
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సన్నిహితుడు, బంగ్లాదేశ్ పరిశ్రమల శాఖ మాజీ మంత్రి నూరుల్ మాజిద్ మహమ్మద్ హుమాయున్ మృతిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన నూరుల్ మాజిద్ చేతికి హ్యాండ్‌కప్స్ బిగించి చికిత్స చేయడం వివాదాస్పదంగా మారింది.
అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నూరుల్ కన్నుమూయడం, ఆసమయంలో చేతికి బేడీలు ఫొటోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. దీంతో షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నేతలతో పాటు సామాన్య ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
షేక్ హసీనా ప్రధానిగా విధులు నిర్వహించే సమయంలో నూరల్ బంగ్లాదేశ్ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ ప్రభుత్వం నూరల్‌ను అదుపులోకి తీసుకుంది. 2024లో వివక్ష వ్యతిరేక ఉద్యమం సందర్భంగా జరిగిన దాడుల్లో నూరుల్ మాజిద్ పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. తాజాగా, నాటి కేసులకు సంబంధించి ఆయనను గత నెల 24న బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.
వయోభారం రిత్యా అరెస్టయిన స్వల్ప వ్యవధిలో పలుమార్లు ఆస్పత్రి పాలయ్యారు. ఈ క్రమంలో నూరుల్ మాజిద్ సోమవారం ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రి (డీఎంసీహెచ్) ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. జైలు కస్టడీలో నూరుల్ మాజిద్ మరణించాడని జైలు అధికారులు సైతం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆ ఫొటోలు సైతం బహిర్ఘతమయ్యాయి. నెట్టింట్లో వైరలైన ఫొటోల్లో నూరుల్ మజీద్ చేతికి బేడీలు ఉండడంపై యూనస్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. మానవ హక్కుల సంఘాలు, రాజకీయ నేతలు అమానుషమైన చర్యగా అభివర్ణిస్తున్నారు.
మరోవైపు,పోలీసు అధికారులు మాత్రం నూరుల్ మజీద్‌పై పలు కేసులు ఉన్నాయని.. పారిపోవడం, ఇతర ప్రమాదాలను నివారించేందుకు ఈ చర్య తీసుకున్నాం’అని పేర్కొన్నారు. కానీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని ఇలా బేడీలు వేయడం అవసరమా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి ఈ దుమారంపై యూనస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
Nurul Majid Mahmud Humayun, a 75-year-old veteran of Bangladesh’s 1971 Liberation War, former Industries Minister, and senior Awami League leader, passed away while undergoing treatment in jail custody at Dhaka Medical College Hospital (DMCH).
The day before his death, he was… pic.twitter.com/t582kBShJY— Mohammad Ali Arafat (@MAarafat71) September 30, 2025