
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి: శు.నవమి ప.2.20 వరకు తదుపరి దశమి, నక్షత్రం: ఉత్తరాషాఢ పూర్తి (24 గంటలు) వర్జ్యం: ప.1.24 నుండి 3.04 వరకు, దుర్ముహూర్తం: ప.11.31 నుండి 12.21 వరకు, అమృత ఘడియలు: రా.11.25 నుండి 1.06 వరకు, మహర్నవమి.
సూర్యోదయం : 5.54
సూర్యాస్తమయం : 5.48
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం.... ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. బంధువుల నుంచి పిలుపు రావచ్చు. దైవదర్శనాలు.
వృషభం... వ్యవహారాలు కొంత మందగిస్తాయి. శ్రమ తప్పదు. నిర్ణయాలలో మార్పులు. దైవదర్శనాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.
మిథునం.... వ్యవహారాలలో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. అనారోగ్యం. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో గందరగోళం. ఆధ్యాత్మిక చింతన.
కర్కాటకం... నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. కార్యజయం. శుభవార్తలు. సోదరులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలలో లాభాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. కళాకారులకు పురస్కారాలు.
సింహం..... దూరపు బంధువుల కలయిక. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు కొంత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. వస్తులాభాలు.
కన్య.... ఆర్థిక ఇబ్బందులు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
తుల... వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. బంధువులతో తగాదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది..
వృశ్చికం... పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. విందువినోదాలు.
ధనుస్సు... పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. కుటుంబంలో మరిన్ని బాధ్యతలు తప్పవు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. తీర్థయాత్రలు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
మకరం... కొత్త విషయాలు తెలుస్తాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. కార్యజయం. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు. ఆస్తుల విషయంలో చిక్కులు తొలగుతాయి.
కుంభం... ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆరోగ్యసమస్యలు. మిత్రులతో అకారణంగా తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు.
మీనం... మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సమస్యలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం. కళాకారులకు సత్కారాలు.