ప్రధాన వార్తలు

ఈ నెల్లోనే భారత్-చైనాల మధ్య నేరుగా విమాన సర్వీసులు!
న్యూఢిల్లీ: కోవిడ్ సంక్షోభం, గల్వాన్ ఉద్రిక్తతలతో బీటువారిన చైనా, భారత్ బంధానికి భారతీయ విమానాలు మళ్లీ ఆకాశ మార్గాన స్నేహవారధి నిర్మించనున్నాయి. సుమారు ఇరుదేశాల మధ్య ఐదేళ్ల నుంచి ఆగిపోయిన భారత్, చైనా నేరుగా విమానసర్వీసులను అతి త్వరలో పునరుద్ధరించబడనున్నాయి. ఈ నెల చివరి నాటికి ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు పునరుద్ధరించే అవకాశం ఉంది. ఈ మేరకు భారత్-చైనాల మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎడాపెడా టారిఫ్‌ల మోత మోగించడంతో విసిగి పోయిన భారత్, చైనాలు మళ్లీ స్నేహగీతాన్ని ఆలపిస్తున్నాయి. అందులో భాగంగానే నేరుగా విమానసర్వీసుల పునర్‌ప్రారంభానికి శ్రీకారం చుట్టబోతున్నాయి.గల్వాన్ నుంచి గట్టిబంధం దిశగా2020 మేలో తూర్పు లద్దాఖ్‌లో ఇరు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తతకు బీజం పడింది. జూన్‌లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ముష్టిఘాతం, పిడిగుద్దులు, ఘర్షణ కారణంగా ఇరువైపులా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సరిహద్దు వెంట గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించి ఉద్రిక్తతలను మరింత పెంచారు. దీంతో భారత్, చైనా సత్సంబంధాలు అడుగంటాయి. పాస్‌పోర్ట్‌లు, దిగుమతులు, అనుమతులు మొదలు మరెన్నో రంగాల్లో సత్సంబంధానికి బీటలు పడ్డాయి.అయితే ట్రంప్ ఇష్టారీతిన విధించిన దిగుమతి సుంకాల భారంతో ఇబ్బందులు పడుతున్న భారత్, చైనాలు ఉమ్మడిగా ఈ సమస్యను పరిష్కరించుకుందామని భావిస్తున్నాయి. ఇందుకోసం మళ్లీ స్నేహగీతం పాడక తప్పని నెలకొంది. గత కొద్దినెలలుగా ఇందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చైనా జాతీయులకు పర్యాటక వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం గత నెలలో అంగీకారం తెలిపింది. దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటనకు సిద్ధపడ్డారు.చైనాతో బంధం బలపడాలని తాము కోరుకుంటున్నామని ఆదేశ పర్యటనను ఖరారుచేసి మోదీ సూచనప్రాయంగా చెప్పారు. భారత్ వంటి దేశాలపై టారిఫ్‌ను అమెరికా పెంచడాన్ని చైనా సైతం తీవ్రంగా పరోక్షంగా ఖండించింది. ఇలా నెమ్మదిగా బలపడుతున్న మైత్రీ బంధాన్ని నేరుగా విమానసర్వీసుల ద్వారా మరింత పటిష్టంచేయాలని భారత్ ఆశిస్తోంది. చివరిసారిగా మోదీ చైనాలో 2018 జూన్‌లో పర్యటించారు. ఆ తర్వాతి ఏడాది అక్టోబర్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించారు. ఇటీవల టియాన్జిన్లో జరిగిన 25వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన పలు కీలక అంశాలపై చర్చించారు: అందులో ఇరు దేశా మధ్య విమాన సర్వీసుల పునరుద్ధరణ అంశం ఒకటి.

తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం
విశాఖ: కళింగపట్నం వద్ద కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం నెమ్మదిగా పారాదీప్-గోపాల్పూర్ మధ్య తీరాన్ని దాటింది. ఈ విషయాన్ని ఐఎండీ స్పష్టం చేసింది. అయితే ఈ తీవ్ర వాయుగుండం బలహీనపడినా దీని ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుగుతుందని వెల్లడించింది. ఫలితంగా రేపు కూడా పలు ప్రాంత్లాఓ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తీరం దాటే సమయంలో 55 కి.మీ నుంచి 75 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి.కాగా, ఈ తీవ్ర వాయుగుండ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వాయుగుండ ప్రబావంతో సముద్రం అలజడిగా మారింది. మత్స్యకారులు వేటకు వెళ్ళ రాదని ఐఎండీ ముందుగానే హెచ్చరికలు పంపింది. ఉత్తరాంధ్రలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరక కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. గాలి వానకు భారీ చెట్లు నేలకొరిగాయి.పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ కుప్పకూలాయి. ద్వారకానగర్ రోడ్డులోని ఫార్చునర్ కారుపై చెట్టు కూలిపోయింది. కారు పార్క్ చేసి.. ఓనర్ షాపింగ్‌కు వెళ్లడంతో ప్రమాదం తప్పింది.

వందకు పైగా మావోయిస్టుల లొంగుబాటు
రాయ్‌పూర్: వివిధ కేడర్లకు చెందిన 100కు పైగా మావోయిస్టులు.. పోలీసులకు లొంగిపోయారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లాలో 103 మంది మావోయిస్టులు తమకు సరెండర్ అయినట్లు పోలీసులు స్పష్టం చేశారు. గురువారం( అక్టోబర్ 1వ తేదీ) తాము లొంగిపోతున్నట్లు తెలిపిన మావోయిస్టులు.. పారామిలటరీ అధికారులు, సీనియర్ పోలీసులు సమక్షంలో వీరు లొంగిపోయారు. ఆ మేరకు ఆయేధాలను విడిచిపట్టి సాధారణ సంఘ జీవితంలో కలిసి బ్రతకడానికి సిద్ధమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. లొంగిపోయిన వారంతా 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు వారే ఉన్నారని, వారు చేపట్టిన ఉద్యమాన్ని వదిలి సంఘ జీవితంలో కలిసే బ్రతుకుతామంటూ లొంగిపోయినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఆసుపత్రిలో అమానుష దృశ్యం.. మాజీ కేంద్ర మంత్రి మృతిపై దేశవ్యాప్తంగా నిరసనలు!
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సన్నిహితుడు, బంగ్లాదేశ్ పరిశ్రమల శాఖ మాజీ మంత్రి నూరుల్ మాజిద్ మహమ్మద్ హుమాయున్ మృతిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన నూరుల్ మాజిద్ చేతికి హ్యాండ్‌కప్స్ బిగించి చికిత్స చేయడం వివాదాస్పదంగా మారింది. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నూరుల్ కన్నుమూయడం, ఆసమయంలో చేతికి బేడీలు ఫొటోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. దీంతో షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నేతలతో పాటు సామాన్య ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షేక్ హసీనా ప్రధానిగా విధులు నిర్వహించే సమయంలో నూరల్ బంగ్లాదేశ్ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ ప్రభుత్వం నూరల్ను అదుపులోకి తీసుకుంది. 2024లో వివక్ష వ్యతిరేక ఉద్యమం సందర్భంగా జరిగిన దాడుల్లో నూరుల్ మాజిద్ పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. తాజాగా, నాటి కేసులకు సంబంధించి ఆయనను గత నెల 24న బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.వయోభారం రిత్యా అరెస్టయిన స్వల్ప వ్యవధిలో పలుమార్లు ఆస్పత్రి పాలయ్యారు. ఈ క్రమంలో నూరుల్ మాజిద్ సోమవారం ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రి (డీఎంసీహెచ్) ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. జైలు కస్టడీలో నూరుల్ మాజిద్ మరణించాడని జైలు అధికారులు సైతం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆ ఫొటోలు సైతం బహిర్ఘతమయ్యాయి. నెట్టింట్లో వైరలైన ఫొటోల్లో నూరుల్ మజీద్ చేతికి బేడీలు ఉండడంపై యూనస్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. మానవ హక్కుల సంఘాలు, రాజకీయ నేతలు అమానుషమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. మరోవైపు,పోలీసు అధికారులు మాత్రం నూరుల్ మజీద్‌పై పలు కేసులు ఉన్నాయని.. పారిపోవడం, ఇతర ప్రమాదాలను నివారించేందుకు ఈ చర్య తీసుకున్నాం’అని పేర్కొన్నారు. కానీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని ఇలా బేడీలు వేయడం అవసరమా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి ఈ దుమారంపై యూనస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. Nurul Majid Mahmud Humayun, a 75-year-old veteran of Bangladesh’s 1971 Liberation War, former Industries Minister, and senior Awami League leader, passed away while undergoing treatment in jail custody at Dhaka Medical College Hospital (DMCH).The day before his death, he was… pic.twitter.com/t582kBShJY— Mohammad Ali Arafat (@MAarafat71) September 30, 2025

దుర్గమ్మ నిమజ్జనోత్సవంలో పెను విషాదం.. 11 మంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. దుర్గమ్మ నిమజ్జనోత్సవంలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. దుర్గమ్మను నిమజ్జనానికి తీసుకెళ్తుండగా ట్రాక్టర్ చెరువులోకి దూసుకెళ్లింది. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో దుర్గమ్మ నిమజ్జనోత్సవం విషాదంగా మారింది. గురువారం జరిగిన ఈ దుర్ఘటనలో ట్రాక్టర్ చెరువులోకి దూసుకెళ్లి 11 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 20 నుంచి 25 మంది భక్తులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. VIDEO | Madhya Pradesh: At least nine devotees died after a tractor-trolley carrying idols of Goddess Durga for immersion on Vijayadashmi plunged into a lake in Khandwa district.#Khandwa #DurgaPuja2025 (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/ipqVplGJus— Press Trust of India (@PTI_News) October 2, 2025ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దుర్ఘటన ఖండ్వా జిల్లా అర్దాలా గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గమ్మ విగ్రహ నిమజ్జనం కోసం చెరువుపై తాత్కాలిక వంతెనపై ఆపి ఉంచిన ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడటంతో అందులో ఉన్న వారందరూ నీటిలో మునిగిపోయారు. గురువారం సాయంత్రం 5:00 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. జేసీబీ సహాయంతో వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6:00 గంటల సమయానికి 11 మృతదేహాలను వెలికి తీశారు. బాధితులను పంధానా ఆసుపత్రికి తరలించడానికి సంఘటనా స్థలంలో పది అంబులెన్స్‌లను మోహరించారు. జిల్లా కలెక్టర్ రిషబ్ గుప్తా, పోలీసు సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ రాయ్ సంఘటన స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రాణాలతో బయటపడిన ముగ్గురు పిల్లలను చికిత్స కోసం ఖాండ్వా ఆసుపత్రికి తరలించారు.

'కాంతార 1' రెమ్యునరేషన్స్.. ఈసారి ఎవరికి ఎంత?
దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత 'కాంతార' ఫ్రాంచైజీ నుంచి మరో సినిమా థియేటర్లలోకి వచ్చింది. అదే 'కాంతార ఛాప్టర్ 1'. తొలి పార్ట్ కంటే ఈసారి భారీ హంగులు, స్టోరీలో మరిన్ని ఎలిమెంట్స్ జోడించారు. దసరా కానుకగా అక్టోబరు 02న పాన్ ఇండియా లెవల్లో రిలీజైంది. అయితే ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ అయితే రాలేదు. కొందరు ప్రేక్షకులు ఆహా ఓహో అంటుండగా.. మరికొందరు మాత్రం ఓకే ఓకే అని అంటున్నారు.మరోవైపు తొలి పార్ట్ కేవలం రూ.15-20 కోట్లతో నిర్మిస్తే ఏకంగా రూ.400 కోట్ల వరకు కలెక్షన్ అందుకుంది. ఇప్పుడు మాత్రం భారీగా బడ్జెట్ పెట్టారు. ఏకంగా రూ.125 కోట్ల వరకు నిర్మాతలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే ప్రతి సీన్లోనూ రిచ్‌నెస్ కనిపించింది. అడవిలో సెట్ కావొచ్చు, బాంగ్రా రాజ్యం సెట్ కావొచ్చు స్క్రీన్‌పై అద్భుతంగా కనిపించాయి. కంటెంట్‌తో పాటు విజువల్స్, సెట్స్‌కి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు.(ఇదీ చదవండి: Kantara Review: 'కాంతార ఛాప్టర్ 1' సినిమా రివ్యూ)ఈ సినిమా రెమ్యునరేషన్ విషయానికొస్తే తొలి పార్ట్ కోసం హీరో, దర్శకుడిగా చేసినందుకు రిషభ్ శెట్టి అప్పట్లో కేవలం రూ.4 కోట్లు తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈసారి మాత్రం రూపాయి పారితోషికం తీసుకోకుండానే దాదాపు మూడేళ్ల పాటు కష్టపడ్డాడని అంటున్నారు. అలా అని ఫ్రీగా ఏం చేసేయలేదు. రిలీజ్ తర్వాత లాభాల్లో వచ్చే వాటాని తీసుకోవాలని ముందే నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నాడట.సినిమాలో రిషభ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య లీడ్ రోల్స్ చేశారు. వీళ్లందరికీ తలో రూ.కోటి వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. వీళ్లు తప్పితే అందరూ పెద్దగా పేరున్న యాక్టర్స్ అయితే కనిపించలేదు. అయితే సినిమాలో అటు రిషభ్ ఇటు రుక్మిణి వసంత్ యాక్టింగ్ జనాలకు బాగా నచ్చుతోంది. పబ్లిక్ టాక్‌లోనూ ఎక్కువ మంది వీళ్లిద్దరినే మెచ్చుకుంటుండటం విశేషం. (ఇదీ చదవండి: కొడుకుని పరిచయం చేసిన వరుణ్ తేజ్.. పేరు ఏంటంటే?)

అనాదిగా ధర్మానిదే విజయం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: గురువారం విజయ దశమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనాదిగా చెడుపై ధర్మానిదే విజయమనే సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుందని ప్రధాని పేర్కొన్నారు. విజయ దశమి రోజు ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. మంచి, ధర్మం అనేవి ఎల్లప్పుడూ చెడు, మోసాలను అధిగమిస్తాయన్నారు. ఈ పండుగ.. ధైర్యం, జ్ఞానం, భక్తి మొదలైనవాటిని జీవితంలో మార్గదర్శక శక్తులుగా స్వీకరించడానికి ప్రేరణనిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. विजयादशमी बुराई और असत्य पर अच्छाई और सत्य की विजय का प्रतीक है। मेरी कामना है कि इस पावन अवसर पर हर किसी को साहस, बुद्धि और भक्ति के मार्ग पर निरंतर अग्रसर रहने की प्रेरणा मिले। देशभर के मेरे परिवारजनों को विजयादशमी की बहुत-बहुत शुभकामनाएं।— Narendra Modi (@narendramodi) October 2, 2025ఈ పవిత్ర దినం మనల్ని సత్యం, ధర్మ మార్గంలో స్థిరంగా నిలిచేందుకు ప్రోత్సహిస్తుందని ప్రధాని అన్నారు. దసరా అంటే రావణుడిపై రాముడు సాధించిన విజయాన్ని గుర్తుచేసుకోవడమే కాకుండా, ప్రతికూలతలను జయించి న్యాయం, ధర్మాన్ని నిలబెట్టడానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. భారతీయులంతా ఒక పెద్ద జాతీయ కుటుంబంలోని సభ్యులుగా అభివర్ణించారు. ఇటువంటి పండుగలు ఐక్యతను బలోపేతం చేస్తాయని, ప్రజలను దగ్గర చేస్తాయని, దేశ సాంస్కృతిక స్ఫూర్తిని వ్యాపింపజేస్తాయని ప్రధాని పేర్కొన్నారు.గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. సోషల్ మీడియా ‘ఎక్స్’ పోస్టులో ఆయన.. ధైర్యం, సరళత అనేవి మనిషి మార్పునకు సాధనాలుగా ఎలా మారుతాయనేది గాంధీ చూపారని పేర్కొన్నారు. ప్రజలకు సాధికారత కల్పించడానికి సేవ, కరుణ ముఖ్యమైన సాధనాలని అన్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా విజయ్ ఘాట్‌లో ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. సమగ్రత, వినయం, దృఢ సంకల్పాల బలంతో భారతదేశాన్ని బలోపేతం చేసిన అసాధారణ రాజనీతిజ్ఞుడిగా ఆయనను ప్రధాని మోదీ ప్రశంసించారు.

టీడీపీ శ్రీనివాసులురెడ్డికి కడప కోర్టు షాక్
వైఎస్సార్ జిల్లా: మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పీఏ ఖాజాను అరెస్ట్ చేసిన కేసులో పోలీసులకు కడప కోర్టు షాకిచ్చింది. స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసులో రిమాండ్ కోరతారా? అంటూ కడప మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే 41ఏ నోటీసులు ఇచ్చి విడుదల చేయాలని ఆదేశించారు ఈ క్రమంలోనే పోలీసుల తీరుపై మొట్టికాయలు వేశారు మెజిస్ట్రేట్. దాంతో ఖాజాను విడుదల చేశారు పోలీసులు.సోషల్ మీడియాలో ఎమ్మెల్యే మాధవీరెడ్డి తీరును టీడీపీ సీనియర్ మహిళలు ఎండగట్టారు. ఇది సోషల్ మీడియాలో షేర్ కావడంతో దాన్ని అంజాద్ భాషా పీఏ ఖాజా షేర్ చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. దీన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి ఫిర్యాదు చేశారు. ఓవరాక్షన్, హైడ్రామా నడిపి ఖాజాను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే కడప మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ కేసు చూసి కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేసిస మేజిస్ట్రేట్.. ఏదో ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తే అరెస్ట్ చేస్తారా? మళ్లీ రిమాండ్ కోరతారా? టూ మొట్టికాయలు వేసింది. ఇది స్టేషన్ బెయిల్ కేసని, 41 ఏ కింద నోటీసులు ఇచ్చి ఖాజాను విడుదల చేయాలని ఆదేశించింది దాంతో ఖాజాను విడుదల చేయడంతో పోలీసులతో పాటు శ్రీనివాసులురెడ్డికి షాక్ తగిలినట్లయ్యింది.

చెలరేగిన బౌలర్లు.. రాణించిన కేఎల్ రాహుల్.. భారీ స్కోర్ దిశగా టీమిండియా
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో (West Indies) జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా (Team India) మంచి స్కోర్ దిశగా సాగుతుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (36; 7 ఫోర్లు), సాయి సుదర్శన్ (7) ఔట్ కాగా.. కేఎల్ రాహుల్ (Kl Rahul) (53), శుభ్‌మన్ గిల్ (18) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ తీశారు. విండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 41 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.విండీస్ ఇన్నింగ్స్‌లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్ కాకుండా అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయ్ హోప్ (26), ఖారీ పియెర్ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో జాన్ క్యాంప్‌బెల్ 8, తేజ్‌నరైన్ చంద్రపాల్ డకౌట్, జోమెల్ వార్రికన్ 8, జోహన్ లేన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్‌లో భారత వికెట్‌కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్‌లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: రుతురాజ్, ఇషాన్ కిషన్ విఫలం.. పోరాడుతున్న రజత్ పాటిదార్

పడిఉన్న రూ.80,000 కోట్లను పట్టించుకోండి..
డిపాజిట్లు, డివిడెండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర పొదుపు సాధనాలలో దాదాపు రూ.80,000 కోట్ల సొమ్ము.. ఎవరూ క్లెయిమ్ చేయకపోవడంతో అనామకంగా పడిఉంది. ఈ సొమ్మును దాని హక్కుదారులు, వారసులు గుర్తించి, తిరిగి పొందటానికి సహాయపడటానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది.యువర్ మనీ.. యువర్ రైట్కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అక్టోబర్ 4న గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 'యువర్ మనీ, యువర్ రైట్' అనే మూడు నెలల అవగాహన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్ఏ)తో ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) ఈ ప్రచారాన్ని సమన్వయం చేస్తోంది."బీమా పాలసీ క్లెయిమ్‌లు, బ్యాంక్ డిపాజిట్లు, డివిడెండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్ ఆదాయంతో సహా క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులు అవగాహన లేకపోవడం లేదా కాలం చెల్లిన ఖాతా వివరాల కారణంగా అన్‌క్లెయిమ్‌గా మిగిలిపోతున్నాయి. ప్రజలు ఆదా చేసే ప్రతి రూపాయిని వారు లేదా వారి చట్టపరమైన వారసులు, నామినీలు సముచితంగా క్లెయిమ్ చేసుకునేలా చూడటానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది" అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీలు), సంబంధిత ఫండ్ రెగ్యులేటర్లు అభివృద్ధి చేసిన తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్ఏక్యూలు) ద్వారా తమ సొమ్మును ఎలా గుర్తించాలో, క్లెయిమ్ చేయాలనే దానిపై ప్రజలకు స్పష్టమైన సమాచారాన్ని అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.డిజిటల్ క్లెయిమ్ ప్రక్రియకస్టమర్లు ఆర్బిఐకి చెందిన ఉద్గమ్ (UDGAM) పోర్టల్ ద్వారా అన్‌క్లెయిమ్ చేయని డిపాజిట్లను చెక్ చేయవచ్చు. అయితే క్లెయిమ్ ప్రక్రియను పూర్తి చేయడానికి వారు సంబంధిత బ్యాంకు శాఖను సందర్శించాలి. బ్యాంకులు చేపట్టబోయే ప్రతిపాదిత మార్పులు ఈ ప్రక్రియను డిజిటలైజ్ చేస్తాయి. ఆ తర్వాత ఆన్లైన్లో డిపాజిట్‌ను తిరిగి పొందటానికి అనుమతిస్తాయి.కాగా బ్యాంకింగ్ చట్టాల (సవరణ) చట్టం, 2025.. ప్రతి బ్యాంకు ఖాతాకు అంగీకరించిన నామినీల సంఖ్యను ఒకటి నుండి నలుగుకు పెంచింది. ఖాతా డార్మాంట్గా ఉంటే లబ్ధిదారులను సులభంగా గుర్తించడానికి అనుమతిస్తుంది. చట్టం ముఖ్య నిబంధనలు ఆగస్టు 1 నుండి అమల్లోకి వచ్చాయి.ఇదీ చదవండి: డీఏ పెరిగింది.. మరి జీతమెంత పెరుగుతుంది?
ఈ నెల్లోనే భారత్-చైనాల మధ్య నేరుగా విమాన సర్వీసులు!
SBI క్రెడిట్ కార్డులకు కొత్త మార్పులు.. ఛార్జీలు
తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం
టీసీఎస్‌లో తొలగించినవాళ్లకు రెండేళ్లు జీతం!
టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. కంచు కనకమాలక్ష్మి అప్డేట్!
ప్రపంచకప్‌లో స్వర్ణ పతకం గెలిచిన ఆంధ్రప్రదేశ్ షూటర్
వందకు పైగా మావోయిస్టుల లొంగుబాటు
ఓజీ డైరెక్టర్ కొత్త సినిమా.. ఆ టాలీవుడ్ స్టార్‌తోనే!
దుర్గమ్మ నిమజ్జనోత్సవంలో పెను విషాదం.. 11 మంది మృతి
థియేటర్లలో కాంతార ఛాప్టర్-1.. ఓటీటీల్లో ఏయే సినిమాలంటే?
ఆసీస్‌పై శ్రేయస్ అయ్యర్ విధ్వంసం.. 413 పరుగులు చేసిన భారత్
Kantara Review: 'కాంతార ఛాప్టర్ 1' సినిమా రివ్యూ
జియో 3 నెలల ప్లాన్: చౌకగా డైలీ 2జీబీ.. అన్లిమిటెడ్
కొనసాగుతున్న ఆసియా కప్ హైడ్రామా.. ట్రోఫీ తిరిగి ఇచ్చేందుకు షరతులు పెట్టిన నఖ్వీ
OG: ఆహా ఓహో అన్నా... చివరకి లేదుగా సాహో రేంజీ...
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన 'జూనియర్'
ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు సార్! ఎవరైనా పొలిటికల్ ఎనలిస్టుతో సర్వే చేయిస్తే పోలా?!
డైరెక్టర్ కార్తీక్ వర్మ నిశ్చితార్థంలో చైతూ-శోభిత (ఫొటోలు)
ఈసీ - ఆయుధ పూజ
పండుగ వేళ అమాంతం తగ్గిన బంగారం ధరలు: వెండి మాత్రం..
మనం కలిసి బతుకుదామా...
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. వాహన, గృహయోగాలు
ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనే ఎజెండా ఉంటే సరిపోతుందనుకుంటా!
నిర్మాత అశ్వనీదత్ మూడో కూతురి నిశ్చితార్థం
చినబాబు చెబితే అర్హత ఉండక్కర్లేదు!
దసరా వేడుకల్లో హద్దుమీరిన జంట.. వీడియో వైరల్
IND VS AUS: విధ్వంసకర శతకం.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
సినిమాలో చిన్న చేంజ్ సార్! విలన్‌గా ట్రంప్‌ని పెడదాం!
ఈ నెల్లోనే భారత్-చైనాల మధ్య నేరుగా విమాన సర్వీసులు!
SBI క్రెడిట్ కార్డులకు కొత్త మార్పులు.. ఛార్జీలు
తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం
టీసీఎస్‌లో తొలగించినవాళ్లకు రెండేళ్లు జీతం!
టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. కంచు కనకమాలక్ష్మి అప్డేట్!
ప్రపంచకప్‌లో స్వర్ణ పతకం గెలిచిన ఆంధ్రప్రదేశ్ షూటర్
వందకు పైగా మావోయిస్టుల లొంగుబాటు
ఓజీ డైరెక్టర్ కొత్త సినిమా.. ఆ టాలీవుడ్ స్టార్‌తోనే!
దుర్గమ్మ నిమజ్జనోత్సవంలో పెను విషాదం.. 11 మంది మృతి
థియేటర్లలో కాంతార ఛాప్టర్-1.. ఓటీటీల్లో ఏయే సినిమాలంటే?
ఆసీస్‌పై శ్రేయస్ అయ్యర్ విధ్వంసం.. 413 పరుగులు చేసిన భారత్
Kantara Review: 'కాంతార ఛాప్టర్ 1' సినిమా రివ్యూ
జియో 3 నెలల ప్లాన్: చౌకగా డైలీ 2జీబీ.. అన్లిమిటెడ్
కొనసాగుతున్న ఆసియా కప్ హైడ్రామా.. ట్రోఫీ తిరిగి ఇచ్చేందుకు షరతులు పెట్టిన నఖ్వీ
OG: ఆహా ఓహో అన్నా... చివరకి లేదుగా సాహో రేంజీ...
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన 'జూనియర్'
ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు సార్! ఎవరైనా పొలిటికల్ ఎనలిస్టుతో సర్వే చేయిస్తే పోలా?!
ఈసీ - ఆయుధ పూజ
పండుగ వేళ అమాంతం తగ్గిన బంగారం ధరలు: వెండి మాత్రం..
మనం కలిసి బతుకుదామా...
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. వాహన, గృహయోగాలు
నిర్మాత అశ్వనీదత్ మూడో కూతురి నిశ్చితార్థం
ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనే ఎజెండా ఉంటే సరిపోతుందనుకుంటా!
చినబాబు చెబితే అర్హత ఉండక్కర్లేదు!
దసరా వేడుకల్లో హద్దుమీరిన జంట.. వీడియో వైరల్
IND VS AUS: విధ్వంసకర శతకం.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
సినిమాలో చిన్న చేంజ్ సార్! విలన్‌గా ట్రంప్‌ని పెడదాం!
ఈ రాశి వారికి ధనలబ్ధి.. వ్యాపారాలు లాభిస్తాయి
సినిమా

రిషబ్ శెట్టి కాంతార ఛాప్టర్-1.. ఏ ఓటీటీకి రానుందంటే?
రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం కాంతార చాఫ్టర్-1(Kantara Chapter1). ఈ మూవీని బ్లాక్ బస్టర్ హిట్ కాంతారకు ప్రీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈరోజే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. తొలి రోజే ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ రిలీజైన తర్వాత ఏ ఓటీటీకి రానుందనే విషయంపై ఆసక్తి నెలకొంది.తాజాగా కాంతార ఛాప్టర్-1 ఓటీటీకి సంబంధించిన సినీ ప్రియులు సైతం నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ కుదుర్చుకున్న డీల్ ప్రకారం.. ఈ సినిమా ఆరు వారాల తర్వాతే ఓటీటీకి రానుందని టాక్ వినిపిస్తోంది. థియేటర్లలో వచ్చే రెస్పాన్స్ చూసి ఓటీటీ డేట్ రివీల్ చేయనున్నారు. అప్పటి వరకు కాంతార ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పదు.

'కాంతార 1' రెమ్యునరేషన్స్.. ఈసారి ఎవరికి ఎంత?
దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత 'కాంతార' ఫ్రాంచైజీ నుంచి మరో సినిమా థియేటర్లలోకి వచ్చింది. అదే 'కాంతార ఛాప్టర్ 1'. తొలి పార్ట్ కంటే ఈసారి భారీ హంగులు, స్టోరీలో మరిన్ని ఎలిమెంట్స్ జోడించారు. దసరా కానుకగా అక్టోబరు 02న పాన్ ఇండియా లెవల్లో రిలీజైంది. అయితే ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ అయితే రాలేదు. కొందరు ప్రేక్షకులు ఆహా ఓహో అంటుండగా.. మరికొందరు మాత్రం ఓకే ఓకే అని అంటున్నారు.మరోవైపు తొలి పార్ట్ కేవలం రూ.15-20 కోట్లతో నిర్మిస్తే ఏకంగా రూ.400 కోట్ల వరకు కలెక్షన్ అందుకుంది. ఇప్పుడు మాత్రం భారీగా బడ్జెట్ పెట్టారు. ఏకంగా రూ.125 కోట్ల వరకు నిర్మాతలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే ప్రతి సీన్లోనూ రిచ్‌నెస్ కనిపించింది. అడవిలో సెట్ కావొచ్చు, బాంగ్రా రాజ్యం సెట్ కావొచ్చు స్క్రీన్‌పై అద్భుతంగా కనిపించాయి. కంటెంట్‌తో పాటు విజువల్స్, సెట్స్‌కి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు.(ఇదీ చదవండి: Kantara Review: 'కాంతార ఛాప్టర్ 1' సినిమా రివ్యూ)ఈ సినిమా రెమ్యునరేషన్ విషయానికొస్తే తొలి పార్ట్ కోసం హీరో, దర్శకుడిగా చేసినందుకు రిషభ్ శెట్టి అప్పట్లో కేవలం రూ.4 కోట్లు తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈసారి మాత్రం రూపాయి పారితోషికం తీసుకోకుండానే దాదాపు మూడేళ్ల పాటు కష్టపడ్డాడని అంటున్నారు. అలా అని ఫ్రీగా ఏం చేసేయలేదు. రిలీజ్ తర్వాత లాభాల్లో వచ్చే వాటాని తీసుకోవాలని ముందే నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నాడట.సినిమాలో రిషభ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య లీడ్ రోల్స్ చేశారు. వీళ్లందరికీ తలో రూ.కోటి వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. వీళ్లు తప్పితే అందరూ పెద్దగా పేరున్న యాక్టర్స్ అయితే కనిపించలేదు. అయితే సినిమాలో అటు రిషభ్ ఇటు రుక్మిణి వసంత్ యాక్టింగ్ జనాలకు బాగా నచ్చుతోంది. పబ్లిక్ టాక్‌లోనూ ఎక్కువ మంది వీళ్లిద్దరినే మెచ్చుకుంటుండటం విశేషం. (ఇదీ చదవండి: కొడుకుని పరిచయం చేసిన వరుణ్ తేజ్.. పేరు ఏంటంటే?)

డైరెక్టర్‌గా జబర్దస్త్ కమెడియన్.. హీరోగా రాజ్ తరుణ్.. టీజర్ చూశారా?
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తోన్న తాజా చిత్రం చిరంజీవ(). ఈ సినిమాకు జబర్దస్త్ కమెడియన్.. అదిరే అభి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు.ఇవాళ దసరా సందర్భంగా చిరంజీవ టీజర్‌ను విడుదల చేశారు. తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే..మైథలాజికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శివ అనే పాత్రలో హీరో రాజ్ తరుణ్ కనిపించనున్నారు. నీ స్పీడుకు నువ్వు చేయాల్సిన జాబ్ ఏంటో తెలుసా?.. ఆంబులెన్స్ డ్రైవర్.. అనే డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సినిమాలో కుషిత హీరోయిన్గా కనిపించనున్నారు. ఈ చిత్రం ఆహా వేదికగా నవంబర్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. Chiranjeeva Meter lo chala Matter undhi 🧭#Chiranjeeva Premieres 7th Nov only on #aha#ChiranjeevaOnAha #AnAhaOriginalFilm pic.twitter.com/yknNbBuTGT— ahavideoin (@ahavideoIN) October 2, 2025

తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన శివజ్యోతి
బిగ్‌బాస్ ఫేమ్ శివజ్యోతి శుభవార్త చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది తనకు పిల్లాడు పుట్టబోతున్నాడని చెప్పి ఓ వీడియోని షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఈమెకు ఫ్రెండ్స్, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: కొడుకుని పరిచయం చేసిన వరుణ్ తేజ్.. పేరు ఏంటంటే?)తీన్మార్ వార్తలతో సావిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె అసలు పేరు శివజ్యోతి. కానీ సావిత్రిగానే చాలా ఫేమస్ అయింది. తెలంగాణలోని నిజామాబాద్ నాగంపేట ఈమె సొంతూరు. పదేళ్ల క్రితమే గంగూలీ అనే వ్యక్తిని ప్రేమించి, ఇంట్లో వాళ్లు నో చెప్పినా సరే పెళ్లి చేసుకుంది. అయితే బిగ్‌బాస్ 3వ సీజన్లో పాల్గొని మరింత ఫేమస్ అయింది. తర్వాత షోలు, యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ బాగానే సంపాదించింది. ఇప్పుడు తల్లి కాబోతున్న విషయాన్ని బయటపెట్టింది.'అందరికీ దసరా శుభాకాంక్షలు. ఆ ఏడుకొండల వెంకన్నస్వామి దయతో 2026లో మాకు బిడ్డ రాబోతుంది. మా పిల్లల కోసం ఎంతోమంది ఎంతగానం ఎదురు చేసిండ్రో. మీరు నాకు కావలిసినవాళ్లు. వాళ్ల సొంత అక్క బావకి బేబీ రావాలి అన్నంత గట్టిగా కోరుకున్నారు. ఇట్ల బిడ్డ అస్తుంది అని చెప్పగానే మా వాళ్ళు ఇచ్చిన రియాక్షన్ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. మీరు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయితరు అనుకుంటున్న. అందుకే చెపుతున్న పండుగ పూట ఈ ముచ్చట. దిష్టి పెట్టొద్దు. ఆశీర్వదం చాలు. ఈ బ్యూటీఫుల్ జర్నీలో సపోర్ట్ చేసినోళ్లను మర్చిపోను, బాధ పెట్టినళ్లోను కుడా మర్చిపోను' అని శివజ్యోతి రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: నిర్మాత అశ్వనీదత్ మూడో కూతురి నిశ్చితార్థం) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri)
న్యూస్ పాడ్‌కాస్ట్

స్టాప్‌గ్యాప్ ఫండింగ్ బిల్లును తిరస్కరించిన డెమొక్రాట్లు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలనలో సున్నా వడ్డీ ఔట్... మహిళలను మోసం చేసిన సీఎం చంద్రబాబు

రాజమండ్రి సెంట్రల్ జైల్ నుండి ఎంపీ మిథున్‌రెడ్డి విడుదల..ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వడంతో రిలీజ్

ఆసియా కప్ భారత్‌దే... ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయకేతనం

తమిళనాడులో ఘోరం, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ప్రచారంలో తొక్కిసలాట... 36 మంది మృతి, 25 మంది పరిస్థితి విషమం

తెలంగాణలో నేడే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్... బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

మెగాస్టార్ చిరంజీవిపై అసెంబ్లీ వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా నిలబడతాం... పార్టీ శ్రేణులకు అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా

హైకోర్టుకు ఆదేశాలు బేఖాతర్... ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా కార్యకర్త సవేంద్రరెడ్డి అక్రమ నిర్బంధం, ఆపై అక్రమ కేసు

ఏపీ శాసనమండలిలో కొనసాగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై చర్చకు పట్టు
క్రీడలు

IND vs WI 1st Test: పర్వాలేదనిపించిన జైస్వాల్.. నిరాశపరిచిన సాయి
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. 68 పరుగుల వద్ద జైస్వాల్ (Yashasvi Jaiswal) (36), 90 పరుగుల వద్ద సాయి సుదర్శన్ (Sai Sudarshan) (7) ఔటయ్యారు. జైస్వాల్ తన సహజ శైలిలో ధాటిగా ఆడి జేడన్ సీల్స్ బౌలింగ్‌లో షాయ్ హోప్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జైస్వాల్ ఈ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు బాదాడు. సాయి సుదర్శన్ విషయానికొస్తే.. మంచి ఫామ్‌లో ఉన్న ఇతను కేవలం 7 పరుగులే చేసి రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 26 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 92/2గా ఉంది. కేఎల్ రాహుల్ (40), శుభ్‌మన్ గిల్ (2) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 70 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.విండీస్ ఇన్నింగ్స్‌లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్ కాకుండా అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయ్ హోప్ (26), ఖారీ పియెర్ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో జాన్ క్యాంప్‌బెల్ 8, తేజ్‌నరైన్ చంద్రపాల్ డకౌట్, జోమెల్ వార్రికన్ 8, జోహన్ లేన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్‌లో భారత వికెట్‌కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్‌లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: IND VS WI 1st Test: ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన బుమ్రా

IND VS WI 1st Test: ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన బుమ్రా
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో ఇవాళ (అక్టోబర్ 2) మొదలైన తొలి టెస్ట్‌లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఓ ఆల్‌టైమ్ రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లతో చెలరేగిన అతను.. స్వదేశంలో అత్యంత వేగంగా 50 టెస్ట్ వికెట్లు తీసిన భారత ఫాస్ట్ బౌలర్‌గా జవగల్ శ్రీనాథ్ (javagal Srinath) రికార్డును సమం చేశాడు. బుమ్రా, శ్రీనాథ్ తలో 24 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించారు. ఈ జాబితాలో కపిల్ దేవ్ (25), ఇషాంత్ శర్మ (27), మొహమ్మద్ షమీ (27) బుమ్రా, శ్రీనాథ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. భారత బౌలర్లు చెలరేగడంతో 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.విండీస్ ఇన్నింగ్స్‌లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్ కాకుండా అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయ్ హోప్ (26), ఖారీ పియెర్ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో జాన్ క్యాంప్‌బెల్ 8, తేజ్‌నరైన్ చంద్రపాల్ డకౌట్, జోమెల్ వార్రికన్ 8, జోహన్ లేన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్‌లో భారత వికెట్‌కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్‌లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: IND vs WI: వారెవ్వా బుమ్రా.. మిస్సైల్లా దూసుకొచ్చిన బంతి! ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది

చెలరేగిన భారత బౌలర్లు.. 162 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న (India vs West Indies) తొలి టెస్టులో టీమిండియా (Team India) బౌలర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా పేసర్లు సిరాజ్ (Siraj), బుమ్రా (Bumrah) నిప్పులు చెరిగారు. వీరి ధాటికి వెస్టిండీస్ (West Indies) తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కుప్పకూలింది.సిరాజ్ 14 ఓవర్లలో 40 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా.. బుమ్రా 14 ఓవర్లలో 42 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. స్పిన్నర్లు కుల్దీప్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్ కాకుండా అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయ్ హోప్ (26), ఖారీ పియెర్ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో జాన్ క్యాంప్‌బెల్ 8, తేజ్‌నరైన్ చంద్రపాల్ డకౌట్, జోమెల్ వార్రికన్ 8, జోహన్ లేన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్‌లో భారత వికెట్‌కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్‌లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

వారెవ్వా బుమ్రా.. మిస్సైల్లా దూసుకొచ్చిన బంతి! ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది
జస్ప్రీత్ బుమ్రా.. యార్కర్లకు పెట్టింది పేరు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్, ఐపీఎల్ ఏ ప్లాట్‌ఫామ్ అయినా బుమ్రాను మించిన బౌలర్ మరొకరు లేరు. అతడు సంధించే బంతులు మిస్సైల్లా దూసుకొస్తాయి. బుమ్రా బౌలింగ్ చేస్తుంటే స్ట్రైక్‌లో ఉన్న బ్యాటర్ వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఇప్పుడు ఆ అనుభవం వెస్టిండీస్ బ్యాటర్ జస్టిన్ గ్రీవ్స్‌కు ఎదురైంది. అహ్మదాబాద్ వేదికగా విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బుమ్రా మ్యాజిక్ చేశాడు. విండీస్ తొలి ఇన్నింగ్స్ 39వ ఓవర్లో బుమ్రా వేసిన యార్కర్‌కు గ్రీవ్స్ వద్ద సమాధానమే లేకుండా పోయింది.ఆ ఓవర్లో ఆఖరిని బంతిని బుమ్రా అద్బుతమైన యార్కర్‌గా సంధించాడు. ఆఫ్ స్టంప్ దిశగా పడిన బంతిని బ్యాట్‌తో ఆపడంలో గ్రీవ్స్ విఫలమయ్యాడు. అతడు బ్యాట్ కిందకు దించడంలో ఆలస్యం కావడంతో 142.7 కి.మీ వేగంతో పడిన బంతిని ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. దెబ్బకు కరేబియన్ బ్యాటర్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా మొత్తంగా మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 162 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. సిరాజ్, బుమ్రాతో పాటు కుల్దీప్ రెండు, సుందర్ ఓ వికెట్ సాధించారు. విండీస్ బ్యాటర్లలో గ్రీవ్స్ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.Two fiery deliveries, two similar results 🔥🔥Jasprit Bumrah, you absolute beauty!#TeamIndia @IDFCfirstbank | @Jaspritbumrah93 pic.twitter.com/JNcPGJxK8I— BCCI (@BCCI) October 2, 2025
బిజినెస్

విదేశీ రుణం 747 బిలియన్ డాలర్లు
ముంబై: భారత్ విదేశీ రుణ భారం (ఎక్స్టర్నల్ డెట్) 2025 జూన్ నాటికి 747.2 బిలియన్ డాలర్లకు చేరింది. 2025 మార్చి నుంచి 11.2 బిలియన్ డాలర్లు పెరిగింది. జీడీపీలో విదేశీ రుణ భారం నిష్పత్తి మాత్రం 2025 మార్చి నాటికి ఉన్న 19.1 శాతం నుంచి 18.9 శాతానికి తగ్గినట్టు ఆర్బీఐ విడుదల చేసిన డేటా తెలియజేస్తోంది.డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం విదేశీ రుణ భారం అధికంగా పెరగడానికి దారితీసింది. ఈ ఏడాది మార్చి చివరి నుంచి జూన్ చివరికి రూపాయి మారకం విలువ ప్రభావాన్ని మినహాయించి చూస్తే నికరంగా పెరిగిన విదేశీ రుణ భారం 6.2 బిలియన్ డాలర్లుగానే ఉంది.మొత్తం విదేశీ రుణ భారంలో స్వల్పకాల రుణం 18.3 శాతం నుంచి 18.1 శాతానికి తగ్గింది. మొత్తం విదేశీ రుణ భారంలో డాలర్ రూపంలో తీసుకున్నది 53.8 శాతంగా ఉంది. రూపాయి మారకంలో రుణ భారం 30.6 శాతం, యెన్ రూపంలో 6.6 శాతం, సింగపూర్ డాలర్ రూపంలో 4.6 శాతం, యూరో మారకం రూపంలో 3.5 శాతం చొప్పున ఉంది.

ఇదే జరిగితే.. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా మస్క్!
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk).. దాదాపు అర ట్రిలియన్ డాలర్ల నికర విలువను సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్స్ ట్రాకర్ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి.. ఇప్పుడు 500.1 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నారు. ఈయన నికర విలువ ఒరాకిల్ కో ఫౌండర్ లారీ ఎల్లిసన్ కంటే 150 బిలియన్ డాలర్లు ఎక్కువ.దక్షిణాఫ్రికాలో జన్మించిన బిలియనీర్ ఎలాన్ మస్క్.. సంపద అతని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా (Tesla)తో ముడిపడి ఉంది. సెప్టెంబర్ 15 నాటికి అతను 12.4 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 3:30 గంటల నాటికి టెస్లా షేర్లు దాదాపు 4 శాతం పెరిగాయి. దీంతో మస్క్ సంపదకు 9.3 బిలియన్ డాలర్లు యాడ్ అయ్యాయి. ఇలా కంపెనీ స్టాక్ వాల్యూ ఎప్పటికప్పుడూ పెరుగుతూ ఉండటం వల్ల.. మస్క్ సంపద కూడా పెరుగుతూనే ఉంది.డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. మస్క్ టెస్లా షేర్స్ భారీగా పెరిగాయి. కాగా కంపెనీ ఇప్పుడు ఏఐ స్టార్టప్ ఎక్స్ఏఐ, స్పేస్ఎక్స్ కంపెనీలను కూడా విస్తరించడానికి సన్నద్ధమవుతోంది. ఇది కూడా మస్క్ సంపదను మరింత పెంచే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఆ పాస్‌పోర్ట్‌తో అమెరికాలో సమస్యలు!: కెనడా హెచ్చరికపిచ్బుక్ డేటా ప్రకారం, ఎక్స్ఏఐ జూలై నాటికి 75 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉంది. అదే సమయంలో స్పేస్ఎక్స్ విలువ 400 బిలియన్ డాలర్లు (బ్లూమ్‌బెర్గ్ ప్రకారం). మస్క్ సంపద ఇదే వృద్ధి రేటుతో కొనసాగితే.. 2023 మార్చి నాటికి ఆయన ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ కాగలరని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది.

పండుగ వేళ అమాంతం తగ్గిన బంగారం ధరలు: వెండి మాత్రం..
భారీగా పెరుగుతూ ఉన్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. విజయదశమి సందర్భంగా గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరలలో మార్పులు జరిగాయి. వెండి ధరలు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. ఈ కథనంలో నేటి (అక్టోబర్ 02) గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ ఎలా ఉందో తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

ఆ పాస్‌పోర్ట్‌తో అమెరికాలో సమస్యలు!: కెనడా హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరిలో వైట్ హౌస్‌కు తిరిగి వచ్చిన తరువాత.. తన ప్రారంభ ప్రసంగంలో "పురుషుడు & స్త్రీ అనే రెండు లింగాలు మాత్రమే ఉన్నాయని" ప్రకటించినప్పటి నుంచి ట్రాన్స్‌జెండర్స్, బైనరీయేతర వ్యక్తులపై చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కెనడా ప్రభుత్వం తమ పాస్‌పోర్ట్‌లలో నాన్బైనరీ 'ఎక్స్' లింగ హోదాతో పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న పౌరులకు హెచ్చరిక జారీ చేసింది.ఎక్స్ లింగ హోదాతో పాస్‌పోర్ట్‌లను కలిగిఉన్న వారు యునైటెడ్ స్టేట్స్కు వెళితే.. ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందని కెనడా ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం 'ఎక్స్' జెండర్ ఐడెంటిఫైయర్‌తో పాస్‌పోర్ట్‌లను జారీ చేసినప్పటికీ.. ఇది ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు తెచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.ఇదీ చదవండి: అమెరికా వీడిన భారతీయ యువతి.. కన్నీటి వీడ్కోలుకెనడా 2019లో పాస్‌పోర్ట్‌లపై 'ఎక్స్' ఎంపికను ప్రవేశపెట్టింది. ఫెడరల్ డేటా ప్రకారం.. జనవరి నాటికి దాదాపు 3,600 మంది కెనడియన్లు దీనిని ఎంచుకున్నారు. కెనడా మాత్రమే కాకుండా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ దేశాలు కూడా ఎక్స్ జెండర్ పాస్‌పోర్ట్‌లను జరీ చేస్తోంది. కానీ యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ 'ఎక్స్' జెండర్ ఐడెంటిఫైయర్‌తో పాస్‌పోర్ట్‌ల జారీని నిలిపివేసింది. కాగా ఈ విధానం అమలులోకి రాకుండా కోర్టు నిషేధం విధించింది.
ఫ్యామిలీ

స్త్రీ శక్తే విజయ దశమి..
అమ్మవారిని తొమ్మిది రోజులు పూజిస్తే, ఏడాదంతా శుభప్రదంగా... జయకరంగా ఉంటుందని శాస్త్రోక్తి. బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు త్రిమూర్తులనీ, వారికి సృష్టిస్థితి లయకారులనీ పేరు. వీరు ముగ్గురూ తామే ఆ కార్యక్రమాలని నిరాటంకంగా చేసేస్తున్నారా అంటే వారికి విలువ, అస్తిత్వం ఆధిక్యమనేవి తమ తమ భార్యల వల్లనే కలుగుతున్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే బ్రహ్మకి గుడి, పూజలు లేకపోయినా, ఆయన నోట దాగిన ఆ సరస్వతి కారణంగానే ఆయనను పూజిస్తారు.అదేతీరుగా శ్రీహరికి గుర్తింపూ విలువా లక్ష్మీదేవి వల్లనే. శ్రీవేంకటేశ్వరుడు కన్పించేది కూడా ఎనలేని విలువైన ఐశ్వర్యం వెనుకనే. ఆయన్ని భక్తజనం కొలిచేది కూడా ఐశ్వర్యం కోసమే. అంటే కేవలం ధనం కోసమే కాదు... అది పదవి, అధికారం, జీవితానికి సంబంధించి లేదా ధనానికి సంబంధించిన వాటికోసం అదేవిధంగా శక్తి లేని శివుడు ఏ ప్రయోజనాన్నీ చేకూర్చలేడట. అందుకే అర్ధనారీశ్వర రూపంలో ఆయన ఉన్నాడు. కేవలం తమ తమ భార్యల ద్వారా గుర్తింపు ఈ త్రిమూర్తులకీ ఉండడమే కాదు– తమ తమ భర్తలకు కష్టం వచ్చినప్పుడు రక్షించి ఒడ్డెక్కించింది కూడా తమ తమ భార్యలే. అందుకే వీరికి త్రిశక్తులని పేరు. ఈ త్రి శక్తి దేవతల సమష్టి పండగే విజయ దశమి.జమ్మిచెట్టును ఎందుకు పూజిస్తారు? శ్లోకం: శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియ దర్శనంజమ్మి చెట్టును సంస్కృతంలో శమీవృక్షం అంటారు. త్రేతాయుగంలో శ్రీరాముడు శమీ పూజ చేసి లంకకు వెళ్లి విజయం సాధించాడని రామాయణ గాథ చె΄్తోంది. అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్లేటపుడు తమ ఆయుధాలను, ధనుర్బాణాలను శవాకారంలో మూటలా కట్టి ఆ మూటను శమీవృక్షం పై ఉంచి తాము అజ్ఞాత వాసం వీడే వరకు వాటిని జాగ్రత్తగా కాపాడాలని జమ్మి చెట్టుకు నమస్కరించి వెళ్ళారట. తిరిగి అజ్ఞాత వాసం వీడిన అనంతరం జమ్మిచెట్టుకు పూజలు చేసి చెట్టు పై నుండి ఆయుధాలు తీసుకుని యుద్ధంలో కౌరవులను ఓడించారని మహా భారతకథ చెపుతోంది. నాటి నుండి నేటి వరకు విజయ దశమి రోజున శమీ వృక్షాన్ని పూజిస్తే అపజయం ఉండదని అందరి నమ్మకం. విజయ దశమి రోజున నక్షత్ర దర్శన సమయాన జమ్మిచెట్టు వద్ద అపరాజితా దేవిని పూజించి పైన పేర్కొన్న శ్లోకం చదివి చెట్టుకు ప్రదక్షిణ చేసిన తరువాత ఆ చెట్టు ఆకులు తెంపుకుని పెద్ద వారికి ఇచ్చి దండం పెట్టి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇది నేటికీ ఆనవాయితీగా కొనసాగుతోంది.ఆయుధ పూజలోని ఆంతర్యం?అజ్ఞాతవాస ముగింపులో విజయ దశమి నాడు పాండవ మధ్యముడు విజయుడు జమ్మిచెట్టు మీదున్న ఆయుధాలను బయటికి తీసి పూజచేసి ఉత్తర గోగ్రహణ యుద్ధాన్ని చేసి దిగ్విజయుడైనాడు. కనుక ఆశ్వీయుజ శుద్ధ దశమి విజయదశమి అయింది. ఆరోజున దుర్గాదేవి, అర్జునుడు విజయం సాధించారు కనుక ప్రజలు తమకు జీవనాధారమైన పనిముట్లకు కృతజ్ఞతా పూర్వకంగా పూజలు చేసి తమ జీవితం విజయవంతం కావాలని అమ్మవారిని వేడుకుంటారు. ఇదే ఆయుధపూజ. విద్యార్థులు పాఠ్య పుస్తకాలను, ఇతరులు తమ వృత్తికి సంబంధించిన పుస్తకాలను పూజలో పెట్టడం ఆనవాయితీ. ఉత్తరాయణంలో అక్షరాభ్యాసం కాని పిల్లలకు ఈ రోజున అక్షరాభ్యాసం చేయడం, ఏదైనా కొత్త అంశాలను ఆరంభించడం ఈనాటి ఆచారాలలో ఒకటి. పాలపిట్ట దర్శనం ఎందుకు?పురాణ గాథల్లోకి వెళితే పాండవులు అరణ్య, అజ్ఞాత వాసాలను ముగించుకుని తిరుగు ప్రయాణమై తమ రాజ్యానికి వెళుతున్న సమయంలో వారికి పాలపిట్ట దర్శనం కావడం జరిగిందని, నాటి నుండి వారి కష్టాలు తొలగిపోయి కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించడంతోపాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందారట. అందుకే పాండవులకు కలిగిన శుభాలు పాలపిట్టను చూస్తే అందరికి కలుగుతాయని ప్రజల నమ్మకం. అందుకే విజయ దశమి రోజు లపిట్ట దర్శనం కోసం గ్రామాల్లో సాయంత్రం వేళ జమ్మి పూజ అనంతరం పంట పొలాల వైపు ప్రజలు ఆడ, మగ తండోపతండాలుగా వెళతారు. పాలపిట్ట దర్శనం చేసుకుని ఆనందంగా ఇళ్లకు చేరుకుంటారు. – డి.వి.ఆర్.(చదవండి: వెయ్యేళ్ల నాటి ఆలయం..! ఇక్కడ దుర్గమ్మకు రక్తం చిందించని బలి..)

పాలపిట్టలు.. ప్రాకృతిక శోభలు
దసరా అంటే ఆయుధాల పూజ మాత్రమే కాదు బంతి పూల సింగడీ పూజ. లేఎండ తగిలిన పచ్చగడ్డి భూతల్లికి వేసే ఆవిరి ధూపం. మెట్ట ప్రాంతాల సౌరభం. స్త్రీలు ఎర్రమట్టితో అలికే ఇంటి ముంగిలి కళ. చెరువులు నిండి, వాగులు పొంగే కాలం. ప్రతి ఊరిలో పట్టనలవిగాని సంబరం... ‘దసరా’ గురించి వాగ్గేయకారుడు గోరటి వెంకన్న చెబుతున్న విశేషాలు.దసరా పండుగ మా దక్షిణ తెలంగాణ లో గొప్పగా జరుపుకుంటాం. దుందుభి, కృష్ణ నదుల నడిమధ్యన ఉండే ప్రాంతం మాది. చిన్నప్పుడు దసరా వస్తే ఊళ్లో ‘అమ్మా వినవే జామి’... అని జమ్మిచెట్టు మీద కట్టిన జానపద పాటలు స్త్రీల నోటి నుంచి వినిపించేవి. జమ్మి చెట్టు మీద పాండవులు ఆయుధాలు దాచడం, వాటిని కిందకు దించాక అర్జునుడు యుద్ధం చేసి గెలవడం ఈ విరాట పర్వం అంతా ప్రజలకు ఇష్టంగా మారిన గాథ. అందుకే దసరాకు పాడుకుంటారు. దసరా సమయంలో యక్షగానం ఊరూరా ఉంటుంది. కొన్ని చోట్ల శశిరేఖా పరిణయం ఆడతారు. దసరా పండుగ ప్రాకృతిక శోభ నిండి ఉన్నప్పుడు వస్తుంది. భూమాత వానకు తడిసి, ఎండ తగలడం వల్ల అంత తడిగా, పొడిగా కాకుండా మెత్తగా ఉంటుంది. వేరుశనగ బుడ్డలు అప్పుడప్పుడే గింజ గట్టి పడుతూ ఉంటాయి. జొన్న, సజ్జ, రాగి, కంది పొలాలు పంటతో మురిసి పోతూ ఉంటాయి. అలసందలు ఆ సమయంలోనే కోతకు వస్తాయి. పెసర, బీర తీగలు, కాకర పాదులు, చిక్కుడు చెట్లు కళకళలాడుతుంటాయి. నా చిన్నప్పుడు మాకున్నది మూడు నాలుగు ఎకరాలే అయినా మా చేనులో చిన్న గుడిసె ఉంటే అక్కడే ఉండేవాణ్ణి. పంటలు పండిన పొలాల మీదకు గువ్వలు వస్తాయి. వాటిలో పాలపిట్టను చూసి సంతోషపడేది. పండగ రోజు మాత్రమే కాదు.. ఆ సీజన్లో ఎప్పుడు పాల పిట్ట కనపడినా ఎంతో సంతోషం కలుగుతుంది. దానిని చూడటం శుభకరం అని భావిస్తారు. దసరా నాటికి వానలు పడి చెరువులు నిండి ఉంటాయి. వాగులు పారుతుంటాయి. చేపలు ఎదురెక్కుతుంటాయి. నల్ల తుమ్మలు నిండుగా గాలికి ఊగుతుంటాయి. వలస పక్షులు వాలుతాయి. పండగ సమయంలో దేవతలు, యక్షులు పక్షుల రూపంలో వచ్చి వాలుతాయని అనుకునేది. అందుకే ‘తిప్ప తీగల వీణ మీటుతూ రాగమాలికలు పాడే పిట్టలు’ అని రాశాను. తెలంగాణలో దసరా పండగకు తప్పనిసరిగా ఆడబిడ్డలను పదిరోజుల ముందే తీసుకు వస్తారు. స్త్రీలు ఎర్రమట్టి తెచ్చి ఇల్లంతా సుందరంగా అలుక్కుంటారు. ఆ ఎర్రమన్ను తెచ్చుకునే సమయంలో స్త్రీలు కదిలి వస్తుంటే చూసి పిల్లలందరం పండగ కళ రాబోతున్నదని కేరింతలు కొట్టేవాళ్లం. దసరా సమయానికే సీతాఫలం చెట్లు విరగకాసి ఉంటాయి. మా చిన్నప్పుడు వాటిని కాల్చుకుని తినడం గొప్ప ఆహారం. ఎన్ని తినేవారమో లెక్కే లేదు. దసరా అంటే పూల పండగ. సమయంలో ఊరిలో, ఇళ్లలో, పొలాల గట్ల మీద బంతి పూలు పూస్తాయి. వాటిని తెచ్చి మామిడాకులు, పోక పూలు అన్ని కలిపి ప్రతి ఇంటి దర్వాజాలకు, ద్వారబంధాలకు కళాత్మకంగా కట్టి శోభను తీసుకు వస్తారు. దసరా అంటే బరిలో గెలిచిన ఆయుధ పూజ మాత్రమే కాదు బంతిపూల సింగడి పూజ. దసరా సమయంలో నేలంతా రకరకాల గడ్డి మొలిచి ఉంటుంది. ఎండ తగిలినప్పుడు సూర్యకిరణాల తాపంతో వీటి నుంచి సన్నటి ఆవిరి లేచి భూతల్లికి ధూపం వేసినట్టు ఉంటుంది. ఆ గడ్డి మీదుగా వీచే గాలిలోని వాసన ఎంతో అద్భుతంగా ఉంటుంది. పండగ రోజు జమ్మి కోసం వెళ్లడం... దానికి బండ్లు కట్టడం అదో ఉత్సవం. నా చిన్నప్పుడు నా స్నేహితులు నాగయ్య, మల్లయ్య, బుచ్చయ్య, అంజయ్య, కూర్మయ్య మా మేనమామ నరసింహయ్య మేమందరం తప్పనిసరిగా కలిసేవాళ్లం. మేం మాత్రమే కట్టుగా ఉండి పొలాల వెంట తిరిగేవాళ్లం. ఈ కాలంలోనే ఈత కల్లు మొదలవుతుంది. నురగ పడుతది. దసరా పండగలో తినడం, సంతోషంగా గడపడం ప్రజలకు కొత్త ఉత్సాహం ఇస్తుంది. దసరా దశ దిశలా సంతోషాలు తెచ్చే పండుగ.

హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 బిలియనీర్లు.. కళ్లు చెదిరే విషయాలు
2025లో భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య 358కి పెరిగింది. M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 తాజా నివేదిక ప్రకారం గత సంవత్సరంతో పోలిస్తే 24మంది కొత్త బిలియనీర్లు జాబితాలో చేరారు. 13 ఏళ్ల క్రితం హురున్లిస్ట్ మొదలైనప్పటి నుండి భారతదేశ బిలియనీర్ల సంఖ్య ఆరు రెట్లు పెరిగి 350కి చేరుకుంది. ఈ జాబితాలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలుM3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 లిస్టలో చోటు సంపాదించుకున్న వారు ధనవంతులు రోజుకు 1,991 కోట్ల సంపదను ఆర్జించారు.2025లో టాప్ 10 మంది మొత్తం సంపద జాబితాలోని మిగిలిన జాబితాలో 28 శాతానికి సమానం. ఒక్క ముఖేష్ అంబానీ , గౌతమ్ అదానీ సంపదే మొత్తం సంపదలో 12శాతం ఉందని ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. రూ.9.55 లక్షల కోట్ల (USD 105 బిలియన్లు) సంపదతో, ముఖేష్ అంబానీ & కుటుంబం అత్యంత ధనవంతులైన భారతీయుడిగా నిలిచారు. గౌతమ్ అదానీ & కుటుంబం రూ.8.15 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉంది.M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 సంచిత సంపద INR 167 లక్షల కోట్లు. ఇది వార్షిక ప్రాతికపదికన ఇది 5 శాతం పెరుగుదల. ఇది స్పెయిన్ GDP కంటే ఎక్కువ . భారతదేశ GDPలో దాదాపు సగానికి సమానం.సుంకాల ఎదురుదెబ్బ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో M3M హురున్ ఇండియా రిచ్ లిస్టర్ల సగటు సంపద 10,320 కోట్ల 9,850 కోట్లకు తగ్గింది.నీరాజ్ బజాజ్ & కుటుంబం సంపద రూ. 2.33 లక్షల కోట్లు పెరిగి, నాలుగు స్థానాలు ఎగబాకి 6వ స్థానానికి చేరుకుంది.మరో విధంగా చెప్పాలంటే, బజాజ్ గ్రూప్‌కు చెందిన నీరాజ్ బజాజ్ & కుటుంబం ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు, 69,875 కోట్లు పెరిగి వారి సంపద 2.33 లక్షల కోట్లకు చేరుకుంది.చెన్నైలో జన్మించిన పెర్ప్లెక్సిటీ వ్యవస్థాపకుడు అరవింద్ శ్రీనివాస్, INR 21,190 కోట్ల సంపదతో 2025 M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో బిలియనీర్‌గా అరంగేట్రం చేశారు. జాబితాలో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ కూడా ఆయనే.రోష్ని నాడార్ మల్హోత్రా & కుటుంబం రూ. 2.84 లక్షల కోట్ల సంపదతో టాప్ 3లో అడుగుపెట్టారు, భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళగా నిలిచారు. రోష్ని నాడార్ టాప్ 10లో అతి పిన్న వయస్కురాలు కూడా.జాబితాలో ఉన్న పద్దెనిమిది మంది లక్ష కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నారు. గత సంవత్సరం కంటే ఆరుగురు ఎక్కువ. పదేళ్ల క్రితం దశాబ్దం ఇద్దరు మాత్రమే ఉన్నారు.హురున్ ఇండియా యునికార్న్ & ఫ్యూచర్ యునికార్న్ లిస్ట్ 2025 నుండి అరవై ఐదు మంది యునికార్న్ వ్యవస్థాపకులు—13 మంది గజెల్( Gazelle founders) వ్యవస్థాపకులు , 5 మంది చీతా వ్యవస్థాపకులు (Cheetah founders)M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో చోటు సంపాదించారు.

పండుగ పూట పెట్టెతో సహా గోల్డ్ కొట్టేసింది..! వీడియో వైరల్
బంగారం ధరలు రోజురోజుకి ఆకాశాన్నంటుతున్నాయి.కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతూ సామాన్యుడికి అందని ద్రాక్షగా మిగిలిపోతోంది పసిడి. గ్రాము బంగారం కొనాలంటే జనం బెంబేలెత్తుతున్న పరిస్ఙతి. ఈ క్రమంలో ట్విటర్లో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది.ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని ఒక జ్యుయల్లరీ దుకాణంలో ఒక మహిళ తన చేతివాటి చూపించింది. బంగారం షాపింగ్ చేస్తున్నట్టుగానే నటిస్తూ లక్షలు విలువ చేసే నగను పెట్టెతో సహా దాచేసింది. కానీ విషయం షాపులోనే ఉన్న కెమెరానుంచి మాత్రం తప్పించు కోలేక పోయింది. ఒక ట్విటర్ యూజర్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. బంగారం ధరలు గ్రాముకు రూ 12 వేలు దాటేసింది. ఇలాంటి దొంగతనాలు బాగా పెరిగే అవకాశం ఉంది... ఆభరణాలు కొనుగోలు చేసేవారు ఎప్పుడూ లేనంతగా అప్రమత్తంగా ఉండాలి! అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. 🚨 With gold prices soaring past ₹12k/gram, theft cases are bound to spike...Jewellers must stay more alert than ever!#UttarPradesh | Bulandshahr: Woman caught on camera stealing..stuffs an entire jewellery box inside her saree 👇 pic.twitter.com/5FRxWAQrA0— Nabila Jamal (@nabilajamal_) October 1, 2025
ఫొటోలు


జ్యూవెలర్లీ ఎగ్జిబిషన్.. తళుక్కుమన్న స్టార్ హీరోయిన్స్ (ఫొటోలు)


ఫ్యామిలీతో అనసూయ దసరా సెలబ్రేషన్స్ (ఫొటోలు)


మహాత్మునికి, లాల్ బహదూర్ శాస్త్రికి ప్రధాని మోదీ నివాళులు (ఫొటోలు)


నివేదా థామస్ చీరలో చాలా సింపుల్‌గా (ఫొటోలు)


మహిషాసుర మర్దినిగా బెజవాడ దుర్గమ్మ దర్శనం (ఫొటోలు)


తెలంగాణ డీజీపీగా శివధర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ (ఫొటోలు)


ఫారిన్ వెకేషన్‌లోనే సాయిపల్లవి.. ఊరికి రాలే! (ఫొటోలు)


ఫెస్టివ్ మూడ్..ప్రెటీ శారీ..ఫన్నీ కాప్షన్ ప్లీజ్అంటున్న ఈ భామను చూశారా? (ఫొటోలు)


'గూఢచారి 2' హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)


పెళ్లి ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్ అవికా గోర్ (ఫొటోలు)
అంతర్జాతీయం

గ్రీన్ కార్డు ఇంటర్వ్యూ మరింత కఠినం
వాషింగ్టన్: అమెరికాలో ఉంటున్న వేలాదిమంది భారతీయులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రీన్ కార్డ్ పైనా ట్రంప్ ప్రభుత్వం దృష్టిపడింది. ఇటీవలే భారతీయులు ఎక్కువగా ఉపయోగించుకునే హెచ్1బీ వీసాపై కఠిన చర్యలను ప్రకటించడం తెల్సిందే. ఇప్పుడిక గ్రీన్‌కార్డు దరఖాస్తుదారుల ఇంటర్వ్యూ ప్రక్రియలో కఠినతరమైన నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఇంటర్వ్యూల పరిధి మరింత విస్తృతం కానుంది. పరీక్ష కూడా కఠినంగా మారనుంది. దరఖాస్తుదారుల సత్ప్రవర్తనపై ఇమిగ్రేషన్ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేపడతారు. కొత్త విధానం ఈ నెల 20వ తేదీ నుంచే అమల్లోకి రానుండటం గమనార్హం. అమెరికా విలువలను పూర్తిగా స్వీకరించే వారు మాత్రమే పౌరులయ్యేలా చూడటమే ఈ మార్పుల లక్ష్యమని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) చెబుతోంది. ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా హోమ్‌ల్యాండ్ డిఫెండర్స్ పేరుతో అధికారులను కూడా నియమిస్తోంది. అయితే, దరఖాస్తు దారులకు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి రెండంటే రెండు అవకాశాలు మాత్రమే ఉంటాయి. రెండో ప్రయత్నంలో విఫలమైతే వారికి పౌరస త్వాన్ని తిరస్కరిస్తారని తెలిపింది. అమెరికా లో ఒక వ్యక్తిని శాశ్వత నివాసి అని చూపే అధికారిక గుర్తింపు పత్రమే గ్రీన్ కార్డ్. హోల్డర్లను అధికారికంగా చట్టబద్ధమైన శాశ్వత నివాసులుగా పిలుస్తారు. ఈ విధానం సమగ్రతను స్థాపించడమే తాజా మార్పుల లక్ష్యమని యూఎస్సీఐఎస్ అంటున్నప్పటికీ, వలసదారుల ఉద్దేశాలను సందేహించే అవకాశం ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పౌరశాస్త్ర పరీక్ష. కొత్తగా ప్రవేశపెట్టే ఈ పరీక్షలో దరఖాస్తుదారులకు అమెరికా చరిత్ర, ప్రభుత్వంపై ఉన్న అవగాహనను అంచనా వేస్తారు. మొత్తం 128 ప్రశ్నల నుంచి దరఖాస్తుదారులు 20 ప్రశ్నలను ఎన్నుకుని 12 ప్రశ్నలకు సమాధానం సరిగ్గా ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో 10 ప్రశ్నల్లో ఆరింటికి సరైన సమాధానం ఇవ్వాల్సి ఉండేది. ఈ పరీక్షతోపాటు అభ్యర్థుల సత్ప్రవర్తనను ఇమిగ్రేషన్ అధికారులు అంచనా వేయడం కూడా కఠినతరమైందే. కేవలం నేర రహిత ప్రవర్తన ఉంటే చాలదు. అమెరికా సమాజానికి సానుకూలంగా చేసిన మేలును కూడా చూస్తారు. ఇందులో, 1991 నుంచి వారి చుట్టుపక్కల వారిని సైతం విచారిస్తారు. దరఖాస్తుదారులు తెలిసిన సహ ఉద్యోగులు, సంబంధిత సంస్థల యజమానులు, ఇతరులను కూడా ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూలు చేసి, ప్రవర్తనను బేరీజు వేస్తారు. ఇందులోనూ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండొచ్చు. దీని వల్ల భారతీయులపై ప్రత్యేకంగా వివక్ష చూపే అవకాశముందన్న ఆందోళనలు వ్యక్తమవుతు న్నాయి. అమెరికాలోని వలసదారుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. వేలాది మంది భారతీయులకు గ్రీన్‌కార్డు ఉంది. పెద్ద సంఖ్యలో భారతీయులు ఎన్నో ఏళ్లుగా ఈ ‘పచ్చకార్డు’కోసం ఎదురు చూస్తున్నారు. 2024 గణాంకాల ప్రకారం అమెరికా పౌరుల్లో 6.1 శాతం, అంటే 49,700 మంది భారతీయులున్నారు. ఈ విషయంలో అమెరికాకు పొరుగునున్న మెక్సికో మొదటిస్థానంలో నిలిచింది.

అమెరికాలో షట్‌డౌన్
వాషింగ్టన్: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో మరో అలజడి మొదలైంది. కీలకమైన స్టాప్‌గ్యాప్ ఫండింగ్ బిల్లుకు సెనేట్‌లో ఆమోదం లభించలేదు. విపక్ష డెమొక్రటిక్ పార్టీ సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. గడువు ముగిసినా బిల్లు నెగ్గకపోవడంతో ట్రంప్ ప్రభుత్వం దేశంలో షట్‌డౌన్ ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఇది అమల్లోకి వచ్చింది. దీంతో అత్యవసరం కాని ప్రభుత్వ సేవలు, కార్యకలాపాలు నిలిచిపోయాయి. పెద్ద సంఖ్యలో ఫెడరల్ ఉద్యోగులను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు. ‘బుధవారం తెల్లవారుజాము 00:01 గంటల’ను సూచించే టైమర్ చిత్రాన్ని ‘డెమొక్రటిక్ షట్‌డౌన్’ పేరిట వైట్‌హౌస్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అమెరికాలో 1981 తర్వాత ఇది 15వ షట్‌డౌన్ కాగా, గత ఏడేళ్లలో ఇది రెండోసారి. చాలావరకు ఈ షట్డౌన్లు కేవలం కొన్ని రోజులపాటే కొనసాగాయి. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు 2018 డిసెంబర్లో షట్‌డౌన్ ప్రకటించారు. దేశ సరిహద్దుల్లో గోడ నిర్మాణం కోసం భారీగా నిధులు ఖర్చు చేయడానికి సెనేట్ అంగీకరించలేదు. ఫలితంగా షట్‌డౌన్ అమల్లోకి వచ్చింది. 35 రోజులపాటు కొనసాగింది. ఆధునిక అమెరికా చరిత్రలో ఇదే అత్యధిక కాలం కొనసాగిన షట్‌డౌన్ కావడం గమనార్హం. 2013లో బరాక్ ఒబామా ప్రభుత్వ హయాంలో 16 రోజులపాటు షట్‌డౌన్ కొనసాగింది. ఆరోగ్య ప్రయోజనాలపైనే ప్రతిష్టంభన ప్రభుత్వ పరిపాలనకుగాను స్వల్పకాలానికి (ఈ ఏడాది నవంబర్ 21వ తేదీ దాకా) నిధులు విడుదల చేసేందుకు ఉద్దేశించినదే స్టాప్‌గ్యాప్ ఫండింగ్ బిల్లు. దీన్ని షార్ట్–టర్మ్ గవర్నమెంట్ స్పెండింగ్ బిల్లు అని కూడా అంటారు. త్వరలో గడువు తీరిపోనున్న ఆరోగ్య ప్రయోజనాలను పొడిగించాలని డెమొక్రాట్లు పట్టుబట్టగా, అధికార రిపబ్లికన్లు తిరస్కరించారు. ఈ అంశాన్ని ప్రత్యేకంగా పరిగణించాలని, బిల్లులో చేర్చడానికి వీల్లేదని తేలి్చచెప్పారు. ఆరోగ్య ప్రయోజనాలను పొడిగిస్తే ప్రభుత్వ ఖజానాపై పెనుభారం పడుతుందని స్పష్టంచేశారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని సూచించారు. దాంతో సెనేట్‌లో బిల్లుకు విపక్ష డెమొక్రాట్లు సుముఖత వ్యక్తంచేయలేదు. అమెరికా కాంగ్రెస్ ఉభయసభల్లో ట్రంప్ పారీ్టకి మెజార్టీ ఉన్నప్పటికీ.. సెనేట్‌లో మెజార్టీ లేకపోవడంతో స్టాప్‌గ్యాప్ ఫండింగ్ బిల్లు నెగ్గలేదు. షట్‌డౌన్ ముగించడంపై ఓటింగ్ విఫలం షట్‌డౌన్‌ను తక్షణమే ముగించడానికి బుధవారం సెనేట్‌లో ఓటింగ్ నిర్వహించారు. డెమొక్రాట్లు అంగీకరించకపోవడంతో ఓటింగ్ విఫలమైంది. ఆరోగ్య రంగానికి సబ్సిడీలు ఇవ్వాలని, అందుకు నిధులు కేటాయించాలన్న తమ డిమాండ్ పట్ల వారు వెనక్కి తగ్గలేదు. ఇదిలా ఉండగా, తాజా షట్‌డౌన్ ఎన్నిరోజులు కొనసాగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇప్పుడేం జరగొచ్చు? → షట్‌డౌన్ విధించిన నేపథ్యంలో అత్యవసర సేవల్లో ఉన్న ఉద్యోగులు మాత్రమే విధుల్లో కొనసాగుతారు. అయితే, షట్ డౌన్ ముగిసేదాకా వారికి వేతనాలు చెల్లించరు. → అత్యవసర సేవల్లో లేని సిబ్బందిని విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తారు. 7.50 లక్షల మందిని తొలగించే అవకాశం ఉంది. వారికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిహారం రోజుకు 400 మిలియన్ డాలర్ల దాకా ఉండొచ్చని అంచనా. → ఎఫ్‌బీఐ, సీఐఏ అధికారులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, ఎయిర్‌పోర్టు సిబ్బంది, హోంల్యాండ్సెక్యూరిటీ అధికారులు యథావిధిగా విధుల్లో కొనసాగుతారు. సైనిక దళాలు ఎప్పటిలాగే పనిచేస్తాయి. → సోషల్ సెక్యూరిటీ చెల్లింపులకు ఆటంకాలు ఉండవు. ఆరోగ్య బీమాపై వైద్య సేవలు పొందవచ్చు. ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తాయి. → పోస్టల్ సర్వీసులు కొనసాగుతాయి. → తమ సిబ్బందిలో 90 శాతం మందిని తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు అమెరికా విద్యాశాఖ ప్రకటించింది. → మ్యూజియంలు, జంతు ప్రదర్శనశాలలు, జాతీయ ఉద్యానవనాలు మూతపడుతున్నాయి.

పాక్ దళాల కాల్పుల్లో ఎనిమిది మంది నిరసనకారులు మృతి
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుసగా మూడవ రోజు జరిగిన హింసాత్మక నిరసనల్లో బుధవారం ఎనిమిది మంది పౌరులు మరణించారు. బాగ్ జిల్లాలోని ధిర్‌కోట్‌లో నలుగురు మృతిచెందారని, ముజఫరాబాద్‌లో ఇద్దరు, మీర్పూర్లో ఇద్దరు మృతిచెందారని ఎన్డీటీవీ తెలిపింది. మరణించిన నిరసనకారుల సంఖ్య 10కి చేరుకుందని అధికారవర్గాలు తెలిపాయి.‘ప్రాథమిక హక్కుల ఉల్లంఘన’పై అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో గత 72 గంటలుగా భారీ నిరసనలు జరగడంతోపాటు మార్కెట్లు, దుకాణాలను పూర్తిగా మూసివేశారు. రవాణా సేవలను కూడా నిలిపివేశారు. దీంతో జనజీవనం అతలాకుతలయ్యింది. బుధవారం ఉదయం నిరసనకారులు ముజఫరాబాద్‌లో షిప్పింగ్ కంటైనర్లపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో పలువులు నిరసరకారులు మృతి చెందారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జనం అటు పాకిస్తాన్ ప్రభుత్వం, ఆ దేశ ఆర్మీకి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాల తరబడి కొనసాగుతున్న దోపిడీ, పేదరికానికి వ్యతిరేకంగా అక్కడి జనం తిరగబడుతున్నారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీ ఈ ఉద్యమాలను అణిచివేస్తోంది. అయితే ప్రజలు మరింతగా తిరగబడుతున్నారు. ఆర్మీ, పోలీసులపై దాడులు చేస్తున్నారు. ఆర్మీ వాహనాలను నదుల్లోకి విసిరేస్తున్నారు.గత రెండు రోజులుగా ప్రజలు సైన్యం-పోలీసులకు ఎదురుతిరుగుతున్నారు. పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 10 మందికి పైగా మరణించినట్లు సమాచారం. వందలాది మంది గాయపడ్డారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ అల్లర్లను కవర్ చేసేందుకు అక్కడి మీడియాకు అనుమతినివ్వడం లేదు. 70 ఏళ్లుగా తమను అణిచివేసి, తమ వనరుల్ని కొల్లగొడుతున్నారని, తమ ప్రాథమిక హక్కుల్ని హరిస్తున్నారని నిరసనకారులు అంటున్నారు. అక్టోబర్ 1న పీఓకేలోని ముజఫరాబాద్ వరకూ లాంగ్ మార్చ్ చేపడతామని నిరసనకారులు ప్రకటించారు.

Gaza: ఆహారానికి బదులుగా లైంగిక దోపిడీ.. భయానక స్థితిలో మహిళలు
గాజా: యుద్ధంతో అట్టుడికిపోతున్న గాజాలో దుర్భర పరిస్థితులు తాండవిస్తున్నాయి. అక్కడి ప్రజలు సహాయం కోసం నిరంతరం ఎదురు చూస్తున్నారు. ఆహార కొరత, ఉద్యోగాలు కనుమరుగు కావడం లాంటివి ఇక్కడి జనాభాను తీవ్రంగా కుంగదీశాయి. దీనిని అనువుగా మలచుకున్న కొందరు పురుషులు సహాయం మాటున లైంగిక దోపిడీకి పాల్పడుతున్నారని స్థానిక మహిళలు చెబుతున్నారు.ఆరుగురు పిల్లల కోసం..దక్షిణ గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యునిస్‌లోని ఛారిటీ కిచెన్ నుండి ఆహారాన్ని అందుకునేందుకు ఎదురుచూస్తున్న మహిళలు తమ దుర్భర స్థితిని ‘అసోసియేటెడ్ ప్రెస్’ ముందు వెళ్లగక్కారు. తన ఆరుగురు పిల్లలకు ఆహారం అందించేందుకు వారాల తరబడి ఎదురు చూశానని 38 ఏళ్ల ఒక తల్లి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించింది. ఒక వ్యక్తి తనకు సేవా సంస్థలో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చాడని, తరువాత అతను ఒక ఖాళీ అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లాడని తెలిపింది. దీంతో తాను అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని అనుకున్నానని, అయితే తాను ఆహారం కోసం అతను చెప్పినట్లు చేయల్సి వచ్చిందని తెలిపారు. తరువాత అతను కొంత నగదు, ఆహారం ఇచ్చాడని, దీంతో పిల్లల ఆకలి తీర్చానని ఆమె వివరించింది. అయితే అతను చెప్పినట్లు ఉద్యోగం ఇవ్వలేదని పేర్కొంది. ఆహారానికి బదులుగా కొందరు పురుషులు లైంగిక దోపిడీకి ఎలా పాల్పడుతున్నారనే దానికి ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది.సర్వసాధారణంగా లైంగిక దోపిడీ గాజాలో సహాయం అందిస్తున్న సంఘాలు మానవ హక్కుల న్యాయవాదులు ఇటువంటి ఘటనలు ఇక్కడ సర్వసాధారణంగా మారిపోయాయన్నారు. దక్షిణ సూడాన్ నుండి హైతీ వరకు యుద్ధ భూముల్లో ఇలాంటివి నిత్యం కనిపిస్తున్నాయన్నారు. మానవతా సంక్షోభాలు ప్రజలను అనేక విధాలుగా దుర్బలంగా మారుస్తాయనేది భయంకరమైన వాస్తవమని హ్యూమన్ రైట్స్ వాచ్‌లోని మహిళా హక్కుల విభాగం అసోసియేట్ డైరెక్టర్ హీథర్ బార్ పేర్కొన్నారు. గాజాలో మహిళలు, బాలికలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నారు. సహాయం అందుకునే నేపధ్యంలో లైంగిక దోపిడీకి గురైన కొందరు మహిళలకు చికిత్స చేసినట్లు పాలస్తీనియన్ మనస్తత్వవేత్తలు తెలిపారు. లైంగిక దోపిడీకి గురైన మహిళల్లో కొందరు గర్భవతులయ్యారన్నారు.పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులు35 ఏళ్ల ఒక వితంతువువు ఒకరు మీడియాతో మాట్లాడుతూ సహాయక స్థలంలో యూనిఫాంలో ఉన్న ఒక వ్యక్తి తనకు ఒక నంబర్ ఇచ్చి, అర్థరాత్రి ఫోన్ చేశాడని తెలిపారు. దీనిపై తాను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, వారు కాల్ రికార్డింగ్స్ అవసరమని చెప్పారని, తాను వాటిని అందించలేకపోయానని ఆమె తెలిపింది. కాగా గత ఏడాది గాజాలో 18 లైంగిక వేధింపుల ఆరోపణలను నమోదు చేసినట్లు పీఎస్ఈఏ నెట్వర్క్ తెలిపింది. మరో ఉదంతంలో 29 ఏళ్ల ఒక తల్లి తన నలుగురు పిల్లలకు ఆహారం అందించేందుకు బదులుగా ఒక సహాయ కార్యకర్త తనను వివాహం చేసుకోవాలని వేధించాడని ఆరోపించింది. తాను అందుకు నిరాకరించానని పేర్కొంది.
జాతీయం

మహాత్మునికి, శాస్త్రిజీకి ప్రధాని మోదీ నివాళులు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత ఆదర్శాలు మానవ చరిత్ర గమనాన్ని మార్చాయని ప్రధాని పేర్కొన్నారు. Gandhi Jayanti is about paying homage to the extraordinary life of beloved Bapu, whose ideals transformed the course of human history. He demonstrated how courage and simplicity could become instruments of great change. He believed in the power of service and compassion as… pic.twitter.com/LjvtFauWIr— Narendra Modi (@narendramodi) October 2, 2025సోషల్ మీడియా ‘ఎక్స్’ పోస్టులో ఆయన.. ధైర్యం, సరళత అనేవి మనిషి మార్పునకు సాధనాలుగా ఎలా మారుతాయనేది గాంధీ చూపారని పేర్కొన్నారు. ప్రజలకు సాధికారత కల్పించడానికి సేవ, కరుణ ముఖ్యమైన సాధనాలని అన్నారు. వీక్షిత భారత్‌ను నిర్మించాలనే మా ఆశయంలో మేము ఆయన మార్గాన్ని అనుసరిస్తూనే ఉంటామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.#WATCH | Delhi: Prime Minister Narendra Modi pays tribute to former PM Lal Bahadur Shastri at Vijay Ghat on his birth anniversary.(Source: DD) pic.twitter.com/OnrZU1aAdY— ANI (@ANI) October 2, 2025మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా విజయ్ ఘాట్‌లో ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. సమగ్రత, వినయం, దృఢ సంకల్పాల బలంతో భారతదేశాన్ని బలోపేతం చేసిన అసాధారణ రాజనీతిజ్ఞుడిగా ఆయనను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆయన ఆదర్శప్రాయమైన నాయకత్వం, మహోన్నత వ్యక్తిత్వం, ఆయన ఇచ్చిన ‘జై జవాన్ జై కిసాన్’ నినాదం ప్రజల్లో దేశభక్తిని రగిలించాయన్నారు. స్వావలంబన కలిగిన భారతదేశాన్ని నిర్మించే ప్రయత్నంలో ఆయన మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

RSS Utsav: మతం అడిగి కాల్చిచంపారు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
నాగ్‌పూర్: పహల్గామ్లో ఉగ్రదాడికి పాల్పడ్డ ముష్కరులు భారతీయులను మతం(ధర్మం) ఏమిటని అడిగి కాల్చిచంపారని, ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, అనంతరం దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన దరిమిలా ప్రభుత్వం, సైన్యం తీవ్రంగా ప్రతిస్పందించి ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పిందన్నారు.ఆర్ఎస్ఎస్ శతాబ్ది విజయదశమి వేడుకల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ నేడు, మన దేశంలో వైవిధ్యం విభజనలకు కారణమవుతోందని, అయినా మనమంతా ఒక్కటేనని, వైవిధ్యం అనేది ఆహారం, జీవన పరిస్థితులకే పరిమితమన్నారు. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం సరైనది కాదని, ఇలాంటి అరాచకత్వాన్ని ఆపాలన్నారు. విజయదశమి సందర్భంగా ఆయన హిందూ ఐక్యత గురించి మాట్లాడారు. వ్యవస్థీకృత హిందూ సమాజం భద్రతకు హామీనిస్తుందన్నారు. గత 100 ఏళ్లుగా హిందువులను ఏకం చేయడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కృషి చేస్తోందని అన్నారు.మహాకుంభ్‌తో ఐక్యతా తరంగాలుమహారాష్ట్రలోని నాగపూర్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది విజయదశమి వేడుకలను ఉద్దేశించి మోహన్ భగవత్ ప్రసంగించారు. పహల్గామ్ దాడి, నక్సలైట్ల అంశాలను ఆయన ప్రస్తావించారు. పహల్గామ్ దాడి దరిమిలా సైన్యం పూర్తి సన్నద్ధతతో ప్రతిస్పందించిందని ఆయన అన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన భారీ మహాకుంభ్ గురించి ప్రస్తావిస్తూ.. ఇది భారతదేశం అంతటా ఐక్యతా తరంగాలను విడుదల చేసిందన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆర్ఎస్ఎస్లో కుల వివక్ష లేదు: రామ్ నాథ్ కోవింద్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘1991 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆర్ఎస్ఎస్, దాని స్వచ్ఛంద సేవకులను కలిసే అవకాశం లభించిందని, ఆర్ఎస్ఎస్ లో ఏ విధమైన కుల వివక్ష లేదన్నారు. 2001లో ఎర్రకోట సమీపంలో జరిగిన దళిత సంగం ర్యాలీలో కొంతమంది వాజపేయిని దళిత వ్యతిరేకిగా దుయ్యబట్టారని, అయితే అప్పుడు తాము అంబేద్కరిస్టులమని ఆయన సమాధానం చెప్పారన్నారు. తాను రాష్ట్రపతి పదవిని నిర్వర్తించేటప్పుడు, రాజ్యాంగ విలువలకు, బాబా సాహెబ్ ఆశయాలకు ప్రాధాన్యత ఇచ్చానన్నారు. ఈ ఏడాది ఆర్ఎస్ఎస్ తన 100వ వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రత్యేక తపాలా బిళ్ల, స్మారక నాణేన్ని విడుదల చేశారు.1925లో విజయదశమి వేళ..నాగపూర్ చేరుకున్న మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 1956లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించిన దీక్షా భూమిని సందర్శించారు. కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ 1925లో విజయదశమి నాడు 17 మంది సమక్షంలో ఆర్ఎస్ఎస్ను స్థాపించారు. 1926, ఏప్రిల్ 17న జరిగిన సమావేశంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనే పేరును నిర్ణయించారు. ప్రస్తుతం జరుగుతున్న ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో 21 వేల స్వచ్ఛంద సేవకులు పాల్గొంటున్నారు.విదేశీ అతిథులు హాజరువిజయదశమి నాడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆయుధ పూజ నిర్వహించారు. కాగా ఘనా, ఇండోనేషియాకు చెందిన అతిథులు కూడా ఆర్ఎస్ఎస్ విజయదశమి వేడుకలలో పాల్గొంటున్నారు. దక్షిణ భారత కంపెనీ డెక్కన్ గ్రూప్‌కు చెందిన లెఫ్టినెంట్ జనరల్ రాణా ప్రతాప్ కాలిత్, కేవీ కార్తీక్,బజాజ్ గ్రూప్‌కు చెందిన సంజీవ్ బజాజ్ హాజరయ్యారు. ఘనా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, థాయిలాండ్,యూకే, యుఎస్ఎలకు చెందిన ప్రతినిధులను ఆర్ఎస్ఎస్ ఈ వేడుకలకు ఆహ్వానించింది.

రోడ్డు ప్రమాదాల్లో 1.97 లక్షల మంది బలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రహదారులు రక్త సిక్తమవుతున్నాయి. ఏటా లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల రూపంలో మృత్యువు ఒడి కి చేరుతున్నారు. 2023 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా జరిగిన వివిధ ట్రాఫిక్ ప్రమాదా ల్లో ఏకంగా 1,97,871 మంది ప్రాణాలు కోల్పోయారని జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. ‘యాసిడెంటల్ డెత్స్–సూసైడ్స్ ఇన్ ఇండియా 2023’పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2022తో పోలిస్తే 2023లో మొత్తం ట్రాఫిక్ ప్రమాదాల సంఖ్య 4,72,467 నుంచి 4,91,190కి పెరిగింది. ఈ ప్రమాదాల్లో 4,51,228 మంది గాయపడ్డారు.రోడ్డు ప్రమాదాలే అధికంమొత్తం ట్రాఫిక్ ప్రమాదాల్లో అత్యధికం రోడ్డు ప్రమాదాలే ఉన్నాయి. 2023లో 4,64,029 రోడ్డు ప్రమాదాలు జరగగా, వీటిలో 1,73,826 మంది మరణించారు. వీటితో పాటు 24,678 రైల్వే ప్రమాదాల్లో 21,803 మంది, 2,483 రైల్వే క్రాసింగ్ ప్రమాదాల్లో 2,242 మంది చనిపోయారు. రాష్ట్రాల వారీగా చూస్తే, ట్రాఫిక్ ప్రమాద మరణాల్లో ఉత్తరప్రదేశ్ (28,103), తమిళనాడు (20,279), మహారాష్ట్ర (18,879) మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ మూడు రాష్ట్రాలు కలిపి దేశంలోని మొత్తం ట్రాఫిక్ మరణాలలో 34% వాటాను కలిగి ఉన్నాయి. 2023లో తెలంగాణలో మొత్తం 23,673 ట్రాఫిక్ ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల కారణంగా 8,435 మంది మరణించారు. వీటిలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలే ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 22,903 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా, వీటిలో 7,660 మంది మృత్యువాత పడ్డారు.అతివేగమే యమపాశంరోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మితిమీరిన వేగమేనని నివేదిక స్పష్టం చేసింది. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 61.4% అంటే 2,84,733 కేసులు అతివేగం వల్లనే జరిగాయి. రోడ్డు ప్రమాద మరణాల్లో 58.6% అంటే, 1,01,841 మంది అతివేగం కారణంగానే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదకరమైన/నిర్లక్ష్యపు డ్రైవింగ్ లేదా ఓవర్ టేకింగ్ కారణంగా 23.7% ప్రమాదాలు, 1,10,064 కేసుల్లో, 41,035 మంది, అంటే 23.6% మరణించారు. మద్యం/డ్రగ్స్ సేవించి వాహనాలు నడపడం వల్ల 3,688 మంది మృత్యువాత పడ్డారు.ద్విచక్ర వాహనదారులే ఎక్కువప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో ద్విచక్ర వాహ నదారులే అత్యధికంగా ఉన్నారు. మొత్తం రోడ్డు ప్రమాద మరణాల్లో 45.8% అంటే 79,533 మంది వీరివే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆ తర్వాత పాదచారులు 15.9%, 27,586 మంది, కారు/జీపు/ఎస్ యూవీ ప్రయాణికులు 14.3%, 24,776 మంది ఉన్నారు.జాతీయ రహదారులపైనే ఎక్కువదేశంలోని మొత్తం రోడ్ల పొడవులో జాతీయ రహదారుల వాటా కేవలం 2.1% మాత్రమే అయినప్పటికీ, అత్యధిక ప్రమాదాలు, మరణాలు ఇక్కడే సంభవిస్తున్నాయి. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 30.3% జాతీయ రహదారులపైనే జరిగాయి. అదేవిధంగా, మొత్తం మరణాలలో 34.6% అంటే 60,127 ఈ రహదారులపైనే నమోదయ్యాయి. దీని తర్వాత రాష్ట్ర రహదారులపై 23.4% మరణాలు అంటే 40,611 సంభవించాయి. ప్రమాదాలు ఎక్కువగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య జరుగుతున్నాయని నివేదిక పేర్కొంది. ఈ గణాంకాలు రహదారి భద్రతా నియమాలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని, ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయి.ప్రమాదాల ముఖచిత్రం (2023)మొత్తం ట్రాఫిక్ ప్రమాదాలు 4,91,190మొత్తం మరణాలు 1,97,871రోడ్డు ప్రమాద మరణాలు 1,73,826అతివేగంతో మరణాలు 1,01,841ద్విచక్ర వాహనదారుల మరణాలు 79,533

త్వరలో ట్రంప్, మోదీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెలాఖరులో మలేసియాలో భేటీ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కౌలాలంపూర్‌లో ఈ నెల 26, 27వ తేదీల్లో జరిగే 47వ ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య (ఆసియాన్) శిఖరాగ్రానికి ఇద్దరు నేతలు హాజరుకా నున్నారు. ఈ సందర్భంగా వీరు సమావేశమవుతారని విశ్వసనీయవర్గాల సమా చారం. సమావేశానికి రావాలంటూ మలేసియా ఇప్పటికే ఇద్దరు నేతలకు ఆహ్వానం పంపించింది. ట్రంప్ పర్యటన ఖరారైన పక్షంలో, అమెరికా భారత్‌పై 50 శాతం టారిఫ్‌లను విధించిన తర్వాత ఇద్దరు నేతలు కలుసుకునే మొట్టమొదటి అంతర్జాతీయ సమావేశం అవుతుంది.
ఎన్ఆర్ఐ

అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ప్రవాస తెలంగాణీయులు అబుదాబిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ వేదికగా, తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు ఘనంగా జరిగాయి. ఎడారి ప్రాంతమైన అబుదాబిలో పూలు దొరకడం కష్టమైన నేపథ్యంలో, సంఘ నాయకత్వం ప్రత్యేకంగా తెలంగాణ నుండి వందలాది కిలోల పూలను తెప్పించి నగరాన్ని పూల వనంగా మార్చారు. శనివారం రాత్రి ఉదయం సామూహిక బతుకమ్మ తయారీతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి యు.ఏ.ఈ.లోని భారత రాయబార కార్యాలయం నుంచి శ్జార్జీ జార్జ్ (First Secretary, Community Welfare and Coordination) ముఖ్య అతిథిగా విచ్చేసి, తెలంగాణ సంస్కృతిని ప్రశంసించారు. ఆయన ప్రవాస భారతీయుల సాంస్కృతిక అంకితభావాన్ని కొనియాడుతూ, “ఇలాంటి ఉత్సవాలు భారతీయతను ప్రపంచానికి పరిచయం చేస్తాయి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ గౌరవ అధ్యక్షుడు జయచంద్రన్ నాయర్, గౌరవ ఉపాధ్యక్షుడు శ్షాజీ వి.కె., కర్ణాటక రాష్ట్ర సంఘం అధ్యక్షుడు సర్వోత్తమ్ శెట్టి, మహారాష్ట్ర మండల్ అధ్యక్షుడు విజయ్ మానె, బీహార్ మరియు ఝార్ఖండ్ సంఘ అధ్యక్షుడు దివాకర్ ప్రసాద్, ఇండియా ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ సంఘ అధ్యక్షుడు వినాయక్ ఆవాటే, సంపంగి బ్యుటికా సంస్థల యాజమాన్యం ప్రత్యేక అతిథులుగా పాల్గొని, ప్రవాస తెలంగాణీయుల సాంస్కృతిక చైతన్యాన్ని అభినందించారు. అలాగే, తమిళ సంఘం, మలయాళి సంఘం, కన్నడ సంఘం, మరాఠీ సంఘం, గుజరాతీ సంఘం, పంజాబీ సంఘం తదితర రాష్ట్ర సంఘాల ప్రతినిధులు ప్రత్యేక అతిథులుగా విచ్చేసి, బతుకమ్మ ఉత్సవాన్ని తమ హాజరుతో మరింత వైభవవంతం చేశారు. భారతీయ సమైక్యతకు ప్రతీకగా, వారు తమ సంఘాల తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రముఖ కవి, గాయకుడు డా. కోకిల నాగరాజు, యువ గాయని సోనీ యాదర్ల ప్రత్యేకంగా ఇండియా నుంచి విచ్చేసి తమ బతుకమ్మ ఆట పాటలతో అందరినీ ఉర్రూతలూగించారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలతో బతుకమ్మ ప్రాంగణం మరో తెలంగాణ ను తలపించింది. అందమైన బతుకమ్మలకు, ముందుగా వచ్చిన బతుకమ్మలకు, నాట్యం చేసిన మహిళలకు, అందంగా ముస్తాబైన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఇండియా నుండి తెప్పించిన పిండి వంటలు—అరిసెలు, గారెలు, బోబట్ల వంటి వంటకాలు—అందరినీ ఆకట్టుకున్నాయి. బతుకమ్మ సంబరాలు ప్రతి సంవత్సరం మరింత ప్రాశస్త్యం పొందుతూ అందరి మన్ననలు పొందుతున్నందుకు కార్యవర్గానికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని కార్య నిర్వాహకులు రాజా శ్రీనివాస రావు, గంగారెడ్డి, వంశీ సందీప్, గోపాల్, సతీష్, పావని, అర్చన, దీప్తి, పద్మజ తదితరులు తెలియ జేశారు “విదేశాల్లో కూడా బతుకమ్మను ఇంత ఘనంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణం” అని నిర్వాహకులు తెలిపారు.(చదవండి: ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు)

ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ఆస్ట్రేలియా బ్రిస్బేన్ నగరంలోని గ్రేటర్ స్ప్రింగ్ ఫీల్డ్‌లో బతుకమ్మ సంబరాలను తెలుగు ప్రజలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మలను పేర్చి అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరీ మాత పూజను నిర్వహించారు. ‘బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్’ ఆధ్వర్యంలో స్థానిక స్ప్రింగ్ ఫీల్డ్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు, ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో మహిళలు చిన్నపిల్లలు పాల్గొని తెలంగాణ సాంప్రదాయ నృత్యాలను కనుల విందుగా ప్రదర్శించారు.కాగా, దసరా నవరాత్రులతో పాటు తెలంగాణలో బతుకమ్మ వేడుకలు కూడా ఘనంగా జరుగుతాయి. ఈ వేడకలు భాద్రపద బహుళ అమావాస్య– అంటే మహాలయ అమావాస్య నుంచి మొదలవుతాయి. అంటే బతుకమ్మ వేడుకలు దుర్గాష్టమి నాటితో ముగుస్తాయి. అప్పుడే ఈ బతుకమ్మ వేడుకలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ వెన్నముద్ద బతుకమ్మని ఆరాదిస్తారు. ఈ రోజున నువ్వులు, వెన్న, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.;(చదవండి: మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు)

మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
మలేషియా (malaysia) రాజధాని నగరం కౌలాలంపూర్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా శనివారం జరిగాయి. తెలంగాణా ఆడబిడ్డల గౌరవ ప్రతీక, ప్రకృతి పండుగ, బతుకమ్మలను వివిధ రకాల పూలతో అలంకరించారు. తెలుగు మహిళలు సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై, బతుకమ్మ ఆటపాటలతో సందడిగా గడిపారు. చిన్నా పెద్దా అంతా ఉత్సాహంగా ఆడిపాడారు. అనంతరం ప్రసాదాలను ఒకరికొకరు పంచుకొని గౌరమ్మను నిమజ్జనం చేశారు. కౌలాలంపూర్‌లోని బ్రిక్స్ఫీల్డ్స్లోలోని కృష్ణా టెంపుల్లో ఈ వేడుకలను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఫెడరేషన్ ఆఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్ మలేషియా (Federation of nri cultural association malaysia) ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు డిప్యూటీ హైకమీషనర్ సుభాషిణి నారాయణన్, పెరెక్ స్టేట్ లెజిస్లేటివ్ సభ్యురాలు శాంతి చిన్నసామి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ప్రతీ ఏడాది బతుకమ్మ వేడుకలను నిర్వహించుకోవడం తమకు ఆనవాయితీ అని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వాసంతిసిన్ని సామిమలేషియాలో భారతీయవారసత్వాన్ని జీవం పోసేందుకు ఎఫ్ఎన్సీఏ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఇండియన్ డిప్యూటీ హై కమీషనర్ శ్రీమతి సుభాషిణినారాయణన్ గారు మహిళలతో చేరి ఆడి పాడి సందడి చేసారు . అలాగే ప్రవాసీ భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయినా ఇండియన్ హై కమిషన్ ఎల్లపుడు సహాయం చేయడానికి ముందుంటుందని హామీ ఇచ్చారు. అత్యంత అందంగా అలంకరించిన బతుకమ్మకు బంగారు నాణెం బహుమతి అందించారు. అలాగే బతుకమ్మలు తీసుకొచ్చిన మహిళలందరికీ వారందరికీ వెండి నాణేలు కానుకగా ఇచ్చారు. ఉత్సవాల్లో పాల్గొన్న మహిళలకు వెండి బహుమతులు. మలేషియాలో ఉన్న తెలుగు రెస్టారెంట్లు స్పాన్సర్ చేసిన గొప్ప విందు, ఇందులో ప్రామాణిక తెలుగు వంటకాలు ప్రదర్శించారు.తెలుగు ఎక్సపెట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఇంద్రనీల్ , కోశాధికారి నాగరాజు , మలేషియా ఆంధ్రా అసోసియేషన్ విమెన్ప్రెసిడెంట్ శారదా , భారతీయ అసోసియేషన్ అఫ్ మలేషియా ప్రెసిడెంట్ సత్య, విమెన్ప్రెసిడెంట్ గీత హజారే , భరత్ రాష్ట్ర సమితి మలేషియా వైస్ ప్రెసిడెంట్ అరుణ్, మలేషియా తెలుగుఫౌండేషన్ అధ్యక్షుడు దాతో కాంతారావు , మలేషియా తెలుగు వెల్ఫేర్ & కల్చరల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ మూర్తి గారు , తెలుగు ఇంటెలెక్చ్యువల్ సొసైటీ అఫ్ మలేషియా ప్రెసిడెంట్ కొణతాల ప్రకాష్ రావు పాల్గొన్నారు. ఎఫ్ఎన్సీఏ మలేషియా అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, తన స్వాగత ప్రసంగంలో, విదేశాల్లో సాంస్కృతికసంప్రదాయాలను కాపాడుకోవడం మరియు భారతీయ ప్రవాసుల మధ్య ఐక్యతను పెంపొందించడం యొక్కప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమాన్నినిర్వహించడానికి సహకరించినస్పాన్సర్లు రాప్పినో టెక్ సొల్యూషన్స్ , టూట్కర్ సొల్యూషన్స్ ,సెంట్రల్ స్పైస్ ,టెక్మ్యాట్రిక్స్ ,రెడ్వేవ్ సొల్యూషన్స్ , టెక్డార్ట్ ,స్ప్రౌట్అకాడమీ ,బిఆర్ఎస్ మలేషియా ,జాస్ బెలూన్స్ అండ్ డెకరేటర్స్ ,లులు మనీ , బిగ్ సివెడ్డింగ్ కార్డ్స్ , శ్రీ రుచి రెస్టారెంట్, జబిల్లి , మై బిర్యానీ , శ్రీ బిర్యానీ ,స్పైసీ హబ్, ఫ్యామిలీ గార్డెన్, మైఫిన్ MY81 , MY81 , మెరిడియన్ , ఎన్ఎస్ టూర్స్ & ట్రావెల్స్ మరియు , స్వచ్ఛంద సేవకులు మరియు కోర్ కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞత లుతెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరెడ్డిమోహన్ రెడ్డి, సహాధ్యక్షులు కృష్ణముత్తినేని,ఉపాధ్యక్షులు రవి వర్మకనుమూరి,ప్రధాన కార్యదర్శి శివ సానిక,సంయుక్త కార్యదర్శిభాస్కర్ రావు ఉప్పుగంటి, కోశాధికారి రాజ శేఖర్ రావుగునుగంటి,యువజన విభాగం అధ్యక్షులు క్రాంతి కుమార్ గాజుల,సాంస్కృతికవిభాగం అధ్యక్షులు సాయి కృష్ణ జులూరి, కార్యనిర్వాహకసభ్యులు నాగరాజుకాలేరు,నాగార్జున దేవవరపు, ఫణీంద్రకనుగంటి,సురేష్ రెడ్డి మందడి , రవితేజ శ్రీదాస్యాం, మహిళా విభాగం అధ్యక్షురాలు శిరీష ఉప్పుగంటి ,మహిళా ఉపాధ్యక్షురాలు దుర్గా ప్రవళిక రాణి కనుమూరి, కార్యనిర్వాహక సభ్యురాలు సూర్య కుమారి , రజిని పాల్గొన్నారు.

హెల్త్ కేర్ ఫ్రాడ్ : భారత సంతతి వైద్యుడికి 14 ఏళ్ల ఖైదు
అమెరికాలో హెల్త్‌కేర్ స్కామ్‌లో భారత సంతతి వైద్యుడికి శిక్షపడింది. హెల్త్ కేర్ ఫ్రాడ్ నియంత్రిత పదార్థాల చట్టవిరుద్ధ పంపిణీ నేరం భారత సంతతికి చెందిన వైద్యుడు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఏడాది ప్రారంభంలో ఆరోగ్య సంరక్షణ మోసానికి నీల్ కె ఆనంద్ దోషిగా తేలాడు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, పెన్సిల్వేనియాకు చెందిన వైద్యుడు 48 ఏళ్ల డా. ఆనంద్ 2 మిలియన్ల డాలర్లకు పైగా పరిహారాన్ని, 2 మిలియన్లపై జరిమానా పైగా జప్తు చెల్లించాలని ఆదేశించింది.బీమా చెల్లింపులను క్లెయిమ్స్ కోసం తన రోగులను గూడీ బ్యాగులను అంగీకరించమని బలవంతం చేసి మరీ ఈ అక్రమాలకు పాల్పడ్డాడు. డాక్టర్ ఆనంద్ మెడికేర్, యుఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ (OPM), ఇండిపెండెన్స్ బ్లూ క్రాస్ (IBC) , ఆంథమ్ అందించిన ఆరోగ్య పథకాలకు తప్పుడు మరియు మోసపూరిత క్లెయిమ్‌లను సమర్పించడానికి కుట్ర పన్నాడు. వైద్యపరంగా అనవసరమైన ప్రిస్క్రిప్షన్ మందుల 'గూడీ బ్యాగులు' కోసం, వాటిని అతని యాజమాన్యంలోని ఇన్-హౌస్ ఫార్మసీలు రోగులకు పంపిణీ చేశాయి. ప్రిస్క్రిప్షన్లపై ముందే సంతకం చేయడం ద్వారా లైసెన్స్ కూడా లేని తన ఇంటర్న్లు మందులు సూచించడానికి అనుమతించాడు. ఆక్సికోడోన్ను పంపిణీ చేశాడు.ఓపియాయిడ్, నొప్పి నివారిణి అయిన ఆక్సికోడోన్ అమెరికాలో ముంచెత్తుతున్న మాదకద్రవ్యాల్లో ఒకటి.ఇదీ చదవండి: బాలీవుడ్‌ని వదిలేసి, వ్యవసాయంలోకి..కట్ చేస్తేఅలాగే ఆనంద్ ప్రిస్క్రిప్షన్లపై ముందస్తు సంతకం చేశాడు. లైసెన్స్ లేని మెడికల్ ఇంటర్న్లు డాక్టర్ ఆనంద్ ముందే సంతకం చేసిన ఖాళీ ఫారమ్‌లలో నియంత్రిత పదార్థాల కోసం ప్రిస్క్రిప్షన్లను పూరించారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ పథకం కింద, డాక్టర్ అనేక మంది రోగులకు 20,850 ఆక్సికోడోన్ మాత్రలను ప్రిస్క్రైబ్ చేశాడు. మొత్తంగా, మెడికేర్, OPM, IBC,చ ఆంథమ్2.4 మిలియన్లకు పైగా మెడికల్ క్లెయిమ్‌లను చెల్లించాయి. జిల్లా న్యాయమూర్తి చాడ్ F కెన్నీ ప్రకారం, ఆనంద్ తన రోగుల అవసరాల కంటే దురాశ ,అక్రమ లాభాల ద్వారా ప్రేరేపించబడ్డాడు. రోగుల చిక్సత మీద దృష్టిపెట్టకుండా లాభాలకోసం చూసుకున్నారని కెన్నీ వ్యాఖ్యానించారు.ఏప్రిల్‌లో, డాక్టర్ ఆనంద్ ఆరోగ్య సంరక్షణ మోసం మరియు వైర్ మోసం, మూడు ఆరోగ్య సంరక్షణ మోసం, ఒక మనీలాండరింగ్, నాలుగు చట్టవిరుద్ధమైన ద్రవ్య లావాదేవీలు , నియంత్రిత పదార్థాలను పంపిణీ చేయడానికి కుట్ర పన్నినట్లు నిర్ధారించబడింది. భారతీయ సంతతికి చెందిన వైద్యుడు అమెరికాన నేవీలో వైద్యుడిగా కూడా పనిచేశాడు. కాగా ఈ అన్ని ఆరోపణలను ఖండిస్తూ, డా. ఆనంద్, తని కుటుంబం 2001లో న్యూయార్క్‌లో జరిగిన 9/11 దాడుల బాధితులతో తాను ఎలా వ్యవహరించాడో వర్ణిస్తూ వివరణ ఇచ్చారు. రోగుల పట్ల ఆయనకున్నకరుణను నేరంగా పరిగణించడం అన్యాయమని డాక్టర్ కుటుంబం వాదించింది.
క్రైమ్

మా జోలికొస్తే పోలీసులకు ఐ‘బొమ్మ’ చూపిస్తాం!
పైరేటెడ్ వెబ్సైట్ ఐ బొమ్మ వ్యవహారం(iBomma) ఇప్పుడు తీవ్రతరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు సినీ నిర్మాతలను, హీరోలను బెదిరిస్తూ వచ్చిన ఈ సైట్ నిర్వాహకులు.. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ పోలీసులకే(Hyderabad Police) సవాల్ విసిరారు. తమపై దృష్టి సారిస్తే ప్రతిచర్య తప్పదంటూ ఓ నోట్ విడుదల చేసి మరీ హెచ్చరించడం సంచలనం సృష్టిస్తోంది.ఇటీవల ఐబొమ్మ సహా 65 పైరసీ వెబ్సైట్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి ఒక పైరసీ ముఠాను ఛేదించి ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ైరసీ కారణంగా కేవలం 2024లోనే తెలుగు చిత్ర పరిశ్రమకు సుమారు ₹3,700 కోట్ల భారీ నష్టం వాటిల్లిందన్నారు. ఐబొమ్మ వంటి సైట్లను ఎంతటి సాంకేతికత వాడినా వదిలిపెట్టేది లేదని, అంతర్జాతీయ సంస్థల సహకారంతో వారిని పట్టుకుంటామని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో..ఐబొమ్మ పేరిట విడుదలై వైరల్ అవుతున్న నోట్ యధాతథంగా ఇలా ఉంది.. ‘‘ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్స్ అమ్మిన తరువాత మీరు ఎం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ OTT రెవిన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు.1) హీరో లకు అంత రెమ్యూనిరేషన్ అవసరమా? అది మీ కొడుకు అయినా ఎవరు అయినా...2) సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది వున్నారు. వాళ్ళు ఎం అయిపోతారు అని కబుర్లు చెప్పకండి.. వాళ్ళకి మీరు ఇచ్చేఅమౌంట్ ఏ కూలి పని చేసిన వస్తాయి కానీ మీ హీరోకి హీరోయిన్ కి వస్తాయా.3) సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యూరురేషన్స్ మరియు విదేశాలలో షూటింగ్ లకు మరియు ట్రిప్స్ కి ఖర్చుపెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చుపెడుతున్నారు ? ఇండియా లో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది. కదా ? అక్కడ వాళ్ళకి ఉపాధి కలుగుతుంది కదా.4) అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికావెర్టీ కి దానిని మా మీద రుద్ది ఎక్కువకి అమ్ముతున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ ని కలెక్ట్ చేసుకోవటానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు. చివరికి మధ్యతరగతివాడే బాధపడుతున్నాడు.మా వెబ్సైటు మీద ఫోకస్ చేయటం ఆపండి లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది.ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్లు మీద మీ ద్రుష్టి పెట్టండి. ఇబొమ్మ అన్నది సిగేరేట్ నుంచి e -సిగిరెట్ కు యూజర్స్ ని మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్ కి నా రియాక్షన్ ఉంటుంది.ఈ మిడిల్ లో - వేరే ఏ హీరో కూడా (example: Vijay) టార్గెట్ అవ్వటం ఇష్టం లేదు, మేము స్వతహాగా వెబ్సైటు నుంచి తొలిగిస్తున్నాం, ఇప్పుడు ఇమ్మీడియేట్ డిలీట్ చేస్తే మీకు బయపడి లేదా మీరు తీయించినట్టు వుంటది అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తరువాత తీసివేయాలని అనుకుంటున్నాం..ఇబొమ్మ వాళ్ళు ఇండియా లో తీసివేసిన తరువాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరము, దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేయటం లేదు. మేము ibomma.net వళ్ళంత అంత మంచివాళ్లం కాదు. బురదలో రాయి వేయకండి... అది కూడా పెంట మీద అసలు చేయకండి.మేము ఏ దేశం లో వున్నా భారత దేశం, అందులో తెలుగు వానికోసం ఆలోచిస్తాము.(చావుకు భయపడని వాడు దేనికి భయపడడు - There's nothing more dangerous than a man who has nothing to loose.).సీవీ ఆనంద్ స్థానంలో ఇప్పుడు వీసీ సజ్జనార్(VC Sajjnar) హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించారు. వచ్చి రాగానే.. పైరసీ, సైబర్ నేరాలను ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు. ఈ తరుణంలో ఏకంగా పోలీసులకే సవాల్ విసురుతున్న నేపథ్యంలో, ఈ వ్యవహారాన్ని ఆయన ఎంత సీరియస్‌గా తీసుకుని ముందుకు వెళ్తారో వేచి చూడాలి.

మహిళలను గౌరవించాలి
కర్ణాటక: యువతిపై అత్యాచారం చేసిన కేసులో నిందితునికి హైకోర్టు బెయిలును నిరాకరించింది. వివరాలు.. కోలారు జిల్లా ముళబాగిలు తాలూకాకు చెందిన సయ్యద్ పర్వేజ్ నిందితుడు. ఈ ఏడాది ఏప్రిల్ 1న బిహార్ కూలీ యువతి (19) కేరళ నుంచి సొంతూరికి వెళ్లాలని బయల్దేరింది. బెంగళూరు కేఆర్ పురం రైల్వేస్టేషన్లో దిగింది. మరుసటి రోజు అర్ధరాత్రి యువతి తెలిసిన వ్యక్తితో భోజనం చేయాలని హోటల్‌కు నడుచుకుంటూ వెళ్తోంది. ఈ సమయంలో అక్కడే ఉన్న నిందితుడు పర్వేజ్, మరొక నిందితుడు వారిపై దాడి చేశారు. యువతిని లాక్కెళ్లి అఘాయిత్యం చేశారు. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి పరప్పన జైలుకు తరలించారు. బెయిలు ఇవ్వాలని నిందితుడు పర్వేజ్ హైకోర్టును ఆశ్రయించాడు. మహిళలను గౌరవించాలని మన పురాణాలు ఘోషిస్తున్నాయి, అర్ధరాత్రి మహిళలు నిర్భయంగా నడిచి వెళ్లినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు మహాత్మాగాంధీ చెప్పారు, ఈ నేరంలో బెయిలు ఇవ్వలేము అని జడ్జి ఎస్.రాచయ్య తీర్పు చెప్పారు.

పోలీసుల పైకి కుక్కను వదిలారు..
హైదరాబాద్: మద్యం మత్తులో న్యూసెన్స్‌కు పాల్పడుతుండగా డయల్ 100 కాల్‌తో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసుల పైకి కుక్కలను వదిలిన ఓ న్యూస్ రిపోర్టర్‌తో పాటు మరో ముగ్గురిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని అరోరా కాలనీలో ఓ ఇంటి టెర్రస్‌పై 20 మందికి పైగా యువకులు అర్ధరాత్రి దాకా మద్యం సేవిస్తూ గాలిలోకి మద్యం బాటిళ్లను విసురుతూ, పగులగొడుతూ గోల చేస్తుండగా చుట్టుపక్కల నివాసితులు డయల్ 100కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న బంజారాహిల్స్ కానిస్టేబుల్ భరత్‌కుమార్, నైట్ డ్యూటీ ఎస్ఐ సంధ్యారాణి ఘటనా స్థలానికి చేరుకున్నారు. న్యూసెన్స్ జరుగుతున్న ఇంటి టెర్రస్ పైకి వెళ్లడానికి యతి్నంచగా వీరి పైకి కుక్కను వదిలి విధులను అడ్డుకున్నారు. దీనిపై బంజారాహిల్స్ కానిస్టేబుల్ భరత్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ న్యూస్ రిపోర్టర్ సహా అజయ్, శివ, రవి తదితరులపై బంజారాహిల్స్ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 121 (1), 126 (2), 291, 292, 352, 189 (5) కింద కేసు నమోదు చేశారు. తాము ఘటనా స్థలానికి వెళ్తున్న క్రమంలో సుమారు 20 మంది వరకు తమను అడ్డుకోవడంతో పాటు ఆగ్రహంతో ఊగిపోతూ దాడి చేయగా తన చేతికి గాయమైందని కానిస్టేబుల్ భరత్‌కుమార్ ఆరోపించారు. తాము ఘటనా స్థలం నుంచి మెట్టుదిగే క్రమంలో మరోసారి 10–15 మంది వరకు తమను చుట్టుముట్టి దుర్బాషలాడుతూ యూనిఫాం తీసేసి అవమానిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. వీరిలో కుమార్ అనే వ్యక్తి తాను న్యూస్ చానల్ రిపోర్టర్‌నంటూ తీవ్రంగా దుర్బాషలాడాడని అజయ్, శివ, రవి సహా మరికొందరు కూడా తోడయ్యారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

నార్సింగిలో యువకుడి దారుణ హత్య
మణికొండ: ఓ సెల్‌ఫోన్ చోరీ వ్యవహారం యువకుడి హత్యకు దారి తీసింది. అర్ధరాత్రి వరకు ముగ్గురు స్నేహితులు కలిసి అతిగా మద్యం తాగి మత్తులో గొడవ పడ్డారు. చోరీ చేసిన ఫోన్‌ను తిరిగి ఇచ్చేయాలని చెప్పిన యువకున్ని మరో ఇద్దరు యువకులు దారుణంగా కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన నార్సింగి – కోకాపేట రోడ్డులోని డబుల్ బెడ్ రూం గృహాల సముదాయం పక్కన సోమవారం అర్ధరాత్రి జరిగింది. నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..షాద్‌నగర్‌కు చెందిన కాశారం యాదగిరి(24), కిషన్‌బాగ్‌కు చెందిన అఫ్రోజ్, నవాజ్‌ల కుటుంబాలకు 11 నెలల క్రితం నార్సింగిలో డబుల్ బెడ్రూంలు మంజూరు కావటంతో ఇక్కడే పక్కపక్కనే నివసిస్తున్నారు. ముగ్గురు స్నేహితులు కలిసి మూడు రోజుల క్రితం నార్సింగిలో మరో యువకున్ని కొట్టి సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. దాన్ని యాదగిరి వ్యతిరేకించాడు. అది తిరిగి ఇచ్చేయాలని పట్టుపట్టాడు. అప్పటికే దాన్ని అమ్మేసిన హంతులకు విషయం యాదగిరి బయటపెడతాడని భావించి సోమవారం రాత్రి వారి గృహాలకు సమీపంలోనే నిర్మానుష్య ప్రాంతంలో మద్యం తాగుదామని అతన్ని పిలిచారు. వింటే సరే లేదంటే హత్య చేయాలని పథకం వేసుకున్నారు. మద్యం తాగించి హత్య.. తమ పథకంలో బాగంగా మృతుడు యాదగిరికి ఎక్కువగా మద్యం తాగించి మత్తు ఎక్కేలా చేశారు. తర్వాత వారి వద్ద సిద్ధంగా ఉన్న కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. నొప్పి తాళలేక గట్టిగా అరవడంతో డబుల్ బెడ్ రూంలలో నివసిస్తున్న వారు సంఘటనా స్థలానికి వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 108ను రప్పించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలోనే అతను ప్రాణాలు కోల్పోయాడు. దాంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితులలో ఒకడైన అఫ్రోజ్‌పై ఆర్జీఐ, బహదూర్ పురా పోలీస్స్టేషన్లలో పాత కేసులు ఉన్నాయని సీఐ తెలిపారు. నిందితులనిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు తెలిసింది.
వీడియోలు


Pushpasri: గిరిజన సంక్షేమ హాస్టల్స్ లో పచ్చకామెర్ల కలకలం


Kakani: నీ పాలనలో రైతుల పరిస్థితి ఇది చంద్రబాబు..


Visakha Weather: అర్థరాత్రి భీకర గాలులతో..!


పాలక్ బ్రిడ్జ్ పై పాక్ ఆర్మీ VS నిరసనకారులు


చంద్రబాబులా ఒక సిటీని నిర్మించాలని రేవంత్‌రెడ్డి ఉత్సాహం!


మహాత్మ గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమం


చిత్తూరులో మైనర్ బాలికపై అత్యాచారం


నల్గొండ చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి


Bhumana: పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప


Auto Drivers: ఉచిత బస్సుతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయంటున్న డ్రైవర్లు