పీఓకేలో పాక్‌ సైన్యం అరాచకం.. | Deadly Clashes In Pakistan-Occupied Kashmir, 12 Killed As Pakistani Army Opens Fire On Protesters, Watch Video Inside | Sakshi
Sakshi News home page

పీఓకేలో పాక్‌ సైన్యం అరాచకం..

Oct 2 2025 12:18 PM | Updated on Oct 2 2025 1:20 PM

Pakistan Army Over Action At POK

శ్రీనగర్‌: భారత సరిహద్దుల్లోని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో(POK) పాకిస్తాన్‌ సైన్యం రెచ్చిపోయింది. పీఓకేలో అరాచకం సృష్టించింది. పీవోకే ప్రజలు, ఆందోళకారులపై పాక్‌ సైన్యం(Pakistan Army) విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 12 మంది మృతి చెందారు. దాదాపు 200 మంది గాయపడినట్టు సమాచారం. పాక్‌ సైన్యం కాల్పులతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లో అవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ) నేతృత్వంలో కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. పీఓకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని తమ 38 డిమాండ్లను అమలు చేయాలని ఏఏసీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో, భారీ సంఖ్యలో ప్రజలు బయటకు వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు. తమ ప్రాథమిక హక్కులను పాకిస్తాన్‌ హరిస్తోందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే, పాక్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతుండడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాక్‌ పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించింది. ఇంటర్నెట్‌ను నిలిపివేసింది. ఈ నిరసనలతో మార్కెట్లు, దుకాణాలు, రవాణా సేవలు నిలిచిపోయాయి. ఈ ఉదయం ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. తమను అడ్డుకునేందుకు బ్రిడ్జిలపై ఉంచిన షిప్పింగ్ కంటైనర్లను నదిలోకి నెట్టేశారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిగాయి. ధిర్కోట్‌, ముజఫరాబాద్‌, బాఘ్‌, మిర్‌పుర్ ప్రాంతాల్లో పాక్‌ సైన్యం రెచ్చిపోయి కాల్పులకు తెగబడింది. దీంతో, 12 మంది పౌరులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఏఏసీ లీడర్ షౌకత్‌ నవాజ్‌ మిర్ పాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుత నిరసనలు ప్లాన్‌-ఏ అని, ఇంకా తమ వద్ద వేరే ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement