకిచ్చింది. స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసులో రిమాండ్ కోరతారా? అంటూ కడప మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే 41ఏ నోటీసులు ఇచ్చి విడుదల చేయాలని ఆదేశించారు ఈ క్రమంలోనే పోలీసుల తీరుపై మొట్టికాయలు వేశారు మెజిస్ట్రేట్. దాంతో ఖాజాను విడుదల చేశారు పోలీసులు.
సోషల్ మీడియాలో ఎమ్మెల్యే మాధవీరెడ్డి తీరును టీడీపీ సీనియర్ మహిళలు ఎండగట్టారు. ఇది సోషల్ మీడియాలో షేర్ కావడంతో దాన్ని అంజాద్ భాషా పీఏ ఖాజా షేర్ చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. దీన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి ఫిర్యాదు చేశారు. ఓవరాక్షన్, హైడ్రామా నడిపి ఖాజాను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించారు.
ఈ క్రమంలోనే కడప మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ కేసు చూసి కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేసిస మేజిస్ట్రేట్.. ఏదో ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తే అరెస్ట్ చేస్తారా? మళ్లీ రిమాండ్ కోరతారా? టూ మొట్టికాయలు వేసింది. ఇది స్టేషన్ బెయిల్ కేసని, 41 ఏ కింద నోటీసులు ఇచ్చి ఖాజాను విడుదల చేయాలని ఆదేశించింది దాంతో ఖాజాను విడుదల చేయడంతో పోలీసులతో పాటు శ్రీనివాసులురెడ్డికి షాక్ తగిలినట్లయ్యింది.