Rajanna
-
లే అవుట్ స్థలం మాయం చేశారు
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని లే అవుట్ స్థలాన్ని గత ప్రభుత్వ హయాంలో పెద్దల అనుయాయులు మాయం చేశారు. సర్వేనంబరు 525, 530/సీలో ఫైల్ నంబరు 1828/80లో 121 గజాల స్థలం ప్లాట్ నంబరు 13ను మున్సిపల్‌కు చెందిందిగా పేర్కొన్నారు. దాని విలువ రూ.40లక్షలు ఉంటుంది. కబ్జాకు గురైన మున్సిపల్ లే అవుట్ స్థలాన్ని గుర్తించి మున్సిపల్‌కు అప్పగించేలా చర్యలు తీసుకోవాలి. – నాగుల శ్రీనివాస్, సిరిసిల్ల ధాన్యం తరుగు అరికట్టాలి మా గ్రామంలో ధాన్యం కొనుగోళ్లలో తరుగు తీస్తున్నారు. ఎందుకు తీయాల్సి వస్తుందో కూడా వివరణ ఇవ్వడం లేదు. నాతోపాటు గ్రామానికి చెందిన రైతులు ఓన్సులాల్, సజన్లాల్కు చెందిన 710 బస్తాలను లారీలో మిల్లుకు తరలించగా వాటిలోంచి 21 బస్తాలు తరుగు తీసినట్లు చెబుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో తరుగుపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – భూక్య గజన్‌లాల్, వీర్నపల్లి -
రాజన్నపేట ఇళ్ల పరిహారంపై నేడు విచారణ
● బై నంబర్లతో రూ.1.80 కోట్లు చెల్లింపులపై ఫిర్యాదులుబోయినపల్లి(చొప్పదండి): మిడ్‌మానేరులో ముంపునకు గురైన బోయినపల్లి మండలం వరదవెల్లి అనుబంధ గ్రామం రాజన్నపేటలోని 9 ఇళ్ల పరిహారం చెల్లింపులపై కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా విచారణకు ఆదేశించారు. ఈమేరకు డీఎల్పీవో నరేశ్ మంగళవారం వరదవెల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టనున్నారు. పరిహారం పొందిన 9 పాత ఇళ్ల ఇంటి నంబర్లకు బై నంబర్లతో దాదాపు రూ.1.80 కోట్ల మేర పరిహారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి. పరిహారం చెల్లింపులు నిలిచిపోయాయి. ఫిర్యాదులతో నిలిచిన చెల్లింపులు వరదవెల్లి ఆర్అండ్ఆర్ కాలనీలో సుమారు 482 వరకు ఇంటి నంబర్లు ఉన్నాయి. 2006 నుంచి ఇళ్లు, భూముల ముంపు గుర్తింపు జరిగింది. 2014లో ఎంఎంఆర్ నంబర్లు వేసి నోటీసులు ఇచ్చారు. మళ్లీ నిర్మాణాలు చేస్తే పరిహారం వర్తించదని స్పష్టం చేశారు. కాగా తప్పిపోయిన ఇళ్లకు పరిహారం ఇవ్వాలని 2021లో గత ప్రభుత్వం జీవో ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో 9 ఇళ్లకు సంబంధించిన వారు పరిహారం కావాలని జిల్లా అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. ఈక్రమంలో కలెక్టరేట్ నుంచి ఎస్డీసీ అకౌంట్లోకి డబ్బులు జమ చేశారు. రూ.1.80 కోట్ల మేర పరిహారం చెల్లించేందుకు అధికారులు చెక్కులు సిద్ధం చేశారు. పరిహారం పొందిన ఇళ్లకు బై నంబర్లతో మళ్లీ పరిహారం పొందుతున్నారని ఫిర్యాదులు వెళ్లడంతో చెల్లింపులు నిలిచిపోయాయి. మంగళవారం నాటి విచారణకు గ్రామంలో 2015 నుంచి 2019 వకు వరదవెల్లి గ్రామపంచాయతీ కార్యర్శులుగా పనిచేసిన వారు హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. విచారణ నేపథ్యంలో కొందరి అధికారుల్లో భయం నెలకొన్నట్లు సమాచారం. -
వారసత్వ పనిని ఇప్పించాలి
మాది తిప్పాపురం. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయంలో 60 ఏళ్లుగా మా వంశానికి చెందిన వారు 8 పాళ్లుగా పట్నాలు వేస్తున్నాం. అయితే మూడేళ్లుగా మా కులస్తులు ఎనిమిది పాళ్లు కాదని కొడుకులున్నోళ్లు మొత్తంగా 26 పాళ్లు చేశారు. నా కొడు కు అనారోగ్యంతో ఉంటున్నాడు. నాకు పాలు క ల్పించాలని కోరితే వారు ఒప్పుకోవడం లేదు. ఈ విషయమై వేములవాడ ఆలయ ఈవో సైతం వారికి చెప్పారు. అయినా వినడం లేదు. – పి.అంజలి, వేములవాడ ఉపాధి కల్పించాలి మాది రగుడు గ్రామం. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన దివ్యాంగుడిని. మా నాన్న చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. అమ్మే నన్ను ఐటీఐ వరకు చదివించింది. ప్రస్తుతం లైసెన్స్డ్ సర్వేయర్‌కు దరఖాస్తు తీసుకున్నారు. నాకు లైసెన్స్డ్ సర్వేయర్‌గా ఉద్యోగం కల్పించి ఆదుకోవాలి. – బూర మధు, రగుడు చెరువుకట్టలు పునర్ నిర్మించాలి గ్రామ శివారులోని పెద్దచెరువు, కొత్తచెరువులో పూడిక తీయాలి. పూడిక తీయగా చెరువు లోతు పెరుగుతుంది. పూడిక తీయకపోవడంతో చిన్నవర్షాలకే నిండి మత్తడి దూకుతున్నాయి. వెంటనే వాటిలో పూడిక తీసి కట్టలను పునర్ నిర్మించాలి. ఫలితంగా చెరువులోంచి నీరు వృథాపోకుండా అరికట్టవచ్చు. – రవీందర్, చిన్నబోనాల -
అక్రమంగా పట్టా చేసుకుండ్రు
ఊరిలో మా మామ పేరిట 9 ఎకరాల స్థలం ఉంది. ఆయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. వారిలో చిన్నకూతురు మినహా ఎవరూ బతికిలేరు. వారసత్వంగా మాకు సంక్రమించాల్సిన భూమిని కొందరు నా ప్రమేయం లేకుండానే వారి పేరిట పట్టా చేయించుకున్నారు. నా పోషణ గురించి పట్టించుకోవడం లేదు. నాకు న్యాయం చేయాలి. – జూలూరి మల్లవ్వ, సముద్రలింగాపూర్ ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలి జిల్లాలోని చాలా ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు పాటించడం లేదు. వైద్యుల అర్హతల వివరాలు ప్రదర్శించడం లేదు. ధనార్జనే ధ్యేయంగా ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. డబ్బుల కోసం రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – అంగూరి రంజిత్, సిరిసిల్ల నా స్థలాన్ని కబ్జా కానీయొద్దు మాకు జిల్లాకేంద్రం విద్యానగర్ బైపాస్ రోడ్డులో సర్వేనంబర్ 517లో స్థలం ఉంది. నేను ఉపాధి నిమిత్తం మా స్థలంలో హోటల్ పెట్టుకోవాలని చూస్తుంటే ఓ బీఆర్ఎస్ నాయకుడు బెదిరిస్తున్నాడు. అదే సర్వేనంబర్‌లో వారికి ఉన్న భూమి బైపాస్‌రోడ్డులో పోయింది. అప్పుడు పరిహారం కూడా పొందారు. ఇప్పుడు నిరుపేద అయిన నా స్థలాన్ని కాజేయాలని చూస్తుండ్రు. కలెక్టర్ న్యాయం చేయాలి. – షేక్ జలీల్, విద్యానగర్ -
ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లాలి
● డెంగీ ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి ● ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు ● మహిళా సంఘాలకు ఎరువులు, విత్తనాల దుకాణాలు ● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాసిరిసిల్ల: జిల్లాలో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికెళ్లాలని, డెంగీ ప్రబలకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే వానాకాలంలో డెంగీ రాకుండా ముందుజాగ్రత్త చర్యలకు సన్నద్ధం కావాలన్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి, నియంత్రణకు చ ర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ మంగ ళ, శుక్రవారాలలో డ్రైడే నిర్వహించాలన్నారు. డీఎంహెచ్‌వో రజిత, మున్సిపల్ కమిషనర్లు అన్వేశ్, వాణి పాల్గొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు జిల్లాలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఈనెల 22 నుంచి 29 ఇంటర్ పరీక్షలు, జూన్ 3 నుంచి 12 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో 13 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్డీవోలు రాధాబాయి, వెంకటేశ్వరావు, జిల్లా ఇంటర్మీడియెట్ నోడల్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘాలకు ఎరువుల దుకాణం జిల్లాలోని ఐదు మహిళా సంఘాలకు ఎరువుల దుకాణాలకు ఈ–పాస్ మిషన్లను కలెక్టర్ పంపిణీ చేశారు. మహాలక్ష్మీ గ్రామైక్య సంఘం ఫెర్టిలైజర్స్ అండ్ విత్తనాలు(పెద్దూర్), శ్రీధనలక్ష్మీ మండల సమాఖ్య ఫెర్టిలైజర్స్ అండ్ విత్తనాలు వేములవాడ, శివరామ్ గ్రామైక్య సంఘం ఫెర్టిలైజర్స్ అండ్ విత్తనాలు వేములవాడ మండలం బొల్లారం, విలాసాగర్ గ్రామైక్య సంఘం ఫెర్టిలైజర్స్ అండ్ విత్తనాలు బోయినపల్లి, వెన్నెల గ్రామ సమాఖ్య సంఘం రుద్రంగి వారికి ఈ–పాస్ యంత్రాలు అందజేశారు. జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్లక్రైం: ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారమే లక్ష్యంగా ప్రతీ సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 33 ఫిర్యాదులు స్వీకరించి, ఆయా పోలీస్స్టేషన్ల అధికారులకు ఫోన్‌చేసి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు. నేడు వేములవాడ–ముంబయి ఏసీ బస్సు ప్రారంభం వేములవాడ: వేములవాడ నుంచి ముంబయికి వెళ్లేందుకు ఏసీ స్లీపర్ కోచ్ బస్సును రాష్ట్ర బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సోమవారం తెలిపారు. వేములవాడ నుంచి కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్, నిజామాబాద్, పుణె మీదుగా ముంబయి చేరుకుంటుందని తెలిపారు. సిట్టింగ్ రూ.1,500, స్లీపర్ రూ.2వేలు చార్జీలు ఉన్నట్లు చెప్పారు. అనంతరం స్థానిక మహాలింగేశ్వర ఫంక్షన్హాల్లో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే లక్ష్యం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో గ్రామ, మండల శాఖ నూతన కార్యవర్గాలను ఎన్నుకుంటున్నట్లు పీసీసీ పరిశీలకులు ఫక్రుద్దీన్, చైతన్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేటలోని పార్టీ కార్యాలయంలో సోమవారం కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలను గుర్తిస్తామన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ సాబేరా బేగం, వైస్‌చైర్మన్ గుండాడి రాంరెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు సాహెబ్ పాల్గొన్నారు. నేడు ఐఐహెచ్‌టీ కోర్సుపై అవగాహన సదస్సు సిరిసిల్ల: కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్‌టీ) కోర్సుపై అవగాహన కల్పించేందుకు మంగళవారం సిరిసిల్లలో సదస్సు నిర్వహిస్తున్నామని చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు రాఘవరావు తెలిపారు. 2025–2026 విద్యాసంవత్సరంలో 60 సీట్లు చేనేత, టెక్స్టైల్స్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో ఉన్నట్లు వివరించారు. ఆ కోర్సు ప్రాధాన్యతను వివరించేందుకు బీవై నగర్‌లోని పాత ఏడీ ఆఫీస్‌లో మంగళవారం ఉదయం 11 గంటలకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భగవద్గీత పఠనంలో గోల్డ్మెడల్స్ముస్తాబాద్(సిరిసిల్ల): భగవద్గీతలోని 700 శ్లోకాలను కంఠస్థం చేసిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు గోల్డ్‌మెడల్స్ సాధించారు. ముస్తాబాద్ మండలం ఆవునూర్‌కు చెందిన కటకం లక్ష్మి, కటకం విజయలక్ష్మి మైసూర్లో జరిగిన భగవద్గీత శ్లోకాల పోటీల్లో సత్తా చాటారు. 700 శ్లోకాలను అలవోకగా ఆలపించిన అక్కాచెల్లెళ్లకు గణపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా బంగారు పతకాలను అందించారు. కంచర్ల పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్వీర్నపల్లి(సిరిసిల్ల): విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కంచర్ల పంచాయతీ కార్యదర్శి ముక్తార్ అహ్మద్‌ను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సోమవారం సస్పెండ్ చేశారు. గ్రామంలో డెంగీ కేసులు నమోదైనప్పటికీ పారిశుధ్య చర్యలు చేపట్టకపోవడంతో కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. సోమవారం గ్రామంలో పర్యటించిన కలెక్టర్.. పంచాయతీ కార్యదర్శి లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో సస్పెండ్ చేశారు. -
రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, బాబు జగ్జీవన్‌రామ్ వ్యవసాయ కళాశాల జిల్లెల్ల ఆధ్వర్యంలో చీర్లవంచలో సోమవారం రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులు పంటలకు సిఫారసు చేసిన మోతాదులోనే యూరియాను వినియోగించాలన్నారు. పచ్చిరొట్ట ఎరువులు, వర్మీకంపోస్టు, పేడ ఎరువులను వినియోగించాలన్నారు. చీడపీడల ఉధృతిని బట్టి సరైన మోతాదులో రసాయనిక మందుల వాడడంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బాబు జగ్జీవన్‌రామ్ వ్యవసాయ కళాశాల వ్యవసాయ శాస్త్రవేత్తలు డా.రజియా సుల్తానా, కె.భవ్యశ్రీ, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, మండల వ్యవసాయ అధికారి కె.సంజీవ్, ఏఈవో కరుణాకర్, మౌనిక, విత్తన అధికారి మౌనిక, విద్యార్థులు మణికంఠ, శాలిని, రైతులు పాల్గొన్నారు. -
జ్వరం..ఒళ్లునొప్పులు
సిరిసిల్లటౌన్: జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. పల్లె..పట్నం తేడా లేకుండా జనాలు మంచం పడుతున్నారు. మండుటెండలు ఒక వైపు.. కురుస్తున్న వర్షాలు మరో వైపుతో వాతావరణంలో తీవ్రమార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా దోమలు పెరిగి జ్వరాలు వస్తున్నాయి. నీరు, ఆహారం కలుషితమై విరోచనాలు, మలేరియా, డెంగీ వ్యాధులు వస్తున్నాయి. జ్వర బాధితులతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. జిల్లా ఆస్పత్రికే నిత్యం 700 వరకు రోగులు ఓపీ సేవలు పొందుతున్నారు. వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో డెంగీ కేసులు బయటపడుతుండడం జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. లక్షణాలు..చికిత్స సాధారణం నుంచి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు, వాంతులు, విరోచనాలు, కండ్లు లాగడం వంటి లక్షణాలతో జ్వరాలు వ్యాపిస్తున్నాయి. మూత్రంలో రక్తం రావడం, నాలుక నల్లబారడం, జ్వరం తగ్గకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో వెంటనే ఆస్పత్రిలో వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ఎన్ఎస్ఐ ఏజీ టెస్టు పాజిటివ్ వస్తే డెంగీ మొదటి దశలో ఉందని అర్థం. ఈ దశలో రెండు, మూడు రోజులు ఉంటుంది. ఐజీహెచ్ టెస్టు పాజిటివ్ వస్తే మోడరేట్ టు సివియర్‌గా పరిగణించి చికిత్స అందిస్తారు. ఈసమయంలో జాగ్రత్తలు తీసుకో వాల్సి ఉంటుంది. అన్ని రకాల జ్వరాలకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందుబాటులో ఉంది. ప్రైవేటుకు వెళ్లాల్సిన అవసరం లేదు. జ్వరాల తీవ్రత పెరిగితే జిల్లా ఆస్పత్రిలో కార్పొరేట్ వైద్యానికి దీటుగా మూడు షిఫ్టుల్లో 24 గంటలపాటు సిబ్బంది వైద్యసేవలు అందిస్తున్నారు. జిల్లాలో జ్వరాల తీవ్రత దృష్ట్యా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా వైద్యశాఖను అప్రమత్తం చేశారు. వణికిస్తున్న వైరల్, డెంగీ కేసులు జిల్లా ఆస్పత్రికి పోటెత్తుతున్న రోగులు నిత్యం 700 మందికి పైగా ఔట్‌పేషంట్లు ప్లేట్లెట్స్ తగ్గడంతో జనాలు బెంబేలు ఈమె వీర్నపల్లి మండలం కంచర్లకు చెందిన దండుగుల లక్ష్మి. నాలుగు రోజుల క్రితం చాతి, తలనొప్పి తో పాటు పక్కబొక్కలు నొప్పిలేశాయి. విపరీతమైన జ్వరం వచ్చింది. ఊరిలోకి వైద్యశాఖ నుంచి వచ్చినోళ్లు గోలీలు ఇచ్చినా తగ్గలేదు. ఇంట్లో వాళ్లు వెంటనే సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చి పరీక్షలు చేశారు. ర్యాపిడ్ టెస్టులో డెంగీ పాజిటివ్ వచ్చింది. ఇన్‌పేషెంటుగా చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. డెంగీ నుంచి కోలుకుంటున్న ఎనిమిది రోజుల క్రితం తలనొప్పి, కండ్లు గుంజుడం.. నడుం నొప్పి వచ్చింది. జ్వరం ఎక్కువైంది. జిల్లా ఆస్పత్రికి వచ్చినం. ఇక్కడ ఎలీసా టెస్టు చేస్తే పాజిటివ్ రావడంతో వైద్యం అందించారు.ఎలాంటి ఖర్చు లేకుండానే డెంగీ జ్వరం నుంచి కోలుకుంటున్న. – మిర్యాల మంజుల, కంచర్ల మెరుగైన చికిత్స అందిస్తున్నాం ఇటీవల రెండు డెంగీ పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇతర విషజ్వరాలతో కూడా రోగులు వస్తున్నారు. ఆస్పత్రిలో అన్ని రకాల మందులు ఉన్నాయి. ఫ్లూయిడ్స్, ఇంజక్షన్లు, ఓఆర్ఎస్లు, యాంటిబయాటిక్స్ ఉన్నాయి. వెంటిలేటర్, ఆక్సిజన్ సౌకర్యం ఉంది. ఐసీయూలో పది పడకలు కేటాయించాం. జిల్లా ఆస్పత్రిలో అన్ని విభాగాల వైద్యులతో చికిత్స అందిస్తున్నాం. ప్రైవేటు కన్నా మెరుగ్గా వైద్యం అందిస్తున్నాం. – డాక్టర్ లక్ష్మీనారాయణ, సూపరింటెండెంట్ జిల్లా ఆస్పత్రి, సిరిసిల్ల ఈమె వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన శశికళ. ఈనెల 16న తీవ్ర జ్వరం, వాంతులు, ఒళ్లు నొప్పులతో సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి వచ్చింది. ర్యాపిడ్ టెస్టు చేయగా డెంగీ పాజిటివ్‌గా తేలింది. వైద్యులు వెంటనే ట్రీట్మెంట్ ప్రారంభించారు. ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోకుండా 24 గంటలు సిబ్బంది పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. -
విన్నపాలు వినవలే..
● ప్రజావాణిలో వెల్లువెత్తిన వినతులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ● వివిధ సమస్యలపై 120 విన్నపాలుసిరిసిల్లటౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు బాధితులు కలెక్టరేట్ బాట పడుతున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాక కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి భారీ సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా వినతిపత్రాలు స్వీకరించి పరిష్కరించాల్సిందిగా ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ 54, మున్సిపల్ 11, డీఆర్డీవో 7, ఉపాఽధికల్పన 6, హౌసింగ్ 5, ఎస్డీసీ 4, డీడబ్ల్యూవో 3, ఎస్సీ కార్పొరేషన్, ఏడీఎస్ అండ్ ఆర్డీఎస్వో, హ్యాండ్లూమ్, టెక్స్టైల్, డీఎంహెచ్‌వోకు రెండు చొప్పున మొత్తంగా 120 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, వేములవాడ ఇన్చార్జి ఆర్డీవో రాధాబాయి, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం తదితరులు పాల్గొన్నారు. -
నేడు సిరిసిల్లకు కేటీఆర్
సిరిసిల్ల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కె.తారకరామారావు ఆదివారం సిరిసిల్ల లో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు గంభీరావుపేట మండలం కోళ్లమద్దిలో మల్లికార్జునస్వామి ప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం కొత్తపల్లి, లింగన్నపేట, మల్లారెడ్డిపేట, జగదాంబతండా, రాచర్లగొల్లపల్లి, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్లలో జరిగే శుభకార్యాలకు హాజరుకానున్నారు. హిందూ ఏక్తాయాత్రను విజయవంతం చేయండి ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి సిరిసిల్ల: కరీంనగర్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఈనెల 22న నిర్వహించే హిందూ ఏక్తాయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డిబోయిన గోపి కోరారు. సిరిసిల్లలోని బీజేపీ ఆఫీస్‌లో శనివారం సన్నాహక సమావేశంలో మాట్లాడారు. సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ కో–కన్వీనర్ ఆడెపు రవీందర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరు భాస్కర్, జిల్లా అధికార ప్రతినిధి బర్కం నవీన్‌యాదవ్, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు వైశాలి ఉన్నారు. వయోవృద్ధుల సమస్యలు పరిష్కరించాలి సిరిసిల్ల: వయోవృద్ధుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ ప్రతినిధులు సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లును కోరారు. ఆర్డీవో ఆఫీస్‌లో శనివారం కలిసి విన్నవించారు. వయోవృద్ధులను వారి కొడుకులు పోషించకుండా.. ఆకలి బాధతో మాడ్చుతున్నారన్నారు. ఇటీవల ఆర్డీవోగా విధుల్లో చేరిన వెంకటేశ్వర్లును సీనియర్ సిటిజెన్స్ సత్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్య, ప్రధాన కార్యదర్శి జనపాల శంకరయ్య, ఉపాధ్యక్షుడు ఏనుగుల ఎల్లయ్య, రాష్ట్ర ఈసీ మెంబర్ శ్రీగాథ మైసయ్య, కోశాధికారి దొంత దేవదాసు, శ్రీకాంత్ పాల్గొన్నారు. వేములవాడ సబ్‌కోర్టు ఇన్చార్జి పీపీగా రాజిరెడ్డి వేములవాడ: వేములవాడ సబ్‌కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గౌరు రాజి రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శని వారం ఉత్తర్వులు జారీ చేశా రు. ఆమేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు. ఏడాదిపాటు పదవిలో కొనసాగనున్నారు. కరీంనగర్ ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టు అడిషనల్ పీపీగా విధులు నిర్వహిస్తున్న రాజిరెడ్డిని వేములవాడ ఇన్‌చార్జీగా నియమించారు. ఇక్కడ గురు, శుక్రవారాల్లో సేవలందిస్తారు. ఉగ్రవాదులను అంతం చేయాలివేములవాడ: మన ఆడబిడ్డల సింధూరాలను తుడిచిన ఉగ్రవాదులను అంతం చేయాలని ఫోజీ ఉమ్మడి కరీంనగర్ అధ్యక్షులు పద్మలత, జిల్లా ఐఎంఏ అధ్యక్షుడు నాగమల్ల శ్రీనివాస్ కోరారు. వేములవాడలో శనివారం తిరంగ్యాత్ర నిర్వహించారు. వైద్యులు స్రవంతి, స్వప్న, చీకోటి సంతోష్, అభినయ్, కోటగిరి మనోహర్, అనిల్‌కుమార్, తిరుపతి, ఆనందరెడ్డి, మహేందర్, సింధు, నాగేందర్, సుమన్, లహరి, సంతోష్‌చారి, సంధ్యారాణి, రాజేందర్, లీలాశిరీష, గీతావాణి. త్రిసంధ్య పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రం పరిశీలనఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని అక్కపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని డీఆర్డీవో శేషాద్రి శనివారం తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు వివరాలు, ట్యాబ్‌లో ఎంత వరకు ఎంట్రీ చేశారని ఆరా తీశారు. ఇన్చార్జి డీపీఎం శ్రీనివాస్, ఏపీఎం మల్లేశం, సీసీ రమణ, వీవోఏ రమ తదితరులు ఉన్నారు. -
5 బస్తాలు కోత విధించారు
నేను 8 ఎకరాల్లో వరి సాగు చేసిన. దాదాపు 326 బస్తాల ధాన్యం వచ్చింది. తూకం వేసి రైస్‌మిల్లుకు పంపిన తర్వాత 5 బస్తాలను కట్ చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే వెయిట్ లాస్ వచ్చిందని కట్ చేశారని బదులిచ్చారు. నాకు రూ.5వేలు నష్టం వచ్చింది. – మర్రి శంకర్, చందుర్తి వెయిట్ లాస్ వస్తోందని.. తూకం వేసిన తర్వాత రెండు రోజులు లారీలు ఆలస్యంగా వస్తే మిల్లర్లు తూకంలో వెయిట్ లాస్ వస్తోందని కోతలు విధిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. రైతులు మాత్రం మేమే ధాన్యం కట్ చేస్తున్నామని దూషిస్తున్నారు. కేంద్రాల నిర్వాహకులకు ధాన్యం కటింగ్‌కు సంబంధం లేదని చెప్పినా వినిపించుకోవడం లేదు. – రజిత, ఐకేపీ ఏపీఎం, చందుర్తి ● -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● ముందు జాగ్రత్తలు మేలు ● మంగళ, శుక్రవారాల్లో డ్రైడే నిర్వహించాలి ● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాసిరిసిల్ల: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో శనివారం అధికారులతో సమీక్షించారు. రా నున్న వానాకాలంలో ప్రతీ గ్రామంలో, ప్రతీ ము న్సిపల్ వార్డుల్లోనూ నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి, నీటి నిల్వను తొలగించాలన్నారు. ప్రతీ మంగళ, శుక్రవారం డ్రై డే నిర్వహించాలని సూచించారు. డ్రెయినేజీల్లో ఆయిల్‌బాల్స్ వేయించాలన్నారు. లోతట్టు ప్రాంతాలపై శ్రద్ధ జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అధికంగా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రత, దోమల నివారణకు ప్రజలు తీసుకోవాల్సిన చర్యలపై గ్రామసభలు పెట్టి అవగాహన కల్పించాలన్నారు. అన్ని పీహెచ్సీలలో డెంగీ రాపిడ్ టెస్ట్‌లు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జిల్లాలో కూలిపోయే స్థితిలో ఉన్న భవనాలను తొలగించాలని ఆదేశించారు. డీఎంహెచ్‌వో ఎస్.రజిత, డీపీవో షరీఫొద్దీన్, ఎంపీవోలు, పంచాయతీ సెక్రటరీలు, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
నిండా ముంచుతున్నారు !
● ఇప్పటికే 530కి పైగా బస్తాల కోత ● రూ.5లక్షలకు పైగా రైతుల సొమ్ము స్వాహా ● ఒక్కో రైతు నుంచి 2 నుంచి 10 బస్తాల వరకు కటింగ్ ● అధికారులే న్యాయం చేయాలంటున్న రైతులుచందుర్తి(వేములవాడ): రైతులను ప్రకృతి ప్రకోపాలు నిండా ముంచడం చూశాం. కానీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు తెలియకుండానే ని లువు దోపిడీ చేస్తున్నారు. అధికారులు, పాలకులు ఒక్కటై అన్నదాతలను ఆగం చేస్తున్నారు. చందుర్తి మండల పరిధిలో ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం నుంచి దాదాపు 530కి పైగానే బస్తాలను కోత పెట్టారు. ఎవరికీ చెప్పుకోవాలో తెలియక అన్నదాతలు లోలోపల కుమిలిపోతున్నారు. రైతులను నిండా ముంచుతున్న వైనంపై ‘సాక్షి’ ఫోకస్. 20 కేంద్రాలు.. రూ.4.95 లక్షలు స్వాహా చందుర్తి మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో 13, సనుగుల సింగిల్‌విండో ఆధ్వర్యంలో 7 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలోని 13 కేంద్రాల్లో ఇప్పటి వరకు 1.20 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అధికారిక లెక్కల ప్రకారం 314 బస్తాలు కోత పెట్టారు. ఐదు రోజుల లెక్కలు అందుబాటులో లేవు. వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే మరో 70 బస్తాల వరకు కోత విధించి ఉంటారన్న అంచనా. సనుగుల సింగిల్‌విండో పరిధిలో 56 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా.. రైతుల నుంచి 225 బస్తాల వరకు కటింగ్ చేశారు. ఐకేపీ, సింగిల్‌విండోల ద్వారా మొత్తానికి 539 బస్తాలు కోత విధించగా.. వీటి విలువ దాదాపు రూ.4.95 లక్షల వరకు ఉంటుంది. రైతుల ఖాతాల్లో జమకావాల్సిన సొమ్మును రైస్‌మిల్లర్లు దోచుకోవడంపై అన్నదాతల నుంచి విమర్శలు వె ల్లువెత్తుతున్నాయి. కొనుగోలు కేంద్రాల మూసివేసే వరకు రైతులకు చెందాల్సిన సుమారు రూ.20లక్షల సొమ్ము వరకు రైస్‌మిల్లర్ల జేబుల్లో చేరుతాయనే ఆరోపణలు రైతులు చేస్తున్నారు. గతంలో తూకంలో బస్తాకు కిలో అదనంగా వేయడంతో ఇలా కోత విధించలేదని.. ఈసారి అదనపు కిలో తూకం లేకపోవడంతో మిల్లర్లు తమ దోపిడీకి ఈ మార్గాన్ని ఎంచుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. మిల్లర్లు చెప్పిందే వేదం రైతుల ధాన్యంలో కోతలు విధిస్తే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని అధికారుల హెచ్చరికలు తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో మిల్లర్ల దోపిడీ ఆగడం లేదు. కొనుగోలు కేంద్రాలకు గన్నీసంచులు పంపించగా.. వాటిని రైస్‌మిల్లర్లు దించుకోకపోవడంతో చాలా కేంద్రాల్లో కొత్త వాటిని పక్కకు పెట్టి పాత గన్నీసంచుల్లో తూకం వేస్తున్నట్లు తెలిసింది. ఇలా పాత గన్నీసంచుల్లోనే తూకం వేస్తేనే మిల్లర్లు ధాన్యాన్ని అన్లోడ్ చేసుకుంటున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. పాత గన్నీ సంచుల్లోనే తూకం వేసుకోవాలన్న మిల్లర్ల ఆలోచన వెనుక వెనుక ఏం ఆంతర్యం తెలియడం లేదు. ఇతను చందుర్తికి చెందిన పోతురాజు మోహన్. 10 ఎకరాల్లో వరి సాగు చేశాడు. చందుర్తిలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో 904 ధాన్యం బస్తాలను విక్రయించాడు. లారీలో తరలించిన 904 బస్తాల నుంచి 10 బస్తాలను కట్ చేస్తున్నామని నిర్వాహకులు చెప్పగా.. తమ ధాన్యం బస్తాలను వాపస్ తెప్పించి ఇవ్వాలని రైతు మొండికేశాడు. ఎవరికై నా చెప్పుకోమనడంతో చేసేదేమి లేక సైలెంట్ అయ్యాడు. 10 బస్తాల కటింగ్‌తో 4 క్వింటాళ్ల ధాన్యం డబ్బులు రూ. 10వేల వరకు నష్టం వచ్చిందని వాపోయాడు. చందుర్తి మండలం మర్రిగడ్డకు చెందిన రైతు ఏరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి 626 బస్తాలను 20 రోజుల క్రితం తూకం వేసి అపెరల్ పార్క్‌కు తరలించారు. అక్కడ వేబ్రిడ్జి కాంటా వేసి అధికారులు 5 బస్తాలను కోత పెట్టారు. ఎవరికీ చెప్పుకున్నా ఎలాంటి లాభం లేకపోవడంతో ఈనెల 14వ తేదీ రాత్రి వివరాలు ఇచ్చి, ఓటీపీ చెప్పాడు. -
ఆమ్చూర్ ఆశలు ఆవిరి
సిరిసిల్ల: మామిడి టంకర(ఆమ్చూర్) వ్యాపారం ఢీలా పడిపోయింది. అకాల వర్షాలు.. ఈదురుగాలులతో ఇప్పటికే చెట్టుపై ఉన్న కాయల్లో పావువంత రాలిపోయాయి. ప్రస్తుతం మార్కెట్లో ఆమ్‌చూర్‌కు సరైన ధర లేక మామిడిరైతులు, కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది క్వింటాలుకు రూ.35వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.19వేల నుంచి రూ.25వేలు పలుకుతుంది. ఆమ్చూర్ వినియోగం ఇలా మామిడికాయల పొట్టు తీసి, ముక్కలుముక్కలుగా కోసి ఎండలో ఎండబెడతారు. ఇలా ఎండిన ముక్కలను మామిడి టంకర అంటారు. అన్‌సీజన్‌లో వంటకాలలో వాడుకుంటారు. జిల్లాలోని పల్లెల్లో ఆమ్‌చూర్‌ను తయారుచేసి నిజామాబాద్, హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. ఏడాదికో పంట కావడంతో మామిడికాయలను నిల్వ చేసేందుకు శీతల గిడ్డంగులు లేక.. ఆమ్చూర్ చేసి అమ్ముకుంటున్నారు. ఆమ్‌చూర్‌కు ఢిల్లీతోపాటు ఉత్తరాది రాష్ట్రాలు, విదేశాల్లో డిమాండ్ ఉంది. మహారాష్ట్ర వ్యాపారులతో స్థానిక వ్యాపారులు ఒప్పందం చేసుకొని ఎగుమతి చేస్తుంటారు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం సగం ధరనే ఉండడంతో మామిడి రైతులు, కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలు.. రాలిన కాయలు జిల్లాలోని ఇల్లంతకుంట, ముస్తాబాద్, కోనరావుపేట, తంగళ్లపల్లి, చందుర్తి, వేములవాడ, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, బోయినపల్లి మండలాల్లో మామిడితోటలు ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. తోటలను స్థానికులు కాంట్రాక్ట్ తీసుకుని చెట్లకు కాపలా ఉండి కాయలను కాపాడుకున్నారు. మరో పక్షం రోజుల్లో కాయలు చేతికొస్తాయని భావించగా.. అంతలోనే ఈదురుగాలులతో కాయలే రాలిపోయాయి. దీంతో మార్కెట్లో నాణ్యమైన మామిడికాయలకు కొరత ఏర్పడింది. ఈ సీజన్లో ఊరగాయల(తొక్కు)కు మామిడికాయలు పెద్దగా రావడం లేదు. ఉన్న కొద్దిపాట కాయలకు ధర మంచిగానే ఉన్నా మార్కెట్లో ఆమ్‌చూర్‌కు ధర లేక మామిడి రైతులు దిగాలు పడుతున్నారు. మామిడి దిగుబడి లేదు.. టంకరకు ధర లేదు అకాల వర్షాలు.. ఈదురుగాలులతో నష్టాలు మామిడి టంకర వ్యాపారం ఢీలాధర నిర్ణయించేది దళారీ ఆమ్చూర్ విక్రయాలకు కరీంనగర్ జిల్లాలో పెద్దగా మార్కెట్ లేదు. పొరుగునే ఉన్న నిజామాబాద్, లేదా హైదరాబాద్‌లో మార్కెట్ ఉండగా.. మహారాష్ట్ర వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తున్నారు. గతేడాది క్వింటాల్ ఆమ్‌చూర్‌కు రూ.35వేలు పలికింది. ఈ–నామ్ మార్కెట్ ఆధారంగా ఆమ్‌చూర్‌కు ధర నిర్ణయించాల్సి ఉండగా.. దళారులు సిండికేట్‌గా మారి ధర తగ్గించారని రైతులు వాపోతున్నారు. ఆమ్చూర్ ధర కనీసం క్వింటాలుకు రూ.30వేలు ఉంటే గిట్టుబాటవుతుందని మామిడి రైతులు అభిప్రాయపడుతున్నారు. అటు మామిడికాయల దిగుబడి లేక.. ఇటు అకాల వర్షాలతో కాయలు రాలిపోయి.. మరోవైపు మామిడి ఒరుగులకు ధర లేక ఈ ఏడాది తోటలను నమ్ముకున్న రైతులు, కాంట్రాక్టర్ల ఆశలు ఆవిరయ్యాయి. -
కొత్త చట్టాల ప్రకారమే కేసులు
సిరిసిల్లకల్చరల్: నూతన చట్టాల ప్రకారమే కేసులు నమోదు చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ తెలిపారు. డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో శనివారం ద్వైమాిషిక పర్యవేక్షణ సమీక్ష నిర్వహించారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, మానిటరింగ్, మెంటరింగ్ కమిటీ సభ్యులు, ప్యా నెల్ న్యాయవాదులతో సమావేశమయ్యారు. కొత్త చట్టాలతో నవీకరించే ప్రక్రియ చేపట్టాలని సూచించారు. అగ్రి లీగల్, ఎయిడ్, పారలీగల్ వలంటీర్లు, లా విద్యార్థుల పనితీ రును ప్రశంసించారు. డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాధికా జైస్వాల్, మానిటరింగ్ సభ్యుడు జి.అంజయ్య, లోక్‌అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, ఆడెపు వేణు, జి.అంజనేయులు పాల్గొన్నారు. -
సార్..పని ఇవ్వండి
● శ్రమజీవులకు ఉపాధి వెతలు ● భవన నిర్మాణ కూలీలకు పని కరువు ● పెరిగిన ముడిసరుకు ధరలతో ఆగిన నిర్మాణాలు ● లేబర్ అడ్డాపై ఎదురుచూపులే దిక్కు ● పల్లెల్లో ‘ఉపాధి’ లేదు.. పట్నంలో పని కరువు సిరిసిల్లటౌన్: ఒకప్పుడు భవన కార్మికుల ఉపాధికి కల్పతరువైన సిరిసిల్లలో ప్రస్తుతం పనులు దొరకడం లేదు. కార్మికులకు పనులు కల్పించడంలో ప్రభుత్వ విధానాలు, అధికారుల నిర్లక్ష్యంతో శ్రమజీవులకు పనిలేకుండా పస్తులుండే పరిస్థితులు వచ్చాయి. కొందరు దళారులు స్వార్థానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలకు తక్కువ కూలీ ఇస్తూ పనుల్లోకి తీసుకెళ్తున్నారు. శ్రమకు తగిన ఫలితం దక్కకుండా నిత్యం పనులు దొరక్క భవన నిర్మాణ కార్మికులు ప్రతిరోజు లేబర్అడ్డాపై పని ఇవ్వండి సారూ..అంటూ వచ్చిపోయే వారిని అర్థిస్తున్నారు. పనుల్లేకుండా అవస్థలు ఎదుర్కొంటున్న అడ్డా కూలీల వ్యథపై ప్రత్యేక కథనం. పని కోసం పడిగాపులు శ్రమించే చేతులకు పని లేకుండా పోయింది. పల్లెల్లో వ్యవసాయ పనులు ముగియడం.. ఉపాధి పనిలేకపోవడంతో పల్లెల నుంచి నిత్యం వందలాది సంఖ్యలో కూలీలు పొద్దున్నే సిరిసిల్లకు చేరుకుంటున్నారు. తెల్లవారుజామునే లేచి అన్నం వండుకొని సద్దిమూటలతో ఆటోలు ఎక్కి వచ్చేవారు కొందరైతే.. సైకిళ్లపై మరికొందరు వస్తున్నారు. జిల్లాలోని పదమూడు మండలాల పరిఽధిలోంచి కాకుండా.. కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా ప్రతిరోజు చాలా మంది కూలీలు వస్తున్నారు. అయితే పల్లెల్లో వ్యవసాయ పనులు ముగియడంతోపాటు ఇటీవల సిమెంటు, సలాక రేట్లు పెరిగిపోయాయి. భవన నిర్మాణాలు చాలా వరకు తగ్గిపోయాయి. ప్రతిరోజు సిరిసిల్ల పట్టణంలోనే సుమారు 3వేల మంది భవన నిర్మాణ పనుల్లో చేరి ఉపాధి పొందేవారు. ఇప్పుడు మందగించిన పనులతో అడ్టాపై కార్మికులకు నాలుగు రోజులకోసాసారి పనులు దొరుకుతున్నాయి. నిత్యం వందలాది మంది కూలీలు పని దొరక్క నిరాశతో ఇంటిదారి పడుతున్నారు. ఉపాధికి ధరాఘాతం గతంలో క్వింటాలు సలాక రూ.5వేలు ఉండగా.. ఇప్పుడు రూ. 6వేలు, సిమెంటు రూ.300 ఉండగా.. ప్రస్తుతం రూ.360, ఇటుక లోడ్ రూ.17 వేలు ఉండేది కాగా ప్రస్తుతం రూ.21వేలకు చేరినట్లు కార్మికులు, భవన నిర్మాణదారులు చెబుతున్నారు. స్థానిక అవసరాలకు ఇసుకను తోడేందుకు అధికారులు నిత్యం అనుమతులు ఇవ్వడం లేదు. ఫలితంగా భవన నిర్మాణ పనులు సరిగ్గా జరగడం లేదు. ఇతర రాష్ట్రాల కూలీలు కూడా రావడంతో సిరిసిల్లలో స్థానికులకు పని దొరకడం లేదు. అడ్డా కూలీల అవస్థలు ఇవీ ● సిరిసిల్ల లేబర్ అడ్డాకు షెడ్డు లేదు. ఫలితంగా కార్మికులు ఎండకు, వానకు ఇబ్బందులు పడుతున్నారు. ● అడ్డాపై కనీసం మరుగుదొడ్డి వసతి లేదు. పనులు దొరకని అవస్థకు తోడుగా ఒంటికి, రెంటికి పోవాలన్నా.. గుక్కెడు నీళ్లు తాగాలన్నా డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. ● అపార్టుమెంట్లలో పనిచేసే కార్మికులకు సేఫ్టిథింగ్స్ హెల్మెట్స్, గ్లౌజులు ఇవ్వడం లేదు. ● పనికి వచ్చే కార్మికులకు గుర్తింపుకార్డులు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు. ● అడ్డాపైన వైద్య, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం లేదు.పని లేకుంటే ఇబ్బందే.. నేను, నా భార్య లక్ష్మీనర్స వ్వ, కొడుకు అజయ్.. కూలీ పనిచేసుకుని బతుకుతాం. ఊరిలో బయట నుంచి వ చ్చిన కూలీలతో మాకు పనులు దొరుకుతలేవు. నేను ఇంట్లో నుంచి 6 గంటలకు బయలుదేరి సిరిసిల్లకు 7 గంటల వ రకు వస్తా. వారంలో రెండు రోజులే పని దొరుకుతుంది. మిగతా రోజుల్లో ప్రతిరోజు రూ.80 బస్సు కిరాయిలు మీద పడుతున్నాయి. – అల్లెపు సురేష్, గజసింగవరంఇరవై ఏళ్లుగా సిరిసిల్లకు వస్తున్న నేను ఇరవై ఏళ్లుగా సిరిసిల్ల లేబర్ అడ్డాపైకి వస్తున్న. ఏడాది సంది పనులు సరిగా దొరుకుతలేవు. రాను పోను రూ.30 ఖర్చు అవుతాయి. ఇద్దరు ఆడపిల్లలను సాకాలి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూలీలు తక్కువ పైసలు తీసుకుంటుండ్రని మాకు పనులు ఇస్తలేరు. కమీషన్ ఏజెంట్లు వాళ్ల కోసం ప్రత్యేకంగా అడ్డా పెట్టిండ్రు. దళారుల స్వార్థానికి మాలాంటోళ్లకు పనులు దొరకనివ్వట్లేదు. – గోరిబీ, రాళ్లపేట గుర్రాలగొంది నుంచి వస్తున్న నేను సిద్దిపేట జిల్లా గుర్రాలగొంది నుంచి ఇరువై ఏళ్లుగా ఇక్కడికి వస్తున్న. రానుపోను బస్సు కిరాయిలు రూ.70 పోతయి. ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలతో పోటీ ఎక్కువైంది. మరో దిక్కు స్థానికంగా ఇసుక దొరక్క భవన నిర్మాణాలు తగ్గి మాకు పనులు దొరుకుతలేవు. ఉదయం 5గంటలకు ఇంటి నుంచి వెళ్లిన. పని దొరకకుంటే నిన్న వచ్చిన కూలీ డబ్బులోంచి బస్సు కిరాయి పెట్టుకోవాలి. – ఎ.శివారెడ్డి, గుర్రాలగొంది పనులు తగ్గి.. పోటీ ఎక్కువైంది సిరిసిల్లలో ఇతర రాష్ట్రాల కూలీలతో స్థానిక కూలీలకు పనులు తగ్గి కూలీలకు పోటీ ఎక్కువైంది. మాకు నిత్యం పనులు దొరుకుతలేవు. ఊర్లలో వ్యవసాయ పనుల్లేవు. ఇక భవన నిర్మాణ ముడిసరుకుల ధరలు ఎక్కువైనయి. ఇసుకను రోజు ఇవ్వడం లేదు. ఫలితంగా చాలామటుకు నిర్మాణాల పనులు సరిగ్గా నడవడం లేదు. స్థానిక అవసరాలకు మొరం, ఇసుక రోజు అనుమతించాలి. – కోల శ్రీనివాస్, అడ్డా కూలీల అధ్యక్షుడు సంక్షేమ పథకాలు అందడం లేదు భవన నిర్మాణరంగ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అధికారుల నిర్లక్ష్యంతో అందడం లేదు. లేబర్అడ్డాౖ పె కనీసం నీడ లేదు. ఎండలు, వానలకు నిలబడాలి. బా త్రూమ్కు వెళ్లాలంటే, నీళ్లు తాగాలంటే రూ.5 ఖర్చు చేసుకోవాల్సిన పరి స్థితి. ఇది ఉన్నతాధికారులకు చెప్పినా అడ్డాపై కనీస వసతులు కల్పించడం లేదు. బయట కూలీలు, స్థానిక కూలీలకు ఒకే దగ్గర అడ్డా ఉంచితే అందరికీ పనులు దొరికేలా చూడాలి. – ఎగమంటి ఎల్లారెడ్డి, సీఐటీయూ అధ్యక్షుడు సమాచారం భవన కార్మికులు : 70 వేలు నమోదైన కార్మికులు: 50వేలు సిమెంటు బ్యాగు ధర: రూ.360 సలాక(క్వింటాలుకు): రూ.6వేలు ఇటుక(2వేల పీసులు): రూ.18,500 ఇటుక(బ్రాండెడ్, 2వేల పీసులు): రూ.21వేలు -
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
సిరిసిల్లటౌన్: రోడ్డు భద్రత నియమాలు పాటించా లని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో శుక్రవారం ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి ఇన్సూరెన్స్ గురించి వివరించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం నేరమని, సరైన పత్రాలు లేకుండా డ్రైవింగ్ చేసినా శిక్షార్హమేనన్నారు. లైసెన్సు లేని వారు వెంటనే తీసుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ సభ్యులు చింతోజ్ భాస్కర్, ఆడెపు వేణు, గుర్రం ఆంజనేయులు, ఆటోడ్రైవర్ యూనియన్ ప్రెసిడెంట్ కనకం శ్రీనివాస్ పాల్గొన్నారు. లైసెన్సులు తప్పనిసరిగా పొందాలి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్ ఆటోడ్రైవర్లకు అవగాహన -
సర్వేయర్లతో భూ సమస్యలు పరిష్కారం
● రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చందుర్తి(వేములవాడ): భూభారతి చట్టంలో దరఖాస్తుదారుల సమస్యల పరిష్కారానికి జూన్ 2వ తేదీ తర్వాత మండలానికి ఐదారుగురు సర్వేయర్లు వస్తారని రెవెన్యూ, సమాచార, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రుద్రంగి మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు హాజరయ్యారు. రుద్రంగిలో 243 ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకాగా.. వాటి నిర్మాణానికి భూమిపూజ చేసి మాట్లాడారు. భూ భారతిలో భాగంగా మండలంలో 1,300 దరఖాస్తులు స్వీకరించారని, జూన్ 2 తర్వాత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. భూభారతిలో భూముల రిజిస్ట్రేషన్‌తోపాటు హద్దులు, సర్వేయర్లు సర్వేచేసిన మ్యాప్‌లను పాసుబుక్‌లో ముద్రిస్తారని వివరించారు. రెండు రెవెన్యూ భవనాలకు నిధులు వేములవాడ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన రుద్రంగి, భీమారం మండలాల్లో రెవెన్యూ భ వన నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. వేములవా డ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ భవనానికి త్వరలో నిధులు మంజూరు చేస్తామన్నారు. ముంపు గ్రామాల బాధితులకు 4,696 ఇళ్లు మంజూరు చేస్తామని, అర్హులు మిగిలితే వారికి కూడా అందజేస్తామన్నారు. ఇందిరమ్మ పథకంలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇచ్చామని.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరిక మేరకు అదనంగా మరో 1,750 ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ప్రజలు ప్రశంసించేలా అభివృద్ధి : పొన్నం ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించి, జిల్లాను ప్రజ లు ప్రశంసించేలా అభివృద్ధి చేసి చూపిస్తామని బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయాలని ఆర్టీసీ బస్సులను అందజేస్తున్నట్లు తెలిపారు. వేములవాడ నుంచి మంబయికి త్వరలోనే ఏసీ బస్సును ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అభివృద్ధి పనులకు నిధులు : సీతక్క ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం నిధులు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. నాగారం చెరువు నుంచి కుక్కలగుట్టతండా వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందజేస్తుందన్నారు. యూనిఫాంలు, పాఠశాలల బిల్డింగ్ నిర్మాణాలు, ఇందిరాశక్తి క్యాంటీన్లు, ముందుకొచ్చే మహిళా సంఘాలకు రైస్మిల్లలను ఏర్పాటు చేస్తామని వివరించారు. రూ.150కోట్లతో ఆలయాభివృద్ధి : విప్ ఆది నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నానని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనులను రూ.150 కోట్లతో త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతే, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, రాష్ట్ర సహకార సంఘం చైర్మన్ తీపీరెడ్డి మోహన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఆర్డీవో రాధాబాయి, తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీవో నటరాజ్, రుద్రంగి, వేములవాడ, కోనరావుపేట మార్కెట్ కమిటీల చైర్మన్లు చెలుకల తిరుపతి, రొండి రాజు, కచ్చకాయల ఎల్లయ్య పాల్గొన్నారు. -
నిలిచిన మైనర్ వివాహం
● తల్లిదండ్రులకు అధికారుల కౌన్సిలింగ్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గుట్టుచప్పుడు కాకుండా మైనర్ బాలిక వివాహం చేస్తున్నట్లు తె లుసుకున్న అధికారులు అక్కడికి వెళ్లి పెళ్లిని అ డ్డుకున్నారు. మైనర్ వివాహంపై తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అధికారులు తెలిపిన వివరాలు. మండలంలోని నారాయణపూర్‌లో శుక్రవారం మైనర్ బాలిక(17) వివాహం చేస్తుండగా.. సమాచారం అందడంతో ఐసీడీఎస్, సఖీ కేంద్రం, రెవెన్యూ, పోలీసు అధికారులు చేరుకొని అడ్డుకున్నారు. సీడీపీవో ఉమారాణి, తహసీల్దార్ సుజాత మాట్లాడుతూ.. మైనర్ వివాహాలు చట్టరీత్య నేరమన్నారు. మైనార్టీ తీరిన తర్వాతనే వారి ఇష్టానుసారంగా పెళ్లి చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. చైల్డ్‌లైన్ అధికారులు విజయలక్ష్మి, సూపర్వైజర్ శ్రావణ్, ఆర్ఐ శ్రావణ్‌కుమార్, లీగల్ ప్రొటెక్షన్ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ముస్తాబాద్(సిరిసిల్ల): బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ శ్రేణులకు కరీంనగర్ పార్లమెంట్ కోకన్వీనర్ ఆడెపు రవీందర్ కోరారు. గంభీరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీపై ప్రజలు సానుకూలంగా ఉన్నారన్నారు. ప్రధాని మోదీ దేశ రక్షణ కోసం, ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. దేశంలో సుస్థిరపాలన బీజేపీతోనే సాధ్యమన్నారు. మండల అధ్యక్షుడు కోడె రమేశ్, నాయకులు పాల్గొన్నారు. -
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
● జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత వీర్నపల్లి(సిరిసిల్ల): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోనే డెంగీ వ్యాధిని నివారించగలమని జిల్లా వైద్యాధికారి రజిత పేర్కొన్నారు. వీర్నపల్లి మండలకేంద్రంలో శుక్రవారం డెంగీపై అవగాహన కల్పించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో నీటిని నిల్వ చేసుకోవద్దని సూచించారు. తీవ్రమైన తలనొప్పి, జ్వరం, శరీరంపై దద్దులు, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు ఉంటే వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో సంప్రదించాలని సూచించారు. పనికిరాని పాత్రలు, పాతటైర్లు, పగిలిపోయిన బకెట్లు ఉంటే బయట పడేయాలని సూచించారు. ప్రతీ మంగళ, శుక్రవారాలు డ్రై డేగా పాటించాలన్నారు. అనంతరం గ్రామంలో ర్యాలీ తీసి, గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. వైద్యులు అంజలి, ఆల్ఫ్రెడ్, అనిత, రామకృష్ణ, సారియా అంజు, డిప్యూటీ డెమో రాజ్‌కుమార్, హెచ్‌ఈవో లింగం, ఎస్‌యూవో మోహన్, డీడీఎం కార్తీక్ పాల్గొన్నారు. రైతుబజార్లో వసతులు కల్పిస్తాం ● జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని రైతుబజార్లో వసతులు కల్పిస్తామని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపరెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లలోని మోడల్ రైతుమార్కెట్ను శుక్రవారం సందర్శించారు. వ్యాపారులు, రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. రైతుబజార్ ఇన్ని రోజులు మున్సిపల్‌శాఖ నిర్వహణలో ఉండేదని, రెండు రోజుల క్రితమే వ్యవసాయశాఖ నిర్వహణ బాధ్యతలు తీసుకుందని తెలిపారు. రైతుబజార్లో టాయిలెట్స్, తాగునీటి సౌకర్యంపై ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. రైతులకు కేటాయించిన దుకాణాల్లోనే కూరగాయలు విక్రయించుకోవాలని, రోడ్డుపై విక్రయించొద్దని సూచించారు. ఏఎంసీ డైరెక్టర్లు దుబాల వెంకటేశం, ఖాజా, ఆడెపు జగన్ పాల్గొన్నారు. కార్మికులు బెనిఫిట్స్ కోల్పోతున్నారు సిరిసిల్లటౌన్: జిల్లా కార్మికశాఖ అధికారుల నిర్లక్ష్యంతో లేబర్‌కార్డులు లేక కార్మికులు ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ కోల్పోతున్నారని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల లోని కార్మికభవన్‌లో శుక్రవారం భవన నిర్మాణ కార్మిక సమస్యలపై మాట్లాడారు. కార్మికులకు ప్రమాదం జరిగితే రూ.10లక్షలు, సహజ మరణానికి రూ.5లక్షలు, డెలివరీకి రూ.50వేలు, పెండ్లికి రూ.లక్ష ఇవ్వాలని కోరారు. హెల్త్ చెకప్ పేరుతో జరుగుతున్న దోపిడీని ఆపాలని కోరారు. నాయకులు అజ్జ వేణు, సంజీవరెడ్డి పాల్గొన్నారు. వర్షానికి కూలిన ఇల్లుముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని మోహినికుంటలో మూడు రోజులుగా పలుమార్లు కురిసిన వర్షానికి ఓ ఇల్లు కూలిపోయింది. గ్రామానికి చెందిన రైతు మంద అశోక్ పెంకుటిల్లు శుక్రవారం కూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వానలతో ఇల్లు ఉరుస్తోందని, వాన నీటికి గోడలు తడిసి పడిపోయిందని బాధిత రైతు అశోక్ తెలిపారు. -
ఇల్లాలు.. కన్నీళ్లు
కరీంనగర్‌క్రైం: పెళ్లి చేసుకొని కోటి ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన మహిళలకు మొదట్లో బాగానే ఉన్నప్పటికీ రోజులు గడుస్తున్న కొద్ది రకరకాల రూపాల్లో వేధింపులు ఎదురవుతున్నాయి. అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్త, మామ, ఆడబిడ్డల వేధింపులు పెరుగుతున్నాయి. పోలీసుస్టేషన్లలో పెద్ద ఎత్తున పిటిషన్లు ఈ కారణాలతోనే వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆర్థిక పరిస్థితుల పరంగా వెనకబడడంతో మగవారు మద్యం, గంజాయి ఇతర దురలవాట్లకు బానిసవుతున్నారు. దీంతో నిత్యం మద్యం తాగి ఇంట్లో గొడవ పెట్టడం, ఇల్లాలిని తిట్టడం, భౌతిక దాడులకు పాల్పడడం జరుగుతోంది. ఇలాంటి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు ● అనుమానం పెనుభూతంగా మారి ఇల్లాలిని హత్య చేయడం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అలాగే, వివిధ రకాల వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ● ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుమానం కారణంగానే హత్యలు, ఆత్మహత్యలకు దారితీస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు మహిళలు ఇంట్లో ఆర్థిక పరిస్థితి చితికిపోవడంతో భవిష్యత్తు జీవితాన్ని ముందుకు తీసుకెళ్లలేమని భయపడి ముందుగానే తనువు చాలిస్తున్నారు. ● బతుకుబండిని మోయలేక వ్యసనాలకు అలవాటుపడి భర్తలు.. ఇంట్లో పరిస్థితులు రోజురోజుకు దిగజారి కనీస అవసరాలను సైతం వివాహితలు పుట్టింటివారికి చెప్పుకోలేక బలవన్మరణానికి పాల్పడిన ఘటనలు అనేకం ఉంటున్నాయి. ● అలాగే మిస్సింగ్ కేసుల్లో కూడా ఎక్కువ శాతం వివాహితలు ఉంటున్నట్లు గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. ఇంట్లో సమస్యలు భరించలేక, వేధింపులు తట్టుకోలేక ఇళ్ల నుంచి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. వేధింపులు ఆగడంలేదు సమాజంలో మహిళలపై వేఽ దింపులు పెరుగుతున్నాయి. అదనపు కట్నం కోసం వివిధ విషయాల వల్ల ఆడవారిపై భర్త, వారి కుటుంబ సభ్యుల గృహహింస కేసులు పెరుగుతుండడం కనిపిస్తుంది. చిన్న విషయాలకే హత్యలు, ఆత్మహత్యల ఘటనలు జరుగుతున్నాయి. ఆడవారి భద్రతకు మరింత కఠిన చట్టాలు అవసరం. – కర్రె పావని, ఆదరణ సేవా సమితి, ఎన్జీవో నిర్వాహకురాలు కౌన్సెలింగ్ ఇస్తున్నాం గృహహింస కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. భర్త, భర్త కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేస్తున్నారని చాలా ఫిర్యాదులు వస్తుంటాయి. మేము సాధ్యమైనంత వరకు కౌన్సెలింగ్ ఇచ్చి జంటలను కలుపుతున్నాము. తీరుమార్చుకోకపోతే కేసులు నమోదు చేసి కోర్టుకు పంపిస్తున్నాం. – శ్రీలత, సీఐ, కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్ -
ప్రాణం తీసిన ఈతసరదా
● ఈతకు వెళ్లి యువకుడి మృతి ఎలిగేడు(పెద్దపల్లి): స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసేందుకు వచ్చిన యువకుడు ముష్కి రాజీవ్‌గాంధీ(36) ఈత కోసమని వెళ్లి నీటమునిగి చనిపోయాడు. ఈ ఘటన ముప్పిరితోట గ్రామంలో చోటుచేసుకుంది. జూలపల్లి ఎస్సై సనత్ కుమార్ కథనం ప్రకారం.. గోదావరిఖనిలోని జైభీమ్‌నగర్‌కు చెందిన ముష్కి రాజీవ్‌గాంధీ ఈనెల 14న ముప్పిరితోట గ్రామంలో జరిగిన శ్రీవేంకటేశ్వరస్వామి రథోత్సవం, జాతరకు వచ్చాడు. సాయంత్రం వేళ సరదాగా స్నేహితులతో కలిసి వ్యవసాయ బావిలో ఈత కొట్టడానికి వెళ్లాడు. ప్లాస్టిక్ డబ్బా కట్టుకుని బావిలో దిగాడు. ప్రమాదవశాత్తు బావిలో నీట మునిగి మృతి చెందాడు. గురువారం ఉదయం వ్యవసాయ బావి నుంచి మృతదేహాన్ని బయటకు తీసి సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. నీటి సంపులో పడి చిన్నారి మృతివేములవాడ అర్బన్: నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్‌లో గురువారం విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాలు. తిప్పాపూర్‌లో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం వచ్చింది. నాలుగేళ్ల చిన్నారి జిక్రా ఫాతిమా ప్రమాదవశాత్తు ఇంటి ముందు నీటిసంపులో పడిపోయింది. ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతిచెందింది. ఈ సంఘటనపై పోలీసులను వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. రైలు ఢీకొని యువకుడు..మల్యాల: కొడిమ్యాల మండలం రాంసాగర్‌కు చెందిన అనుముల శేఖర్ (37) కొండగట్టు సమీపంలో రైలు ఢీకొని మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. వార్డు సభ్యుడిగా పనిచేసిన శేఖర్ ఇటీవల దుబాయ్ వెళ్లి వచ్చాడు. బుధవారం కొండగట్టు సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మల్యాల సీఐ నీలం రవి, ఎస్సై నరేశ్‌కుమార్‌లు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే ప్రమాదవశాత్తు రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొందా? రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి జైలుజగిత్యాలక్రైం: అతిగా మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడిన వ్యక్తికి న్యాయమూర్తి ఒకరోజు జైలుశిక్ష విధించారు. రాయికల్ మండలం ఉప్పుమడుగు గ్రామానికి చెందిన అల్లెపు వెంకటనర్సయ్య ఇటీవల అతిగా మద్యం సేవించి వాహనం నడుపగా రాయికల్ ఎస్సై సుదీర్‌రావు పట్టుకుని అతడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని గురువారం స్పెషల్ జ్యూడిషియల్ మెజిస్టేట్ సెకెండ్ క్లాస్ న్యాయమూర్తి కరుణాకర్ ముందు హాజరు పర్చగా ఒకరోజు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. గొర్రె, మేకల దొంగల అరెస్టుమల్యాల: గొర్రెలు, మేకలు ఎత్తుకెళ్లి విక్రయిస్తూ జల్సాలు చేస్తున్న ముగ్గురు దొంగలను పట్టుకొని అరెస్టు చేసినట్లు మల్యాల సీఐ నీలరం రవి, ఎస్సై నరేశ్‌కుమార్ తెలిపారు. జగిత్యాలకు చెందిన ముద్దవేని అనిల్, మహ్మద్ మోసిన్, వెంకటేశ్‌లు రాత్రివేళ గ్రామాల్లో మోటారు సైకిల్, ఆటోల్లో తిరుగుతూ షెడ్లలోని గొర్రెలు, మేకలను దొంగిలించి కొన్నింటిని అమ్ముకోగా, మరికొన్నింటిని కోసి మాంసం విక్రయించే వారన్నారు. వచ్చిన డబ్బులను సమానంగా పంచుకొని జల్సాలు చేస్తున్నట్లు తెలిపారు. గురువారం మల్యాల ప్రాథమిక సహకార కేంద్రం వద్ద వాహనాల తనిఖీ చేపట్టగా బైక్, ఆటోలో రెండు మేకలు, రెండు గొర్రెలు తీసుకెళ్తున్న వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా వివిధ ప్రాంతాల్లో గొర్రెలు, మేకలు దొంగిలించినట్లు అంగీకరించారన్నారు. బైక్, ఆటో, రెండు మేకలు, రెండు గొర్రెలు స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. -
ప్రతీ జిల్లాలో రైతువిజ్ఞాన కేంద్రం
జగిత్యాలఅగ్రికల్చర్: కృషి విజ్ఞాన కేంద్రాలు, డాట్ సెంటర్లు లేని అన్నిజిల్లాల్లో రైతువిజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ జానయ్య తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో గురువారం శ్రీరైతు ముంగిట్లో శాస్త్రవేత్తలుశ్రీ కార్యక్రమం నిర్వహించారు. జానయ్య ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే 17 జిల్లాల్లో డాట్ సెంటర్లు, కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయన్నారు. మిగతా జిల్లాల్లో రైతువిజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒక్కో కేంద్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతీజిల్లాలో 50 ఎకరాలు అందుబాటులో ఉన్నచోట రైతువిజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో లేదని, వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేక రైతు కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులతో పంటలపై అనేకరకాల పురుగులు, తెగుళ్లు దాడి చేస్తున్నాయన్నారు. వాటి నివారణకు శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధనలు చేయాలని కోరారు. ఆర్ఎంపీల మాదిరిగా గ్రామాల్లో ఫార్మర్స్ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం తెలంగాణ సీడ్ సంస్థ రూపొందించిన శ్రీమన సంస్థ– మన విత్తనంశ్రీ ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ శ్రీలత, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ సైదానాయక్, జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖాధికారులు భాస్కర్, శ్యాంప్రసాద్, రైతు నాయకులు రవీందర్‌రెడ్డి, నారాయణరెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ వర్శిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ జానయ్య -
ముగ్గురు యువకులపై కత్తులతో దాడి
● ఒకరి పరిస్థితి విషమం జగిత్యాలక్రైం: పుట్టిన రోజు వేడుకలకు సిద్ధమవుతున్న యువకుడితో పాటు అతని ఇద్దరు స్నేహితులపై కత్తులతో దాడి చేయడంతో ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన గురువారం లింగంపేట శివారులో చోటు చేసుకుంది. జగిత్యాలరూరల్ మండలం అంతర్గాంకు చెందిన ఏళ్ల అరవింద్ తన జన్మదిన వేడుకల కోసం అంతర్గాం, లింగంపేట శివారులోని గంగమ్మతల్లి ఆలయం వద్ద ఏర్పాట్లు చేసుకున్నాడు. అరవింద్ అతని స్నేహితులు తోపారపు గంగాధర్, ఉయ్యాల వంశీలు ఉండగా ఉండగా అదే గ్రామానికి చెందిన మహేశ్, రాకేశ్, చందు, దినేశ్‌తో పాటు మరికొంతమంది కత్తులతో దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. గంగాధర్‌కు 23 చోట్ల గాయాలు కాగా, అరవింద్, వంశీలకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆటోలో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా విషయం తెలుసుకున్న సీఐ వేణుగోపాల్, ఎస్సై గీత బాధితుల నుంచి వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మహేశ్, రాకేశ్, దినేశ్, చందులతో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై వేణుగోపాల్ తెలిపారు. -
దేశరక్షణలో పల్లె యువత
● సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న జిల్లా బిడ్డలు ● కశ్మీర్లో కాపలాగా ఉన్న యువకులు ● గర్వంగా భావిస్తున్న కుటుంబ సభ్యులు కోనరావుపేట(వేములవాడ)/ఇల్లంతకుంట(మానకొండూర్): దేశరక్షణలో జిల్లా యువత ముందుంటున్నారు. ఉగ్రవాద ముష్కరులను మట్టుబెట్టడంలో మేమున్నామంటూ దేశసరిహద్దుల్లో గస్తీ కాస్తున్నారు. ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనగా జిల్లాలో ఉద్విగ్న పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత సైన్యంలో పనిచేస్తున్న జిల్లాకు చెందిన యువతలో అత్యధికులు జమ్మూకశ్మీర్‌లోని దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్నారు. సరిహద్దుల్లో గస్తీ కాస్తూ రక్షణగా నిలుస్తున్న వారిలో కోనరావుపేట మండలం మామిడిపల్లి నుంచి జవ్వాజి ప్రసాద్, బెదిరె వేణు, కోనరావుపేట నుంచి కస్తూరి ప్రశాంత్‌రెడ్డి, అజ్జు, ఎగ్లాస్పూర్ నుంచి తాళ్లపెల్లి శ్రీకాంత్, తాళ్లపెల్లి వినోద్, వేములవాడ మండలం చెక్కపల్లి నుంచి మెతుకు మధుకర్‌రెడ్డి, ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన అంతటి అనిల్ ఉన్నారు. గత కొన్నేళ్లుగా జమ్మూకశ్మీర్, లడక్‌లో దేశభద్రత విధుల్లో నిమగ్నమై ఉన్నారు. -
టికెట్ బుక్ చేసుకొని.. అక్కడే ఆగిపోయి
ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన ఆర్మీ జవాన్ అంతటి అనిల్ జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆ ప్రాంతంలోనే బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నాడు. గత 8 నెలలుగా జమ్మూసెక్టార్లోనే ఉంటున్నాడు. ఈనెల 7న ఇంటికొచ్చేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ 6వ తేదీ నుంచి యుద్ధ సన్నాహాలు మొదలుకావడంతో అక్కడే ఉండిపోయాడు. ఇల్లంతకుంట మండల కేంద్రం నుంచి 11 మంది యువకులు ఆర్మీలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అంతటి అనిల్ -
ఎనిమిదేళ్లుగా దేశ సేవలోనే..
నేను గత ఎనిమిదేళ్లుగా దేశ సేవలోనే ఉంటున్నాను. మా నాన్న అంజయ్య మద్దిమల్లలో పనులు చేసుకుంటాడు. తల్లి లక్ష్మి ఇంటి వద్దే ఉంటుంది. నేను ప్రస్తుతం పంజాబ్ సమీపంలోని పటిండ వద్ద విధులు నిర్వర్తిస్తున్నాను. మాకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో పాక్ బాంబు పడింది. – తాళ్లపల్లి వినోద్, ఎగ్లాస్పూర్ (కోనరావుపేట) దేశ సేవలో.. నా తల్లిదండ్రులు బెదిరె నాంపెల్లి–లక్ష్మి. అమ్మానాన్న గ్రామంలోనే ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటారు. నేను 2019లో ఆర్మీలో చేరాను. గత ఐదేళ్లుగా ఆర్మీలో పనిచేస్తుండడం సంతోషంగా ఉంది. దేశం కోసం పనిచేయడం గర్వంగా ఉందని వేణు పేర్కొన్నాడు. – బెదిరె వేణు, మామిడిపల్లి (కోనరావుపేట) -
సరస్వతీ నమస్తుతే..
● విశేష పూజలతో పుష్కరాలు ప్రారంభం ● తొలిస్నానం ఆచరించిన శ్రీశ్రీ మాధవనంద సరస్వతిస్వామి ● మొదటిరోజు సుమారు 50 వేల మంది పుణ్యస్నానం కాళేశ్వరం: సరస్వతి నది పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో గురువారం ఉదయం 5.44 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛరణలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి సరస్వతి ఘాట్‌లోని త్రివేణి సంగమం, అంతర్వాహిని సరస్వతి నదిలో పుష్కర స్నానాలు ఆచరించారు. కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో క్యూలైన్లో భక్తులు గంటల తరబడి నిల్చొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం వరకు భక్తుల రద్దీ నెలకొంది. మొదటి రోజు భక్తుల తాకిడి.. తొలిరోజు ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేటు వాహనాల్లో వచ్చిన భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. భక్తుల తాకిడితో ఆలయ పరిసరాలు, గోదావరి తీరం కిక్కిరిసింది. పార్కింగ్ స్థలాల్లో వాహనాల రద్దీ నెలకొంది. సుమారు 50 వేల మంది భక్తులు పుష్కర స్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. హారతి గద్దెలకు ఏడు జీవనదుల పేర్లు సరస్వతి నది పుష్కరాల సందర్బంగా కాశీ పండితులచే నవరత్నమాల హారతి కార్యక్రమం నిర్వహించడానికి చతుర్వేదసరస్వతి ఘాట్ వద్ద ఏడు గద్దెలు నిర్మించారు. దేవాదాయశాఖ అధికారులు ఆ గద్దెలకు ఏడు జీవనధుల పేర్లను ప్రకటించారు. వాటిలో గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధూ, కావేరి పేర్లను శిలాఫలకం రూపంలో తయారు చేసి ప్రదర్శించారు. కాళేశ్వర శాశ్వత అభివృద్ధికి తోడ్పాటు కాళేశ్వర శాశ్వత అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మాస్టర్ ప్లాన్ తయారు చేసి నివేదించాలని మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్‌ను సీఎం కోరారు. పుష్కర ఏర్పాట్లపై సీఎం సంతృప్తి వ్యక్తం చేసి మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులను అభినందించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాబోయే గోదావరి పుష్కరాల్లోగా కాళేశ్వర అభివృద్ధికి రూ.100 కోట్ల నిధుల మంజూరుతోపాటు పర్యాటక క్షేత్రంగా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఇప్పటికే రూ.35కోట్లు మంజూరు చేశారని సీఎంకు కృత/్ఞతలు తెలిపారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి సీఎం ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రానున్న గోదావరి, కృష్ణ ఫుష్కరాలతో పాటు సమ్మక్క–సారలమ్మ జాతరను విజయవంతం చేస్తామని అన్నారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక లోటుపాట్లతో ఉన్నప్పటికి పుష్కర ఏర్పాట్లు ఘనంగా చేశామన్నారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పన్నెండేళ్లకు ఓసారి వచ్చే సరస్వతిమాత పుష్కరాలను భక్తులు ఆచరించాలని సూచించారు. -
పారిశుధ్య కార్మికుల భద్రత అందరి బాధ్యత
● డీఆర్డీవో శేషాద్రి సిరిసిల్ల: గ్రామాల్లో పరిశుభ్రత నెలకొల్పడానికి రేయింబవళ్లు శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల రక్షణ, భద్రత, బాధ్యత అందరిపై ఉందని డీఆర్డీవో శేషాద్రి పేర్కొన్నారు. ‘యూనిసెఫ్ – స్వచ్ఛ భారత్’ సమన్వయంతో పారిశుధ్య కార్మికుల రక్షణ, భద్రత, గౌరవం అనే అంశంపై కలెక్టరేట్లో గురువారం ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చారు. డీఆర్డీవో శేషాద్రి మాట్లాడుతూ గ్రామాల్లో చెత్త నిర్వహణ, సేంద్రీయ ఎరువుల తయారీ పనులు చేస్తున్న పారిశుధ్య కార్మికులకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన పని వాతావరణం ఏర్పాటు చేయాలని యూనిసెఫ్ శిక్షకుడు ఫణీంద్ర తెలిపారు. కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలని, తరచూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, రక్షణ కవచాలు ఇచ్చి వాడేలా అవగాహన కల్పించాలని సూచించారు. యూనిసెఫ్ సమన్వయకర్త కిషన్ స్వామి, స్వచ్ఛభారత్ శిక్షకుడు రమేశ్, సిరిసిల్ల స్వచ్ఛ భారత్ కో ఆర్డినేటర్ సురేష్ పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందిస్తున్న పలువురు పారిశుధ్య కార్మికులను సన్మానించారు. డీఎల్పీవో నరేశ్, స్వచ్ఛభారత్ మిషన్ కన్సల్టెంట్ ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కులమతాలకు అతీతంగా అభివృద్ధి
ఎల్లారెడ్డిపేట/తంగళ్లపల్లి(సిరిసిల్ల): తమ హయాంలో కులమతాలకు అతీతంగా అభివృద్ధి చేశామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం శివారులోని దర్శావలిగుట్టపై గురువారం నిర్వహించిన ఉర్సు ఉత్సవాలకు హాజరై మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో దర్శావలి గుట్టను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను ఉర్సు ఉత్సవాల నిర్వాహకులు సన్మానించారు. ఉత్సవాల్లో రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మాజీ జెడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, నాయకులు అందె సుభాష్ తదితరులు పాల్గొన్నారు. భీరప్పకామరాతి కల్యాణానికి హాజరు తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లిలో నిర్వహించిన భీరప్పకామరతి కల్యాణంలో కేటీఆర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు జనం పోటీపడ్డారు. ● దర్శావలి ఉర్సు ఉత్సవాల్లో మాజీ మంత్రి కేటీఆర్ -
మంత్రుల పర్యటనకు పటిష్ట భద్రత : ఎస్పీ
సిరిసిల్ల ఎడ్యుకేషన్: రుద్రంగి మండలంలో శుక్రవా రం మంత్రుల పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రత చేపడుతున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. తీసుకోవాల్సిన భద్రత చర్యలపై జిల్లా పోలీస్ ఆఫీస్‌లో గురువారం సమీక్షించారు. వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ మురళీకృష్ణ, డీసీ ఆర్బీ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, వెంకటేశ్వర్లు, మధుకర్, నాగేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ
● బోధనలో మార్పులు అవసరం ● జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు సిరిసిల్లఎడ్యుకేషన్: మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు నూతన విధానంలో బోధన చేయాలని జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు పేర్కొన్నారు. సిరిసిల్లలో కొనసాగుతున్న శిక్షణ శిబిరాన్ని జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు, కరీంనగర్ డైట్ కళాశాల బోధకులు, స్టేట్ రిసోర్సు పర్సన్లు సందర్శించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. బోధన మార్పులకనుగుణంగా ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాల ద్వారా బోధించాల్సి ఉంటుందన్నారు. శిక్షణలో భాగంగా సాంఘికశాస్త ఉపాధ్యాయులకు మోటివేషన్ తరగతులను శ్రీనివాస్, బోధించారు. కోర్సు కోఆర్డినేటర్ శైలజ, కోర్సు ఇన్చార్జీలు శారద, పద్మ, వెంకటేశ్వర్రావు, జిల్లా సైన్స్ అధికారి దేవయ్య, జిల్లా రిపోర్సు పర్సన్లు తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక సదుపాయాలకు పెద్దపీట!
● అదనపు లైన్లు, స్టేషన్ల ఆధునీకరణకు నిధులు ● ఫైనల్ లొకేషన్ సర్వే కోసం నిధులు విడుదల ● కొత్తపల్లి–మనోహరాబాద్‌కు రూ.205 కోట్లు ● పెద్దపల్లి బైపాస్కు రూ.36 కోట్లు, నిజామాబాద్–పెద్దపల్లికి రూ.13 కోట్లు ● కొలనూరు ఆర్వోబీకి రూ.29 కోట్లు, రాఘవాపురం ఆర్వోబీకి రూ.36 కోట్లు ● ఉమ్మడి జిల్లాకు రూ.435 కోట్లకుపైగా నిధులు ● ఆలస్యంగా దక్షిణ మధ్య రైల్వే పింక్‌బుక్ సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఎట్టకేలకు దక్షిణమధ్య రైల్వే బడ్జెట్ 2025–26 వెలుగుచూసింది. వాస్తవానికి ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండు లేదా మూడు రోజుల తర్వాత స్థానిక రైల్వే విభాగాల కేటాయింపులను పింక్ బుక్ పేరిట విడుదల చేస్తారు. కానీ..దాదాపు నాలుగు నెలల తరువాత బడ్జెట్ వెలుగుచూడటం ఇదేతొలిసారి. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల మార్గాల్లో నెలకొన్న ఈ బడ్జెట్లో రైల్వే పనుల కోసం దాదాపు రూ.435 కోట్లకుపైగా నిధులు కేటాయించింది. ఇవే కాకుండా పలు అభివృద్ధి పనులకు మిగిలిన జిల్లాల్లోని స్టేషన్లతోకలిపి మరికొన్ని రూ.కోట్లు కేటాయించడం గమనార్హం. ఈసారి స్టేషన్ల ఆధునీకరణ, స్టేషన్లలో లైప్లైన్ల ఏర్పాటు, గూడ్స్ షెడ్ల నిర్మాణం, స్టేషన్లలో అదనపు మెయిన్ లైన్ల ఏర్పాటుకు ఈ నిధులు కేటాయించింది. కొత్తపల్లి మనోహరాబాద్‌కు రూ.205 కోట్లు అత్యంత కీలకదశలో ఉన్న కొత్తపల్లి–మనోహరాబాద్ (151 కిమీ) మార్గానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.205 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం సిద్దిపేట (సుమారు 77 కిమీ) వరకు లైన్ పూర్తయి సర్వీసు కూడా నడుస్తోంది. సిరిసిల్ల–సిద్ధిపేట మధ్య లైన్‌పనులు నడుస్తున్నాయి. ఇప్పటికే కరీంనగర్, సిరిసిల్లలో భూసేకరణ వేగంగా సాగుతోంది. 2026 వరకు ట్రాక్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. మిడ్‌మానేరులో బ్రిడ్జి పనులు సవాలుగా మారనున్నాయి. ఫలితంగా 2027లో పూర్తి అవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సర్వేలకు.. ఉమ్మడి జిల్లా పరిధిలోని మూడు లైన్లకు ఫైనల్ లొకేషన్ సర్వేలకు నిధులు కేటాయించింది. కరీంనగర్–హసన్‌పర్తి రూ.1.55 కోట్లు, పెద్దపల్లి బైపాస్ లైన్ ఎఫ్ఎల్ఎస్ సర్వే రూ.2 లక్షలు, పెద్దపల్లి–నిజామాబాద్ డబ్లింగ్ లైన్ ఎఫ్ఎస్ఎల్ సర్వే కోసం రూ.3.56 కోట్లు ఇచ్చింది. స్టేషన్ల కోసం.. నూకపల్లి– మల్యాల నూకపల్లి మల్యాల హాల్ట్ స్టేషన్‌ను బ్లాక్ స్టేషన్‌గా మార్చేందుకు రూ.15.85 కోట్లు కరీంనగర్లో అదనంగా రెండు లూప్లైన్ల నిర్మాణం, రైల్వేస్టేషన్ కోసం రూ.27.50 కోట్లు నిజామాబాద్–పెద్దపల్లి సెక్షన్లో లింగపేట–జగిత్యాల స్టేషన్లోలూప్లైన్ కోసం రూ.19.89 కోట్లు మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి ప్లాట్‌ఫారాల అభివృద్ధికి రూ.4.54 కోట్లు పెద్దపల్లిలో గూడ్స్ షెడ్ అభివృద్ధి కోసం రూ.9.99 కోట్లు పెద్దపల్లి–నిజామాబాద్ మార్గంలో న్యూ క్రాసింగ్ స్టేషన్ పూడురు (నూకపల్లి మల్యాల–గంగాధర స్టేషన్ మధ్యలో) రూ.23.59 కోట్లు సుల్తానాబాద్–ఎస్టీబీడీ యార్డ్ విస్తరణ, అప్‌గ్రేడేషన్ కోసం రూ.రూ.36.80 కోట్లు మణుగూరు–రామగుండం (రాఘవాపురం) 200 కి.మీ లైన్‌కు ఈసారి నామమాత్రపు నిధులు కేటాయించారు. మెయిన్‌లైన్‌కు నిజామాబాద్– కరీంనగర్–పెద్దపల్లి లైన్ కోసం రూ.13.86 కోట్లు పెద్దపల్లి బైపాస్ లైన్ (2.169 కిమీ) ను బల్లార్షా కాజీపేట మెయిన్ లైన్‌కోసం రూ.36.99 కోట్లు రైలు వంతెనల కోసం.. కొలనూరు–పెద్దపల్లి ఆర్వోబీ కోసం రూ.29.33 కోట్లు పెద్దపల్లి–రాఘవాపురం ఆర్వోబీ కోసం రూ.36.83 కోట్లు కొలనూరు–పెద్దపల్లి స్టేషన్ల మధ్య ఆర్యూబీ రూ.7.41 కోట్లు -
వెల్జీపురం రూట్ పరిశీలన
ఇల్లంతకుంట: సిరిసిల్ల నుంచి మండలంలోని వెల్జీపూర్కు ఆర్టీసీ బస్సు నడిపేందుకు డీఎం శ్రీనివాసరావు గురువారం రూట్‌మ్యాప్ పరిశీలించారు. ఈనెల 7న మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెల్జీపూర్ రాగా గ్రామస్తుల విన్నవించారు. ఎమ్మెల్యే వెంటనే డీఎంతో మాట్లాడి బస్సు నడిపించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈమేరకు డీఎం గ్రామంలో పర్యటించగా.. మానసాదేవి టెంపుల్ వరకు బస్సు నడపాలని గ్రామస్తులు వినతిపత్రం అందించారు. ఇక్కడి నుంచి దాచారం గ్రామానికి రూట్ పరిశీలనకు డీఎం వెళ్లారు. గుండ వెంకటేశం, ఏఎంసీ డైరెక్టర్ రాంప్రసాద్, బొజ్జ శ్రీనివాస్, బాల్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి ● డీఎంహెచ్‌వో రజిత వేములవాడరూరల్: రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత సూచించారు. వేములవాడరూరల్ మండలం హన్మాజిపేట, చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కాయకల్ప అసెస్మెంట్ జిల్లా టీంతో కలిసి బుధవారం తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసరాల్లో పరిశుభ్రతతోపాటు రోగులకు అందించే తాగునీరు, మరుగుదొడ్లు, బిల్డింగ్ నాణ్యత ప్రమాణాలను జిల్లా క్వాలిటీ సిబ్బందితో తనిఖీ చేశారు. జిల్లా క్వాలిటీ టీం ఎన్హెచ్ఎం డీపీవో రాజేందర్, క్వాలిటీ మేనేజర్ సింధూజ, వైద్యాధికారులు సురేష్, దివ్యశ్రీ పాల్గొన్నారు. స్కానింగ్ వివరాలు నమోదు చేయాలిసిరిసిల్ల: స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు స్కానింగ్ వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో గురువారం పీసీపీఎన్డీటీ–యాక్టుపై వైద్యసిబ్బందితో సమీక్షించారు. స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు, రేడియాలజిస్టులు పీసీపీఎన్డీటీ రాష్ట్ర కమిటీ నిర్వహించే తనిఖీలలో ఫారం–ఎఫ్ ఆడిట్, రికార్డులు నిబంధనల మేరకు నిర్వహించాలన్నారు. నిబంధనలు పాటించని సెంట ర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లింగన్నపేట, ఎల్లారెడ్డిపేట, పోత్గల్ పీహెచ్‌సీల సిబ్బందికి టీకాల ఆన్లైన్ నమోదుపై శిక్షణ ఇచ్చారు. ఫ్యామిలీ ప్లానింగ్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఫార్మాసిస్ట్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చారు. ఎంహెచ్ఎన్ ప్రోగ్రాం ఆఫీసర్ అంజలి ఆల్ఫ్రెండ్, వైద్యులు సంపత్‌కుమార్, రామకృష్ణ, డిప్యూటీ డెమో రాజ్‌కుమార్, హెచ్ఈ బాలయ్య ఉన్నారు. అనుమతి లేని విద్యాసంస్థలు మూసేయాలి సిరిసిల్లటౌన్: జిల్లాలో అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి నాయకులు కంచర్ల రవిగౌడ్ కోరారు. ఈమేరకు గురువారం జిల్లా విద్యాధికారి ఆఫీస్‌లో వినతిపత్రం అందించి మాట్లాడారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లపై దృష్టి సారించాలని కోరారు. అనుమతులు లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. మట్టె శ్రీనివాస్, జగన్, అనిల్, షేక్ అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. మనం బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘చిటికెన’ సిరిసిల్లకల్చరల్: నిరంతర వ్యాసరచన, కవితలు, కథనాలతో సామాజిక చైతన్యానికి కారకుడయ్యారని జిల్లా కవి చిటికెన కిరణ్‌కుమార్‌కు ‘మనం’ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు కల్పించారు. ఈమేరకు మనం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ చక్రవర్తి సంబంధిత సర్టిఫికెట్‌ను అందజేశారు. -
మంత్రుల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
రుద్రంగి(వేములవాడ): రుద్రంగిలో శుక్రవారం మంత్రులు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతేలతో ఏర్పాట్లపై స్థానిక గ్రామపంచాయతీలో గురువారం సమీక్షించారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ భాభారతి చట్టం అమలులో భాగంగా జిల్లాలో రుద్రంగిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందునా శుక్రవారం నిర్వహించే రెవెన్యూ సదస్సుకు రుద్రంగిలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌గౌడ్ హాజరవుతున్నట్లు తెలిపారు. మండలంలో మంజూరైన 243 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఇళ్ల దరఖాస్తులు పెండింగ్ ఉంటే వెంటనే మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించారు. మంత్రుల పర్యటనకు రైతులు, ఇందిరమ్మ లబ్ధిదారులు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ భూభారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణ, ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపనలో మంత్రులు పాల్గొంటారని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి.రాధాబాయ్, రుద్రంగి తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీవో నటరాజ్, ఈఈ ఆర్బీ వెంకట రమణయ్య, ప్రాజెక్టు డైరెక్టర్ హౌసింగ్ శంకర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నేడు రుద్రంగిలో పర్యటించనున్న మంత్రుల బృందం -
ఇల్లాలు.. కన్నీళ్లు
● వివాహితలపై వేధింపులు ● ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న గృహహింస కేసులు ● అనుమానమే పెనుభూతమవుతున్న వైనం ● మహిళల హత్యలు, ఆత్మహత్యలు ఉమ్మడి జిల్లాలో 2024–25 ఏప్రిల్ వరకు కేసులు ఇలా..4225580515230073736820659గృహహింసఆత్మహత్యహత్యకరీంనగర్జగిత్యాలపెద్దపల్లిరాజన్న సిరిసిల్ల -
నిద్ర..
● భయపెడుతున్న గుర్‌గుర్ ● జనాభాలో 10 శాతం మంది బాధితులు ● హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణమంటున్న డాక్టర్లు ● ప్రారంభంలో చికిత్స చేస్తే ఫలితమంటున్న నిపుణులుగురక..గుండెపోటు!వీరు జ్యోతి, క్రాంతి దంపతులు. వీరికి తొమ్మిదేళ్ల కిందట పెళ్లి కాగా, ఇద్దరు పిల్లలు. జ్యోతి బీడీ కార్మికురాలు, క్రాంతి కాంట్రాక్టు కార్మికుడు. రేషన్‌కార్డు కోసం ఎనిమిదేళ్లుగా నిరీక్షిస్తున్నారు. ఇటీవల మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం 369360193430 నంబర్‌తో కొత్త రేషన్‌కార్డు జారీ చేసింది. కార్డు వచ్చిందనే సంతోషంలో రేషన్ షాపునకు వెళ్తే కొత్త కార్డులకు ఇంకా బియ్యం రాలేదని డీలర్ చెప్పడంతో నిరాశతో ఇంటిబాట పట్టారు. ఇలాంటి వారు జిల్లాలో 22,114 మంది పేదలు ఉన్నారు. వీరంతా రేషన్‌బియ్యం కోసం ఎదురుచూస్తున్నారు. -
అర్బన్ ఫారెస్ట్ బాగుంది
● జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, జడ్జి రాధిక జైస్వాల్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అర్బన్ ఫారెస్ట్ పార్క్ చాలా బాగుందని, ప్రకృతిసిద్ధంగా పెరిగిన చెట్లు, సెలయేళ్లు చూడముచ్చటగా ఉన్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్ పేర్కొన్నారు. పార్క్‌ను బుధవారం సందర్శించిన సందర్భంగా మాట్లాడారు. పండ్లు, మోదుగుచెట్లు పెంచడం ద్వారా గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుపడతాయన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు జీవవైవిద్యాన్ని కాపాడవచ్చని పేర్కొన్నారు. గిరిజనులకు అటవీహక్కుల చట్టా లను తెలియజేయడంతోపాటు వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కేంద్రంలో లభించే ఉచిత న్యాయ సదుపాయాన్ని వినియోగించుకునేలా అటవీ శాఖ అధికారులు కృషి చేయాలని కోరారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వి.శ్రీహరిప్రసాద్ అర్బన్ ఫారెస్ట్ పార్కులోని సదుపాయాల గురించి వివరించారు. లోక్ అదాలత్ మెంబర్లు చింతోజు భాస్కర్, ఆడెపు వేణు, గుర్రం ఆంజనేయులు పాల్గొన్నారు. ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి● ఎస్పీ మహేశ్ బీ గీతే బోయినపల్లి(చొప్పదండి): ఫిర్యాదులపై వేగంగా స్పందించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ మహేశ్ బీ గీతే ఆదేశించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను బుధవారం సందర్శించారు. పోలీస్‌స్టేషన్‌లో 5–ఎస్ అమలు తీరు తెలుసుకున్నారు. కేసుల వివరాలు, పెండింగ్ ఫైల్స్, రికార్డ్ గది పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ రౌడీషీటర్లపై నిఘా పెట్టాలని సూచించారు. పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి సారించాలన్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించాలని తెలిపారు. వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్, పీఎస్సై అనిల్‌కుమార్, ఏఎస్సై మోతీరామ్ తదితరులు ఉన్నారు. నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఇల్లంతకుంట(మానకొండూర్): యూరియా తక్కువ మోతాదులో వాడుతూ సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే పంటల్లో అధిక దిగుబడి పొందవచ్చని జిల్లా ఉద్యానశాఖ అధికారి లత పేర్కొన్నారు. మండలంలోని పెద్దలింగాపూర్ రైతువేదికలో బుధవారం రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆయిల్‌పామ్ సాగు యాజమాన్య పద్ధతులు, కూరగాయలు, పూలసాగుపై అవగాహన కల్పించారు. మండల వ్యవసాయాధికారి సురేశ్‌రెడ్డి, ఏఈవోలు జ్యోతి, అర్చన, రవళి, లలిత, గంగ పాల్గొన్నారు. హిందూ ఏక్తాయాత్రను విజయవంతం చేయండి సిరిసిల్ల: కరీంనగర్లో ఈనెల 22న నిర్వహించే హిందూ ఏక్తాయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ కోరారు. సిరిసిల్ల పట్టణ శివారులోని రగుడులో బుధవారం స్థానిక హనుమాన్ ఆలయంలో పూజలు చేసి, హిందూ ఏక్తాయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. శ్రీకాంత్ మాట్లాడుతూ కరీంనగర్లో నిర్వహించే హిందూ ఏక్తాయాత్రలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ పాల్గొంటారని తెలిపారు. బీజేపీ నాయకులు బూర విష్ణు, అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు మాస బాలయ్య, మాస వంశీకృష్ణ, ఏశ సాయిదీప్, పోతుల సాయిచరణ్, బూర దేవరాజు, వంగ కృష్ణ, బూర కొమురయ్య, నర్సయ్య, శశిధర్ పాల్గొన్నారు. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా నిర్వహించాలి
సిరిసిల్ల: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా, పకడ్బందీ నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. పరీక్ష కేంద్రాలను శుభ్రం చేయించాలని, తాగునీటి వసతి కల్పించాలని, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. వైద్యసిబ్బ ంది వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉండాలని, పరీక్షలు నిర్వహించే రోజుల్లో ఆర్టీసీ బస్‌లను సమయానుకూలంగా నడిపించాలన్నారు. చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాలు ఉండాలని తెలిపారు.144 సెక్షన్ అమలుపరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. 22 నుంచి జరిగే పరీక్షలకు 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫస్టియర్‌లో 2,385, సెకండియర్‌లో 1,478 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని అధికారులు సూచించారు. అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎస్బీ డీఎస్పీ మురళి, డీఈఐవో శ్రీనివాస్, డీఎంహెచ్‌వో రజిత, ఆర్టీసీ డీఎం ప్రకాశ్‌రావు పాల్గొన్నారు.జిల్లాలో సాండ్ ట్యాక్స్ అమలుసిరిసిల్ల: జిల్లాలో సాండ్ ట్యాక్స్ ద్వారా ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రకటనలో తెలిపారు. ఇసుక రవాణాను ఆన్లైన్ చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని ట్రాక్టర్ యజమానులు అందరూ తమ వాహనాల లైసెన్స్, ఇతర అన్ని పత్రాలు, డ్రైవర్ వివరాలు, డ్రైవింగ్ లైసెన్సు పత్రాలను కలెక్టరేట్లో వారంలోగా అందించి నమోదు చేసుకోవాలని కోరారు. ట్రాక్టర్ యజమానులు జిల్లా కలెక్టర్ పేరిట రూ.10వేల డీడీ తీయాలని తెలిపారు. అనుమతి పొందిన సాండ్ రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుక రవాణా చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలిరుద్రంగి(వేములవాడ): భూ భారతిలో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. రుద్రంగి మండల పరిధిలోని దెగావత్‌తండా గ్రామంలో దరఖాస్తులు స్వీకరించారు. గైదిగుట్టతండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ గ్రామం పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికవగా.. 44 ఇళ్లు మంజూరయ్యాయి. 23 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఎంపీడీవో నటరాజ్, ఎంపీఓ సుధాకర్, రెవెన్యూ అధికారులు షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రాల్లోనే మొలకెత్తుతున్నాయి
కోనరావుపేట/ఇల్లంతకుంట: రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పంటల సాగు సమయంలో సరిగ్గా నీరు అందక సగానికి పైగా పంటలు ఎండిపోగా.. ధాన్యం కోసిన తర్వాత సకాలంలో తూకం వేయక అకాల వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయి. కోనరావుపేట, ఇల్లంతకుంట మండలాల్లో బుధవారం కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. వట్టిమల్ల లో వడ్లు మొలకెత్తాయి. ఇల్లంతకుంట మండలం దాచారం, సిరికొండ, పెద్దలింగాపురం, తాళ్లపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. దాచారం, పెద్దలింగాపూర్ గ్రామాల్లో వెయ్యి బస్తాల వరకు తడిసిపోయిందని ఐకేపీ ఏపీఎం కట్ట వాణిశ్రీ తెలిపారు. -
సామాన్యులు సాధించారు
దేశ సరిహద్దుల్లో నుంచి ప్రజాక్షేత్రంలోకి.. ముస్తాబాద్ పీఎస్సైగా విధుల్లో చేరిన బాలెంకి శ్రీనివాస్ 17 ఏళ్లు ఆర్మీలో హవల్దార్‌గా చేశారు. శ్రీనివాస్‌ది సాధారణ రైతుకుటుంబం. మానకొండూరు మండలం ముంజంపల్లికి చెందిన బాలెంకి ఆశలు, రాజేశ్వరీ దంపతుల కుమారుడు శ్రీనివాస్ విద్యాభ్యాసం ప్రభుత్వ పాఠశాలలోనే సాగింది. డిగ్రీ ఫైనలియర్‌లోనే ఆర్మీకి ఎంపికై కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, పుణేతోపాటు భూటాన్ దేశంలో పనిచేశారు. 17 ఏళ్లపాటు ఆర్మీలో విధలు నిర్వర్తించి, 2022లో రిటైర్మెంట్ తీసుకున్నారు. అనంతరం కష్టపడి చదివి ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యారు.నాన్న కష్టాలను చూసి.. మానకొండూరు మండలం రంగపేటకు చెందిన సత్యనారాయణరెడ్డి, వనజ దంపతుల కుమార్తె వినీతారెడ్డి. ఇంటర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచిన వినీతారెడ్డి కోటి ఉమెన్స్ కాలేజీలో బీకామ్ కంప్యూటర్స్ చది వారు. నాన్న పడ్డ కష్టానికి ప్రతిఫలం సాధించాలనే తపనతో చదివి ఎస్సైగా ఎంపికయ్యారు. తంగళ్లపల్లిలో ప్రొబేషనరీ ఎస్సైగా విధుల్లో చేరారు. షీటీమ్, డయల్ 100, సైబర్ నేరాలపై మహిళలను చైతన్యం చేస్తున్నారు. వినీతారెడ్డి వివాహం తన బ్యాచ్‌మేట్, కోనరావుపేట ప్రొబేషనరీ ఎస్సై రాహుల్‌రెడ్డితో ఇటీవల జరిగింది. నేతకార్మికులు ఉండే ప్రాంతం కావడం.. చిన్న కారణాలతో ప్రాణాలు తీసుకుంటుండడం ఆమెను కలచివేసింది. నేతన్న కుటుంబాల్లో మనోధైర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. -
కార్డులొచ్చాయ్.. కోటా రాలే !
● కొత్త కార్డుదారులకు అందని బియ్యం ● 15వ తేదీ దాటుతున్నా పల్లెలకు రాని రేషన్ ● తెరుచుకోని రేషన్ దుకాణాలు ● ఆందోళనలో నిరుపేదలు ● సన్నబియ్యం కోసం ఎదురుచూపులు సిరిసిల్ల: ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్‌కార్డులు వచ్చినా సంబురం లేదు. ఈ కార్డులకు బియ్యం కోటా రాకపోవడంతో కొత్త లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే రేషన్ కార్డులు ఉండి.. ఆయా కార్డుల్లో కొత్తగా పేర్లు నమోదు చేసుకున్న వారికి మాత్రం బియ్యం కోటా మంజూరైంది. మూడేళ్లు దాటిన పిల్లలకూ ఆరు కిలోల చొప్పున బియ్యం మంజూరైంది. రేషన్ కార్డు ఉండీ.. మార్పులు, చేర్పులు చేసుకున్న వారికి బియ్యం కోటా మంజూరుకాగా.. కొత్త రేషన్‌కార్డులకు కోటా పెరగలేదు. అయితే ఇదే సమయంలో జిల్లాలో చాలా పల్లెల్లో ఈనెల రేషన్‌బియ్యం పంపిణీ చేయలేదు. స్మార్ట్ కార్డుల జారీ గతంలో రేషన్ కార్డులు ఉండగా.. వాటి స్థానంలో ఆహార భద్రత కార్డులుగా ప్రభుత్వం పేరు మార్చింది. ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులు గా జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నే పథ్యంలో డిజిటల్ స్మార్ట్ కార్డులు రానున్నాయి. ప్ర స్తుతం ఆన్లైన్లో ఆహార భద్రత కార్డులను జిరాక్స్‌లు చేయించుకుని బియ్యం పొందుతున్నారు. పని ఒత్తిడిలో యంత్రాంగం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాలకు సంబంధించిన క్షేత్రస్థాయి సర్వేలు ఏకకాలంలో నిర్వహించాల్సి రావడంతో అధికారులు ఒత్తిడికి గురవుతున్నారు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి అర్హులను గుర్తించే పనిలో ఉన్నారు. మూడు పథకాలు ముఖ్యమైనవి కావడంతో సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇటీవల ఓ గ్రామపంచాయతీ కార్యదర్శి పని ఒత్తిడి, రాజకీయ ఒత్తిళ్లలో పనిచేయలేక పోతున్నానని విధులను వదిలేసి వెళ్లారు. క్షేత్రస్థాయి సర్వేల్లో సమస్యలు ఎదురవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. సర్వే జాప్యం జిల్లా వ్యాప్తంగా మీసేవ కేంద్రాల ద్వారా నేరుగా వచ్చిన దరఖాస్తులు ఆయా మండలాల తహసీల్దార్ల లాగిన్‌కు వెళ్లాయి. ఆ దరఖాస్తుదారులు అర్హులా.. అనర్హులా అని తేల్చే సర్వేల్లో జాప్యమవుతుంది. ఫలితంగా రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ఆలస్యమవుతోంది. 2025 జనవరి నాటికి 9,731 మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల ప్రభుత్వం మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వగా.. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 22,114 మంది దరఖాస్తు చేశారు. దీనిలో ఎన్ని దరఖాస్తులు సర్వే పూర్తయింది.. ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో ఆన్లైన్లో చూపడం లేదు. జిల్లా వ్యాప్తంగా 1,922 ఉన్నట్లు డీఎస్వో లాగిన్‌లో చూపిస్తుంది. కానీ సర్వే స్థాయిలోనే చాలా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మార్పులు, చేర్పులకు సంబంధించి మరో 20,606 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. -
అభివృద్ధి చేస్తే అడ్డుతగులుతారా ?
● రాజన్న ఆలయంపై రాజకీయం చేయొద్దు ● అభివృద్ధికి సహకరించాలి ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ: గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధికి నోచుకోని వేములవాడ రాజన్న ఆలయం, పట్టణాన్ని రూ.76కోట్లతో అభివృద్ధి చేస్తామంటే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు అడ్డు తగులుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. అభివృద్ధిని జీర్ణించుకోలేకనే రెండు పార్టీలు వేములవాడ బంద్‌కు పిలుపునిచ్చి రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. వేములవాడలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, అనువంశిక అర్చకులు, స్థానికులు, ప్రముఖుల సలహాలతో శృంగేరి పీఠాధిపతుల అనుమతులతో పనులు చేపడతామని స్పష్టం చేశారు. మూలవిరాట్టు, తదితర విగ్రహాలను టచ్ చేయకుండానే ఆలయాన్ని విస్తరిస్తామని చెబుతున్నా.. ప్రతిపక్షాలు ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మాజీ సీఎం ప్రగల్భాలు పలికారే తప్ప ఆలయాభివృద్ధికి రూపాయి ఇవ్వలేదన్నారు. బీజేపీ నాయకులు పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్నా ఎలాంటి నిధులు తీసుకుని రాలేదని గుర్తు చేశారు. ఆలయాన్ని మూసివేయబోమని స్పష్టం చేశారు. ఆలయ నిర్మాణం పనులు కొనసాగే సమయంలో మాత్రమే భీమన్న ఆలయంలో దర్శనావకాశాలు కల్పిస్తామని తెలిపారు. -
కానిస్టేబుల్ నుంచి ఎస్సైగా..
హుజూరాబాద్ మండలం రాంపూర్‌కు చెందిన వేముల లక్ష్మణ్ తల్లి అరుణ కూలీ పని చేస్తుండగా, తండ్రి సోడాలు విక్రయిస్తుంటాడు. ఇంటర్ వరకు చదివిన లక్ష్మణ్ 2018లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. కరీంనగర్, సిరిసిల్లలో విధులు నిర్వర్తిస్తూనే ఓపెన్ డిగ్రీ పూర్తి చేశారు. సిరిసిల్లలో మూడేళ్ల క్రితం పీసీగా పనిచేసిన లక్ష్మణ్ అదే స్టేషన్లో ట్రెయినీ ఎస్సైగా వచ్చారు. ప్రస్తుతం ఎల్లారెడ్డిపేట పీఎస్సైగా పనిచేస్తున్నారు. కూలీ పనులు చేసుకునే కుటుంబం నుంచి కానిస్టేబుల్‌గా, ఎస్సైగా ఎదిగిన లక్ష్మణ్ నేటి యువతకు స్ఫూర్తికి నిలుస్తున్నారు. లక్ష్మణ్ కవల సోదరుడైన రామ్ మిషన్ భగీరథలో ఏఈఈ, మరో సోదరుడు ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. -
ఎందుకురా నీ బతుకు చావరాదు..! అని తిట్టడంతో
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కులపెద్దలు చేసిన పంచాయితీ ఒకరి నిండు ప్రాణాన్ని తీసింది. పంచాయితీలో బూతులు తిట్టడంతో అవమాన భారంగా భావించిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన కడమంచి స్వామి(34) ఇంట్లో లేనప్పుడు అ తని భార్యపై అదే గ్రామానికి చెందిన టేకు ప్రేమ్‌కుమార్ లైంగికదాడికి యత్నించాడు. స్వామికి ఈ విషయం తెలియడంతో ప్రేమ్‌కుమార్‌ను నిలదీశా డు.మూడు రోజుల క్రితం కులపెద్దలు పంచాయితీ పెట్టి ప్రేమ్‌కుమార్‌కు జరిమానా విధించారు. దీంతో కోపోద్రిక్తుడైన ప్రేమ్‌కుమార్ స్వామిని అందరిముందే బూతులు తిట్టాడు. అంతేకాకుండా చావమని తిట్టడంతో అవమానంగా భావించిన స్వామి మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతుని భార్య ఫిర్యాదుతో ప్రేమ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ట్రెయినీ ఎస్సై కె.వినీతారెడ్డి తెలిపారు. అయితే గ్రామానికి చెందిన కొందరు పెద్దమనుషులతోపాటు కొందరు విలేకరులు కలిసి ఈ పంచాయితీ నిర్వహించినట్లు తెలిసింది. వీరిద్దరి నుంచి రూ.4లక్షల చొప్పున మొత్తం రూ.8లక్షలు పంచాయితీ దరావతుగా తీసుకోవడంతోపాటు ఆ మొత్తం కూడా ఖర్చు అయినట్లు తెలిపారనే చర్చ సాగుతోంది. -
నీటి ఎద్దడి అధిగమించాం
● అన్ని వార్డులకు నిర్ణీత సమయంలో సరఫరా ● అవసరమైన ఏరియాల్లో ట్యాంకర్లతో అందిస్తున్నాం ● వేసవిలో ప్ర‘జల’ ఇబ్బందులు తీరుస్తున్నాం ● వచ్చే ఏడాదిలో విలీన గ్రామాల్లోనూ మిషన్ భగీరథ నీరు ● ఇంటర్వ్యూలో మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ వాణిసిరిసిల్లటౌన్: పక్కా ప్రణాళికతో సిరిసిల్లలో తా గునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని మున్సిపల్ ఇన్చార్జి కమిషన ర్ పోసు వాణి తెలిపారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్‌కు తగ్గట్టుగా నల్లాల ద్వారా నీటి సరఫరా జరుగుతోందన్నారు. మున్సిపల్ పరిధిలోని అన్ని వా ర్డుల్లో తాగునీటి సరఫరా, ఇబ్బందులపై ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు. 39 వార్డుల్లో నిత్యం నీటి సరఫరా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 39 వార్డుల్లో ని త్యం తాగునీటి సరఫరా చేస్తున్నాం. వేసవి ఆరంభంలో కొన్ని ఏరియాల నుంచి వచ్చిన ఫిర్యాదు ల మేరకు చర్యలు తీసుకున్నాం. ఆయా ఏరియాల్లో తాగునీటి సమస్య పరిష్కరించాం. అన్ని వార్డులకు ప్రత్యేకంగా అధికారులు ఉన్నారు. 13 మంది లైన్మెన్లు, ఇద్దరు బోర్వెల్ మెకానిక్స్, 9 మంది లీకేజీ రిపేరర్స్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఫిర్యాదులు పరిష్కరిస్తున్నాం వేసవిలో నీటి కొరత రాకుండా ప్రత్యేకంగా కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశాం. 78935 93308లో ఇప్పటి వరకు ఎనిమిది ఫిర్యాదులు రాగా వెంటనే పరిష్కరించాం. ఫిర్యాదుల్లో ఎక్కువగా నల్లా కనెక్షన్లు కావాలని కోరారు. మిషన్ భగీరథ ద్వారా నిత్యం 9 మిలియన్ లీటర్లు సరఫరా చేస్తున్నాం. మున్సిపల్ ఫిల్టర్ బెడ్, ట్యాంకర్లు, పవర్‌బోర్ల ద్వారా 8.6 ఎం.ఎల్.డీ(మిలియన్ లీటర్స్ పర్ డే) నీటిని అందిస్తున్నాం. 39 వార్డులు.. 13 జోన్లు సిరిసిల్ల, విలీన గ్రామాలు కలిపి 39 వార్డులను 13 జోన్లుగా విభజించి నీటి సరఫరా చేపడుతున్నాం. ఉదయం 3.30 నుంచి 6 గంటల వరకు ఎనిమిది జోన్లకు, మధ్యాహ్నం 3.30 నుంచి సా యంత్రం 6.30 గంటల వరకు ఐదు జోన్లకు నీటి సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం 1.10లక్షల మంది కి నీటి సరఫరా ఉంది. రాబోయే ఏడాది తర్వాత 1.40లక్షల మందికి 24 ఎంఎల్డీ లీటర్ల నీటిని సరఫరా చేసే దిశగా పనులు చేపడుతున్నాం. విలీన గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణ విలీన గ్రామాల్లో మిషన్ భగీరథ పైపులైన్ ద్వారా చే పడుతున్నాం. మిషన్ భగీరథ పైపులైన్ లేని చో ట్ల లో ‘అమృత్ 2.0’ పథకంలో భాగంగా మరో 40 కి లోమీటర్ల పైపులైన్ నిర్మాణం జరుగుతుంది. రూ. 100కోట్ల అభివృద్ధి పనుల్లో భాగంగా తాగునీటి స రఫరాకు కొన్ని నిధులు కేటాయించగా పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాదిలోగా సిరిసిల్లలో విలీనమై న గ్రామాలతోపాటు అన్ని వార్డుల్లో నూరుశా తం తా గునీటి పైపులైన్ ద్వారా నీటి సరఫరా చేపడతాం. 4 ట్యాంకర్లతో సరఫరా సిరిసిల్ల పట్టణంలో మిషన్ భగీరథ, మున్సిపల్ ఫిల్టర్‌బెడ్ ద్వారా తాగునీటి సరఫరా జరుగుతోంది. పట్టణ జనాభా 1.10లక్షల మందికి 17.6 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తున్నాం. నీటి సరఫరా కాని ప్రాంతాలకు నాలుగు మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా నీటిని అందజేస్తున్నాం. అన్ని వార్డుల్లో మొత్తంగా 450 పవర్‌బోర్ల ద్వారా స్థానికులు నీటిని వినియోగిస్తున్నారు. వాటిలో 11 రిపేర్లు చేయిస్తున్నాం. మిగతా 439 పవర్‌బోర్లు ద్వారా ప్రజలు నిరంతరం నీటిని వినియోగించుకుంటున్నారు. నీటిని వృథా చేయొద్దు చాలా మంది నల్లాలకు బిరడాలు బిగించడం లే దు. ఫలితంగా నల్లా నీటిని వాడుకోని వారి ఇళ్లలో నుంచి నీరు వృథాగా పోతుందన్న ఫిర్యాదులు ఉన్నా యి. నల్లా నీరు వృథా పోకుండా పౌరులంతా బా ధ్యతగా ఉండాలి. ఎవరికై నా నీటి సరఫరాలో సమ స్య ఉంటే వెంటనే ఆఫీసులో ఏ ర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్‌కు ఫోన్ చేస్తే సత్వరమే పరిష్కరిస్తాం. లీకేజీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా టీమ్‌ను ఏర్పాటు చేశాం. సిరిసిల్ల మున్సిపల్ వివరాలు జనాభా : 1,10,00రోజూ నీటి సరఫరా : 16,500 మిలియన్ లీటర్లు డిమాండ్ : 17.6 ఎంఎల్డీలు -
సజావుగా పాలీసెట్ ప్రవేశ పరీక్ష
సిరిసిల్ల ఎడ్యుకేషన్/తంగళ్లపల్లి: జిల్లాలో పాలీసెట్ ప్రవేశ పరీక్ష సజావుగా సాగింది. తంగళ్లపల్లి, గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో కేంద్రాలను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పరిశీలించారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు పనితీరును తెలుసుకున్నారు. తంగళ్లపల్లి హైస్కూల్లో నిర్మిస్తున్న అదనపు తరగతి గదులను త్వరగా పూర్తి చేయాలని ప్రిన్సిపాల్ శంకర్ నారాయణను ఆదేశించారు. బోరుమోటార్ కోసం ప్రతిపాదనలు సమర్పించాలని పంచాయతీ సెక్రటరీని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో 2,136 మందికి 2,027 మంది హాజరయ్యారు. -
ఈ టెక్నికల్ అసిస్టెంట్ మాకొద్దు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తాము నిబంధనల ప్రకా రం పని చేసినా తగిన వేతనం రావడం లేదని ఉపాధిహామీ కూలీలు మంగళవారం నిరసనకు దిగారు. టెక్నికల్ అసిస్టెంట్ ప్రభాకర్ తమకు వద్దంటూ ఇంటి దారి పట్టారు. కూలీలు తెలిపిన వివరాలు. మండలంలోని కోరుట్లపేటలోని అప్ప సముద్రంలో మంగళవారం ఉపాధిహామీ పనులు చేస్తున్న 100 మంది కూలీలు తమకు సరైన వేతనం రావడం లేదని పని స్థలంలోనే నిరసన తెలిపారు. టెక్నికల్ అసిస్టెంట్ మహిళా కూలీలపై దుర్భాషలాడుతున్నాడన్నారు. అతన్ని ఇక్కడి నుంచి పంపించాలని డిమాండ్ చేశారు. పని చేయని వారి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయన్నారు. అవకతవకలపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీవో కొమురయ్యను వివరణ కోరగా.. కూలీ డబ్బుల అవకతవకలపై క్షేత్రస్థాయిలో విచారణ చేపడతామని తెలిపారు. -
పారమిత విద్యార్థుల ప్రతిభ
ఎన్టీపీసీ కేవీలో వందశాతం ఉత్తీర్ణత ‘సీబీఎస్ఈ’ ఫలితాల్లో అల్ఫోర్స్ ప్రభంజనంమానేరు విజయకేతనం జ్యోతినగర్(రామగుండం): సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్(సీబీఎస్ఈ)లో ఎన్టీపీసీ రామగుండం కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు విజయదుందుబి మోగించారు. మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో పదో తరగతి, 12వ తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలో టాపర్‌గా నిలిచారు. పదో తరగతిలో 67 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 67 మంది ఉత్తీర్ణత సాధించారు. ఓం సాహూ(484/500), 12వ తరగతిలో 18 మంది విద్యార్థులు పరీక్షలకు హా జరుకాగా 18 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యా రు. సైన్స్ విభాగంలో పెండ్యాల ఆగస్త్యశర్మ (398/500), కుడితేటి ప్రద్యుమ్నరావు (396/ 500), కామర్స్ విభాగంలో హ్రిశికేశ్ (44 1/500) మార్కులు సాధించారు. దీంతో విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు, ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సామంత, నామిని చైర్మన్ బిజయ్‌కుమార్ సిగ్దర్, ప్రిన్సిపాల్ ఓరుగంటి శోభన్‌బాబు, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. చొప్పదండి నవోదయ ప్రభంజనం చొప్పదండి: జవహర్ నవోదయ విద్యాలయం 2024–25 పదోతరగతి, పన్నెండో తరగతి సీబీ ఎస్ఈ ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించింది. పన్నెండో తరగతిలో 500మార్కులకు 483మార్కులు సాధించి పి.రుత్విక్‌రెడ్డి మొదటి ర్యాంకు సాధించారు. పదోతరగతిలో వి.వశిష్ట యాదవ్ 500 మార్కులకు 480 మార్కులు సాధించారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ మంగతాయారు అభినందించారు.సప్తగిరికాలనీ(కరీంనగర్): సీబీఎస్ఈ పదోతరగతి, ఇంటర్ పరీక్ష ఫలితాల్లో కరీంనగర్‌లోని అల్ఫోర్స్ సీబీఎస్ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయిలో ప్రభంజనం సృష్టించినట్లు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. పదో తరగతిలో 500మార్కులకు గాను మహమ్మద్ షాజ్నీన్ తబాసుమ్ జాతీయస్థాయిలో 99.4శాతంతో 497మార్కులతో జిల్లాస్థాయిలో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. ఎం.సుచీత్రెడ్డి 493 మార్కులు, జె.సుప్రభ 492, ఆర్.వేదిక, టి.హర్షిణి 491, డి.హర్షిత్489, బి.ఆకృతి, సీహెచ్.అనీశ్‌కుమార్, రయానుద్దీన్ 488, ఏ.నక్షత్ర, పి.శ్రీవర్షిత, కె.నక్షత్రరెడ్డి 486మార్కులు సాధించారని పేర్కొన్నారు. 12వ తరగతిలో 500 మార్కులకు గాను వి.సంజీతరెడ్డి 482మార్కులు, ఎన్.అనిరుద్ సాయి 482, వి.శశాంక్‌రెడ్డి 478, జె.వమీకా 473 మార్కులు సాధించారని తెలిపారు. 10వ తరగతిలో అత్యధికసంఖ్యలో విద్యార్థులు 90శాతం మార్కులు సాధించారని, 12వ తరగతిలో 13మంది 90శాతం మార్కులు సాధించారని పేర్కొన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు.సప్తగిరికాలనీ(కరీంనగర్): సీబీఎస్ఈ పదోతరగతి ఫలితాల్లో పారమిత హెరిటే జ్, వరల్డ్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపారని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎం.శ్రీకర్, పి.గోపికృష్ణ తెలిపారు. 500మార్కులకు గాను ఆకుల శ్రీరామచంద్ర 488 మార్కులు, రూపనిగమ, మనోజ్ఞలు 487, స్ఫూర్తి 481, బి.వర్షిణి480మార్కులు సాధించినట్లు తెలిపా రు. పాఠశాలకు చెందిన 62మంది 90శాతం పైన మార్కులు సాధించగా 80 నుంచి 100శా తం సాధించిన విద్యార్థులు 160మంది ఉన్నారని అన్నారు. విద్యార్థులను పారమిత పాఠశాలల అధినేత ఈ.ప్రసాద్‌రావు, డైరెక్టర్లు ప్రసూన, అనుకర్‌రావు, రశ్మిత, రాకేశ్, ప్రాచీ, వినోద్‌రావు, వీయూఎం.ప్రసాద్, టీఎస్వీ.రమణ, హన్మంతరావు, రవీంద్ర పాత్రో, నాగరాజు అభినందించారు.సప్తగిరికాలనీ(కరీంనగర్): సీబీఎస్ఈ పదోతరగతి ఫలితాల్లో కరీంనగర్ పద్మనగర్‌లోని మానేరు సీబీఎస్ఈ పాఠశాల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారని విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి తెలిపారు. పాఠశాల నుంచి మొత్తం 98మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 100శాతం ఉత్తీర్ణత నమోదు చేసినట్లు తెలిపారు. పలువురు విద్యార్థులు తెలుగులో 100 మార్కులు, ఇంగ్లిష్‌లో 98మార్కులు, హిందీలో 97మార్కులు, సైన్స్, సోషల్‌లో 96మార్కులు, గణితంలో 95 మార్కులు సాధించారని అన్నారు. 500 మార్కులకు పాఠశాలకు చెందిన ఏ.ఆత్రేయ 471మార్కులు, మస్రా మహావీన్ 461, ఏ.అరవింద్‌రెడ్డి 458, ఏ.శరత్ చంద్ర 456మార్కులు సాధించి టాపర్లుగా నిలిచినట్లు పేర్కొన్నారు. విద్యార్థులను మానేరు విద్యాసంస్థల డైరెక్టర్లు కడారి సునీతరెడ్డి, కడారి కృష్ణారెడ్డి, కడారి శ్వేతారెడ్డి అభినందించారు. పది, పన్నెండో తరగతి విద్యార్థుల సత్తా -
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వ్యవసాయరంగంలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని, ధాన్యం డబ్బులను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌లను ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం కోరారు. హైదరాబాద్‌లో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి, డైరెక్టర్లు మహమ్మద్ ఖాజా, షకీల్ ఉన్నారు. కూలి తగ్గించడం శోచనీయం సిరిసిల్లటౌన్: ప్రభుత్వ ఆర్డర్ల చీరలు నేసే కార్మికుల కూలి తగ్గించడం శోచనీయమని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ పేర్కొన్నారు. సిరిసిల్లలోని పార్టీ ఆఫీస్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. చీరల వస్త్రానికి యజమానులకు ఒక మీటరుకు రూ.32 నిర్ణయించగా, కార్మికుల కూలి ప్రకటించకపోవడంతో తక్కువగా ఇస్తున్నారన్నారు. బతుకమ్మ చీరలకు ఇచ్చిన మాదిరిగా మీటర్‌కు రూ.5.25 కూలి ఇవ్వాలని కోరారు. నక్క దేవదాస్, సిరిమల్ల సత్యం, గుండు రమేశ్, సబ్బని చంద్రకాంత్, ఒగ్గు గణేశ్, బెజిగం సురేష్, బాస శ్రీధర్, స్వర్గం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానంసిరిసిల్ల: జిల్లాలోని అర్హులైన మైనార్టీ విద్యార్థులు మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో చేరాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోరారు. మైనార్టీ సంక్షేమ విద్యాసంస్థల్లో ప్రవేశాల పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ సిరిసిల్ల, వేములవాడల్లో మైనార్టీ గురుకుల సంక్షేమ విద్యాసంస్థలు ఉన్నాయని తెలిపారు. ఆయా విద్యాసంస్థల్లో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు తరగతులు కొనసాగుతాయని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ఐదో తరగతిలో ప్రవేశానికి 60 సీట్లు (మైనార్టీ పిల్లలకు) ఉన్నాయని, 6 నుంచి 8వ తరగతి వరకు బ్యాక్ లాగ్ సీట్లు భర్తీ చేస్తారని వివరించారు. సిరిసిల్ల విద్యాసంస్థలో ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీలో కలిపి 80 సీట్లు ఖాళీగా ఉన్నాయని కలెక్టర్ వివరించారు. వేములవాడలోని విద్యాసంస్థలో ఎంఎల్టీ(మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్) 30 సీట్లు, డెయిరీ టెక్నాలజీ కోర్సులో 40 సీట్లు ఖాళీగా ఉన్నాయని వివరించారు. వివరాలకు 79950 57908, 73311 70865లలో సంప్రదించాలని తెలిపారు. మైనార్టీ గురుకుల విద్యాసంస్థల జిల్లా ఇన్చార్జి భారతి, ఆయా విద్యాసంస్థల హెచ్ఎంలు లక్ష్మీనారాయణ, ఫాతిమా పాల్గొన్నారు. -
లగ్గం.. షరతుల పగ్గం!
హుజూరాబాద్: గతంలో 25, 26 ఏళ్లు వచ్చేసరికి అబ్బాయిల్లో దాదాపు 80 శాతం మందికి పెళ్లిళ్లు అయిపోయేవి. కొన్నాళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రెండుమూడేళ్ల నుంచి సంబంధాలు చూస్తున్నా పెళ్లిళ్లు కావడం లేదు. 30ఏళ్లు దాటినా పెళ్లికాని ప్రసాద్‌ల సంఖ్య పెరిగిపోతోంది. అబ్బాయికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఒక పెద్ద యజ్ఞమే చేయాల్సి వస్తోంది. గతంలో తల్లిదండ్రులు ఏదైనా సంబంధం చూస్తే అమ్మాయిలు మాట్లాడకుండా చేసుకునేవాళ్లు. కానీ, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. అమ్మాయిల ఇష్టాయిష్టాలను కాదనలేని పరిస్థితి. అమ్మాయి ఓకే అంటే తప్ప పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో అమ్మాయిలు పూర్తి స్వేచ్ఛగా ఉంటున్నారు. మంచి వేతనం, సొంత ఇల్లు.. వంటివి ఉన్నవారి వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి సంబంధాలను వెతకమని కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. విదేశీ సంబంధాలు అయితే ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. పట్టింపులతో సమస్య.. అబ్బాయిల తల్లిదండ్రుల వ్యవహారశైలి కూడా కొంతవరకూ ఈ సమస్యకు కారణమని చెప్పవచ్చు. మంచి కట్నకానుకలు ఆశించడం, అమ్మాయి అందంగా ఉండాలని, అణకువగా ఉండాలని కోరుకుంటూ మొదట్లో వచ్చిన సంబంధాలను కాదనుకుంటున్నారు. తర్వాత వయసు దాటిపోతున్నా అబ్బాయిలకు పెళ్లిళ్లు చేయలేని పరిస్థితి నెలకొంటోందని చెబుతున్నారు. భిన్నమైన పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసే అబ్బాయిలను కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అబ్బాయితో పెళ్లి చేస్తే అమ్మాయికి జీవితాంతం ఇబ్బంది ఉండదన్న భావన తల్లిదండ్రుల్లో ఉంటోంది. అదే పట్టణ ప్రాంతాల్లోని అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు లేదా సాఫ్ట్వేర్ సంబంధాలపై మొగ్గుచూపిస్తున్నారు. విదేశాల్లో ఉన్నారంటే కట్నం ఎంతయినా ఇచ్చేందుకు వెనుకాడడం లేదు. దీంతో చిరుద్యోగాలు చేసుకునే అబ్బాయిలు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునేవారికి 35 ఏళ్లు దాటినా సంబంధాలు దొరకడం లేదు. మానసిక సమస్యలు పెళ్లికాకపోవడం వల్ల యువకులతోపాటు వారి తల్లిదండ్రులు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. 30 ఏళ్లు దాటినా పెళ్లి కాకపోవడం వల్ల అబ్బాయిల్లో అసహనం, నిరుత్సాహం వంటివి పెరిగిపోతున్నట్టు మానసిక వైద్యులు చెబుతున్నారు. -
ఈదురుగాలుల బీభత్సం
● విరిగిపడ్డ విద్యుత్ స్తంభం ● కొనుగోలు కేంద్రంలో నిలిచిన నీరు ● తడిసిన ధాన్యంఇల్లంతకుంట(మానకొండూర్): జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడగా.. విద్యుత్‌స్తంభాలు నేలకూలాయి. మామిడితోటల్లోని కాయలు నేలరాలిపోయాయి. ఇల్లంతకుంట మండలం చిక్కుడువానిపల్లి, రామాజీపేట, వెల్జీపురం, ఓబులాపురం గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. చిక్కుడువానిపల్లిలో చింతమడక శంకరయ్య ఇంటిపైన రేకులు లేచిపోయాయి. రేకులపై బరువుగా పెట్టిన రాయి శంకరయ్య భార్య శ్యామలపై పడడంతో గాయపడింది. అదే గ్రామంలో కంకటి బాలయ్య వ్యవసాయబావి వద్ద కరెంటు స్తంభం నేలకొరిగింది. వెల్జీపురం ధాన్యం కొనుగోలు కేంద్రంలో నీరు నిలిచింది. తంగళ్లపల్లి/కోనరావుపేట/వేములవాడ: తంగళ్లపల్లి మండలంలోని జిల్లెల్లలో అకాల వర్షానికి ఆకారపు రాజయ్యక రేకుల ఇల్లు కూలింది. కోనరావుపేట మండలం మరిమడ్లలో పిడుగుపడి అక్కెనపల్లి రమేశ్‌కు చెందిన రూ.80వేల విలువైన ఆవు చనిపోయింది. అహ్మద్ హుస్సేన్‌పల్లిలో అక్కెనపల్లి శంకరయ్య ఇంటిగోడ కూలింది. సమీపంలోని సింగిల్‌విండో గోదాము రేకులు లేచి, అక్కడే పడ్డాయి. గ్రామానికి చెందిన కొప్పెర లింగారెడ్డి ఇంటి వద్ద చెట్టుపై పిడుగుపడింది. వేములవాడ పట్టణంలో భారీ వర్షం కురిసింది. అరగంటపాటు కురిసిన వర్షానికి రోడ్డుపై వరదనీరు నిలిచింది. -
ఒకరికొకరు అర్థం చేసుకోవాలి
తమ కూతురుకు పెళ్లి చేస్తే పరిస్థితి ఎలా ఉండాలో అమ్మాయి తల్లిదండ్రులు ముందే ఒక ఆలోచనకు వస్తున్నారు. పెళ్లి అనేది ఇద్దరి జీవితాలను నిర్ణయించేది. అమ్మాయికి అర్థం చేసుకునే గుణం, అబ్బాయికి ఓపిక అనేది ఉన్నాయో లేవో గమనించి వివాహం చేస్తే ఆ బంధం నిలబడుతుంది. తల్లిదండ్రులు ఆ దిశగా ఆలోచన చేస్తే బాగుంటుంది. – డాక్టర్ ప్రవీణ్‌కుమార్, హుజూరాబాద్ ఆలోచనల్లో మార్పు రావాలి అమ్మాయిల తల్లిదండ్రుల ధోరణి ప్రస్తుతం పూర్తిగా మారింది. గత 20 ఏళ్లలో అమ్మాయిల ఆలోచన సైతం మారింది. పెళ్లి చేసుకునే అబ్బాయి ఉద్యోగం, ఆస్తిపాస్తులు, ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే అడుగులు ముందుకు పడుతున్నాయి. అర్థం చేసుకునే గుణం, కష్టపడేతత్వం, తెలివితేటలతో ఎదిగే యువకుడికి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే సుఖపడుతుంది. – ఆడెపు రవీందర్, మ్యారేజ్ బ్యూరో, హుజూరాబాద్ మానసిక ఒత్తిడిలో తల్లిదండ్రులు అబ్బాయికి 30 ఏళ్లు దాటినా పెళ్లి కాకపోవడాన్ని తల్లిదండ్రులు సమాజంలో నామోషీగా భావిస్తున్నారు. అబ్బాయిల్లో నిరుత్సాహం, పెళ్లి పట్ల విరక్తి భావం పెరుగుతోంది. కొందరిలో ఆత్మహత్య ఆలోచనలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటివారికి కౌన్సెలింగ్ ఇప్పించడం చాలా అవసరం. పెళ్లి అన్న దాన్ని పరువుగా భావించడం వల్లే అబ్బాయిలు, వారి తల్లిదండ్రుల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి.– డాక్టర్ ఎల్.వర్షి, మానసిక నిపుణుడు, హుజూరాబాద్ -
ఇంధనం కరువు
● జనవరి నుంచి పెట్రోల్, డీజిల్ బిల్లులు పెండింగ్ ● పోలీసు వాహనాలకు డీజిల్ కరువు ● కరీంనగర్ కమిషనరేట్‌లో రూ.కోటికిపైగా బిల్లులు ● సిరిసిల్ల, రామగుండంలో రూ.40 లక్షల చొప్పున బాకీ ● వాహన మెయింటెనెన్స్ బిల్లులు కూడా రావడంలేదు ● మూడు నెలలుగా రాని స్టేషన్ నిర్వహణ బడ్జెట్సాక్షిప్రతినిధి,కరీంనగర్: తెలంగాణ పోలీసులు సాంకేతికత, కేసుల దర్యాప్తు విషయంలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తున్నారు. ఈ విషయం ఇటీవల మరోసారి రుజువైంది. కానీ, కొన్నినెలలుగా పోలీసులకు సమయానికి నిధులు అందడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పోలీసు వాహనాలకు పెట్రోల్, డీజిల్ బిల్లులు జనవరి నుంచి పెండింగ్‌లో ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ పెట్రోల్ బిల్లులతోపాటు వాహనాల మరమ్మతులకు సంబంఽధించి మెయింటెనెన్స్ బిల్లులు కూడా రావడం లేదని వాపోతున్నారు. స్టేషన్ మెయింటెనెన్స్‌కు సంబంధించి అర్బన్, రూరల్ ఏరియాల్లో నెలనెలా కొంత మొత్తం అందజేస్తారు. ఈ మొత్తం కూడా మూడు నెలలుగా రావడం లేదని పలువురు ఎస్‌హెచ్‌వోలు వాపోతున్నారు. గరిష్టంగా కరీంనగర్లో ఉమ్మడి కరీంనగర్జిల్లాలో కరీంనగర్, రామగుండం కమిషనరేట్లు, సిరిసిల్ల, జగిత్యాల ఎస్పీ కార్యాలయాలు ఉన్నాయి. కరీంనగర్ కమిషనరేట్ బిల్లులు జనవరి నుంచి పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రతీ నె లా రూ.25 లక్షలకుపైగా నిధులు కావాల్సి ఉంటుంది. ఈ లెక్కన కరీంనగర్ కమిషనరేట్‌లోనే దాదాపు రూ.కోటి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సిరిసిల్ల లోనూ గత నాలుగు నెలలుగా బిల్లులు రావడం లేదని సమాచారం. అక్కడా దాదాపు రూ.40 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉందని సిబ్బంది వాపోతున్నారు. రామగుండంలో ఏప్రిల్ నెలకు సంబంధించి రూ.40 లక్షలు మాత్రమే బిల్లులు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. జగిత్యాలలో ఎలాంటి సమస్య లేదని స్పష్టంచేశారు. అంతా బానే ఉందని పైకి చెబుతున్న యూనిట్లలోనూ వాస్తవాలు వేరే ఉన్నాయని సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. వాహనాల మరమ్మతుల డబ్బులు సకాలంలో విడుదల కాకపోవడంతో మెయింటెనెన్స్‌కు ఇబ్బందిగా ఉంటుందని పలువురు పోలీసు అధి కారులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమైన సందర్భాల్లో తమ చేతుల నుంచి డీజిల్ పోయించుకుంటున్నామని వాపోతున్నారు. మెయింటెనెన్స్‌కు తిప్పలే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని రెండు కమిషనరేట్లు, రెండు ఎస్పీ కార్యాలయాల్లో స్టేషన్ మెయింటెనెన్స్ డబ్బులు మూడు నెలలుగా రావడం లేదని సమాచారం. ప్రాంతాన్ని బట్టి అర్బన్, రూరల్ ఏరియాలకు ప్రతీ నెలా స్టేషనరీ, తదితర మెమెంటెనెన్స్కు కొంతమొత్తం రావాల్సి ఉంటుంది. వీటిని స్టేషనరీతోపాటు వచ్చిన వారికి టీ, కాఫీల కోసం వినియోగిస్తారు. ఈ మొత్తం కూడా మూడు నెలలుగా రావడం లేదని పోలీసు అధికారులు వాపోతున్నారు. దీంతో పోలీసులు పలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. చాలాసార్లు తామే తొలుత చేతి నుంచి ఖర్చు చేసి, బిల్లులు వచ్చాక సర్దుబాటు చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.యూనిట్ వాహనాలు కరీంనగర్ 380 రామగుండం 168 జగిత్యాల 242 సిరిసిల్ల 211 (నోట్: వాహనాల సంఖ్యలో స్వల్ప వ్యత్యాసాలు ఉండొచ్చు) -
చట్టాలపై అవగాహన అవసరం
● డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ రాధిక జైస్వాల్ సిరిసిల్లటౌన్: చట్టాలపై పౌరులకు అవగాహన ఉండాలని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ రాధిక జైస్వాల్ పేర్కొన్నారు. సర్దాపూర్‌లోని 17వ బెటాలియన్‌లో సోమవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పనిస్థలంలో మహిళలపై లైంగిక వేధింపులు(నివారణ, నిషేధం, పరిష్కారం) చట్టం, 2013 న్యాయ సేవల చట్టంపై అవగాహన కల్పించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.శ్రీనివాస్, లోక్ అదాలత్ మెంబర్ చింతోజు భాస్కర్, అడిషనల్ కమాండెంట్ డీఎస్పీ సీహెచ్ సాంబశివరావు పాల్గొన్నారు. గోరక్షణ చట్టాలు అమలు చేయాలి సిరిసిల్లటౌన్: రాష్ట్రంలో గోరక్షణ చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని దేశీ గోవంశ రక్షణ సవర్థన సమితి ప్రతినిధి ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి కోరారు. సోమవారం సమితి ప్రతినిధులతో కలిసి కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు. చట్ట విరుద్ధంగా ఉంటున్న గోవధ శాలలను వెంటనే మూసివేయాలని, ఆక్రమణలో ఉన్న గోచర భూములకు వి ముక్తి కల్పించాలని, గుర్తింపు గల గోశాలల కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశా రు. ముష్కు సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రేరణ ఆదర్శం ● కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రేరణ స్వచ్ఛంద సంస్థ ఆదర్శనీయమని కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం గూడెంలో ప్రేరణ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ మేడి సురేశ్ ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ సెంటర్‌ను సోమవారం ప్రారంభించి మాట్లాడారు. పేదరికంలో పుట్టి పెరిగిన సురేశ్ ప్రేరణ సంస్థను స్థాపించి పదేళ్లుగా సేవ చేయడం అభినందనీయమన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ తలారి రాణి, సింగిల్‌విండో చైర్మన్ అన్నం రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, డీసీసీ కార్యదర్శి కొండం రాజిరెడ్డి, సడిమెల బాలయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ అంజన్‌రావు, ఎల్లాగౌడ్, శరత్, మల్లేశ్, వెంకటయ్య, తిరుపతి, పర్శరాములు, రాజు, మోహన్ పాల్గొన్నారు. బుద్ధుని బోధనలు అనుసరణీయం ● బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి లక్ష్మీనరసింహరావు చందుర్తి(వేములవాడ): విశ్వ మానవాళికి ప్రేమతత్వాన్ని, అహింసా మార్గాన్ని చూపిన గౌతమ బుద్ధుని బోధనలు యువతకు మార్గదర్శకమని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు పేర్కొన్నారు. మండలంలోని లింగంపేటలో చార్వాక ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బుద్ధపౌర్ణమి వేడుకలకు హాజరై మాట్లాడారు. శాంతిని వెతికే ప్రతీ మనిషి బుద్ధుని మార్గంలో నడవాలన్నారు. మనుషుల మధ్య అసమానతలు తొలగించి, సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కోరుతూ జీవనం సాగించాలనే బుద్ధుని బోధనలు అనుసరణీయమన్నారు. చార్వాక ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు దప్పుల అశోక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య, నాయకులు ఇస్మాయిల్, చార్వాక వృద్ధుల సంఘం నాయకులు పాల్గొన్నారు. -
ఆలయాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
వేములవాడ: రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇప్పటికే రోడ్ల విస్తరణకు రూ.47కోట్ల పరిహారం మంజూరైందన్నా రు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీ నాయకులు సోమవారం పార్టీలో చేరిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో ముందుకుపోతుందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు రాజన్న ఆలయ పరిసరాలు, తిప్పాపుర్లలో కొత్తగా 33/11 కేవీ సబ్స్టేషన్లు 10 మంజూరు చేసినందుకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లో సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కొత్త సబ్స్టేషన్లతో వేములవాడ పట్టణం, తిప్పాపూర్ పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండబోదన్నారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయిందని, వాటి శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు. -
గోవులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
● జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయాలి ● కలెక్టర్ సందీప్ కుమార్ ఝావేములవాడఅర్బన్: రాజన్న గోశాలలోని కోడెలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆలయ అధికారులకు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్‌లోని రాజన్న గోశాలను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోవులకు అందిస్తున్న మేత, ఇతర పదార్థాల నాణ్యత, సౌకర్యాలను పరిశీలించి, వాటి సంఖ్యపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మాట్లాడతూ ఎండాకాలం నేపథ్యంలో గోవుల సంరక్షణను మరింత బాధ్యతగా చూసుకోవాలన్నారు. గోవుల వయసు ఆధారంగా... గోవుల వయసు ఆధారంగా వాటిని వివిధ షెడ్లలో పెట్టాలని, గోశాలలోని షెడ్లలో ఫాగర్స్(నీటి తుంపర్ల) యంత్రాలను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని గోవులకు సరిపడా పచ్చిగడ్డిని మరింత అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి గోవుకు జియో ట్యాగింగ్ పరికరం పెట్టాలని సూచించారు. అనంతరం గోవులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఆలయ ఈవో వినోద్, జిల్లా పశువైద్యాధికారి రవీందర్‌రెడ్డి, ఆలయ ఏఈవో శ్రీనివాస్, గోశాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. -
తాళం వేస్తే టార్గెట్
ఇది ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లోని సీసీ కెమెరా. గత పాలకవర్గం ఆధ్వర్యంలో దాదాపు రూ.1.60 లక్షలు వెచ్చించి 12 సీసీ కెమెరాలతో గ్రామంపై నిఘా పెట్టారు. అయితే ప్రస్తుతం అందులో మూడు సీసీ కెమెరాలు మాత్రమే పనిచేస్తున్నాయి. వాటిని రిపేర్ చేయించడం లేదు. గ్రామంలో పాలకవర్గం లేకపోవడంతో వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఏదైనా సంఘటన జరిగితే నిందితులను పట్టుకోవడం ఇబ్బంది కానుంది. ● వరుస చోరీలతో జనం బెంబేలు ● జిల్లాలో ఇటీవల పెరిగిన దొంగతనాలు ● పట్టపగలే ఇళ్లు లూఠీ ● పనిచేయని సీసీ కెమెరాలు ● దొరకని దొంగలు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు తెగబడుతున్నారు. వరుస దొంగతనాలతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగలు దొరకడం లేదు. వేసవి సెలవులు కావడం, శుభాకార్యాలు ఎక్కువగా ఉండడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు భయం..భయంగా గడుపుతున్నారు. ఇదే అదునుగా దొంగలు ఇళ్లను గుళ్ల చేస్తున్నారు. పట్టపగలే ఇళ్లను టార్గెట్ చేస్తూ ఉన్నది ఊడ్చుకుపోతున్నారు. లక్షల్లో సొమ్ము, భారీ ఎత్తున బంగారం నగలు పోతుండడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వరుస దొంగతనాలు.. ఆందోళనలో ప్రజలు ● జిల్లాలో ఇటీవల వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 255 గ్రామపంచాయతీల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో సగానికిపైగా పనిచేయడం లేదు. దీంతో దొంగతనాలు పాల్పడ్డ వారి ఆచూకీ దొరకడం లేదు. ● తాజాగా గంభీరావుపేట మండలం నాగంపేటలో పది రోజుల క్రితం ఒకే రోజు తాళం వేసి ఉన్న పది ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. బంగారం, విలువైన బట్టలు, భారీ ఎత్తున నగదు పోయింది. ఇంత పెద్ద సంఘటన జరగడంతో జిల్లా ప్రజలు శుభకార్యాలకు బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ● ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఒద్దిరాల శ్రీనివాస్ ఇంట్లో ఈనెల 9న పట్టపగలే తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. బీరువాను ధ్వంసం చేసి రూ.25వేల నగదు, 3 తులాల బంగారం కమ్మలు, చైన్లు, 15 తులాల వెండి పట్టగొలుసులను ఎత్తుకెళ్లారు. ● నెల రోజల క్రితం ఎల్లారెడ్డిపేటకు చెందిన నాగుల ప్రదీప్‌గౌడ్ ఇంట్లో చోరీ జరిగింది. ● ముస్తాబాద్, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి, వేములవాడరూరల్ మండలాల్లోని ఆలయాల్లో దొంగలు హుండీలను ఎత్తుకెళ్లిన ఘటనలున్నాయి. శుభకార్యాల వేళ దొంగల హల్చల్ ఈ వారం, పది రోజులుగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుండడంతో బ్యాంక్ లాకర్లలో దాచిన బంగారు నగలతోపాటు కుదువపెట్టిన వాటిని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఇదే సమయంలో దొంగలు పడుతుండడంతో బంగారు నగలు చోరీకి గురవుతున్నాయి. ఇటీవల తులం బంగారం రూ.లక్షకు చేరడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఉన్న బంగారాన్ని కాపాడుకునేందుకు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బంధువుల ఇళ్లకు వెళ్లిన వారు సైతం సాయంత్రం వరకు ఇళ్లకు తిరిగి వస్తున్నారు. దొంగలను పట్టుకుంటాం దొంగతనాలపై నిఘా పెట్టాం. సంఘటన జరిగిన రోజు క్లూస్‌టీమ్‌తో వేలిముద్రలు సేకరించి, పాత నేరస్తులను విచారిస్తున్నాం. రాత్రిపూట పెట్రోలింగ్‌ను ముమ్మరం చేస్తాం. ఇళ్లకు తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇంటికి తాళం వేస్తున్న సమయంలో విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలి. – శ్రీనివాస్‌గౌడ్, సీఐ, ఎల్లారెడ్డిపేటఈ చిత్రం గంభీరావుపేట మండలం నాగంపేటలో ఇటీవల జరిగిన దొంగతనంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. పది రోజుల క్రితం నాగంపేటలో ఒకే రోజు తాళం వేసి ఉన్న పది ఇళ్లలో దొంగలు పడ్డారు. ఇటీవల ఇంత పెద్ద ఎత్తున దొంగలు పడ్డ సంఘటనలు జిల్లాలో లేవు. పెద్ద ఎత్తున బంగారం, నగలను ఎత్తుకెళ్లారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తుండడంతో వేసవి సెలవుల్లో వివిధ ప్రాంతాల దర్శనానికి, బంధువు ఇళ్లలో జరిగే శుభకార్యాలకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. -
ఉగ్రవాద మూలాలు లేకుండా చూడాలి
ఇల్లంతకుంట(మానకొండూర్): దేశంలో ఉగ్రవాద మూలాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం చూడాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. ఇల్లంతకుంటలో జరుగుతున్న పెద్దమ్మ పండుగ ఉత్సవాల్లో ఆదివారం పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం పాకిస్థాన్‌తో పోరాటం చేసి బంగ్లాదేశ్ విముక్తికి సహకరించిందని గుర్తు చేశారు. ముదిరాజ్ సంఘం నాయకులు గొడుగు నర్సయ్య, పిల్లి వెంకటి, కూనబోయిన బాలరాజు, సుధాకర్, రఘు, రమేశ్, కనకయ్య, రేగుల కార్తీక్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, వెంకట రమణారెడ్డి, పసుల వెంకటి పాల్గొన్నారు. పున్నం చందర్‌కు బెస్ట్ సైకాలజిస్ట్ అవార్డు సిరిసిల్లటౌన్: ప్రముఖ సైకాలజిస్ట్ కనుకుంట్ల పున్నంచందర్ ‘బెస్ట్ సైకాలజిస్ట్ అవార్డ్–2025’ అందుకున్నారు. హైదరాబాద్‌లోని బిర్లా ఆడిటోరియంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి, మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపురాణ వెంకటరత్నం చేతుల మీదుగా అందుకున్నారు. మానసిక ఆరోగ్యంపై అంకితభావంతో పనిచేస్తూ ఆత్మహత్యల నివారణకు కృషి చేసినందుకు ఈ పురస్కారం అందజేశారు. తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మోతుకూరి రామ్‌చందర్ మాట్లాడుతూ పున్నంచందర్ పదిహేనేళ్లుగా మానసిక సమస్యల పరిష్కారానికి నూతన పద్ధతులను వినియోగిస్తూ, వ్యక్తిగత కౌన్సెలింగ్, వర్క్‌షాపులతో అనేక మందికి స్ఫూర్తిగా నిలి చారని కొనియాడారు. అవార్డు రావడంపై సైకాలజిస్ట్‌లు ఆంజనేయులు, ఈశ్వర్, శ్రీనివాస్, అయ్యప్ప రాము, తిరుమల అభినందించారు. అంతర్జాతీయ పోటీలకు చెక్కపల్లి యువకుడు వేములవాడరూరల్: అంతర్జాతీయ సెస్టోబాల్ పోటీలకు వేములవాడరూరల్ మండలం చెక్కపల్లికి చెందిన ఎడపెల్లి అనిల్ ఎంపికయ్యారు. ఈనెల 16 నుంచి 19 వరకు శ్రీలంకలో జరిగే రెండో సౌత్ ఏషియన్ సెస్టోబాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొననున్నారు. తెలంగాణకు చెందిన ఆరుగురు ఆటగాళ్లు భారతజట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. అనిల్‌ను గ్రామస్తులు ఆదివారం సన్మానించారు. నాయకులు వంగపల్లి మల్లేశం, బాలసాని శ్రీనివాస్, చిలుక ప్రభాకర్, అడ్డికే జైపాల్‌రెడ్డి, నరేశ్, హరినందన్రెడ్డి, అశీల శేఖర్, రమణారెడ్డి, దాన వేణు, నాగరాజు పాల్గొన్నారు. వేములవాడ సబ్ రిజిస్ట్రార్ బదిలీవేములవాడ: సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న రాజిరెడ్డి మంచిర్యాలకు బదిలీ అయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. -
ఏఎన్ఎం నుంచి వైస్ ప్రిన్సిపాల్ వరకు
సేవామూర్తులుఅనారోగ్యం పాలైనప్పుడు రక్తసంబంధీకులే దరిచేరని రోజులివీ. ఆస్పత్రిలో ఉన్నప్పుడు వచ్చి ప్రేమగా పలకరించేందుకూ మనసురాని కుటుంబ సభ్యులున్న సమాజమిదీ. అచేతన స్థితిలో ఉన్నవారికి ఏ సంబంధం లేకపోయినా చిరునవ్వుతో దేవదూతల్లా నర్సింగ్ ఆఫీసర్లు సకల సేవలందిస్తున్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నట్లుగా అనారోగ్యం బారినపడి ఆసుపత్రుల్లో చేరిన వారిని అమ్మ కన్నా మిన్నగా నర్సులు చూసుకుంటున్నారు. తెల్లని దుస్తుల్లో మిలమిలా మెరుస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ.. వారు అందించే సేవలు నిరుపమానం. రోగి అవసరం ఏదైనా చిటికెలో తీర్చడమో, తీర్చేందుకు ప్రయత్నించడమో చేస్తూ పేషెంట్లకు భరోసా కల్పిస్తారు. పైకి గంభీరంగా కనిపించినా పేషెంట్ ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తూ రోగుల పాలిట దైవాలుగా నిలుస్తున్నారు నర్సులు. నేడు నర్సింగ్ డే సందర్భంగా కథనం. – కరీంనగర్‌టౌన్/కోల్‌సిటీ మదర్ థెరిసాను రోల్డ్ మోడల్‌గా తీసుకున్నా. వైద్య సేవలపై ఆసక్తితో ఏఎన్ఎం స్థాయి నుంచి నర్సింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ హోదా వరకు చేరుకున్నాను. ఇంటర్ చదివే వయసులోనే ఏఎన్ఎమ్గా ఉద్యోగం వచ్చింది. ఇదే స్ఫూర్తితో జనరల్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్ తోపాటు సైకాలజీ, పీడియాట్రిక్, ఏంఎస్డబ్ల్యూ కోర్సులు చదివాను. పేషెంట్లకు ఎదురుపడిన నర్సింగ్ ఆఫీసర్లు చక్కని చిరునవ్వుతో పలకరించి వైద్యం అందించాలని దృక్పథం నాలో బలంగా నాటుకుంది. అందుకే 2013 నుంచి 2022 వరకు స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తున్నకాలంలో డిప్యూటేషన్‌పై కరీంనగర్ నర్సింగ్ స్కూల్లో ట్యూటర్‌గా పాఠాలు బోధించాను. 2022లో పదోన్నతిపై సిరిసిల్ల నర్సింగ్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశా. గతేడాది అక్టోబర్ 30న రామగుండం నర్సింగ్ కళాశాలకు వైస్ ప్రిన్సిపాల్‌గా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. రోగులకు వైద్యం అందించడంలో నర్సింగ్ ఆఫీసర్ల సేవలు కీలకమైనవి. – సుశీల, వైస్ ప్రిన్సిపాల్, నర్సింగ్ కళాశాల, గోదావరిఖని – వివరాలు 8లో -
మండుటెండల్లో నీటిజాడలు
మండుటెండల్లోనూ నీటి ఊటలు ఊరుతున్నాయి. ఈ సంవత్సరం వర్షాకాలంలో సరైన వర్షాలు కురువకపోయినా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో నీటి ఊటలు, చెక్‌డ్యామ్‌లు స్థానికంగా నీటి కొరతను తీరుస్తున్నాయి. వన్యప్రాణుల దాహార్తి తీరుస్తున్నాయి. నిండు ఎండాకాలంలోనూ గలగల పారుతున్నాయి. పాతికేళ్లుగా నీటి కొరతకు చెక్ ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని మోహినికుంటలో ఒకప్పుడు ఎటూ చూసినా బీడు భూములు కనిపించేవి. ఉపాధి కరువై ఊరిలోని పురుషులు ముంబయి, దుబాయ్‌కి వలసపోయేవారు. నీటివసతి లేని మోహినికుంటలో 25 ఏళ్ల క్రితం నిర్మించిన చెక్‌డ్యామ్ నేడు జీవనాధారమైంది. వాటర్‌షెడ్ స్కీం ద్వారా 2002లో అప్పటి ఎంపీటీసీ కల్వకుంట్ల గోపాల్‌రావు ఆధ్వర్యంలో నర్సింలవాగుపై చెక్‌డ్యామ్ నిర్మించారు. ఎగువ రాజక్కపేట చెరువు మత్తడి దూకి చెక్డ్యామ్లోనే చేరగా కొంతమేరకు మోహినికుంటలో భూగర్భ జలాలు పెరిగాయి. ఒక్క చెరువు కూడా లేకపోవడం, ఒకే ఒక చెక్‌డ్యామ్‌పై ఆధారపడ్డ మోహినికుంట వాసులు క్రమంగా బోర్లు, బావులు తవ్వించి వ్యవసాయం వైపు మళ్లారు. ఈక్రమంలో మల్లన్నసాగర్ నీరు ఏడేళ్లుగా వస్తుండడంతో చెక్‌డ్యామ్ నిండా నీరు చేరుతుంది. దీంతో స్థానికంగా భూగర్భజలాలు పెరిగి వలసలు తగ్గి ఊరిలో పంటల సాగు పెరిగింది. భూగర్భ జలాలు పెరిగాయి పాతికేళ్ల క్రితం మోహినికుంటలో చెరువు, కుంటలు లేవు. కరువుతో మగవారు వలసలు వెళ్లారు. అప్పటి కేంద్ర, రాష్ట్ర మంత్రులు విద్యాసాగర్‌రావు, సుద్దాల దేవయ్య సహకారంతో వాగుపై చెక్‌డ్యామ్ నిర్మించాం. అదే ఇప్పుడు ఆధారమైంది. భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం చేసుకుంటున్నాం. – కల్వకుంట్ల గోపాల్‌రావు, రైతు నాయకుడు -
కేటీఆర్ బిజీ..బిజీ
సారూ.. నిన్ను చూడక ఎన్నో రోజులవుతాంది వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని శాంతినగర్‌లో ఓ వివాహ వేడుకకు హాజరైన కేటీఆర్‌ను చూడగానే అదే గ్రామానికి చెందిన అలువాల అంజవ్వ భావోద్వేగానికి లోనైంది. కేటీఆర్ సారు నిన్ను చూడక ఎన్నో రోజులవుతుందని సంబరపడిపోయింది. కేటీఆర్ వచ్చిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున మండల కేంద్రానికి చేరుకోగా.. కారు దిగకుండానే మళ్లీ కలుస్తాను ఏమీ అనుకోవద్దంటూ వెళ్లిపోయారు. దీంతో వారు నిరాశతో వెనుదిరిగారు. సిరిసిల్ల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు ఆదివారం జిల్లాలో బిజీబిజీగా పర్యటించారు. సిరిసిల్ల అర్బన్‌బ్యాంకు వైస్‌చైర్మన్ అడ్డగట్ల మురళి–మాధవి దంపతుల కొడుకు వివాహం ఇటీవల జరగ్గా.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. భవాని ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ నాయకుడు మామిడాల రమణ కొడుకు పెళ్లికి హాజరయ్యారు. రాజీవ్‌నగర్‌కు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ అలువాల ఈశ్వర్ కూతురు రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, బీఆర్ఎస్ నాయకులు గూడూరి ప్రవీణ్ పాల్గొన్నారు. తమ్మీ భయడకు నేనున్నా తంగళ్లపల్లి(సిరిసిల్ల): ‘తమ్మీ మహేశ్.. భయపడకు నీకు అండగా నేనున్నా.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగానే నిన్ను ఇంటికి తీసుకొస్తాను’ అంటూ గల్ఫ్ బాధితుడు మంద మహేశ్‌కు కేటీఆర్ ధైర్యం చెప్పారు. మండెపల్లిలోని మహేశ్ ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం సౌదీ అరేబియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహేశ్‌తో వీడియోకాల్‌లో మాట్లాడి భరోసా కల్పించారు. రాళ్లపేట మాజీ సర్పంచ్ తీగల దుర్గయ్య కొడుకు వివాహం ఇటీవల జరుగగా వారిని ఆశీర్వదించా రు. చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకుడు జంగపల్లి భిక్షపతిని ఫోన్లో పరామర్శించారు. ఎల్లమ్మ దర్శనం గంభీరావుపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్లో రేణుక ఎల్లమ్మ–జమదగ్ని కల్యాణోత్సవానికి హాజరయ్యారు. పందిర్ల శ్రీనివాస్ గౌడ్, శ్రీధర్‌గౌడ్, కిషన్గౌడ్లు కేటీఆర్‌ను శాలువా లతో సత్కరించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాయకులు కొండ రమేశ్‌గౌడ్ తదితరులు ఉన్నారు. -
సోమవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2025
నమో నారసింహవేములవాడఅర్బన్: రాజన్న ఆనుబంధ నాంపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం శ్రీభూనీలా సమేత లక్ష్మీనరసింహస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి పట్టువస్త్రాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాజన్న ఆలయ ఈవో వినోద్‌రెడ్డి సమర్పించారు. ఆలయ అర్చకులు రాచకొండ రామాచార్యులు–సంధ్యరాణి దంపతులు కన్యాదాతలుగా వ్యవహరించారు. ఆలయ అర్చకులు విజయసింహచారి, రామకృష్ణాచారి, హర్షవర్ధనాచారి ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహించారు. -
మానేరు ప్రాజెక్ట్ కెనాల్ షట్టర్ మూసివేత
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్‌లోని మానేరు ప్రాజెక్ట్ కెనాల్ షట్టర్‌ను మూసివేశారు. ముస్తాబాద్ నుంచి పోతుగల్ వెళ్లే డిస్ట్రిబ్యూటరీ–18 వద్ద మట్టిని పోశారు. దీంతో 18 కెనాల్ వైపునకు నీరు వెళ్లలేని పరిస్థితి. డిస్టిబ్యూటరీ–18 వద్ద కెనాల్ షట్టర్ మూసుకుపోవడంతో రానున్న ఖరీఫ్ సీజన్‌కు నీరు వెళ్లదని రైతులు పేర్కొంటున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి మట్టిని తొలగించాలని రైతులు కోరుతున్నారు. ముగిసిన వార్పర్ల సమ్మె ● కుదిరిన కూలీ ఒప్పందంసిరిసిల్ల: ఏడు రోజులుగా వార్పర్లు చేస్తున్న సమ్మె ఆదివారం ముగిసింది. పాలిస్టర్ అసోసియేషన్ భవన్లో పాలిస్టర్ అసోసియేషన్ ప్రతినిధులకు, వార్పర్ కార్మిక సంఘం నాయకుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన మహిళా ఇందిరా శక్తి చీరల బీములకు ఒక్కోదానికి కూలీని రూ.475 నిర్ణయించారు. జరీబీములు టాప్ది రూ.275గా నిర్ణయించారు. ఇది బీములో దారం పోగుల పొడవు 1250 మీటర్ల వరకు వర్తిస్తుంది. అంతకంటే ఎక్కువ పొడవు ఉంటే అదనపు కూలీ ఇవ్వాలని నిర్ణయించారు. ఈమేరకు వార్పర్ల కూలీ ఒప్పందం కుదరడంతో సమ్మెను విమరించారు. చర్చల్లో పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, కార్యదర్శి అంకాలపు రవి, ప్రతినిధులు గోవిందు రవి, దూడం శంకర్, వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సిరిమల్లె సత్యం, కార్యదర్శి మూషం రమేశ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, ప్రతినిధులు ఉడుత రవి, మచ్చ వేణు, బూట్ల వెంకటేశ్వర్లు, ఐరన్ ప్రవీణ్, అడిచర్ల రాజు పాల్గొన్నారు. వెంకన్న పారివేట శోభాయాత్రబోయినపల్లి(చొప్పదండి): మండలంలోని తడగొండ శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణంలో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారి పారివేట శోభాయాత్ర ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉత్సవ విగ్రహాలతో భజనలు, భక్తి గీతాలతో కనుల పండువలా ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో పూజారులు అనిల్ ఆచార్య, హరికృష్ణ ఆచార్య, సాయిశర్మ శ్రీనివాస, హునుమాన్ దీక్షా స్వాములు పాల్గొన్నారు. -
బుగ్గ.. జలసవ్వడుల అడ్డా
● నీటిబెంగ తీర్చుతున్న అక్కపల్లి బుగ్గ ● వన్యప్రాణుల దాహార్తి తీరుస్తున్న నీరు ● మోహిని‘కుంట’నే ఆధారంసిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద గుట్టల నుంచి నీటి ఊట వస్తోంది. ఆ ఊట నీరు కుండీలో నిల్వ ఉండడంతో వన్యప్రాణుల దాహం తీరుతుంది. అక్కపల్లి బుగ్గ వద్ద కోతులు నీటిని తాగుతూ ఎండాకాలంలో దాహార్తిని తీర్చుకుంటున్నాయి. చుట్టుపక్కల ఎక్కడా చుక్కనీరు లేక.. ఎండిన ఆకులు.. తడిలేని ఒర్రెలు దర్శనమిస్తుంటే అక్కపల్లి బుగ్గజలం.. వన్యప్రాణులకు వరంగా మారింది. -
‘అనర్హులకు ఉద్యోగాలు’
సిరిసిల్లటౌన్: అర్హత లేని వారికి ఉద్యోగాలిచ్చి తమకు అన్యాయం చేశారని సిరిసిల్ల మెడికల్ కాలేజీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసి భంగపడిన బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ శనివారం సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ల్యాబ్ అటెండెన్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్స్, ఈసీజీ థియేటర్ అసిస్టెంట్స్, ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ల్యాబ్ అటెండెన్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఇతర పోస్టులకు అర్హత లేని వారికి మార్కులు కలిపి ఎంపిక చేశారని ఆరోపించారు. ఈ విషయమైన ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ ప్రవీణ్, సంతోష్, కిరణ్, ప్రశాంత్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
తల్లి త్యాగం.. నిలిచిన ప్రాణం..
ముస్తాబాద్(సిరిసిల్ల): తన జీవితం ఉన్నంత కాలం పేగు తెంచుకుని పుట్టిన సంతానం కోసం ఎంతటి త్యాగానికై న సిద్ధపడుతుంది అమ్మ. అందుకు నిలువెత్తు సాక్ష్యమే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌కు చెందిన అరుట్ల భాగ్యమ్మ. అరుట్ల రాజిరెడ్డి– భాగ్యమ్మ దంపతుల కుమారుడు అరుట్ల మహేశ్‌రెడ్డి వంశపారపర్యంగా వచ్చిన కిడ్నీ వ్యాధితో అస్వస్థతకు గురయ్యాడు. రెండేళ్ల క్రితం ఆస్పత్రిలో చేరగా రెండు కిడ్నీలు చెడిపోయాయి. అత్యవసరంగా కిడ్నీ మార్పిడి చేస్తేనే ప్రాణపాయం నుంచి బయటపడుతాడని వైద్యులు తెలిపారు. మరో ఆలోచన లేకుండా తల్లి భాగ్యమ్మ తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు 15నెలల క్రితం సర్జరీ చేసి భాగ్యమ్మ ఒక కిడ్నీని మహేశ్‌రెడ్డి వేశారు. అప్పుడు భాగ్యమ్మ కొడుకును కాపాడుకునేందుకు చేసి న త్యాగంతో ఇప్పుడు మహేశ్‌రెడ్డి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు. అమ్మ తనకు మరోసారి పునర్జన్మనిచ్చిందని, ఆమె త్యాగం వెలకట్టలేనిదని మహేశ్‌రెడ్డి అంటున్నారు. – మరిన్ని కథనాలు 10లోu తెలియదుఅవును12 48పేరెంట్స్‌ను పట్టించుకోకుంటే కఠిన చర్యలు అవసరమేనా?40వద్దు -
నేడు లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం
వేములవాడఅర్బన్: రాజన్న దత్తత ఆలయం నాంపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం ఆదివారం నిర్వహించనున్నట్లు ఈవో వినోద్‌రెడ్డి తెలిపారు. నాంపల్లిగుట్టపై శనివారం ఆలయ ఉద్యోగులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఆలయ ఈఈ రాజేశ్, డీఈ మహిపాల్‌రెడ్డి, ఏఈ రాంకిషన్‌రావు తదితరులు ఉన్నారు. నేడు ఇస్కాన్‌లో నరసింహ జయంతి సిరిసిల్లటౌన్: ఇస్కాన్ మందిరంలో ఆదివారం నృసింహస్వామి జయంతి నిర్వహిస్తున్నట్లు మందిరం మేనేజర్ ప్రాణనాథ అచుత్దాస్ తెలి పారు. ప్రెస్‌క్లబ్‌లో శనివారం వివరాలు వెల్లడించారు. -
నేతన్నల ఖాతాల్లో యారన్ సబ్సిడీ
● 3,019 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.5.24 కోట్లు ● 2023 నాటి బతుకమ్మ చీరల సొమ్ము జమసిరిసిల్ల: స్థానిక వస్త్రపరిశ్రమలో 2023లో బతుకమ్మ చీరలు నేసిన కార్మికులకు 10శాతం యారన్ సబ్సిడీ డబ్బులను చేనేత, జౌళిశాఖ అధికారులు విడుదల చేశారు. 3,019 మంది పవర్లూమ్ కార్మికుల బ్యాంకు ఖాతాల్లో రూ.5.24కోట్లు జమ చేశారు. మొదటి విడతగా 3,019 మందికి డబ్బులు వస్తాయని, రెండో విడతలో మరో 1,481 మంది ఖాతాల్లో జమవుతాయని అధికారులు తెలిపారు. సిరిసిల్లలో పవర్లూమ్ కార్మికులకు మెరుగైన కూలీ(పగార్) అందించేందుకు 2019లో పది శాతం యారన్ సబ్సిడీని పథకాన్ని అమలు చేశారు. సాంచాలపై కార్మికుడు ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరల బట్ట ఆధారంగా ఒక్కో మీటరుకు కూలీపై అదనంగా రూ.1.42 చొప్పున చెల్లిస్తారు. ఎన్ని మీటర్ల బట్టను ఉత్పత్తి చేస్తే అన్ని డబ్బులను చేనేత, జౌళిశాఖ అధికారులు కార్మికుడి బ్యాంకు ఖాతా లో జమచేస్తారు. ఒక్కో కార్మికుడికి రూ.10 వేల నుంచి రూ.24 వేల వరకు జమయ్యాయి. -
మేరా భారత్ మహాన్
సిరిసిల్లటౌన్: మేరా భారత్ మహాన్..భారత్ మాతాకీ జై.. అనే నినాదాలతో సిరిసిల్ల హోరెత్తింది. పాకిస్థాన్‌తో భారత జవాన్లు వీరోచితంగా పోరాడుతుండడంపై జిల్లా కేంద్రం హర్షాతిరేకలు వ్యక్తమయ్యాయి. కుల, మతాలకతీతంగా సబ్బండ వర్గాలు ఏకమై శనివారం రాత్రి భారత సైన్యం సాహసోపేతాన్ని కొనియాడుతూ ‘త్రివర్ణ సిందూర్ ర్యాలీ’ నిర్వహించారు. చేనేతన్న విగ్రహం నుంచి అంబేడ్కర్‌చౌక్, గాంధీచౌక్, పెద్దబజార్ మీదుగా వేలాది సంఖ్యలో పౌరులు మువ్వన్నెల జెండాలను చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ జిల్లా, పట్టణ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, దుమాల శ్రీకాంత్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఆకుల జయంత్‌కుమార్, సామాజిక సమరసత వేదిక అధ్యక్షుడు మోర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మిల్లర్లు కోతలు విధించొద్దు
● ధాన్యం తరలింపులో జాప్యం చేస్తే లారీ కాంట్రాక్టర్‌కు జరిమానా ● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సిరిసిల్ల/చందుర్తి/కోనరావుపేట(వేములవాడ): కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యంలో రైస్‌మిల్లర్లు కోతలు విధించొద్దని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. చందుర్తి మండలం మూడపల్లి, మర్రిగడ్డ, మల్యాల, కోనరావుపేట మండలం బావుసాయిపేట, గోవిందరావుపేట తండా, వట్టిమల్ల, గొల్లపల్లి, నిమ్మపల్లి గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను శనివారం తనిఖీ చేశారు. కేంద్రాల్లో ఎంత ధాన్యం ఉంది, ఇప్పటి వరకు ఎంత కొనుగోలు చేశారన్నది నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలకు తడవకుండా ఉండేందుకు తూకం వేసిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. బస్తాల సరఫరాలో జాప్యం చేయడం ద్వారా వర్షాలకు ధాన్యం తడిస్తే లారీల కాంట్రాక్టర్ల నుంచి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. డీఆర్డీవో శేషాద్రి, ఐకేపీ ఏపీఎంలు రజిత, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. పాలీసెట్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు జిల్లాలో ఈనెల 13న నిర్వహించే పాలీసెట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. పాలీసెట్ నిర్వహణపై ఆయా శాఖల అధికారులతో కలెక్టరేట్లో శనివారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు నిర్వహించే టీజీ పాలీసెట్‌కు జిల్లాలో 2,136 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఏడు పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు వివరించారు. ఫస్ట్ ఎయిడ్‌కిట్, ఓఆర్ఎస్ ప్యాకెట్లతో మెడికల్ క్యాంపు ఏర్పా టు చేయాలని సెస్, వైద్య అధికారులకు సూచించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, పాలీటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకరాచారి, జిల్లా వైద్యాధికారి రజిత, సిరిసిల్ల తహసీల్దార్ మహేశ్, మున్సిపల్ కమిషనర్ పి.వాణి, ఆర్టీసీ డీఎం ప్రకాశ్‌రావు పాల్గొన్నారు. -
అమ్మే అన్నీ తానై..
సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●: కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం 2017 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ఉన్నత స్థానంలో ఉండటానికి కారణం ఆయన తల్లి నూర్జహాన్. ఐదుగురు కుమారుల్లో గౌష్ ఆలం చిన్నవాడు. ఆయన సోదరుల్లో ఇద్దరు మర్చంట్ నేవీలో, ఒకరు పరిశోధనా శాస్త్రవేత్తగా, మరొకరు రేడియాలజిస్ట్ డాక్టర్‌గా స్థిరపడ్డారు. తండ్రి సయ్యద్ ఆలం భారత సైన్యంలో సుబేదార్‌గా పనిచేశారు. 1993లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. తండ్రి మరణించినప్పుడు గౌస్ ఆలం ఏడాది పిల్లవాడు. ఆ సమయంలో వారి కుటుంబం ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. సమాజం ఒంటరి మహిళ ఉద్యోగం చేయడాన్ని అంగీకరించని రోజుల్లో, ఐదుగురు పిల్లల బాధ్యతను తనపై వేసుకుని నూర్జహాన్ ధైర్యంగా ముందుకు సాగారు. భర్త మరణించిన మూడేళ్ల తర్వాత, ఆమె ఢిల్లీ ఆర్డినెన్స్ డిఫెన్స్‌లో క్లర్క్‌గా ఉద్యోగంలో చేరారు. ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయంలో గౌస్ ఆలం పాఠశాల విద్య సాగింది. తల్లి కోరిక మేరకు యూనిఫాం సర్వీస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆ కలను నిజం చేయడానికి నూర్జహాన్ ఎంతో కష్టపడ్డారు. అనేక సమస్యలను ఎదుర్కొంటూ తమ పిల్లలకు మంచి చదువు చెప్పించారు. ఆ కష్టానికి ఫలితమే ఈరోజు తాము ఈస్థాయిలో ఉన్నామని గౌస్ ఆలం గర్వంగా చెబుతున్నారు. తల్లి సంపాదనతో పాటు, తండ్రి పెన్షన్, ప్రభుత్వం నుంచి వచ్చిన స్కాలర్‌షిప్‌ల ద్వారా చదువుకోగలిగామని తెలిపారు. తండ్రి మరణం తర్వాత కుటుంబ బాధ్యతలన్నీ తన తల్లి ఒక్కరే మోశారని ఆయన గుర్తుచేసుకున్నారు. తనతల్లి చూపిన ధైర్యానికి, చేసిన త్యాగానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఆమెకు హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మ.. రెండక్షరాలు కాదు.. సృష్టికి మూలం.. మానవ పుట్టుకకు సాక్ష్యం.. తన రక్తాన్ని పంచి బిడ్డకు ప్రాణం పోస్తుంది. ప్రాణాన్ని ఫణంగా పెట్టి ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అక్షరాలు నేర్పి లక్షణంగా పెంచుతుంది. బుడిబుడి అడుగులు వేయించి సమాజం వైపు నడిపిస్తుంది. పిల్లలకు చిన్న ప్రమాదం ఏర్పడినా.. తల్లడిల్లిపోతుంది. కంటికి రెప్పలా చూసుకుంటూ.. జీవితానికి దారి చూపుతుంది. పిల్లలు ఎదుగుతున్న కొద్ది గొప్పగా భావిస్తుంది. 50 ఏళ్లు వచ్చినా.. తన బిడ్డలు ఇంకా చిన్నారులే అంటూ.. ప్రేమను చాటుతుంది. ఇలా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు మాతృమూర్తులు తమ బిడ్డలకోసం అష్టకష్టాలు పడి జీవితంలో స్థిరపడేలా చేశారు. భర్త దూరమైనా అధైర్య పడకుండా బిడ్డలను జీవితంలో నిలబెట్టిన వారు కొందరైతే.. ఆపదలో ఉన్న పిల్లలకు అవయవాలు దానం చేసినవారు మరికొందరు ఉన్నారు. నేడు మదర్స్‌డే సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఆదర్శ మాతృమూర్తులపై ప్రత్యేక కథనం!! -
ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025
అమ్మ ప్రేమకు జై.. సాక్షి, పెద్దపల్లి: మన జీవితంలో అన్నిదశల్లో వెంటుండే అమ్మను ప్రేమించేందుకు ఒక్కరోజు తప్పనిసరని యువత భావిస్తోంది. మదర్స్ డే రోజు అమ్మకు గ్రీటింగ్ కార్డు, కేకులు, పూలు కానుకలుగా ఇస్తే సరిపోదు. మన జీవితంలోని ప్రతిక్షణాన్ని అమ్మకు అంకితం చేసినా తక్కువేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. నేడు మదర్స్‌డే సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు అంశాలపై 100 మందిని ప్రశ్నించగా.. చెప్పిన సమాధానాలు ఇవీ.. ఫోన్లో/వీడియోకాల్‌లో మాట్లాడుతాంఅవసరం లేదుబహుమతులు ఇస్తాం చాలా ముఖ్యం053123 తల్లుల పాత్రను గౌరవించడానికి మదర్స్‌డే ముఖ్యమా?58మదర్స్ డే రోజు మీ తల్లిని ఎలా విష్ చేస్తారు? 37అమ్మతో గడుపుతాంకొంత ముఖ్యం 46 -
శ్రద్ధ లేదు.. శుద్ధి కాదు!
సిరిసిల్ల: సిరిసిల్ల మురికి నీరు ఇలా పట్టణ శివారులోని తుమ్మలకుంటలో కలుస్తుంది. అక్కడి నుంచి మానేరు వాగులో కలిసి మధ్యమానేరు జలాశయంలోకి చేరుతుంది. ఆ నీటినే మిషన్ భగీరథ ద్వారా శుద్ధిచేసి తాగునీరుగా జిల్లాలోని అన్ని జనవాసాలకు అందిస్తున్నారు. ఇలా చేయడం ప్రజారోగ్యానికి ఎప్పటికై నా ముప్పే అని భావించిన అధికారులు మురికి సమస్యను శాశ్వతంగా తొలగించేందుకు పట్టణ శివారులోని శాంతినగర్ వద్ద సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ను ఏర్పాటు చేశారు. పద్మనగర్‌లో లోపభూయిష్టంగా నిర్మాణం పద్మనగర్ ప్రాంతంలో మురికి నీటిని శుద్ధి చేసేందు కు ఏర్పాటు చేసిన ఇంప్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఈటీపీ) విఫలమైంది. మున్సిపల్, ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపంతో రూ.1.98 కోట్లతో 2019లో నిర్మించిన మినీ ఈటీపీ ప్లాంటు పనికి రాకుండా పోయింది. మురికి కాల్వకు అడ్డంగా మురికి నీరు శుద్ధి అయ్యే విధంగా ఈటీపీ ప్లాంటును నిర్మించాల్సి ఉండగా.. నీరు కిందనుంచి వెళ్లిపోయే విధంగా ప్లాంటును పైకి నిర్మించారు. ఫలితంగా ఈటీపీ ప్లాంట్ నిర్మించిన నాటి నుంచి నిరుపయోగమే అయింది. దీంతో శాంతినగర్‌లో ఎస్టీపీ ప్లాంటును ఏర్పాటు చేశారు. రూ.61.25 కోట్లతో ఎస్టీపీ ప్లాంటు పట్టణంలో ప్రధాన మురికి కాల్వలు రెండు ఉన్నా యి. ఈ కాల్వల్లో వచ్చే మురికి నీటిని శుద్ధిచేసి మా నేరు వాగులోకి వదలిపెట్టే లక్ష్యంతో శాంతినగర్ డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీ వద్ద సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు (ఎస్టీపీ) ఏర్పాటు చేశారు. ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేసి రూ.61.25 కోట్లతో ఎస్టీపీని నిర్మించారు. 2022లో పనులు ప్రారంభించగా.. 90శాతం పూర్తి అయ్యాయి. మురికి నీటిని శుద్ధిచేసే యంత్రాలను బిగించాల్సి ఉంది. ఇవిపూర్తయితే మురికి నీటి శుద్ధి సాధ్యమవుతుంది. బిల్లులు రాక.. పనులు పెండింగ్ ప్లాంటు నిర్మించిన కాంట్రాక్టర్‌కు రూ.30 కోట్ల మేరకు బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో బ్యాలెన్స్ పనులు చేయడం లేదు. ఫలితంగా ఎస్టీపీ ప్లాంటు వినియోగంలోకి రావడం లేదు. మురికి నీటితో భూగర్భ జలాలు కలుషితమవుతూనే ఉన్నాయి. ప్లాంటును పూర్తి చేయాలని కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి సందీప్‌కుమార్ ఝా పలు మార్లు సమీక్షించారు. కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. భారీగా బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో ఎస్టీపీ పనులు పురోగతి సాధించడం లేదు. సిరిసిల్ల మురుగు ‘శుద్ధి’ అయ్యేనా? రూ.61.25 కోట్లతో ఎస్టీపీ ఏర్పాటు బిల్లులు రాక మధ్యలో ఆగిన పనులు పెండింగ్‌లో యంత్రాల బిగింపు ఇది సిరిసిల్ల నడిబొడ్డున ప్రవహించే ప్రధాన మురికి కాలువ. ఒకప్పుడు ఇది మంచినీరు పారే ఉదారువాగు. సాయినగర్ మానేరువాగు నుంచి మంచినీరు ఈ కాలువలో ప్రవహిస్తే పట్టణవాసులు బిందెలతో తీసుకెళ్లి తాగేవారు. ఇది 50 ఏళ్ల కిందటి ముచ్చట. కాలక్రమంలో మురికినీటి కాలువగా మారింది. అంబేద్కర్‌నగర్ గుండా వెళ్లే ఈ కాలువలో పట్టణ మురికి అంతా ప్రవహిస్తోంది.సిరిసిల్లలో వార్డులు: 39పట్టణ జనాభా: 1.05 లక్షలు విస్తీరణం: 55.47 చదరపు కిలోమీటర్లు ప్రధాన మురికి కాల్వలు: 02కుటుంబాల సంఖ్య: 33,608 ఇది సిరిసిల్ల పాత బస్టాండు, శాంతినగర్ గుండా ప్రవహించే కచ్ఛా మురికి కాలువ. పట్టణంలోని అద్దకం (డయింగ్) యూని ట్లలో వాడే రంగులు, రసాయనాలు, వ్యర్థ జలాలు ఈ కాల్వలో పారుతుంటాయి. వర్షాకాలంలో వరద పోటెత్తి చెరువులను దాటి మధ్యమానేరు వాగులో కలుస్తుంది.పనులు పూర్తి చేయిస్తాం సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు(ఎస్టీపీ) నిర్మాణ పనులు చాలా వరకు పూర్తి అయ్యాయి. కొన్ని పనులు చేయాల్సి ఉంది. కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఎస్టీపీ పూర్తి అయితే సిరిసిల్ల మురికి నీటిని శుద్ధి సాధ్యమవుతుంది. – వరుణ్, డీఈఈ, పబ్లిక్ హెల్త్, సిరిసిల్ల -
ఉచిత శిక్షణ.. ఉన్నతికి నిచ్చెన
● స్వచ్ఛంద సంస్థల సేవ.. విద్యార్థుల భవితకు తోవ ● సద్వినియోగం చేసుకుంటున్న పేద విద్యార్థులుసిరిసిల్లకల్చరల్: కార్మిక క్షేత్రంలో నిరుపేద విద్యార్థులకు ఉచిత శిక్షణ వారి ఉన్నతికి ఆలంబనగా నిలుస్తోంది. జిల్లా కేంద్రంలో పలు స్వచ్ఛంద, ధార్మిక సంస్థల నేతృత్వంలో పోటీ పరీక్షలకు ఇస్తున్న ఉచిత శిక్షణతో కార్మిక కుటుంబాల పిల్లలకు మేలు కలుగుతోంది. సిరిసిల్లలో వివిధ ప్రభుత్వ ఉద్యోగులు, వృత్తి రంగ నిపుణుల ఐక్య వేదికగా పోపా (పద్మశాలి అఫిషియల్స్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్) మూడు దశాబ్దాలుగా పలు సామాజిక సేవలు అందిస్తోంది. ప్రతి వేసవిలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు నెల రోజుల పాటు ఉచితంగా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష కోసం శిక్షణ ఇస్తోంది. సుమారు 120 మంది విద్యార్థులు రోజూ తరగతులకు హాజరవుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వేదికగా ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన పద్మశాలి ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులు తమ సేవలను స్వచ్ఛందంగా అందిస్తున్నారు. శ్రీ సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో.. కొన్నేళ్లుగా సిరిసిల్లలో శ్రీ సత్యసాయి సేవాసమితి ధార్మిక సంస్థ డైట్ సెట్, పాలీసెట్‌లకు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. కోవిడ్ సమయంలో అంతరాయం ఏర్పడినా తిరిగి యథావిధిగా క్లాసులు నిర్వహిస్తోంది. వాసవీనగర్‌లోని సమితికి చెందిన మందిరంలో పాలిటెక్నిక్ శిక్షణకు వందమందికి పైగా విద్యార్థులు హాజరవుతున్నారు. సత్యసాయి భక్తులైన సబ్జెక్టు నిపుణులు స్వచ్ఛందంగా తమ సేవలు అందిస్తున్నారు. -
పత్రికా స్వేచ్ఛపై దాడి సరికాదు
సిరిసిల్లటౌన్: పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సింది పోయి అక్రమంగా దాడులకు పాల్పడటం సిగ్గుచేటని జర్నలిస్టులు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో పోలీసులు వారెంటు లేకుండా సోదాలు చేయడాన్ని ఖండించారు. ఈ మేరకు శుక్రవారం సిరిసిల్ల ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఆర్డీవో కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టి ధర్నా చేపట్టారు. ‘సాక్షి’ ఎడిటర్ ఇంటిపై పోలీసుల దాడిని ఖండిస్తున్నామని అన్నారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఆకుల జ యంత్‌కుమార్,ప్రధాన కార్యదర్శి ఆడెపు మహేందర్, కరుణాల భద్రాచలం, టీవీ నారాయణ, ఊరడి మల్లికార్జున్, రాపెల్లి సంతోష్, కాంబోజి ముత్యం, కాయితీ బాలు, పాలమాకుల శే ఖర్, ప్రెస్‌క్లబ్ ఉపాధ్యక్షుడు బొడ్డు పర్శరాములు, కోశాధికారి వంకాయల శ్రీకాంత్, సహాయ కార్యదర్శి కంకణాల శ్రీనివాస్, సభ్యులు పాల్గొన్నారు. ● సిరిసిల్లలో నల్ల బ్యాడ్జీలతో జర్నలిస్టుల నిరసన ర్యాలీ -
బ్యాంకు రుణాల్లో జిల్లాకు అవార్డు
● డీఆర్డీవో, సిబ్బందికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అభినందనసిరిసిల్ల: స్వశక్తి సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించడంలో ఉత్తమ సేవలు అందించిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కలెక్టరేట్లో శుక్రవారం అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2024–25లో 7,969 సంఘాలకు రూ.533.73 కోట్లు లక్ష్యంకాగా రూ. 542.30 కోట్లతో 102శాతం ప్రగతి సాధించారని పేర్కొన్నారు. ఒక్కో గ్రూప్ ఫైనాన్స్ రూ.12.48 లక్షలు ఇవ్వడంలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్నారన్నారు. దీంతో రాష్ట్రస్థాయిలో జిల్లాకు అవార్డు వచ్చిందన్నారు. పీఆర్ మంత్రి సీతక్క, ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేశ్‌కుమార్, సీఈవో సెర్ప్ దివ్య దేవరాజన్ చేతుల మీదుగా డీఆర్డీవో, అదనపు డీఆర్డీవో, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సరిత అవార్డు స్వీకరించారని తెలిపారు. రివకరీలోనూ 99.74 శాతం బ్యాంకు లింకేజీ రికవరీ 99.74 శాతంతో రాష్ట్రంలో జిల్లా రెండోస్థానంలో ఉందని, 2023–24 ఆర్ధిక సంవత్సరంలోనూ లక్ష్య సాధనలో భాగంగా బ్యాంకు లింకేజీ 106 శాతం సాధించారని కలెక్టర్ వెల్లడించారు. ఆర్థికంగా ప్రగతి సాధించి ఆయా కుటుంబాలు తమ పిల్లల ఉన్నత విద్యాభ్యాసానికి బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ ఏడాది కూడా రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు డిసెంబరులోగా లక్ష్యం సాధించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. డీఆర్డీవో శేషాద్రి, అదనపు డీఆర్డీవో గొట్టె శ్రీనివాస్ పాల్గొన్నారు. సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం జిల్లాలో లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు ఆసక్తి గల అభ్యర్థులు మే 17వ తేదీలోగా దరఖాస్తులు చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఒక ప్రకటనలో కోరారు. లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ దరఖాస్తులు ఆహ్వానిస్తుందన్నారు. మే 5 నుంచి మీ సేవా కేంద్రాలలో రూ.100 చెల్లించి దరఖాస్తు నమోనాలను పొందవచ్చన్నారు. ఇంటర్లో గణితంలో 60శాతం మార్పులు సాధించిన వారు, ఐటీఐ డ్రాప్ట్స్‌మెన్(సివిల్) డిప్లమా, బీటెక్ (సివిల్) అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఎంపికై న అభ్యర్థులకు 50 పని దినాలలో (మే 26 నుంచి జూలై 26 ) శిక్షణ ఇస్తామని, శిక్షణ కోసం ఓసీ అభ్యర్థులు రూ.10వేలు, బీసీలు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ.2500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఇతర వివరాలకు 98490 81489, 70326 34404, 94419 47339 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
పిల్లలకోసం మా వంతుగా
మండే ఎండల్లో తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు స్నాక్స్ అందించా లని నేనూ, మా స్నేహితులు ముందుకు వచ్చాం. పత్తిపాక దామోదర్, మోర విష్ణు, పత్తిపాక మధు, కారంపురి శ్యాంసుందర్, గుడ్ల ప్రభాకర్, నాగుల రవీందర్, దాసరి నాగేశ్వర్, సబ్బని భాస్కర్‌తో కలిసి రోజూ అరటి పండ్లు, స్నాక్స్ అందిస్తున్నాం. ఎల్లారెడ్డిపేట ఎంఈవో గాలిపెల్లి కృష్ణహరి, మోర దామోదర్ తాగునీటి వసతి కల్పిస్తున్నారు. – గాజుల ప్రతాప్, విశ్రాంత ప్రిన్సిపాల్ పేద పిల్లలకు వరప్రసాదం నేత పరిశ్రమపై ఆధారపడిన ఎంతో మంది కార్మిక కుటుంబాలకు పాలిసెట్ ఉచిత శిక్షణ వరప్రసాదంగా మారింది. ఏటా 100 మందికి పైగా విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు. గతేడాది ఉత్తమ ఫలితాలను సాధించడం ప్రేరణగా నిలిచింది. అదే స్ఫూర్తితో ఈ సారి కూడా కొనసాగిస్తున్నాం. స్వచ్ఛంద సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు పోపా తరఫున ధన్యవాదాలు. – మామిడాల భూపతి, పోపా ఉపాధ్యక్షుడు పుష్కర కాలంగా పదేళ్లకు పైగా సమితి సారథ్యంలో పిల్లలకు పలు పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ తరగతులు కొనసాగిస్తున్నాం. డైట్ సెట్ ద్వారా సీట్లు సాధించిన చాలా మంది విద్యార్థులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికై జీవితంలో స్థిరపడడం చాలా సంతృప్తి కలిగించే అంశం. ఏటా 150 మంది పిల్లలు ఈ శిబిరం ద్వారా ప్రయోజనం పొందడం సమితి సభ్యులకు సంతోషాన్ని కలిగిస్తోంది. – గోశికొండ బాలరాజు, శిబిరం నిర్వాహకుడు -
ప్రభుత్వ ఆస్పత్రిపై రెడ్‌క్రాస్ గుర్తు
వేములవాడఅర్బన్: యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ఆస్పత్రుల భవనాలపై పన్నెండు అడుగుల పొడవు, వెడల్పుతో రెడ్‌క్రాస్ గుర్తు వేయడం జరిగిందని వేములవాడ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య తెలిపారు. వేములవాడ ఏరియా ఆసుపత్రి భవనంపై సైతం గుర్తును వేశామని పేర్కొన్నారు. యుద్ధ సమయంలో అత్యవసర వైద్యసేవలు అందించే ఆసుపత్రుల మీద దాడులు చేయకూడదనే జెనీవాలో కుదుర్చుకున్న అంతర్జాతీయ యుద్ధ నియమాల్లో భాగంగా, గుర్తు వేయడం జరిగిందన్నారు. దర్శావళి ఉత్సవాలకు రండి ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలోని దర్శావళి దర్గా వద్ద ఈ నెల 14,15 తేదీల్లో నిర్వహించే ఉర్సు ఉత్సవాలకు రావాలని కోరుతూ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు శుక్రవారం నిర్వాహకుడు అజీజ్‌బాయి ఆహ్వాన పత్రిక అందజేశారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ముస్లిం కమిటీ సభ్యులు చాంద్‌పాషా, షేక్ సాహెబ్, షేక్ గౌస్, మహమ్మద్ జబ్బర్, జహాంగీర్, ఇర్ఫాన్, గౌస్ పాల్గొన్నారు. చేనేత శిల్పికి సన్మానం సిరిసిల్ల: అగ్గిపెట్టెలో ఇమిడే చీర సృష్టికర్త, సిరిసిల్ల చేనేత శిల్పి నల్ల విజయ్‌కుమార్‌ను ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో శుక్రవారం హరి యాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ సన్మానించారు. అగ్గిపెట్టలో ఇమిడే చీర, బంగారు, వెండిపోగులతో తయారు చేసిన చీరను మగ్గంపై నేసి అబ్బుర పరిచారు. ఆ చీరను దత్తాత్రేయ సతీమణికి ఉప రాష్ట్రపతి జగదీశ్ దినకరగ్ చేతుల మీదుగా బహుకరించారు. విజయ్ కుమార్‌ను దత్తాత్రేయ అభినందించారు. ఇంటర్లో స్పాట్ కౌన్సెలింగ్ సిరిసిల్ల: ఇంటర్ 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఎస్టీ బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రాంతీయ సమన్వయ అధికారి డీ.ఎస్.వెంకన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్టీ గురుకుల జూనియర్ కళాశాల (బాలికలు), సిరిసిల్ల ఎస్టీ గురుకుల జూనియర్ కళాశాల (బాలికలు), మానాల (వేములవాడ), ఎస్టీ గురుకుల జూనియర్ కళాశాల (బాలికలు), అక్కన్నపేట (హుస్నాబాద్), ఎస్టీ గురుకుల జునియర్ కళాశాల మంథనిలో సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల (బాలికలు), సిరిసిల్ల (ఇందిరమ్మ కాలనీ) సారంపల్లిలో మే 16న నిర్వహించే కౌన్సెలింగ్ హాజరు కావాలని కోరారు. 10వ తరగతి ఉత్తీర్ణులు అయిన బాల, బాలికలు అన్నీ ఒరిజి నల్ ధృవీకరణ పత్రాలతో పాటు, ఒక సెట్ జిరాక్స్ తీసుకొని వచ్చి అడ్మిషన్లు పొందవచ్చని వెంకన్న కోరారు. వివరాలకు ఫోన్ నంబర్ 83339 25362ను సంప్రదించాలన్నారు. -
ఎండుతున్న మొక్కలు
ముస్తాబాద్: ముస్తాబాద్– కామారెడ్డి ప్రధాన రహదారి పక్కన మొక్కలు నీరు లేక ఎండిపోతున్నాయి. ముస్తాబాద్, నామాపూర్ మధ్య ఈ పరిస్థితి నెలకొంది. మొర్రాయిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని రెండు కిలోమీటర్ల పరిధిలో రహదారి పక్కన ఉన్న మొక్కలకు పంచాయతీ సిబ్బంది నీరందించడం లేదు. మండువేసవిలో మొక్కలు ఎండుతున్నా... పట్టించుకోవడం లేదని ప్రజలు అంటున్నారు. పంచాయతీలో నిధులున్నా.. మొక్కలను కాపాడుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, ట్యాంకర్ల ద్వారా నీరు పట్టాల్సి ఉండగా.. పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. -
ఇసుక రీచ్‌లు తెరవాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్, పదిర, వెంకటాపూర్ గ్రామాల్లో ఇసుక రీచ్‌లు ప్రారంభించాలని ట్రాక్టర్ యూనియన్ల ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిరిసిల్ల– కామారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. రెండు గ్రామాల నుంచి 70ట్రాక్టర్లతో తరలివచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో నారాయణపూర్, వెంకటాపూర్ ఇసుక రీచ్‌లను రద్దు చేశారు. పదిర రీచ్‌కు మాత్రమే అనుమతులు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. దీంతో తమ గ్రామాల్లోనూ రీచ్‌లు ప్రారంభించాలని ఆందోళన నిర్వహించి, తహసీల్దార్ సుజాతకు వినతిపత్రం ఇచ్చారు. -
మూడు కేజీబీవీలు అప్‌గ్రేడ్
● బోయినపల్లి, ఇల్లంతకుంట, వేములవాడ అర్బన్ మండలాల్లో ఇంటర్ తరగతులు ● ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభంబోయినపల్లి(చొప్పదండి): జిల్లాలోని మరో మూడు కేజీబీవీలు కళాశాలలుగా అప్‌గ్రేడ్ కానున్నాయి. బోయినపల్లి, ఇల్లంతకుంట, వేములవాడ అర్బన్ మండలాల కేజీబీవీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ కోర్సులు అందించనున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు బోయినపల్లిలో ప్రచారం చేస్తున్నారు. ఒక్కో కళాశాలలో రెండు కోర్సులు, క్లాస్‌కు 40మంది విద్యార్థినులతో సీట్లు భర్తీ చేయనున్నారు. బోయినపల్లిలో బైపీసీ, ఎంఎల్టీ, ఇల్లంతకుంటలో ఎంపీసీ, బైపీసీ, వేములవాడఅర్బన్లో సీఈసీ, ఏఐ కోర్సులు ప్రవేశపెట్టారు. విద్యాబోధనకు కావాల్సిన ఫ్యాకల్టీని వచ్చే నెలలో నియామకం చేస్తారని అధికారులు తెలిపారు. విద్యార్థినులకు అవసరమైన వసతులు జూన్‌లోపు పూర్తి చేయనున్నారు. ‘బోయినపల్లి కేజీబీ వీ కళాశాలలో ఈ విద్యాసంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరానికి బైపీసీ, ఎంఎల్టీ ( మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్) కోర్సులు ప్రారంభిస్తున్నాం. కళాశాలలో చేరాలని ప్రచారం చేయడం జరుగుతోంది’ అని బోయినపల్లి కేజీబీవీ ఎస్వో లింగవ్వ తెలిపారు. -
చెత్త కాదు.. ఫైళ్లగుట్ట
కోనరావుపేట: కోనరావుపేట మండల పరిషత్ కార్యాలయంలోని ఉపాధి హామీ కార్యాలయం ఫైళ్లతో నిండిపోతోంది. ఫైళ్లతో సగం కార్యాలయం గుట్టలుగా పేరుకుపోయింది. గత కొన్నేళ్లుగా జరుగుతున్న ఉపాధి హామీ పనులు, సామాజిక తనిఖీకి సంబంధించిన ఫైళ్లన్నీ సంచుల్లో కట్టి పెడుతున్నారు. ఇలా పెట్టుకుంటూ ఏళ్లుగా ఇలా మూలకు పడేస్తున్నారు. దీంతో కార్యాలయంలో ఫైళ్లన్నీ గుట్టలుగా మారుతున్నాయి. సగం కార్యాలయం వీటికే పోవడమే కాకుండా క్రిమి కీటకాలు చేరే అవకాశముందని పలువురు భావిస్తున్నారు. ప్రజలు, సిబ్బంది భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కదంతొక్కిన జర్నలిస్టులు
గోదావరిఖని: సాక్షి ఎడిటర్ ధనంజయ్‌రెడ్డి నివాసంపై ఏపీ పోలీసుల దాడిని నిరసిస్తూ పాత్రికేయులు స్థానిక బస్టాండ్ వద్ద గురువారం రాస్తారోకో నిర్వహించారు. సాక్షి ఉమ్మడి జిల్లా బ్యూరో భాషబోయిన అనిల్‌కుమార్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందన్నారు. ‘సాక్షి’ యాజమాన్యంపై కక్ష సాధిస్తోందని దుయ్యబట్టారు. ఏపీ ప్రభుత్వ వైఖరిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు. రాస్తారోకోలో జర్నలిస్టులు గుడ్ల శ్రీనివాస్, కాల్వ చంద్రశేఖర్‌రెడ్డి, మోత్కూరి శ్రీనివాస్, కీర్తి రమేశ్, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. -
జిల్లాలో ఉపాధి పనుల వివరాలు
వివరాలు పనుల సంఖ్య ఖర్చు చేసిన మొత్తం చెరువుల పూడికతీత 158 రూ.2.13కోట్లు ఫాంపాండ్స్ 308 రూ.3.17కోట్లు కండిత కందకాలు 330 రూ.8.03కోట్లు ఫీడర్ చానల్ 192 రూ.3.20లక్షలు వర్షపు నీటి సంరక్షణ 06 రూ.18వేలు బోర్వేల్ రీచార్జ్ 33 రూ.2.08లక్షలు ● జిల్లాలో 11.14కోట్లతో పనులు ● కూలీలకు ఊతమిస్తున్న ఉపాధి ● భూగర్భజలాలు, నీటి వనరుల పెంపు ● అటవీప్రాంతంలో పశువులకు సమృద్ధిగా తాగునీరు ● రైతులకు ప్రయోజనాలు నీటి నిల్వలపై దృష్టి ప్రభుత్వం వృథా నీటిని పొదుపు చేసే చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఈ ఆర్థిక సంవత్సరంలో నీటి నిల్వలపై దృష్టి సారించి పనులు చేపట్టాం. ముఖ్యంగా వర్షపు నీరు వృథా కాకుండా అడవిలో కండిత కందకాలు, పారంఫాడ్స్ ఏర్పాటు చేస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 968 పనులు చేపట్టి రూ.11.14కోట్లు ఖర్చు చేశాం. – కొమురయ్య, ఏపీఎం, ఎల్లారెడ్డిపేట రైతులకు ప్రయోజనాలు అడవిలో వృథా నీటిని ఒడిసి పట్టుకోవడానికి కందిత కందకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. కందిత కందకాలు, పారంఫాండ్స్, చెక్ డ్యాంల ఏర్పాటును ఉపాధి హామీ పథకంలో చేపడుతున్నాం. దీంతో అటవీ ప్రాంతల్లో నీటి నిల్వలు పెంచడంతో పాటు కూలీలకు చేతి నిండా పని దోరుకుతుంది. నీటి నిల్వల పెంపుకు అందరూ సహకరించాలి. – శేషాద్రి, డీఆర్డీవో, సిరిసిల్లఈ మహిళా రైతు పేరు పుష్పల. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం. అడవి లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కండిత కందకం నీటినిల్వలతో పశువులకు తాగునీరు అందిస్తోంది. గతంలో అటవీప్రాంతంలో కనుచూపు మేరలో నీటి సౌకర్యం లేక పశువులు తడ్లాడేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరగడంతో వ్యవసాయానికి సమీపబావులు, బోర్లలో నీరు సమృద్ధిగా ఉంటోందని రైతులు చెబుతున్నారు. పనికి వచ్చిన కూలీలు 75,756జాబ్ కార్డులు 98,130 పనికి వచ్చిన జాబ్ కార్డు కుటుంబాలు 51,088 కల్పించిన పని దినాలు 21,88,092జిల్లాలో చేపట్టిన పనులు..ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అడవిలో వృథా నీటిని ఒడిసిపట్టుకునేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఓ వైపు కూలీలకు పని కల్పిస్తూనే, భూగర్భజలాల పెంపుపై దృష్టి సారించింది. గతంలో రైతుల భూముల అభివృద్ధి, ఇతర పనులకే పరిమితమైన ఉపాధిహామీ పథకాన్ని విస్తరించి ప్రధానంగా నీటివృద్ధి పనులు చేపడుతోంది. జిల్లాలోని 13 మండలాల పరిధిలో గత ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రూ.11.14 కోట్లతో పనులను చేపట్టారు. ప్రధానంగా చెరువుల్లో పూడికతీత, పాంపౌండ్స్, కండిత కందకాలు, ఫీడర్ చానల్, భవనాలపై పడ్డ వర్షపునీటి సంరక్షణ, బోర్వెల్ రీచార్జ్ పనుల ద్వారా నీటి నిల్వలను పెంపొందిస్తున్నారు. ఫలితంగా అడవిలోని జంతు, పక్షి జాతులకు తాగునీరు పుష్కలంగా లభిస్తోంది. రైతులకు సాగునీని ప్రయోజనం చేకూరుతోంది. ఉపాధి కూలీలకు చేతినిండ పని దొరుకుతోంది. వృథా నీటిని అరికడుతూ వర్షాకాలంలో వృథా వరద నీటిని అరికడుతూ.. నీటి వనరులను ఉపాధిహామీ పనుల ద్వారా వృద్ధి చేస్తున్నారు. పాత చెరువుల్లో పూడికతీత పనులను చేపడుతూ నీటి సామర్థ్యాన్ని పెంచుతున్నారు. పాంపాండ్స్ నిర్మాణాలు వృథా నీటిని పొదుపు చేయడానికి ఉపయోగపడుతున్నాయి. గుట్టప్రాంతాల్లో జాలువారే నీటిని కందిత కందకాలతో నిల్వ చేస్తున్నారు. అటవీ ప్రాంతం, వాగులపై ఫీడర్ చానల్ నిర్మాణాలను చేస్తూ, పొలాలకు సాగునీరు అందించే చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే రూ.11.14కోట్లు ఖర్చు చేసి నీటిని పొదుపు చేయడం విశేషం. రానున్నకాలంలో ఈ పనులను మరింత విస్తరించడానికి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. కూలీలకు ఉపాధి.. జిల్లావ్యాప్తంగా ఉపాధి పనుల ద్వారా ఎంతో మంది తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. జాబ్‌కార్డులున్న ప్రతీ ఒక్కరికి వందరోజులు పని కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందులో భాగంగా నూతనంగా శ్రీకారం చుట్టిన నీటి పొదుపు పనులు కూలీలకు వరంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా జాబ్‌కార్డులున్న 98,130 మంది కూలీలు 21,88,092 పని దినాలను వినియోగించుకుని ఉపాధి పొందుతున్నారు. -
రాతిచూర.. పట్టించుకోరా?
● విచ్చలవిడిగా గ్రానైట్ డస్ట్ కుప్పలు ● ప్రయాణికుల తిప్పలు ● పరిధి పేరుతో పట్టించుకోని అధికారులు బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిలో వెంకట్రావుపల్లి ఫోర్‌లేన్ రోడ్డు పరిసరాలు, కొత్తపేటలో విచ్చలవిడిగా గ్రానైట్ వ్యర్థాలు (డస్ట్) డంపింగ్ చేయడంతో గాలికి డస్ట్ లేచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట, గంగాధర మండలం ఒద్యారం గ్రానైట్ ఫ్యాక్టరీలనుంచి నిత్యం గ్రానైట్ కటింగ్ రాళ్ల డస్ట్ ఫోర్‌లేన్ రహదారికి ఇరువైపులా డంప్ చేస్తున్నారు. ఈ రహదారి మీదుగా నిత్యం వందల మంది ప్రయాణాలు చేస్తున్నారు. గాలికి డస్ట్ లేచి వాహనదారుల కళ్లలో పడుతుండడంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. విచ్చలవిడిగా డంపింగ్ మండలంలోని వెంకట్రావుపల్లి, కరీంనగర్ వెళ్లే దారిలో బావుపేట, ఒద్యారం గ్రామాల్లో పెద్ద మొత్తంలో గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నారు. గ్రానైట్ ఫ్యాక్టరీల్లో పెద్ద రంపంతో ఉన్న మిషన్‌తో రాళ్లు కట్ చేసి స్లాబ్స్ తయారు చేస్తారు. ఈక్రమంలో తెల్లని ద్రవంరూపంలో డస్ట్ బయటకు వస్తుంది. కొన్ని ఫ్యాక్టరీలు ఆ ద్రవాన్ని స్టోర్ చేసి, పొడిగా మారిన తర్వాత విక్రయిస్తాయి. మరకొన్ని ఫ్యాక్టరీల నుంచి కొందరు డస్ట్‌ను తీసుకువచ్చి అక్రమంగా వెంకట్రావుపల్లి రోడ్డు పరిసరాల్లో పోస్తున్నారు. దీంతో ఈదురుగాలులు వీచినపుడు వాహనదారుల కళ్లలో డస్ట్ పడి ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల పరిధి ఏది..? బావుపేట, ఒద్యారం, వెంకట్రావుపల్లి గ్రానైట్ ఫ్యాక్టరీలు సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల సరిహద్దు గ్రామాల్లో ఉండడంతో మైనింగ్, ఆర్అండ్బీ అధికారులు తమ జిల్లా పరిధి కాదని, గ్రానైట్ వ్యర్థాల డంపింగ్‌పై చర్యలకు దాటవేస్తున్నారని పలువురు అంటున్నారు. కరీంనగర్, సిరిసిల్ల రెండు జిల్లాల మైనింగ్, ఆర్అండ్బీ అధికారులు సమన్వయంతో గ్రానైట్ వ్యర్థాల నుంచి ప్రయాణికులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. -
చర్యలు తీసుకోవాలి
బావుపేట, ఒద్యారం, వెంకట్రావుపల్లి గ్రానైట్ ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలను(డస్ట్) రోడ్డు పరిసరాల్లో విచ్చలవిడిగా పారబోస్తూ చేతులు దులుపుకుంటున్నారు. రెండు జిల్లాలకు చెందిన మైనింగ్, ఆర్అండ్బీ అధికారులు యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి. గ్రానైట్ వ్యర్థాల డస్ట్‌తో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి. – కొనుకటి హరీశ్, నీలోజిపల్లి కళ్లు దెబ్బతింటున్నాయి రోడ్లపై పోసిన గ్రానైట్ డస్ట్ రాతిపొడి చూర గాలికి లేవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. బైక్‌లపై ప్రయాణం చేసేవారి కళ్లలో డస్ట్ పడడంతో దెబ్బతింటున్నాయి. ఒక్కోసారి బైక్‌లు స్కిడ్ అవడంతో ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. – దోమకొండ విజయ్, కొదురుపాక -
గవర్నర్‌ను కలిసిన రెడ్‌క్రాస్ సభ్యులు
సిరిసిల్లటౌన్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సభ్యులు గురువారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మను కలిశారు. తనె 8న ప్రపంచ రెడ్‌క్రాస్ డే సందర్భంగా హైదరాబాద్ రాజభవన్లో జరిగిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వ్యవస్థాపకులు హేండ్రి డునంట్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన కార్యక్రమానికి వారు హాజరయ్యారు. కాగా, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రం కోసం విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా వేములవాడ మండలం తిప్పాపూర్‌లో వెయ్యి గజాల ప్రభుత్వ భూమిని అందించారు. సదరు స్థలంలో సొసైటీ భవన నిర్మాణం కోసం జరిగే భూపూజకు హాజరు కావాలని గవర్నర్‌కు వినతిపత్రం అందించగా ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు, జిల్లా కమిటీ అడ్వైజర్ ఈవీ శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు గుడ్ల రవి, స్టేట్ కమిటీ సభ్యులు ప్రయాకర్రావు, వేణు కుమార్ పాల్గొన్నారు. పాఠశాల కమిటీలకు బిల్లుల చెల్లింపుసిరిసిల్ల: జిల్లాలోని 283 ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల కమిటీలకు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా బిల్లులు చెల్లించారని డీఆర్డీవో శేషాద్రి గురువారం తెలిపారు. విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అమ్మ ఆదర్శ పాటశాల కమిటీల ద్వారా చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఆయా కమిటీలకు చెల్లించడం జరిగిందని వివరించారు. అసంక్రమిత వ్యాధులను ముందే గుర్తించాలి సిరిసిల్ల: అసంక్రమిత (ఎన్సీడీ) వ్యాధులను ముందే గుర్తించి వైద్యం అందిస్తే విలువైన ప్రాణాలను కాపాడినట్లు అవుతుందని ఎన్సీడీ స్టేట్ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్యేంద్రనాథ్ అన్నారు. గురువారం డీఎంహెచ్‌వో ఆఫీస్‌లో జిల్లాలోని పీహెచ్సీ డాక్టర్లు, స్టాఫ్‌నర్సులకు శిక్షణ ఇచ్చారు. గుండెపోటు, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ల లాంటి దీర్ఘకాలిక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించాలన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్.రజిత మాట్లాడుతూ, 30 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషులకు రక్త, క్యాన్సర్ పరీక్షలను నిర్వహించి వైద్యసేవలు అందించాన్నారు. కార్యక్రమంలో పీఓఎంహెచ్‌ఎన్ డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్, డాక్టర్ రామకృష్ణ, పీఓఎన్సీడీ సంపత్‌కుమార్, డీఐవో డాక్టర్ అనిత, డాక్టర్ నహిమా జహా, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. సమ్మర్క్యాంప్లను సద్వినియోగం చేసుకోవాలి వేములవాడరూరల్: విద్యార్థులు సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని డీఈవో జనార్దన్‌రావు అన్నారు. వేములవాడరూరల్ మండలం మర్రిపల్లి కేజీబీవీలో సమ్మర్ క్యాంపును ప్రారంభించి మాట్లాడారు. 6 తరగతి నుండి 9వ తరగతి చదువుతున్న 100 మంది విద్యార్థులకు జిల్లాలోని కేజీబీవీల్లో ఈ నెల 8 నుంచి 22 వరకు శిబిరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శిబిరాల నిర్వహణకు సమగ్ర శిక్ష అధికారులు కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు. మొదటి విభా గం ఫైన్ ఆర్ట్స్‌లో సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, కంప్యూటర్స్, స్కిల్ బేసిక్ కోడింగ్, రెండో విభా గమైన అకాడమిక్ ఎన్రిచ్మెంట్లో స్పీడ్ మ్యాచ్, యోగా, స్పోకెన్ ఇంగ్లిష్, వివిధ రకాల ఆటలు నేర్పిస్తారని వెల్లడించారు. వేసవి సెలవుల్లో విజ్ఞానంతో పాటు వినోదాన్ని పొందుతూ పాఠ్యాంశేతర అంశాలను నేర్చుకునే అవకాశం సమ్మర్ క్యాంప్‌ల ద్వారా లభిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంఈవో లోకిని కిషన్, కేజీబీవీ ప్రత్యేక అధికారి బి పద్మ, తదితరులు పాల్గొన్నారు. -
జయహో భారత్
వాతావరణం ఆకాశం ఎండగా ఉంటుంది. గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. ఉక్కపోతగా ఉంటుంది. వడగాలులు వీస్తాయి. 10లోu సిరిసిల్లటౌన్/సిరిసిల్లకల్చరల్: జయహో భారత్.. జై హింద్ నినాదాలు కార్మికక్షేత్రం సిరిసిల్లలో హోరెత్తాయి. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ శ్రీసిందూర్శ్రీకు సంఘీభావంగా పార్టీలు, న్యాయవాదులు గురువారం కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ప్రదర్శన జరిపారు. సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణం నుంచి అంబేడ్కర్ సర్కిల్ మీదుగా గాంధీ చౌక్ వరకు ర్యాలీ తీశారు. కాంగ్రెస్ నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు. u -
జిల్లా కోర్టు ప్రధాన పాలనాధికారిగా మాధవి
సిరిసిల్లకల్చరల్: జిల్లా న్యాయస్థానం ప్రధాన పాలనాధికారిగా పి.మాధవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు నుంచి బదిలీపై జిల్లా కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా న్యాయవాదులు సంఘం అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు మ ర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుఛ్చం అందించి స్వాగతించారు. జిల్లాకు మంజూరైన న్యాయనిర్మాణ్ కోర్టు భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు. బా ర్ అసోసియేషన్ కార్యదర్శి తంగళ్లపల్లి వెంకటి, ఉపాధ్యక్షుడు అనిల్‌కుమార్, కోశాధికారి నరేశ్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడలో 80 ఫీట్ల మేర రోడ్డు విస్తరణసిరిసిల్ల/వేములవాడ: జిల్లాలోని వేములవాడ పట్టణంలో 80 ఫీట్ల మేర రోడ్డు విస్తరణ పనులు చేపడతామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం తెలిపారు. పట్టణంలోని మూలవాగు నుంచి శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ, భూసేకరణపై కలెక్టర్ ప్రకటన విడుదల చేశారు. పట్టణంలో వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో సర్వే చేస్తుండగా పనులు పరిశీలించామని, గజానికి ధర ఎంతో ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదన్నారు. భూసేకరణలో గజానికి ధర ఎంతో తాను ప్రకటించలేదని కలెక్టర్ స్పష్టం చేశారు. రోడ్డు డిజైన్, నిర్మాణ గడువు అంశాలను తాను ప్రస్తావించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరగాలిముస్తాబాద్/గంభీరావుపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా వైద్యాధికారులు, సిబ్బంది పనిచేయాలని జిల్లా వైద్యాధికారి రజిత అన్నారు. బుధవారం ముస్తాబాద్ మండలం గూడెం, ఆవునూర్ ఆరోగ్య ఉపకేంద్రాలు, గంభీరావుపేట మండలం లింగన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలను తెలుసుకున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలు జరుగుతున్నాయని, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో అన్నిరకాల సదుపాయాలు ఉన్నాయన్న విషయాన్ని ఏఎన్ఎమ్లు, ఆశ వర్కర్లు ప్రచారం చేయాలన్నారు. పీవోఎంహెచ్‌ఎన్ అంజలి, డీఐవో సంపత్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వేధింపులకు గురైతే 181కు ఫోన్ చేయండి సిరిసిల్ల: మహిళలకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను కల్పించిందని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం అన్నారు. సిరిసిల్ల శివారులోని సర్ధాపూర్ 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ ఎంఐ సురేశ్ ఆదేశాలతో బుధవారం మహిళా ఉద్యోగులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. గృహ హింస నిరోధక చట్టం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నివారణ చట్టం, నిర్భయ చట్టం ద్వారా మహిళలు ఎదుర్కొనే హింసలను నిరోధించుకోవచ్చని వివరించారు. మహిళలు ఏ సందర్భంలోనైనా లైంగిక, మానసిక, శారీరక, ఆర్థిక వేధింపులకు గురైతే 181 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వైద్యం, న్యాయం, పోలీస్, కౌన్సెలింగ్, షెల్టర్ వంటి సహాయాల్ని పొందవచ్చని సూచించారు. మహిళా సాధికారత కేంద్రం కో ఆర్డినేటర్ రోజా, బెటాలియన్ ఏవో ఇ.ప్రమీల తదితరులు పాల్గొన్నారు. సమ్మె నోటీస్ అందజేతసిరిసిల్లటౌన్: కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ నేతలు కోరారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఈనెల 20న చేపట్టే సార్వత్రిక సమ్మె నోటీస్‌ను బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో మధ్యాహ్న భోజన రంగం సంఘం తరఫున అందజేశారు. మధ్యాహ్న భోజన కార్మికులు ఈనెల 20న జిల్లా కేంద్రానికి వచ్చి సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గురిజల శ్రీధర్, నాయకులు ఆంజనేయులు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
కోర్టు భవనాలకు ముహూర్తం
● సిరిసిల్ల, పెద్దపల్లి సహా 12 జిల్లాలకు కొత్త కాంప్లెక్స్‌లు ● పోక్సో, ఫ్యామిలీ కోర్టుల కోసం బిల్డింగులు ● ‘న్యాయ నిర్మాణ్’ ప్రణాళిక కింద నిర్మాణాలు ● రూ.691 కోట్లతో టెండర్లు పిలిచిన ఆర్ అండ్ బీ ● ఉమ్మడి జిల్లాకు రూ.118 కోట్లు కేటాయింపు ● నాలుగంతస్తులు.. 2.18 లక్షల చదరపు అడుగుల స్పేస్సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో కొత్తగా కోర్టు భవన సముదాయాల నిర్మాణానికి ముహూర్తం సిద్ధమైంది. కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత పలు కొత్త జిల్లాల్లో కోర్టు భవనాల కొరత ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యాయనిర్మాణ ప్రణాళిక కింద మంచిర్యాల, నిర్మల్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగాం, వికారాబాద్ మొత్తం 12 జిల్లాలో ఫ్యామిలీ, పోక్సో కోర్టుల భవన సముదాయాల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ భవనాల నిర్మాణాన్ని ఆర్అండ్బీ ఎస్ఈ, యాదాద్రి సర్కిల్ వారు పర్యవేక్షించనున్నారు. గత వారంలో టెండర్లు పిలవగా.. టెండర్లకు మంచి ఆదరణ ఉందని సమాచారం. పలు పేరు మోసిన సివిల్ కాంట్రాక్ట్ కంపెనీలు భవన నిర్మాణానికి ముందుకు వచ్చినట్లు తెల్సింది. ఈనెల రెండో వారంలో రూ.691.18 కోట్లతో టెండర్లు ఖరారు కానున్నాయి, ఇందులో పెద్దపల్లి, సిరిసిల్ల కోసం దాదాపు రూ.118 కోట్లు కేటాయించనున్నారు. 24 నెలల్లో పూర్తి.. ఈ భవనాలు మొత్తం నాలుగు అంతస్తుల్లో ఉండనున్నాయి. ప్రతీ భవనంలో ఒక బేస్మెంట్ (88 కార్లు, 62 బైకులు పార్కింగ్ చేసుకునేలా పార్కింగ్ లాట్), గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్లు మొత్తం నాలుగు అంతస్తుల్లో ఈ భవన సముదా యాలను నిర్మించనున్నారు. అనంతరం ఈ భ వన సముదాయాల్లో పోక్సో, ఫ్యామిలీ కోర్టులు నడవనున్నాయి. ప్రతీ ఫ్లోర్లో 43వేల చదరపు అడుగుల నుంచి 44వేల చదరపు అడుగుల చొ ప్పున మొత్తం 2,18, 743.58 చదరపు అడుగుల వరకు ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉంటుంది. భవిష్యత్ అవసరాల కోసం మరో రెండు అంతస్తులు నిర్మించుకునేలా భవనాలు సిద్ధం చేస్తారు. మే రెండో వారంలో టెండర్లు ఖరారు కాగానే నిర్మాణాలు మొదలవుతాయి. నిర్మాణాలుమొదలైన 24 నెలల్లో అంటే 2027 నాటికి ఈ భవనాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.691.18 కోట్లతో.. మొత్తం రూ.691.18 కోట్ల బడ్జెట్‌తో ఈ భవనాలు నిర్మించనున్నారు. ప్రతీ భవనం తూర్పు అభిముఖంగా విశాలంగా, విరివిగా గాలి, వెలుతురు వచ్చేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇందుకోసం రాజసం ఉట్టిపడేలా భవనం మధ్యలో భారీ ఎలివేషన్‌తో ముఖద్వారం, దానికి ఇరువైపులా రెండు విశాలమైన భుజాలతో ఆర్ట్స్ కాలేజీ తరహాలో భవనం స్కెచ్ కూడా ఖరారైంది. ప్రతీ భవనం సివిల్, ఎలక్ట్రిక్, సానిటరీ– వాటర్ వర్క్స్ కోసం దాదాపు రూ.53 కోట్ల నుంచి రూ.59 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. ఇందులో సిరిసిల్ల కోర్టు కాంప్లెక్స్‌కు రూ.59.92కోట్లు, పెద్దపల్లి కోర్టు భవన సముదాయాలకు రూ.58.58 కోట్లు ఖర్చు చేయనున్నారు. వీటిలో జీఎస్టీ కలపలేదు. మొత్తం రూ.691 కోట్లలో రూ.563 కోట్లు సివిల్ పనులకు, రూ.563.70 కోట్లు శానిటరీ, వాటర్ వర్క్స్ కోసం రూ.7.01 కోట్లు, ఎలక్ట్రికల్ వర్క్స్ కోసం రూ.120.46కోట్లుగా పేర్కొన్నారు. -
ఆస్పత్రి నిర్మించాలి
పేదలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తూ అప్పులపాలవుతున్నారు. 30 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టి ఉచిత వైద్యం అందించాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఆస్పత్రిని నిర్మించాలి. – బైతి నవీన్, తెర్లుమద్ది ఉద్యమించిన నేతలు ఎక్కడ..? మండల ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కేటీఆర్ 30 పడకల ఆస్పత్రి మంజూరు చేస్తే, ప్రస్తు త ప్రభుత్వం దానిని విస్మరించింది. అప్పుడు ఆస్పత్రి కావాలని ఉద్యమించిన నాయకులు ఇప్పు డు ఏం చేస్తున్నారు. ప్రజల బాధలు పట్టవా. – మెంగని మనోహర్, ముస్తాబాద్ సమాచారం లేదు ఏడాదిన్నర క్రితం 30 పడకల ఆస్పత్రి మంజూరు చేసినట్లు ఉత్తర్వులు వచ్చాయి. ప్రస్తుతం సీహెచ్‌సీ పనులపై ఎలాంటి సమాచారం లేదు. గతంలో మంజూరు చేశారని పేర్కొన్నా, ఇప్పుడు ఎలాంటి క్లారిటీ లేదు. – డాక్టర్ గీతాంజలి, వైద్యాధికారి -
వాస్తవాలు మాట్లాడితే వణుకెందుకు..?
సిరిసిల్ల: రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరిస్తూ.. ప్రజాపాలన సాగిస్తుంటే ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ వణికిపోతున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్‌లో మాట్లాడారు. రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందుంచాం. ఉద్యోగ సంఘాలు, కొన్ని వర్గాల డిమాండ్లను ఇప్పుడు తీర్చలేమని సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను పారదర్శకంగా కుండలు బద్దలు కొట్టినట్లు చెబితే, బీఆర్ఎస్, బీజేపీ ఒకరికి ఒకరు వంతపాడుతూ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్‌కు అధికారమిస్తే అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణకు ఒక్క పరిశ్రమను తెచ్చారా, ఎవరికై నా ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. జిల్లాలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో కొనుగోలు చేసిన ధాన్యం కంటే.. ఇప్పటికే తాము ఎక్కువ కొనుగోలు చేశామని, ఇంకా చేస్తున్నామని గణాంకాలతో వివరించారు. రైతులకు మూడు రోజుల్లోనే పేమెంట్ ఇస్తున్నామని, తడిసిన ధాన్యాన్ని కొంటామని ప్రజల్లో ఉంటూ, రైతులకు భరోసా కల్పిస్తున్నామని వివరించారు. వాస్తవాలను జీర్ణించుకోలేక బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ కమిట్మెంట్ ఏంటో ప్రజలకు తెలుసునని స్పష్టం చేశారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపారెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాశ్, నాయకులు ఆకునూరి బాలరాజు, సూర దేవరాజు, కాముని వనజ, గడ్డం నర్సయ్య, బొప్ప దేవయ్య, నేరెళ్ల శ్రీకాంత్‌గౌడ్ పాల్గొన్నారు. ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
ఆలయాల అభివృద్ధికి కృషి
● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్కుమార్ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట(సిరిసిల్ల): జిల్లాలో ఆలయాలను అధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో బద్దిపోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ వేడుకల్లో మంగళవారం పూజలు చేశారు. బండి సంజయ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆలయాల స్థితిగతులపై నివేదిక సమర్పించాలని దేవాదాయశాఖ అధికారులను కోరినట్లు తెలిపా రు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు చందుపట్ల లక్ష్మారెడ్డి, జిల్లా కార్యదర్శులు మద్దుల బుగ్గారెడ్డి, బందారపు లక్ష్మారెడ్డి, నాయకులు సల్ల సత్యంరెడ్డి, రాగుల గాల్‌రెడ్డి, చందుపట్ల రాజిరెడ్డి, కిరణ్‌నాయక్, పొన్నాల తిరుపతిరెడ్డి, నంది నరేశ్, సంజీవరెడ్డి, సాయిలు పాల్గొన్నారు. ధాన్యం పైసలు వెంటనే జమ చేయాలి ధాన్యం కొని 20 రోజులైనా రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని, వెంటనే జమచేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. గంభీరావుపేటలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. వడ్ల కొనుగో లులోనూ రాజకీయ జోక్యం పెరిగిందని, అధికా రులకు స్వేచ్ఛనిచ్చి కొనుగోలు చేపట్టాలని కోరా రు. కొనుగోళ్లపై ప్రశ్నిస్తున్న రైతులపై కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు డబ్బులను కేంద్రమే ఇస్తుంటే రైతులను ఎందుకు అరిగోస పెడుతున్నారని ప్రశ్నించారు. రథోత్సవానికి రండి.. కొత్తపల్లిలో ఈనెల 13న నిర్వహించే శ్రీవేణుగో పాలస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కు ఆహ్వానపత్రిక అందించారు. నర్మాలలో మడేలేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాల్లో పాల్గొన్నారు. గంభీరావుపేటకు చెందిన దేవసాని కృష్ణ తండ్రి జనార్దన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ మండలాధ్యక్షుడు గంట అశోక్, నాయకులు రాజేందర్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, కోడె రమేశ్, కృష్ణకాంత్‌యాదవ్, కొక్కు దేవేందర్ యాదవ్, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
వచ్చే నెలలో ప్రత్యేక లోక్ అదాలత్
సిరిసిల్లకల్చరల్: అపరిష్కృత కేసుల సత్వర పరిష్కారం కోసం వచ్చే నెలలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ తెలిపారు. స్థానిక కోర్టు ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. జూన్ 9 నుంచి 14 వరకు నిర్వహించే అదాలత్‌లో ప్రధానంగా చెక్‌బౌన్స్ కేసులు పరిష్కరించనున్నట్లు తెలిపారు. సంప్రదింపులు, చర్చల ద్వారా రాజీ కుదుర్చుకునే కక్షిదారులు 14న జరిగే మెగా జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారానికి నోచుకునేలా పోలీస్ యంత్రాంగం న్యాయవాదులు సహకరించాలని సూచించారు. న్యాయమూర్తులు లక్ష్మణాచారి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి రాధిక జైశ్వాల్, ప్రవీణ్‌కుమార్, గడ్డం మేఘన, కావేటి సృజన, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, లోక్‌అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, ఆడెపు వేణు పాల్గొన్నారు. ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ -
రోడ్డు విస్తరణ పూర్తిచేస్తాం
వేములవాడ: మూలవాగు నుంచి రాజన్న ఆలయం వరకు గల రోడ్డు విస్తరణకు భూసేకరణ పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణ, భూసేకరణ పనులను మంగళవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ వేములవాడలో 80 ఫీట్ల రోడ్డుకు మార్కింగ్ చేయడంతోపాటు 350 కు టుంబాలకు నష్టపరిహారం కింద గజానికి రూ.30వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపా రు. అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని, 50 ఏళ్లుగా ఈ రోడ్డు విస్తరణకు నోచుకోలేదన్నారు. నిర్వాసితులకు నష్టపరిహారం అందజేస్తామని తెలిపారు. విధుల్లో అలసత్వం వహించిన అధికారులకు షోకాజ్ నోటీసులు అందుతాయని హెచ్చరించారు. నలుగురు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని, మిగతావి సరైనవి కావని డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ రాధాబాయి స్పష్టం చేశారు. అధికారులకు సహకరించాలని కోరారు. మున్సిపల్ మేనేజర్ సంపత్‌రెడ్డి, ఆర్అండ్బీ, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. భూయజమానుల ఆందోళన అధికారులు పరిశీలిస్తుండగానే.. ఆయా భవనాల యజమానులు ఆలయం ఎదుట ఆందోళన చేశారు. తమకు సరైన నష్టపరిహారం అందించాలని, ఇంకాస్త సమయం ఇవ్వాలని వారు కోరారు. సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకోగా.. పోలీసుల సహాయంతో కొలతలు పూర్తి చేశారు. భూ భారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి రుద్రంగి(వేమలవాడ): భూసమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వి నియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. రుద్రంగి, మానాలలో నిర్వహించిన సదస్సుకు హాజరై మాట్లాడారు. వివిధ కారణాలతో రెవెన్యూ సదస్సుల్లో అర్జీలు ఇవ్వని వారు తర్వాత అధికారులకు అందజేయాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చే అధికారులకు రైతులు స హకరించాలని కోరారు. మానాలలోని కొనుగోలు కేంద్రాన్ని డీఆర్డీవో శేషాద్రితో కలిసి పరిశీలించారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా వేములవాడ మెయిన్‌రోడ్డు పరిశీలన -
ఫిట్నెస్ బాహుబలి
● వాహనాల ఫిట్నెస్ ఇక పక్కా.. ● అందుబాటులోకి ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ● ఏఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌తో సామర్థ్య పరీక్షలు ● త్వరలో రూ.8 కోట్ల యంత్రసముదాయం ఇన్స్టాలేషన్ ● కేంద్రం ఆదేశాలతో తిమ్మాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్మాణం ● ఫిట్నెస్ వివరాలు నేరుగా ‘వాహన్’ పోర్టల్‌తో అనుసంధానంసాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఒకప్పుడు వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ విషయంలో ఏదోలా నెట్టుకొచ్చేవారు. ఇందులో అక్రమాలకు పుష్కలంగా ఆస్కారం ఉండేది. ఫలితంగా ఫిట్‌నెస్‌లేని వాహనాలు రోడ్ల మీద అమాయకులను బలిగొన్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇకపై అలాంటి రోడ్డు ప్రమాదాలేవీ జరగకుండా రోడ్డు భద్రతలో భాగంగా.. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్) అనే భారీ యంత్ర సముదాయాన్ని ఇన్స్టాల్ చేయనున్నారు. తిమ్మాపూర్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో త్వరలో ఇన్స్టాల్ చేయనున్న ఈ యంత్ర సముదాయం.. ఆటోమేటెడ్ ఫిట్నెస్ మేనేజ్మెంట్ సర్టిఫికెట్ (ఏఎఫ్ఎంఎస్) ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో పనిచేయనుండటం గమనార్హం. ఈ యంత్రాల ఇన్స్టాలేషన్ బాధ్యతలను ఆర్అండ్బీ అధికారులు తీసుకున్నారు. పూర్తి అత్యాధునిక సాంకేతికతతో నడిచే ఈ భారీ యంత్రాల సముదాయం ఇకపై ఉమ్మడి జిల్లాలోని అన్ని లైట్ మోటార్ వెహికిల్స్ నుంచి భారీ యంత్రాల వరకు ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేయనుంది. ఏటీఎస్ ప్రత్యేకతలు ఏంటంటే.. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్) ఒక యంత్రం కాదు. ఇది వాహనాల ముఖ్యమైన విడిభాగాల సామర్థ్యాన్ని కచ్చితంగా మదించి రిపోర్ట్ ఇచ్చే బహుళ యంత్ర సముదాయం. ఎందుకంటే వాహనంలో ఏ భాగం సరిగా పనిచేయకున్నా.. అది ప్రమాదాలకు దారితీస్తుంది. పైగా ప్రస్తుతం మాన్యువల్‌గా జారీ చేసే ఫిట్నెస్ సర్టిఫికెట్లలో అనేక లోపాలు ఉన్నాయి. అందుకే దేశవ్యాప్తంగా అలాంటి లోపాలు నివారించేందుకు ఏకరూపకంగా, దోషరహితంగా, పూర్తి కంప్యూటీకరణ చేసిన ఏటీఎస్ యంత్రాలతో కచ్చితమైన ఫిట్నెస్ రిపోర్టు ఇవ్వడం దీని ప్రత్యేకత. హెడ్‌లైట్, స్టీరింగ్, టైర్ కోసం స్లిప్‌టెస్ట్, సస్పెన్షన్, ఇంజిన్, నాయిస్, ఎయిర్పొల్యుషన్.. ఇలా ప్రతీ విడిభాగం పనితీరును పకడ్బందీగా తనిఖీ చేసి ఆటోమేటెడ్ ఫిట్నెస్ మేనేజ్మెంట్ సర్టిఫికెట్ (ఏఎఫ్ఎంఎస్) రిపోర్ట్ ఇస్తుంది. ఆ వెంటనే.. ఆ రిపోర్ట్‌ను కేంద్రం ఆధ్వర్యంలో ఉన్న ‘వాహన్–పరివాహన్’ పోర్టల్‌కు చేరవేస్తుంది. ఇలా ప్రతీ బండి సామర్థ్యం, దాని వివరాలు అన్నీ దేశంలో ఎక్కడ నుంచైనా అధికారులు చూసే వీలుంటుంది. ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలోని గ్రానైట్, ఇసుక, మైనింగ్, బొగ్గు, రైస్‌మిల్లుల కోసం నడిచే భారీ వాహనాలు ఇకపై ఈ యంత్రాలతో ఫిట్నెస్ తీసుకోవాల్సిందే. పాత వాహనాలకు ఫిట్నెస్ లేకపోతే ఒకటి రెండు సార్లు అవకాశం ఇస్తారు. అయినా మార్పు రాకపోతే ఎండ్ ఆఫ్ లైఫ్ సర్టిఫికెట్ జారీ చేసి ఆ వాహనాలను స్క్రాప్‌కు పంపిస్తారు. రెండెకరాల స్థలంలో.. రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు ఒక ఏటీఎస్ యంత్ర సముదాయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కరీంనగర్‌లోని తిమ్మాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో ఈ యంత్ర సముదాయాన్ని ఇన్స్టాల్ చేయనున్నారు. ఇది ఉమ్మడి జిల్లా వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందించనుంది. భారీ వాహనాలకు 1500 చదరపు మీటర్ల స్థలం కావాల్సి వస్తుంది. ఇలా ఉమ్మడి జిల్లాలోని హెవీ, లైట్ మోటార్ వెహికిల్స్‌ను బట్టి.. ఇక్కడ నాలుగు లేన్లు అవసరమవుతాయని ఇందుకోసం ఎకరంన్నర నుంచి రెండెకరాల స్థలం అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం భారీ షెడ్లు, వచ్చే వాహనాల పార్కింగ్, డ్రైవర్ల కోసం వెయిటింగ్ రూం, సీటింగ్ ఏర్పాటు, టాయిలెట్లు, జనరేటర్లు తదితరాలు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఈ యంత్రాల ఇన్స్టాలేషన్, షెడ్ నిర్మాణం, మౌలిక వసతుల కల్పన అంతా కేంద్రం మార్గదర్శకాల మేరకు రోడ్లు భవనాల శాఖ ఏర్పాటు చేయనుంది.15ఏళ్లు నిండిన వాహనాల వివరాలుజిల్లా వాహనాలు కరీంనగర్ 1,58,129 జగిత్యాల 4,283 పెద్దపల్లి 9,660 రాజన్నసిరిసిల్ల 2,039 మొత్తం 1,74,111 నోట్: ఆటోరిక్షా, కాంట్రాక్ట్ క్యారేజ్, విద్యాసంస్థల బస్సులు, గూడ్స్క్యారేజ్, మ్యాక్సీ క్యాబ్, మోటర్ క్యాబ్, కారు, ద్విచక్రవాహనం, ప్రైవేట్ సర్వీస్ వెహికిల్, స్టేజీ క్యారేజ్, ట్రాక్టర్, ట్రైలర్‌తో కలిపి. -
సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి
సిరిసిల్ల: సైబర్ నేరగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. మోసపోతే జరిగిన గంట(గోల్డెన్ అవర్)లోపు 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ నేరాలపై మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఆఫర్లు, డిస్కౌంట్ల పేరుతో మొబైల్‌కు వచ్చే లింకులపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లకు, కొత్త నంబర్లతో వచ్చే ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేస్తే మీ మొబైల్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వ్యక్తిగత విషయాలు, ఫొటోలు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. సోషల్‌మీడియా అకౌంట్స్‌కు ప్రొఫైల్ లాక్ పెట్టుకోవాలని సూచించారు. లోన్‌యాప్‌లకు దూరంగా కోరారు. కస్టమర్ కేర్ నంబర్లను గూగుల్‌లో వెతకొద్దని సూచించారు. ఈజీ రిటర్న్స్, కమీషన్ బేస్డ్ సైట్లలో పెట్టుబడి పెట్టొద్దని, పాస్వర్డ్, ఓటీపీ, పిన్ నంబర్లను ఎవరికీ షేర్ చేయొద్దని కోరారు. ‘డిజిటల్ అరెస్ట్’లో ఉన్నారని బెదిరింపులకు ఎవరైనా దిగినా స్పందించొద్దని సూచించారు.అకాల వర్షం.. తడిసిన ధాన్యంబోయినపల్లి/గంభీరావుపేట/వేములవాడరూరల్: అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు చేతికందే సమయంలో నీళ్లపాలవుతున్నాయి. బోయినపల్లి, గంభీరావుపేట మండలాల్లో సోమవారం రాత్రి కురిసిన వర్షాని కి ధాన్యం తడిసిపోయింది. కాంటా పెట్టిన ధా న్యం బస్తాలు కూడా తడిసిపోయాయి. బోయినపల్లి మండలం కోరెంలోని కేంద్రంలో ఽరైతుల ధాన్యం కుప్పలు తడవడంతో లబోదిబోమన్నా రు. కాంటా పెట్టిన సంచులు సైతం తడిశాయి.తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందితడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందొద్దని జిల్లా సహకార అధికారి రామకృష్ణ పేర్కొన్నారు. వేములవాడలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. అకాల వర్షానికి నష్టం జరిగిన రైతుల నుంచి వివరాలు సేకరించినట్లు తెలిపారు. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. లారీల కొరత ఉందని, వేములవాడ పరిధిలో బాయిల్డ్ రైస్‌మిల్లులు సరిపడా లేనందున జాప్యమవుతుందని తెలిపారు.బోనమో పోచమ్మావేములవాడ: రాజన్న దర్శనానంతరం భక్తులు మంగళవారం బద్దిపోచమ్మకు బోనం మొక్కులు చెల్లించుకున్నారు. నెత్తిన బోనాలతో అమ్మవారి చెంతకు చేరుకుని బోనం, కల్లుసాక, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు.సమ్మె విజయవంతం చేయండిసిరిసిల్లటౌన్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం సమ్మె పోస్టర్‌ను సిరిసిల్లలో ఆవిష్కరించారు. కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో తలపెట్టిన సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. సిరిమల్ల సత్యం, ఉడుత రవి, మచ్చ వేణు, గాజుల రా జు, బూట్ల వెంకటేశ్వర్లు, అవధూత హరిదాసు, చింతకింది సుదర్శన్, దోమల రమేశ్, శ్యామ్, సతీశ్, సదానందం పాల్గొన్నారు.బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధిగా స్వామిముస్తాబాద్(సిరిసిల్ల): బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతి నిధిగా కదిరె స్వామి గౌడ్‌ను నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు హైదరాబాద్‌లో నియామకపత్రం అందుకున్నారు. మండలంలోని మద్దికుంటకు చెందిన స్వామిగౌడ్ పదేళ్లుగా వెనుకబడిన తరగతుల హక్కుల కోసం పోరాడుతున్నారని, మరింత చురుకుగా పనిచేసేందుకు రాష్ట్ర అధికార ప్రతి నిధిగా అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. -
వార్పిన్ కార్మికుల సమ్మెబాట
● కూలీరేట్లు పెంచాలని డిమాండ్ ● కాంగ్రెస్ నేత కేకే మహేందర్‌రెడ్డికి వినతిపత్రంసిరిసిల్ల: వార్పిన్ కార్మికులు మంగళవారం నుంచి సమ్మె బాట పట్టారు. వార్పిన్ కార్మికులను ఇస్తున్న కూలీ రేట్లను పెంచాలని కోరుతూ పనులు బంద్ చేసి సమ్మెలోకి దిగారు. దీంతో స్థానికంగా మహిళాశక్తి చీరల ఆర్డర్ల ఉత్పత్తికి విఘాతం కలిగింది. సిరిసిల్లలో వార్పిన్ కార్మికుల సమావేశం మంగళవారం జరిగింది. పవర్లూమ్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ మాట్లాడుతూ వార్పిన్, వైపని, పవర్లూమ్ కార్మికులు పక్షం రోజుల కిందట ప్రభుత్వం ఇచ్చిన మహిళాశక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లకు కూలీ పెంచాలని సమ్మె చేయగా.. చేనేత, జౌళి శాఖ అధికారులు బతుకమ్మ చీరలకు ఇచ్చిన కూలీ కంటే మెరుగైన వేతనం అందిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారులు హామీ ఇచ్చిన మేరకు మీటరు బట్టపై రూ.2 కూలీ పెంచారన్నా రు. ఈమేరకు కార్మికుల కూలీ పెరగాల్సి ఉండగా.. యజమానులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న కూలీని కా ర్మికులకు ఇచ్చేందుకు యజమానులకు మనసు రా వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జౌళిశాఖ అధి కారులు కార్మికుల కూలీ రేట్లను నిర్ణయించే బాధ్యత ను యజమానులకు ఇవ్వడంతోనే ఈ పరిస్థితి ఎదురైందన్నారు. ఇప్పటికై నాకూలీరేట్లు పెంచాలని కో రారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సిరిమల్ల సత్యం, కార్మిక నాయకులు ఉడుత రవి, మచ్చ వేణు, బూట్ల వెంకటేశం, దోమల రమేశ్, ఐరన్ ప్రవీణ్, సామల శీను పాల్గొన్నారు. నేడు పాలిస్టర్ అసోసియేషన్ భవన్ ఎదుట ధర్నా పవర్లూమ్ కార్మికులు, వార్పర్లు, వైపనికార్మికుల కూలీరేట్లు పెంచాలని కోరుతూ బుధవారం సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్ భవన్ ఎదుట ధర్నా చేస్తున్నామని సీఐటీయూ నాయకులు ప్రకటించారు. ఈ ధర్నాలో కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ నేత మహేందర్‌రెడ్డికి వినతి కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం మ హిళాశక్తి చీరలకు ఆర్డర్లు ఇవ్వగా.. కార్మికుల కూలీ లో కోత విధిస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజ కవర్గ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డిని కలిసి మంగళవారం వినతిపత్రం అందించారు. సరైన వేతనం ఇ వ్వకుండా కూలీ రేట్లను తగ్గించాలని చూస్తున్నా యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
15 గంజాయి కేసుల్లో నిందితుడి అరెస్ట్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో 15 గంజాయి కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎండీ హమ్మద్ (23)ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. మంగళవారం వివరాలు వెల్లడించారు. జిల్లాలోని సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి, బోయినపల్లి, చందుర్తి పోలీస్స్టేషన్ల పరిధిలో 15 కేసుల్లో హమ్మద్ నిందితుడని వివరించారు. సిరిసిల్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాలుగు, చందుర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మరో కేసులో పరారీలో ఉన్నాడని ఎస్పీ వివరించారు. హమ్మద్ సిరిసిల్లకు వస్తున్నాడనే సమాచారం మేరకు టౌన్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో విద్యానగర్‌లోని ఎల్లమ్మ చౌరస్తా వద్ద పట్టుకుని రిమాండ్‌కు తరలించామని ఎస్పీ తెలిపారు. గంజాయి నిరోధానికి సహకరించండి జిల్లాలో గంజాయి రవాణాపై పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. గంజాయి నిరోధానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములై సహకరించాలన్నారు. జిల్లాలో గంజాయి విక్రయించినా, సాగు చేసినా, రవాణా చేసినా, సేవించిన వారి సమాచారం 87126 56392 నంబర్‌కు అందించాలని ఎస్పీ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతానమి తెలిపారు. సమావేశంలో టౌన్ సీఐ కృష్ణ, కానిస్టేబుళ్లు శ్రీకాంత్, ఇంతియాజ్ ఉన్నారు. ఐదు కేసుల్లో పరారీ గంజాయి నిరోధానికి సమాచారం ఇవ్వండి: ఎస్పీ మహేశ్ బీ గీతే -
ఎన్నికల హామీలు నిలబెట్టుకోవాలి
● తపస్ జిల్లా అధ్యక్షుడు గశికంటి శ్రీనివాస్ బోయినపల్లి(చొప్పదండి): అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీని సీఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టుకోవాలని తపస్ జిల్లా అధ్యక్షుడు గశికంటి శ్రీనివాస్ కోరారు. మండల కేంద్రంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లోపు పెండింగ్ డీఏలు, కొత్త పీఆర్సీ అమలు చేస్తామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపాల్సిన సీఎం చేతులెత్తేయడం సరికాదన్నారు. రాష్ట్ర కార్యదర్శులు ఒడ్నాల జగన్మోహన్, కటుకం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి జయకృష్ణారెడ్డి ఉన్నారు. -
సైకాలజిస్ట్ అసోసియేషన్ ఫార్మేషన్ డే
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయసంస్థ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఫార్మేషన్ డే నిర్వహించారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పున్నం చందర్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వై.ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి చొప్పదండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అశోకచక్ర అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలి ● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సిరిసిల్ల: సాహసోపేతంగా ప్రజలను కాపాడిన పోలీసులకు స్వాతంత్య్ర దినోత్సవం నాడు కేంద్ర హోంశాఖ అందించే అశోకచక్ర అవార్డు కో సం అర్హులైన పోలీసులు దరఖాస్తు చేసుకోవా లని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం ప్రకటనలో కోరారు. ప్రజల ప్రాణరక్షణలో తన ప్రాణాలు ఫణంగా పెట్టి అమరులైన వారికి అశోకచక్ర, ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి కీర్తిచక్ర, శౌర్యం ప్రదర్శించిన సిబ్బందికి శౌర్యచక్ర అవార్డులు ప్రదానం చేస్తారని వివరించా రు. అర్హత గల వారు జిల్లా ఎస్పీకి తమ దరఖా స్తులను నిర్ణీత నమూనాలో సమర్పించాలని సూచించారు. జూలై 2024 నుంచి జనవరి 2025 మధ్యలో జరిగిన సంఘటన అయి ఉండాలని, ఫొటోగ్రాఫర్ వివరాలు సమర్పించాలని కోరారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఆక్షేపణీయం సిరిసిల్లటౌన్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుమాల రమానాథ్‌రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లలోని కుసుమ రామయ్య పాఠశాలలో మంగళవారం జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కించపరిచేలా, తెలంగాణ ప్రజలను ఢిల్లీలో దొంగలుగా చూస్తున్నారని, ఉద్యోగులు ప్రజల అభివృద్ధిని అడ్డుకుంటున్నారనే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని టీపీటీఎఫ్ ఖండిస్తుందన్నారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా సీఎం అసత్యాలు మాట్లాడడం శోచనీయమన్నారు. టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి అంజయ్య, రాష్ట్ర కౌన్సిలర్ సత్తు రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు దబ్బెడ హనుమాండ్లు, మందాడి శ్రీనివాస్‌రెడ్డి, నూగురి దేవేందర్ , జిల్లా కార్యదర్శులు మైలారం తిరుపతి, వేములవాడ అర్బన్ మండల అధ్యక్షుడు బొజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్లాట్ కొనిస్తానని మోసం చేసిన వ్యక్తిపై కేసుజమ్మికుంట(హుజూరాబాద్): రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ప్లాట్ కొనిస్తానని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ రవి తెలిపారు. 2023లో పట్టణంలోని పొనగంటి కావ్య నుంచి మ్యనకొండ సాయికిరణ్ తక్కువ ధరకు ప్లాట్ కొనిస్తానని రూ.93లక్షలు తీసుకున్నాడు. ప్లాట్ చూపించకుండా మోసం చేస్తున్నాడు. డబ్బు అడిగితే అంతుచూస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
● ఆరేళ్ల కొడుకును చితక్కొట్టిన తల్లి ● చికిత్స పొందుతూ మృతి చెందిన చిన్నారి ● సిరిసిల్లలో కన్నతల్లి కర్కశత్వంసిరిసిల్లటౌన్: మాతృత్వం మంటగలిసింది. కన్నతల్లి కర్కశత్వం ఆరేళ్ల చిన్నారికి నూరేళ్లు నింపింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్నకొడుకునే చితకబాది అతడి మృతికి కారణమైంది. ఈ ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం విషాదం నింపింది. పోలీసులు, చిన్నారి నానమ్మ అనసూయ, స్థానికుల కథనం ప్రకారం.. సిరిసిల్లలోని సుభాష్‌నగర్‌కు చెందిన మంగళారపు అరుణ్‌కు అదే ప్రాంతానికి చెందిన మాధవితో చాలా ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కూతురు ఆదిత్రి(9), కొడుకు ఆరుష్(6) ఉన్నారు. అరుణ్ మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి మాధవి స్థానిక వెంకంపేటలో ఉంటోంది. ఆదిత్రి, ఆరుష్ నానమ్మ, తాతయ్య వద్ద ఉండగా.. కొద్దిరోజుల క్రితం మాధవి వారితో గొడవపడి పిల్లలను బలవంతంగా తీసుకెళ్లింది. అయితే మాధవి కొద్దిరోజులుగా వెంకపేటకు చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నెరుపుతున్నట్లు సమాచారం. పిల్లలిద్దరూ ఇంటివద్దనే ఉంటుండడంతో తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని భావించిన మాధవి ప్రియుడితో కలిసి వారిని తీవ్రంగా హింసిస్తున్నారు. మంగళవారం కూడా ఆరుష్‌ను తీవ్రంగా కొట్టడంతో దెబ్బలకు తాళలేక ప్రాణాలు కోల్పోయాడు. ఆరుష్ నానమ్మ అనసూయ ఫిర్యాదు మేరకు మాధవితోపాటు ఆమె ప్రియుడు బాలకృష్ణపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కృష్ణ తెలిపారు. నిందితులిద్దరిని పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. -
రోడ్డుకిందకు దూసుకెళ్లిన లారీ
శంకరపట్నం(మానకొండూర్): మండలంలోని వంకాయగూడెంలో మంగళవారం వేకువజామున బొగ్గులారీ రోడ్డు కిందకు దూసుకుపోయింది. బొగ్గులోడ్ లారీ వైజాగ్ నుంచి నాగపూర్ వెళ్తుండగా వంకాయగూడెంలోకి చేరుకోగా డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో లారీ రోడ్డు కిందకు దూసుకుపోయిందని స్థానికులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్‌తో మీసేవ కేంద్రం దగ్ధంసిరిసిల్లటౌన్: షార్ట్ సర్క్యూట్‌తో యువకుడి ఉపాధి కేంద్రం కాలిపోయిన ఘటన మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాలు.. సిరిసిల్ల పట్టణంలోని యూనియన్ బ్యాంకు సమీపంలో రజనీకాంత్ చాలా రోజులుగా మీ సేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి షాప్‌ను కట్టేసి ఇంటికి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం దుకాణం తెరిచే సరికి కంప్యూటర్, ఫర్నీచర్, ప్రింటర్ తదితర వస్తువులు కాలిపోయినట్లు పేర్కొన్నాడు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వేడుకున్నాడు. తాళం వేసిన ఇంట్లో చోరీ వేములవాడ: వేములవాడలోని మార్కండేయనగర్లో తాళం వేసిన ఇంట్లో మంగళవారం చోరీ జరిగింది. తాటికొండ సంతోష్ అనే ఫిజియోథెరపిస్ట్ కు టుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల క్రితం విహా రయాత్రకు వెళ్లారు. మంగళవారం తిరిగి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు క్లూస్ టీంతో వేలిముద్రలు సేకరించారు. ఇంట్లో ఉన్న దాచిన రూ.25వేలకు పైగా నగదు, 10 గ్రాముల బంగారం వస్తువులు చో రీ అయింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వరి పొలం దగ్ధంకాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): హుస్సేన్‌మియా వాగు సమీపంలో మంగళవారం ప్రమాదవశాత్తు జంగ రాజయ్యకు చెందిన ఎకరంపావు బాస్మతి వరి, కొరకండ్ల శ్రీనివాస్‌రెడ్డికి చెందిన 30 గుంటలు బాస్మతి వరి కుప్ప మంటల్లో కాలిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. వరి కొయ్యలు కాలపెట్టడంవల్లే నిప్పురవ్వలు గాలికి చెలరేగి మంటలు వ్యాపించినట్లు బాధిత రైతులు వాపోయారు. సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. -
పంటమార్పిడితో సుస్థిర ఆదాయం
● వ్యవసాయ శాస్త్రవేత్తలు ● చంద్రంపేటలో అవగాహన సదస్సుసిరిసిల్ల: రైతులు పంట మార్పిడితో అధిక దిగుబడులు సాధిస్తూ.. సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సతీశ్ పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణ శివారులోని చంద్రంపేటలో మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ‘రైతు ముగింట్లో శాస్త్రవేత్తలు–అన్నదాతల అవగాహన’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అధునాతన వ్యవసాయ సాంకేతిక విధానాలు వివరించారు. యూరియా వాడకాన్ని తగ్గించాలని, పచ్చిరొట్ట పంటలు వేసుకోవాలని సూచించారు. అవసరం మేరకే రసాయనాలను వినియోగించుకోవాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల రశీదులను భద్రపరచుకోవాలన్నారు. శాస్త్రవేత్త డాక్టర్ సంపత్, వ్యవసాయాధికారి సందీప్, వ్యవసాయ విస్తరణ అధికారులు లతశ్రీ, రాజ్‌కుమార్, వ్యవసాయ విద్యార్థులు సతీశ్, సౌమ్య, మాజీ కౌన్సిలర్ రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ బాలయ్యయాదవ్, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. -
ఈసారైనా సిరులు కురిపించేనా..?
వేములవాడ: ఎములాడ రాజన్నకు భక్తులు సమర్పించుకునే కురులతో ఏటా సిరులు కురిశాయి. ఈనేపథ్యంలో కరోనా కాలంలో కల్యాణకట్టను మూసివేశారు. తర్వాత 2023–25 రెండేళ్ల కోసం నిర్వహించిన తలనీలాల సేకరణ టెండర్ రూ. 19.01 కోట్లకు పెరిగింది. దీంతో రాజన్నకు భక్తు ల కురులు సిరులు కురిపించాయి. అయితే ఏడాదిపాటు సక్రమంగా చెల్లింపులు చేసిన సదరు కాంట్రాక్టర్ పది నెలలుగా సేకరణ నిలిపివేసి చే తులెత్తేశాడు. దీంతో అధికారులు రంగంలోకి దిగి నేరుగా తలనీలాలను సేకరించి భద్రపరిచారు. టెండర్ సమయం 11 ఏప్రిల్ 2025తో ముగిసింది. ఈలోగా సదరు కాంట్రాక్టర్ కొన్ని డబ్బులను స్వామివారికి చెల్లించి మిగతా డబ్బు జూన్ వరకు చెల్లిస్తానని అగ్రిమెంట్ చేశారు. ఇందుకు ప్రభుత్వం నుంచి ఓ స్పెషల్ ఆర్డర్ కూడా రావడం గమనార్హం. నేడు ఏడోసారి.. ఈ– టెండర్‌కే మొగ్గు రాజన్నకు భక్తులు కల్యాణకట్టలో సమర్పించుకునే తలనీలాలను పోగు చేసుకునే హక్కు కోసం గత టెండర్ ఏప్రిల్ 11తో ముగియగా, అంతకుముందే నాలుగుసార్లు ప్రకటన చేసి టెండర్ నిర్వహించారు. కానీ ఎవరూ హాజరుకాలేదు. ఐదోసా రి రూ.13.67 కోట్లు, ఆరోసారి రూ. 14.01 కోట్లు కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొన్నారు. ఆశించినంత డబ్బు రాకపోయేసరికి ఆలయ అధికారులు నిబంధనల మేరకు టెండర్‌ను రద్దు చేశారు. దీంతో బుధవారం ఏడోసారి తలనీలాల టెండర్ నిర్వహించనున్నారు. అయితే ఈసారి సీల్డ్ టెండర్, బహిరంగ వేలం పాటలను ఆలయ అధికారులు రద్దు చేసి కేవలం ఈ–టెండర్‌కు మాత్రమే అవకాశం కల్పించారు. ఈసారైనా భక్తుల కురులతో రాజన్నకు సిరులు కురుస్తాయా.. లేదా వేచి చూడాల్సిందే. తలనొప్పిగా తలనీలాల సేకరణ భక్తుల తలనీలాల సేకరణ ఆలయ అధికారులకు తలకు మించిన భారంగా మారింది. టెండర్ నిర్వహించి కాంట్రాక్టర్‌కు అప్పగిస్తే ఈ పనులు కాంట్రాక్టరే తమ వ్యక్తులను ఏర్పాటు చేసుకుని నిర్వహించేవారు. అయితే కాంట్రాక్టర్ల నుంచి సరైన స్పందన రాక కల్యాణకట్ట నుంచి తలనీలాలను సేకరించి పోగు చేయడం ఇబ్బందిగా మారిందని అధికారులు, సిబ్బంది వాపోతున్నారు. సీసీ కెమెరాలు, ప్రత్యేక సిబ్బంది, సెక్యూరిటీతో తలనీలాలను సేకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాజన్న భక్తుల తలనీలాల సేకరణకు నేడు ఏడోసారి టెండర్ ఈ–టెండర్‌తో సరి బహిరంగ వేలం, సీల్డ్ టెండర్లు రద్దు -
అంజన్నా.. నీడ లేదన్నా..
మల్యాల(చొప్పదండి): ఎండల తీవ్రతకు కొండగట్టు అంజన్న సన్నిధిలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. స్వామివారిని దర్శించుకుని సేద తీరేందుకు నీడ కరువైంది. ఆలయ పరిసరాల్లో మాత్రమే చలువ పందిళ్లు వేశారు. వై జంక్షన్ నుంచి ఆలయ సమీపం వరకు సుమారు మూడు వందల మీటర్ల దూరం నడిచి వెళ్లాలి. ఆ ప్రాంతంలో చలువ పందిళ్లు లేక ఎండకు మహిళలు, చిన్నారులు, వృద్ధులకు తిప్పలు తప్పడంలేదు. కాలినడకన వచ్చే భక్తుల ఇబ్బంది కొండగట్టులో ఆలయ సమీపం వరకు వాహనాలు వెళ్తుండడంతో కాలినడక వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వాహనాలను ఆలయ సమీపంలోకి అనుమతించకూడదని, వికలాంగులు, వృద్ధులకు సంబంధించి వాహనాలను మాత్రమే అనుమతించాలని ఆలయ ఈవో ఆదేశాలు జారీ చేశారు. అక్కడక్కడ మాత్రమే పందిళ్లు వేసవి సెలవులు ప్రారంభం నుంచి రోజురోజుకు ఆంజనేయస్వామిని దర్శించుకునే భక్తుల రద్దీ పెరుగుతోంది. కాగా, భక్తులు ఎండ వేడిమి తట్టుకోలేక ఆలయ సమీపంలో నీడ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆలయ ప్రధాన, వెనక ద్వారంతో పాటు ఆలయ కార్యాలయం ఎదుట, తాత్కాలిక అన్నదానం సత్రం వద్ద కొంతమేర చలువు పందిళ్లు ఉన్నా భక్తులకు సరిపోవడం లేదు. వై జంక్షన్ నుంచి.. అంజన్న దర్శనానికి వచ్చేవారి కోసం వై జంక్షన్ సమీపంలోని ఆలయ తోరణం నుంచి చలువు పందిళ్లు వేయాలని భక్తులు కోరుతున్నారు. కాలినకడన వెళ్తున్న భక్తులు ఎండ వేడిమి తట్టుకోలేక ఆలయ ద్వారం వరకు చెప్పులతో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఆలయ పరిసరాల్లో అక్కడక్కడే చలువ పందిళ్లు ఎండకు భక్తుల ఇబ్బంది వై జంక్షన్ నుంచి దారి పొడవునా చలువ పందిళ్లు వేయాలని భక్తుల వేడుకోలు -
మావోల అంతం సులువు కాదు
● పౌర హక్కులను అణిచి వేయొద్దు ● కేంద్రం వైఫల్యంతోనే పహెల్గాం ఘటన ● రైతులు, కార్మికులు, స్కీం వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి ● సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డిసిరిసిల్లటౌన్: కర్రెగుట్ట ప్రాంతంలో మావోలను అంతం చేయడం అంత సులువు కాదని, కేంద్ర ప్రభుత్వం వెంటనే వారితో చర్చలు జరపాలని సీపీఐ జాతీయకార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. యుద్ధం పరిష్కారం కాదని, చర్చలతోనే సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. పార్టీ పట్టణ మహాసభలు మంగళవారం రాజన్నసిరిసిల్ల జిల్లాకేంద్రంలోని కార్మికభవనంలో మంగళవారం నిర్వహించారు. ముందుగా పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు సుంకరపెళ్లి శాంతాబాయి చేతుల మీదుగా పతాకావిష్కరణ చేశారు. అనంతరం జరిగిన సభలో చాడ మాట్లాడారు. పహెల్గాం ఘటనకు కేంద్రప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. కార్మికుల తమ సమస్యల పరిష్కారానికి పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎలిగేటి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎనిమిది మంది సీపీఎం కార్యకర్తలు చాడ సమక్షంలో పార్టీలో చేరారు. మూడేళ్లలో అమరులైన వారికి సంతాపం ప్రకటించారు. పార్టీ పట్టణ కార్యదర్శి పంతం రవి మూడేళ్లలో జరిగిన కార్యక్రమాలను నివేదించారు. మహాసభల్లో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటి వేణు, కార్యవర్గ సభ్యులు కడారి రాములు, మీసం లక్ష్మణ్, అనసూర్య, కూర రాకేష్, మంద అనిల్ పాల్గొన్నారు. -
‘నల్లరంగు నోటు’ ముఠా అరెస్ట్
వెల్గటూర్(ధర్మపురి): నల్లరంగు నోటు పేరిట అమాయకుల నుంచి డబ్బు కాజేసే ముఠాను పట్టుకున్నట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. మంగళవారం వెల్గటూర్ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. చెగ్యాం గ్రామానికి చెందిన రామిల్ల విజయ్‌సాగర్‌ను నల్లరంగులో ఉన్న రూ.500 నోట్లను ఒరిజినల్‌గా మార్చే రసాయనం ఉందని కంది నరేశ్, పాలాజి శ్రీనివాస్, ఎంబడి మల్లేశ్, అల్తాపు రాజు, మగ్గిడి కిషన్ నమ్మించారు. 17 ఫిబ్రవరి 2025 రోజున మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామానికి తీసుకెళ్లారు. ఒక ప్లాస్టిక్ గ్లాస్లో ఏదో రసాయనం పోసి నిందితుల వద్ద ఉన్న నలుపురంగు రూ.500 నోట్లను రసాయనంలో ముంచి ఒరిజినల్ నోట్లలా మారిపోయినట్లు నమ్మించారు. ఈ క్రమంలో రూ.లక్షకు రూ.ఐదు లక్షల నల్లరంగు రూ.500 నోట్లు ఇస్తామని, రసాయనంలో ముంచి సులభంగా లక్షలు సంపాదించవచ్చని విజయ్‌సాగర్‌ను మభ్యపెట్టారు. మార్చి 4న రూ.7 లక్షలు ఒరిజినల్ నోట్లు తీసుకున్నారు. కోటిలింగాలకు వస్తే రూ.35 లక్షల నల్లరంగు నోట్లు ఇస్తామని బొమ్మ కరెన్సీ నోట్ల కట్టలు చూపించారు. అదే సమయంలో రాజశేఖర్, కార్తీక్ అనే ఇద్దరు నిందితులు పోలీసులమని బెదిరించారు. నిందితులందరూ కలిసి రూ.7 లక్షల ఒరిజినల్ నోట్లతో పారిపోయారు. తర్వాత వారికి విజయ్‌సాగర్ ఫోన్ చేయగా, మరోసారి డబ్బు అడిగితే చంపేస్తామని బెదిరించారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణలో భాగంగా మంగళవారం నిందితులు వెల్గటూర్ మీదుగా కరీంనగర్ వెళ్తుండగా, స్తంభంపల్లి వద్ద తనిఖీల్లో శ్రీనివాస్, రాజు, మల్లేశ్, రాజశేఖర్, నరేశ్ పట్టుబడ్డారు. మరో ముగ్గురు నిందితులు కిషన్, నవీన్, కార్తీక్ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి కారు, ఐదు సెల్ఫోన్లు, రూ.4వేల నగదు, ఆరు నలుపురంగు రూ.500 నోట్లు, 570 బొమ్మ కరెన్సీ నోట్లు, బైక్‌ను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. గతంలోనూ నిందితులపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని డీఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ రాంనర్సింహారెడ్డి, వెల్గటూర్, ధర్మపురి, బుగ్గారం ఎస్సైలు ఉమాసాగర్, ఉదయ్‌కుమార్, శ్రీధర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
సీఎం రేవంత్ చేతులెత్తేశారా?.. బండి సంజయ్ కౌంటర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: కుటుంబ పెద్ద చేతులెత్తేస్తే కుటుంబం పరిస్థితేంటి? అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రజలకు ధైర్యం చెప్పాల్సిందిపోయి అధైర్యం నింపుతారా? అంటూ నిలదీశారు. రూ.7 లక్షల కోట్లు అప్పు ఉందని ఎన్నికలకు ముందే తెలుసా కదా?. అప్పుల గురించి తెలిసే హామీలిచ్చి ప్రజలను మోసం చేశారు.ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ రాసిచ్చారు. రేవంత్ వ్యాఖ్యలతో రాష్ట్రం పరువు పోయింది’’ అని బండి సంజయ్ మండిపడ్డారు.మంగళవారం.. ఎల్లారెడ్డిపేటలో పర్యటించిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఉద్యోగస్థులు, ఉపాధ్యాయుల పీఆర్సీ, డీఏలకు డబ్బుల్లేవంటున్నాడు సీఎం. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అన్నీ హుళక్కే ఇక. ఓట్లు వేసి గెలిపించారు ఇక మీ కర్మ. మేమైతే ఏం చేయలేమని ముఖ్యమంత్రి క్లియర్ గా చెప్పిండు...కేసీఆర్ అప్పులు చేశాడని చెప్పిన మీరు... తాము వస్తే అంతా బాగుంటుందని మాయమాటలు చెప్పి అధికారంలోకొచ్చారు. రేపట్నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం. కేంద్ర మంత్రులు, ప్రధాని వచ్చినప్పుడు సాయం చేస్తున్నారని మాట్లాడే కాంగ్రెస్ నాయకులే.. మళ్లీ ఆ తర్వాత కేంద్రం ఏం చేయడం లేదని రాజకీయాలు చేస్తారు’’ అంటూ బండి సంజయ్ దుయ్యబట్టారు. -
ఉగ్రవాదమే ప్రధాన సమస్య
జగిత్యాలటౌన్: ఉగ్రవాదమే మనదేశం ముందున్న ప్రధాన సమస్య అని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా కుట్రలు చేస్తున్న పాకిస్తాన్‌ను అణిచివేసే చర్యలు చేపట్టాలని, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఇదే సరైన సమయమని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. పహెల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిని రాజకీయాలు, కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఖండిస్తున్నారని తెలిపారు. పాకిస్తాన్‌ను ఆర్థికంగా దెబ్బతీయడంతోపాటు ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో దేశ ప్రజలంతా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలువడం హర్షించదగిన పరిణామమన్నారు. మల్లికార్జన ఖర్గే, రాహుల్‌గాంధీతోపాటు ప్రతిపక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం దేశ ఐక్యతకు నిదర్శనమన్నారు. దేశ జాతీయత, ఐక్యత, భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం పాకిస్తాన్‌పై చర్యలు చేపట్టాలన్నారు. మేధావులు, ప్రజాసంఘాలు విజ్ఞప్తి మేరకు ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ఆయుధాలు పట్టిన వారితో శాంతిచర్చలు జరపాలని కోరారు. ఆయన వెంట పీసీసీ కార్యదర్శి బండ శంకర్, నాయకులు గాజంగి నందయ్య, గాజుల రాజేందర్, కల్లెపెల్లి దుర్గయ్య, ధర రమేష్, జున్ను రాజేందర్, చందారాదాకిషన్, బీరం రాజేష్, గుండ మధు తదితరులు ఉన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవాలి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి -
సంక్షేమం.. అభివృద్ధి ధ్యేయంగా పాలన
ధర్మారం: సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని పంచాయతీరాజ్, గ్రామీణా అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ధర్మారంలోని మోడల్ స్కూల్ నుంచి ఎండపల్లి క్రాస్‌రోడ్డు వరకు రూ.3.20 కోట్ల వ్యయంతో చేపట్టిన బీటీరోడ్డు పనులకు ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకువడ్డీలు చెల్లిస్తూనే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీనెల తొలివారంలోనే వేతనాలు చెల్లిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రూ.20వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించిందని ఆమె స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం పెగడపల్లి: కాంగ్రెస్ పార్టీ పేదల అభివృద్ధికి పాటుపడుతుందని మంత్రి సీతక్క అన్నారు. పెగడపల్లి మండలంలోని కీచులాటపల్లి కేంద్రంగా నియోజకవర్గంలోని పలు మండలాల్లో రూ.20కోట్ల తో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఎల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తున్నామని, ఇందిరమ్మ పథకం కింద నియోజకవర్గానికి 3500 ఇళ్లు, రూ.500కే గ్యాస్ సిలిండర్, సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తున్నామని వివరించారు. సన్నబియ్యం కొనలేని స్థితిలో ఉన్న పేదల కోసం దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం అందిస్తూ, పేదలకు అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ధర్మపురి నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని అన్నారు. ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ ధర్మపురి అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్అండ్బీ సీఈ సమత, డీపీఓ మదన్మోహన్, ఈఈ శ్రీనివాస్, సీఈఓ గౌతం రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శోభారాణి, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. సన్నబియ్యం పంపిణీ ప్రతిష్టాత్మకం నిరుపేదలు సన్నబియ్యంతో అన్నం తినాలనే లక్ష్యంతో కాంగ్రెస్ప్రభుత్వం సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిందని సీతక్క అన్నారు. నర్సింహునిపేటకు చెందిన దళితురాలు తాండ్ర లక్ష్మి ఇంట్లో సన్నబియ్యంతో భోజనం చేశారు. దొడ్డుబియ్యం తినేందుకు ఇబ్బందిపడ్డామని, సన్నబియ్యం ఇవ్వడంతో ఇంటిల్లిపాదిభోజనం చేస్తున్నామని లక్ష్మి తెలిపారు. సీతక్కకు ఘన స్వాగతం ధర్మపురి: పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు జిల్లాకు వచ్చిన మంత్రి సీతక్కకు మండలంలోని రాయపట్నం వద్ద నాయకులు ఘన స్వాగతం పలికారు. శ్రీలక్ష్మినృసింహుడి ఫొ టో, ప్రసాదాలు అందించారు. ఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీ రఘుచందర్ బందోబస్తును ఏర్పాటు చేశారు. -
హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ పట్టణంలోని సిక్కువాడిలో గత నెల 18న జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. సిక్కువాడిలోని అమ్మ మెస్‌లో వంట పని చేస్తున్న అన్నమనేని మంజులను ఆమె భర్త అన్నమనేని కొమురయ్య హత్య చేయాలని ప్రయత్నించాడు. హోటల్లోని పొయ్యిపై ఉన్న వేడి కూరను మంజుల మీద పోయడంతో ఆమె ముఖం, ఛాతి, వీపు భాగాల్లో తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. హోటల్ యజమాని విజయ్ 108 అంబులెన్స్ ద్వారా మంజులను ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం మంజుల ఫిర్యాదు మేరకు ఎస్సై రాజన్న కేసు దర్యాప్తు చేపట్టారు. కొమురయ్యకు మొదటి నుంచి తన భార్యపై అనుమానం ఉండేది. అంతేకాకుండా, మంజుల గతంలో మహిళా పోలీస్ స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేసింది. ఈ కారణంగా కొమురయ్య తన భార్యపై కక్ష పెంచుకుని ఆమెను చంపాలని ప్రయత్నించాడు. నిందితుడిని సోమవారం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. నీట్ ర్యాంక్ రాదని యువతి ఆత్మహత్యజగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామానికి చెందిన జంగ పూజ (20) ఆదివారం నీట్ పరీక్ష రాసింది. ప్రభుత్వం విడుదల చేసిన కీ చూసుకుని ర్యాంక్ రాదనే మనస్తాపంతో సోమవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పూజ 2023లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి నీట్‌పరీక్ష కోసం లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంది. పరీక్ష సరిగా రాయలేదని మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. పూజ తల్లి జంగ జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోతులా.. దొంగలా..?శంకరపట్నం(మానకొండూర్): మండలంలో వరుస చోరీలతో జనం జంకుతుండగా.. తాజాగా కిరాణ దుకాణంలో వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో దొంగలు పడ్డారని వ్యాపారి అనుమానం వ్యక్తం చేస్తుండగా.. పోలీసులు మాత్రం కోతులు దూరాయని పేర్కొంటున్నారు. వివరాలు.. మండలంలోని కేశవపట్నం ఎస్సీ, బీసీ కాలనీలో సత్యనారాయణ అనే వ్యక్తి రెండురోజుల క్రితం కిరాణ దుకాణానికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం తాళం తీసి చూడగా దుకాణంలోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ట్రెయినీ ఎస్సై సుమన్‌రెడ్డి సిబ్బందితో కలిసి పరిశీలించారు. కాగా, దుకాణం వెనక తలుపులకు గడియ పెట్టకపోవడంతో కోతులు దూరి వస్తువులను చిందరవందర చేశాయని, అలాగే బ్యాగ్‌లో ల్యాప్‌ట్యాప్ భద్రంగా ఉండడంతో కోతులు దూరినట్లు నిర్ధారణకు వచ్చారు. దుకాణంలో పడింది దొంగలు కాదని, కోతుల పడి వస్తువులు చిందవందర చేశాయని ట్రెయినీ ఎస్సై పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలుశంకరపట్నం: మండలంలోని తాడికల్ గ్రామానికి చెందిన గంట గణేశ్, నరాల కొమురయ్య సోమవారం రాత్రి వర్షంలో మోటార్‌సైకిల్‌పై వస్తుండగా కేశవపట్నంలో కిందపడి తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరిని 108వాహనంలో హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. -
వక్ఫ్ ఆస్తులపై దురాక్రమణ తగదు
● వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి ● మిల్లత్ ఇస్లామియా సెంట్రల్ కమిటీ ప్రతినిధులు జగిత్యాలటౌన్: వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ దురాక్రమణ తగదని, వక్ఫ్ అధికారాలను పరిమితం చేయడం సరికాదని, ఇది ముస్లిం మత విశ్వాసాలను దెబ్బతీయడమేనని మిల్లత్ ఇస్లామియా సెంట్రల్ కమిటీ ప్రతినిధులు అన్నారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆల్ఇండియా పర్సనల్ లాబోర్డు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శాంతిర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు కేవలం షరియా మేధోమార్పిడి మాత్రమే కాకుండా రాజ్యాంగబద్ధంగా లభించిన మైనార్టీల హక్కులకు విరుద్ధంగా ఉందన్నారు. ర్యాలీలో మిల్లత్ ఇస్లామియా సెంట్రల్ కమిటీ నాయకులు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లియాఖత్‌అలీ మొహిసిన్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మన్సూర్, మాజీ కౌన్సిలర్, ముస్లిం సదర్ మహ్మద్భారీ, నేహాల్ పాల్గొన్నారు. -
ఆశన్నపల్లెలో నకిలీ మందుల విక్రయం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఆశన్నపల్లె గ్రామంలో సంజీవని న్యూట్రిషన్ కేర్ సెంటర్ నిర్వాహకుల మని నమ్మించి గ్రామస్తులకు సోమవారం నకిలీ మ ందులు విక్రయించారు. అనుమానం వచ్చిన గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. మాజీ సర్పంచ్ మంద వెంకన్న వైద్యాధికారులు, పోలీసులకు సమాచారం అందించడంతో నిందితులను అదుపులోకి తీసకున్నారు. వరంగల్‌కు చెందిన కొందరు వ్యక్తులు గ్రామానికి చేరుకుని గడువు తీరిన, నకిలీ మందులు విక్రయించారు. విక్రేతలకు గ్రామ పంచాయతీ కా ర్యదర్శి సహకరించినట్లు గ్రామస్తులు ఆరోపించా రు. ఈవిషయమై డిప్యూటీ డీఅండ్‌హెచ్‌వో సుధాక ర్, కూనారం ఆరోగ్య కేంద్రం డాక్టర్ భావన మాట్లాడుతూ, నకిలీ వైద్యం, నకిలీ మందులకు ప్రజలు మోసపోవద్దన్నారు. నకిలీ మందులు, వాహనాన్ని సీజ్‌చేసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
ట్యాంకర్ కిందపడి సూపర్వైజర్ మృతి
గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–1 పరిధిలోని జీడీకే–5 ఓసీపీలో తాను నడుపుతున్న ట్యాంకర్ కిందపడి పీసీపటేల్ అనే ప్రైవేట్ ఓబీ కాంట్రాక్టు సూపర్వైజర్ మృతి చెందాడు. సోమవారం రెండో షిప్టులో వికాస్కుమార్(35) అనే సూపర్వైజర్ ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యాడు. హాలేజీ రోడ్డులో దుమ్ములేవకుండా వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్లు చల్లేందుకు వాహనం నడుపుకుంటూ వెళ్లాడు. ఈక్రమంలో ట్యాంకర్ అదుపు తప్పింది. అందులోంచి దూకి ప్రాణాలు కాపాడుకోవాలనే ప్రయత్నంలో అదుపుతప్పి అదేట్యాంకర్ వెనుక టైర్ కింద పడి వికాస్కుమార్ దుర్మరణం చెందాడు. డ్రైవర్ నడపాల్సిన ట్యాంకర్‌ను సూపర్వైజర్ ఎందుకు నడపాల్సి వచ్చిందని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కాలంచెల్లిన వాహనంతో పనులు చేయించడంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. ప్రమాదంపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి రూ.కోటిపరిహారం చెల్లించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరిగేంత వరకు శవాన్ని కదలనివ్వం ప్రమాదంపై విచారణ జరిపి, మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు శవాన్ని ఇక్కడ నుంచి తీయనివ్వమని కార్మిక సంఘాల నాయకులు యాదగిరి సత్తయ్య, మడ్డి ఎల్లాగౌడ్ డిమాండ్‌చేశారు. పీసీపటేల్ ప్రైవేట్ ఓబీ సంస్థ నిర్లక్ష్యంతోనే వికాస్కుమార్ మృతి చెందాడని ఆరోపించారు. రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ -
ప్రకృతి సాగు.. ఆరోగ్యం బాగు
కరీంనగర్‌అర్బన్: సారవంతమైన నేలలు నిస్సారమవుతున్నాయి. విచ్చలవిడిగా ఎరువులు, మందుల వాడకంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. ప్రజారోగ్యంతో పాటు సాగు నేలలను సారవంతంగా మార్చాలని కేంద్రం బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. నేషనల్ మిషన్.. నేచురల్ ఫార్మింగ్ పేరుతో కార్యక్రమం అమలు చేస్తోంది. సహజ పద్ధతుల్లో విభిన్న పంటలు పండించేలా రైతులను ప్రొత్సహించనుంది. మూస పద్ధతిలో సాగుకు స్వస్తి పలికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఆర్జించే పంటలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇందు కోసం జిల్లాలో మండలానికో గ్రామం చొప్పున ఎంపిక చేసి నివేదిక పంపాలని ఆదేశించింది. ఈ క్రమంలో కరీంనగర్ అర్బన్ మినహా 15 మండలాలకు గానూ 15 గ్రామాలను ఎంపిక చేసి నివేదించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదముద్ర తదుపరి త్వరలోనే శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమవనున్నాయి. ఏంటీ జాతీయ సహజ వ్యవసాయ మిషన్ ఇప్పటికే సాగులో సేంద్రియ పద్ధతులు పాటిస్తున్న రైతులు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్), వ్యవసాయదారుల ఉత్పత్తి సంఘాలు (ఎఫ్‌పీవోలు), స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీలు) వంటి వాటికి ఈ పథకంలో ప్రాధాన్యమిస్తారు. సురక్షితమైన పోషకాహారాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సహజ సాగు పద్ధతులను ప్రోత్సహిస్తుంది. 2025–26లో ఈ పథకం కోసం వెచ్చించే రూ.2,481 కోట్ల మూలధనంలో కేంద్ర ప్రభుత్వం రూ.1,584 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.897 కోట్లు ఖర్చు చేయనున్నాయి. సేంద్రియ వ్యవసాయానికి అవసరమయ్యే సహజ ఉత్పత్తులను రైతులకు సులభంగా అందుబాటులో ఉంచేందుకు అవసరాన్ని బట్టి జీవాధార వనరుల కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, రైతుల పొలాల్లో 2వేల వరకు నమూనా సహజ వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పుతారు. ఆసక్తి గల రైతులకు నిపుణులైన శిక్షకులు సహజ వ్యవసాయ పద్ధతులు, జీవ ఎరువుల తయారీ వంటి వాటిలో శిక్షణనిస్తారు. జిల్లాల్లో ఎంపిక చేసిన వ్యవసాయ క్లస్టర్లలో ఈ పథకంపై అవగాహన కల్పించేందుకు, స్థానిక రైతుల మధ్య సహకారం పెంచేందుకు కృషి సఖులు, సాగు సహాయకుల (సీఆర్పీ)ను ఉపయోగించుకోనున్నారు. నేల సారవంతానికి కేంద్రం చర్యలు మండలానికో గ్రామం ఎంపికకు ఆదేశం ప్రయోజనాలిలా.. సేంద్రియ ఎరువులు, సంబంధ పద్ధతుల వాడకం వల్ల నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి, భూసారం మెరుగుపడుతుంది. రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గడం వల్ల వాతావరణంలో కార్బన ఉద్గారాలు తగ్గుతాయి. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్, ధర ఉండటం వల్ల రైతులకు ఆదాయం పెరుగుతుంది. సేంద్రియ ఉత్పత్తులు మానవ ఆరోగ్యానికి సురక్షితమైనవి. పోషక విలువలను అధికంగా కలిగి ఉంటాయి. కాగా నేషనల్ మిషన్.. నేచురల్ ఫార్మింగ్ పథకం కోసం మండలానికో గ్రామం ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదించామని, ప్రభుత్వం ఆమోదం అనంతరం కార్యక్రమం ప్రారంభమవుతుందని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి వివరించారు. -
అంజన్న హుండీ ఆదాయం రూ.1.07 కోట్లు
మల్యాల: కొండగట్టు ఆంజన్న ఆలయంలోని 12 హుండీలకు భక్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ ఈఓ శ్రీకాంత్‌రావు, అసిస్టెంట్ కమిషనర్ రాజమౌళి ఆధ్వర్యంలో సోమవారం లెక్కించారు. 39 రోజులకు రూ.1,07,67,134 సమకూరాయి. 134 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మిశ్రమ వెండి, బంగారాన్ని తిరిగి బ్యాగుల్లో పెట్టి, సీల్ వేసి హుండీల్లోనే వేశారు. జువెల్లర్స్ సమక్షంలో తూకం వేయనున్నట్లు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ, రఘు, ఆలయ పరిశీలకులు సునీల్‌కుమార్, చంద్రశేఖర్, హరిహరనాథ్, అశోక్, రాములు పాల్గొన్నారు. కొండగట్టులో భక్తుల రద్దీ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మధ్యాహ్నం ఎండలను సైతం లెక్కచేయకుండా స్వామి వారిని దర్శించుకున్నారు. మొక్కలు చెల్లించుకున్నారు. -
వెల్లువలా వినతులు
● వివిధ సమస్యలపై 167 అర్జీలు ● దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాసిరిసిల్లటౌన్: సుదీర్ఘకాలంగా తమ సమస్యలు అపరిష్కృతంగా ఉంటున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా స్పందిస్తూ ప్రజావాణిలో వచ్చే అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా నలు మూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి 167 దరఖాస్తులు వచ్చాయి. సీపీవోకు 1, జిల్లా వ్యవసాయాధికారి 1, జిల్లా పౌర సరఫరాల అధికారి 5, జిల్లా విద్యాధికారి 3, జిల్లా వైద్యాధికారి 10, మైనార్టీ సంక్షేమాధికారి 1, డీఆర్డీవో 3, జిల్లా సంక్షేమాధికారి 4, ఈడీఎం 1, గృహనిర్మాణ శాఖకు 6, ఎల్డీఎం 4, సెస్ ఆఫీస్ 4, మెడికల్ కాలేజీ 1, ఎంపీడీవో ఇల్లంతకుంట 2, గంభీరావుపేట 5, కోనరావుపేట 2, ముస్తాబాద్ 3, తంగళ్లపల్లి 12, వేములవాడ రూరల్ 1, ఎల్లారెడ్డిపేట 4, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల 11,మున్సిపల్ కమిషనర్ వేములవాడ 3, ఆర్డీవో సిరిసిల్ల 6, ఆర్డీవో వేములవాడ 4, ఎస్డీసీ 16, ఎస్పీ కార్యాలయం 3, తహసీల్దార్ బోయినపల్లి 5, చందుర్తి 3, ఇల్లంతకుంట 8, గంభీరావుపేట 3, కోనరావుపేట 3, ముస్తాబాద్ 2, సిరిసిల్ల 3, తంగళ్లపల్లి 9, వీర్నపల్లి 1, వేములవాడ 4, వేములవాడరూరల్ 2, ఎల్లారెడ్డిపేటకు 6, డీసీఎంఎస్‌కు ఒక్కో దరఖాస్తు చొప్పున వచ్చాయి. -
భూకంపం కలకలం
● రెండు సెకన్లు కంపించిన భూమి ● జిల్లాలో 40 ఏళ్ల తర్వాత ప్రకంపనలుసిరిసిల్ల: జిల్లాలో సోమవారం భూమి కంపించింది. సాయంత్రం 6.49 గంటలకు రెండు నిమిషాలపాటు కంపించడంతో జనం ఉలిక్కిపడ్డారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతోపాటు ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, వీర్నపల్లి, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, బోయినపల్లి, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్ మండలాల్లోనూ భూమి కంపించింది. భయంతో జనం రోడ్లపైకి వచ్చారు. వాహనాల్లో వెళ్తున్న వారికి భూకంపం ప్రభావం పెద్దగా కనిపించకపోగా.. ఒక్కచోట ఉండి పనిచేసే వారికి భూకంపం కదలికలు స్పష్టంగా తెలిశాయి. జనం ఒకింత ఆందోళనకు గురయ్యారు. జిల్లా వ్యాప్తంగా రెండు సెకండ్లపాటు వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 3.8గా నమోదైనట్లు తెలుస్తోంది. సిరిసిల్ల, వేములవాడ ప్రాంతంలో 40 ఏళ్ల కిందట ఇదే తరహాలో ఐదు సెకండ్ల పాటు భూకంపం వచ్చింది. మళ్లీ ఇప్పుడు రావడం చర్చనీయాంశమైంది. రాత్రి పూట మళ్లీ ఏమైనా భూకంపం వస్తుందా..? అని జనం ఆందోళనకు గురవుతున్నారు. -
రైల్వేస్టేషన్లకు తుదిమెరుగులు
● దాదాపు పూర్తయిన రామగుండం, కరీంనగర్ స్టేషన్లు ● ఆధునికీకరణలో ముందడుగు.. ఈనెల 15న ప్రారంభం? ● లిఫ్టులు, ఎస్కలేటర్లు, అదనపు ప్లాట్‌ఫారాల నిర్మాణం పూర్తి ● తుదిదశలో స్వాగత తోరణాలు, సుందరీకరణ పనులు ● కరీంనగర్ ఆర్వోబీ కోసం రైల్వేగేట్ పక్కకు తరలింపుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లాలో రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో కరీంనగర్, రామగుండం రైల్వేస్టేషన్ల పనులు దాదాపు పూర్తయి తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. అన్నీ కుదిరితే.. ఈనెల 15న ప్రారంభోత్సవం జరగవచ్చని రైల్వేవర్గాలు అంటున్నాయి. వాస్తవానికి ఏప్రిల్ 27న కరీంనగర్, రామగుండం స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించాల్సింది. అయితే భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో వాయిదాపడింది. ఈసారి అనుకుంటున్న 15వ తేదీన జరగుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు పెద్దపల్లిలో పనులు ఇంకా కొనసాగుతున్నాయి. అటల్ మిషన్ ఫర్ రిజునవేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్మిషన్ (ఏఎంఆర్‌యూటీ) దీనినే అమృత్ పథకం కింద కేంద్రం రూ.73 కోట్లు ఈ మూడు స్టేషన్ల కోసం విడుదల చేసింది. తొలిదశలో కరీంనగర్ రూ.26.06, రామగుండం రూ.26.50 కోట్లు విడుదల కాగా.. రెండో దశలో పెద్దపల్లికి రూ.20 కోట్లు విడుదలయ్యాయి. కరీంనగర్, రామగుండంకు సరికొత్త రూపు రోజుకు ఒకటి, రెండు మినహా పెద్దగా రైళ్లు రాని కరీంనగర్ స్టేషన్ రూపురేఖలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. స్టేషన్లో రెండు దశాబ్దాలుగా ఉన్న ఒక్క ప్లాట్ఫారానికి అదనంగా 2, 3 ప్లాట్‌ఫారాలు నిర్మించారు. వాటిని వృద్ధులు, వికలాంగులు వినియోగించుకునేలా లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు నిర్మించారు. స్వాగత తోరణాలు, స్టేషన్ ముఖద్వారం ఎలివేషన్, పార్కు పూర్తికావొచ్చా యి. ఇవి కాకుండా మరుగుదొడ్లు, ఫుట్‌ఓవర్‌బ్రిడ్జి, బుకింగ్ కార్యాలయం, ఆర్పీఎఫ్ పోస్టు, కేటీరింగ్ స్టాల్స్, వెయిటింగ్ రూములు, రిజర్వ్డ్ లాంజ్లతోపాటు కమర్షియల్ ఇన్స్పెక్టర్, స్టేషన్ మేనేజర్, చీఫ్ గూడ్స్ సూపర్వైజర్, డిప్యూటీ స్టేషన్ మేనేజర్లకు ప్రత్యేక కార్యాలయాలు నిర్మించారు. రామగుండం రైల్వేస్టేషన్ ఆధునీకరణ, సుందరీకరణ పనులు కరీంనగర్ కంటే ముందే పూర్తయ్యాయి. దీని వీడియోలు ఇప్పటికే సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పెద్దపల్లి స్టేషన్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. రెండో ఫేజ్‌లో నిధులు మంజూరవడంతో ఇక్కడ పనులు ఇంకా సగం కూడా పూర్తి కాలేదు. ఆర్వోబీ కోసం.. రైల్వేగేటు తొలగింపు రైల్వేస్టేషన్ నిర్మాణ పనులతోపాటు కరీంనగర్– చొప్పదండి మార్గంలో ఆర్వోబీ పనులు కూడా ఊపందుకున్నాయి. ట్రాక్‌కు రెండువైపులా నిర్మాణాలు రైల్వేగేట్ వరకు వచ్చాయి. ఈ నేపథ్యంలో రైల్వేగేటు తొలగించి అక్కడ పిల్లర్లు వేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రస్తుతమున్న రైల్వేగేట్‌ను తొలగించి పక్కకు తరలించి ట్రాఫిక్‌ను దారి మళ్లించనున్నారు. వాస్తవానికి ఇప్పటికే పూర్తి కావాల్సిన ఆర్వోబీ నిర్మాణం ఇంకా కొనసాగుతూ.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలగజేస్తోంది. ఉదయం ఉద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండలు ముదరడంతో బాధలు రెట్టింపయ్యాయి. అంబులెన్స్‌లో కరీంనగర్‌కు వచ్చే రోగుల పరిస్థితి చెప్పనలవి కాకుండా ఉంది. -
ఫిర్యాదులు ఆన్లైన్లో నమోదు
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్ల: ప్రజల నుంచి వచ్చిన ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసి ఆ సమస్య పరిష్కారమయ్యే సమీక్షిస్తామని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 32 మంది బాధితులు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులను పరిష్కరించాలని ఆయా పోలీస్ స్టేషన్ అధికారులకు నేరుగా ఫోన్ చేసి సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతో ప్రతీ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజాసమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తున్నామన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ప్రతి ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్టప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. -
వైద్యం కోసం సాయం చేయండి
మాది వీర్నపల్లి మండలం వన్‌పల్లి. నేను గత మూడేళ్లుగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న. మాకున్న ఎకరం భూమిని అమ్మి అమ్మనాన్నలు రూ.15లక్షలు ఖర్చుచేసి వైద్యం చేయించారు. ఇంకా రూ.10లక్షలు వైద్య ఖర్చులకు అవసరం ఉంది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ప్రభుత్వపరంగా సాయం అందిస్తే వైద్యం చేయించుకుంటాను. – జింక ప్రభాస్, వన్పల్లిఆస్తిని తీసుకున్నారు మాది తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్. నా భర్త నర్సయ్య పన్నెండేళ్ల క్రితం చనిపోగా మాకున్న పొలాన్ని ముగ్గురు కొడుకులు వారి పేర్లపై పట్టా చేయించుకున్నారు. వారు కూడా కాలం చేయగా.. పెద్దకోడలు కనుకవ్వ, రెండో కోడలు భద్రవ్వ పట్టించుకోవడం లేదు. రోజూ తిడుతున్నారు. తిండికూడా పెట్టడం లేదు. – వంతడ్పుల నర్సవ్వ -
ఉపాధ్యాయుల సహకారంతోనే..
మా పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు బాగా చదవాలని ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. ఉదయమే ఫోన్‌చేసి చదువుకునేలా చేశారు. వెనుకబడ్డ సబ్జెక్టులపై తరగతులు నిర్వహించారు. పరీక్షలంటే భయం పోగొట్టారు. మనం ప్రైవేటుకు ఏ మాత్రం తక్కువ కాదనే నమ్మకాన్ని కల్పించారు. – సానియా, కొండాపూర్ వెనుకబడిన విద్యార్థుల దత్తత చదువులో వెనుకబడిన విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకున్నారు. ప్రతీ ఆరుగురి విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాం. స్టడీ అవర్స్‌తోపాటు ఇంటి వద్ద పిల్లలు చదివేలా చర్యలు తీసుకున్నాం. తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాం. ప్రతి పాఠంపై స్లిప్ టెస్టు పెట్టాం. – నర్సింహరాజు, ప్రిన్సిపాల్, మోడల్‌స్కూల్ -
అనర్హులకు ఉద్యోగాలిచ్చారు
ఇటీవల వైద్య కళాశాలలో ల్యాబ్ అట్టెండ్, డీఈవో పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి.. అర్హతలున్న మమ్మల్ని వదిలేసి ఇతరులకు ఉద్యోగాలిచ్చారు. ఎంపిక విధానంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అర్హులకే ఉద్యోగాలివ్వాలి. – దరఖాస్తుదారులురేషన్కార్డులో తప్పులు సవరించాలి మేము హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు చాలా ఏళ్ల క్రితం వచ్చాము. మారెల్ల లావణ్య, మారెల్ల యశ్వంత్‌కుమార్ పేర్లతో అక్కడ రేషన్‌కార్డు ఉండేది. అది బ్లాక్ కావడంతో సిరిసిల్లలో కొత్తగా కార్డు తీసుకున్నాం. దానిలో మారెల్ల యశ్వంత్‌కుమార్ బదులుగా మారెల్ల శివకుమార్‌గా, జిల్లా పేరు కూడా తప్పుగా పడింది. – మారెల్ల లావణ్య, సిరిసిల్ల -
విద్యార్థులకు అభినందనలు
సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట: పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతే అభినందించారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు పి.ప్రణవి 564, స్వేచ్ఛ 538, పి.కిరణ్‌తేజ 537, పి.మధుశాలిని 533, సంపత్‌కుమార్ 533, శ్రీవాణి 525, జి.రుచిత 524 మార్కులు సాధించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.మురళీధర్, ఉపాధ్యాయులు ఎస్.దేవయ్య పాల్గొన్నారు. బీమాచెక్కు పంపిణీ గంభీరావుపేట(సిరిసిల్ల): ఇటీవల మృతిచెందిన మండల కేంద్రానికి చెందిన సహకార సంఘం సభ్యుడు వంగ రాజిరెడ్డి కుటుంబానికి బీమా చెక్కును నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డి సోమవారం అందించారు. గంభీరావుపేటకు చెందిన బరిగెల బాలకిషన్ ఇటీవల రోడ్డు ప్ర మాదంలో మృతిచెందాడు. బీఆర్ఎస్ సభ్యత్వ బీమా చెక్కును మృతుని కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్, పట్టణాధ్యక్షుడు పెద్దవేని వెంకటి, ప్రధాన కార్యదర్శి గంధ్యాడపు రాజు, సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణరావు, సింగిల్‌విండో చైర్మన్ సురేందర్ పాల్గొన్నారు. బెల్ట్‌షాపులపై ఆకస్మిక దాడులుసిరిసిల్ల: జిల్లాలో బెల్ట్‌షాపులపై ఆకస్మిక దాడులు చేస్తున్నామని, బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయని జిల్లా ఎకై ్సజ్ అధికారి పి.శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. జిల్లాలో బహిరంగంగా మద్యపానంపై ‘సాక్షి’లో ‘ఓపెన్ సిట్టింగ్’ శీర్షికన సోమవారం కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఎకై ్సజ్ అధికారి జిల్లాలో ఈ ఏడాది 31 బెల్ట్‌షాపులపై కేసులు నమోదు చేశామని, 34 మందిని అరెస్ట్ చేసి 503 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు తెలిపారు. జిల్లాలో బెల్ట్‌షాపులపై నిఘా ఉంచామని, బహిరంగ మద్యం సేవించడాన్ని టాస్క్‌ఫోర్స్ టీంతో నిరోధిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. ‘సాక్షి’లో వచ్చిన కథనంపై ఎకై ్సజ్ అధికారులు స్పందించారు. ధాన్యం కాంటా పెట్టండికోనరావుపేట(వేములవాడ): కొనుగోలు కేంద్రం ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా లారీలు రావడంలేదని, దీంతో కొనుగోళ్లు కూడా నిలిచిపోయాని మండలంలోని గొల్లపల్లి(వట్టిమల్ల)లో రైతులు సోమవారం రాస్తారోకో చేపట్టారు. గొల్లపల్లి కొనుగోలు కేంద్రంలో నెల రోజులుగా లారీలు రాకపోవడంతో కాంటా కూడా పెట్టడం లేదన్నారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోయే ప్రమాదముందని, అధికారులు స్పందించి వెంటనే లారీలను పంపించి కొనుగోళ్లను మొదలుపెట్టాలని కోరారు. మాజీ ఉపసర్పంచ్ బండ రవి, రైతులు మాడుగుల శ్రీకాంత్, బొంగు రవి, బండ మల్లేశం, కాలువ దేవమల్లయ్య, బండ శంకర్ పాల్గొన్నారు. సేంద్రియ సాగుతో అధిక దిగుబడిముస్తాబాద్/ఇల్లంతకుంట: సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు సాధించడమే కాదు.. ఆరోగ్యకరమైన ఉత్పత్తులను ప్రజలకు అందించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సతీశ్ పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం ఆవునూర్ రైతువేదికలో అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. డాక్టర్ సతీశ్ అధునాతన వ్యవసాయ పద్దతులను అవలంభించి దిగుబడులు సాధించవచ్చన్నారు. పంట మార్పిడిని పాటించాలన్నారు. శాస్త్రవేత్త సంపత్, ఏఎంసీ చైర్మన్ తలారి రాణి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, ఏవో దుర్గారాజు, ఏఈవోలు అనుష, సౌమ్య, నరేశ్, అఖిల పాల్గొన్నారు. పంట మార్పిడి ద్వారా భూసారం పెంపు వరిపంట కోసిన వెంటనే వ్యవసాయ భూముల్లో పచ్చిరొట్ట, పెసర, సాగు చేసుకుంటే భూసారం పెరుగుతోందని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం పేర్కొన్నారు. ఇల్లంతకుంట మండలం పొత్తూరు రైతువేదికలో పాల్గొన్నారు. ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ మదన్మోహన్, అసోసియేట్ డీన్ కేబీ సునీతా దేవి, డాక్టర్ ఉషారాణి, విజయభాస్కర్‌రెడ్డి, శ్రావణి, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
ఓపెన్ సిట్టింగ్
సిరిసిల్ల: జిల్లాలో మందుబాబులు బహిరంగంగానే మద్యం తాగుతున్నారు. జిల్లా కేంద్రం శివారులోని పెద్దూరు, రాజీవ్‌నగర్, చిన్నబోనాల, చంద్రంపేట, రెండోబైపాస్ రోడ్డు ప్రాంతాలు సాయంత్రం అయితే చాలు మందుబాబులతో హడావుడిగా మారిపోతున్నాయి. వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటిబాట పట్టిన మహిళలు మందుబాబుల కనిపిస్తుండడంతో భయాందోళన చెందుతున్నారు. మరికొందరైతే ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడే మందుబాటిళ్లతో సిట్టింగ్ పెడుతున్నారు. ప్రధానంగా కార్మిక క్షేత్రం సిరిసిల్ల పట్టణం శివారు కాలనీలో ఈ పరిస్థితులు ఉన్నాయి. చంద్రంపేట బస్టాండ్‌కు సమీపంలోనే ఓ బెల్ట్‌షాపులో ఓపెన్‌గానే మద్యం సిట్టింగ్‌లు పెడుతున్నారు. పెద్దూరు శివారులో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. గ్రామాల్లో బెల్ట్జోరు మండల కేంద్రాల్లో వైన్‌షాపులకు అనుబంధంగా సిట్టింగ్ రూమ్స్ ఉండగా.. గ్రామాల్లో అనధికారికంగా నిర్వహిస్తున్న బెల్టుషాపుల్లోనూ బార్లను తలపించేలా సిట్టింగ్‌లు ఉంటున్నాయి. గ్రామాల్లోని బెల్టుషాపుల నిర్వాహకులు ఎక్కువ మందు విక్రయించుకునేందుకు మందుబాబుల కోసం టేబుళ్లు, కుర్చీలు, కూలర్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గ్రామంలో ఐదు నుంచి పది వరకు అనధికారిక బెల్టుషాపులు ఉన్నాయి. ప్రతీ షాపులో రోజుకు తక్కువకు తక్కువగా రూ.10వేల వరకు మందు విక్రయిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో అనధికారికంగా బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. ముస్తాబాద్ మండలం ఆవునూర్, కొండాపూర్ గ్రామాల్లో అయితే అర్ధరాత్రి సైతం బెల్టుషాపుల్లో మందుబాబులు కనిపిస్తున్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని చెరువుకట్టలే అడ్డాలుగా మందుబాబులు బహిరంగంగానే మద్యం తాగుతున్నారు. పోలీసులు బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నా మందుబాబులు మారడం లేదు. జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం గ్రామ శివారులు, వాగులే అడ్డాలు దాడులు చేస్తున్నా ఆగని మందుబాబులు -
దేవయ్యకు గద్దర్ ఐకాన్ అవార్డు
సిరిసిల్లకల్చరల్: జిల్లా కేంద్రానికి చెందిన జానపద గాయకుడు ఆకునూరి దేవయ్యకు సాయి అలేఖ్య సాంస్కృతిక సేవాసంస్థ గద్దర్ ఐకాన్ అవార్డును ప్రదానం చేసింది. రాష్ట్ర భాష, సాంస్కృతికశాఖ సౌజన్యంతో హైదరాబాద్ బిర్లా సైన్స్ సెంటర్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా శనివారం రాత్రి ఈ పురస్కారం అందుకున్నారు. ప్రభుత్వ సలహాదారు సముద్రాల వేణుగోపాలాచారి, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ గద్దర్ వెన్నెల, అలేఖ్య సంస్థ చైర్మన్ ఉపద్రష్ట అరుణఅశోక్, ఉప్పుల శ్రీనివాస్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
పరీక్షలపై ప్రతిష్టంభన
● డిగ్రీ విద్యార్థుల్లో ఆందోళన ● పరీక్షలపై కాలేజీ యాజమాన్యాల సహాయ నిరాకరణ ● గడువు ముగిసినా పరీక్ష ఫీజులు చెల్లించని వైనం ● ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేయాలని విన్నపంసిరిసిల్లకల్చరల్: ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తేనే పరీక్షల నిర్వహణకు ముందుకొస్తామని డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు.. ముందుగా పరీక్ష ఫీజు చెల్లించండి అని యూనివర్సిటీ అధికారుల ప్రతిపాదనల మధ్య అసలు పరీక్షల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్షలు పూర్తికాగా.. శాతవాహన పరిధిలో డిగ్రీ పరీక్షలపై ప్రతిష్టంభన నెలకొంది. డిగ్రీ చివరి సెమిస్టర్ విద్యార్థులు మాత్రం తాము పోటీపరీక్షలకు అనర్హులమ వుతామని.. పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. ఏడాదిగా సాగుతున్న ఫీజు పోరు గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో మూడున్నరేళ్లుగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాలేదు. కళాశాలల నిర్వహణకు ప్రైవేట్ యాజమాన్యాలు అప్పు చేయాల్సిన పరిస్థితులు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల్లో జాప్యంతో అధ్యాపకులకు వేతనాలు, భవనాలకు అద్దెలు, ఇతర నిర్వహణ ఖర్చులకు డబ్బులు లేక ప్రైవేట్ కాలేజీలు చేతులెత్తేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు, మంత్రులకు ఎన్నో సార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. గత్యంతరం లేని స్థితిలో సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు సహాయ నిరాకరణకు దిగాయి. విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించినా యాజమాన్యాలు యూనివర్సిటీకి మాత్రం చెల్లించలేదు. ఈమేరకు శాతవాహన వర్సిటీ ఉన్నతాధికారులకు ప్రైవేట్ కళాశాలల యాజమాన్య సంఘం ప్రతినిధులు లేఖలు అందించారు. మే 14 నుంచి పరీక్షలు ప్రభుత్వం దిగివచ్చి బకాయిలు విడుదల చేస్తేనే ఫీజులు చెల్లిస్తామని, అప్పటి వరకు పరీక్షల నిర్వహణకు సహకరించేది లేదని శాతవాహన ప్రైవేట్ డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్(సుప్మా) నిర్ణయించింది. వైస్‌చాన్స్‌లర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుందామని భావించినా పరీక్ష ఫీజు చెల్లిస్తేనే చర్చలకు అవకాశం ఉంటుందని వీసీ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో పరీక్షల నిర్వహణపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తే తప్ప విద్యార్థుల ఆందోళనకు తెరపడే అవకాశం లేదు. కాగా కొత్త విద్యా సంవత్సరంలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ ప్రకటన విడుదల కావడం విశేషం. గత్యంతరం లేని పరిస్థితిలోనే.. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తున్న ప్రైవేట్ కళాశాలలపై ప్రభుత్వాలకు చిన్న చూపు. రేపటి తరాన్ని రూపొందించే విద్యావ్యవస్థల బకాయిల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా లేకపోవడం విచారకరం. అప్పులు, వడ్డీలు పెరిగిపోయి నిర్వాహకులు నిరాశ, నిస్పృహలో కూరుకుపోయారు. ఫీజులు విడుదలైతే కానీ పరీక్షలు జరగనివ్వం. – శ్రీపాద నరేశ్, సుప్మా, కార్యదర్శిప్రైవేట్ కాలేజీలు : 62 విద్యార్థులు : 50 వేలు (దాదాపు) -
భగీరథ మహర్షికి నివాళి
సిరిసిల్ల: భగీరథ మహర్షి జయంతి సందర్భంగా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా నివాళి అర్పించారు. కలెక్టరేట్లో ఆదివారం బీసీ సంక్షేమశా ఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి జరి గింది. మహర్షి చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి, పూలమాలలు వేశారు. బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి రాజమనోహర్‌రావు, లీడ్ బ్యాంకు మేనేజర్ మల్లికార్జునరావు పాల్గొన్నారు. బలోపేతమవుతున్న ప్రభుత్వ బడులు ● మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ ఇల్లంతకుంట(మానకొండూర్): ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతున్నాయని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని పెద్దలింగాపూర్‌లోని పీఎంశ్రీ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం గాలిపల్లిలో ఉపాధి హామీ కింద రూ.20లక్షలతో చేపట్టే సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయులు గుర్రం సందీప్‌రెడ్డి, డీఈ సత్యనారా యణ, ఏఈ నాగరాజు, ఎంఈవో శ్రీనివాస్ గౌడ్, నాయకులు వెంకటరమణారెడ్డి, పాశం రాజేందర్‌రెడ్డి, కేతిరెడ్డి నవీన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి పాల్గొన్నారు. అబద్దాలతో మోసం చేయలేరు ● కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్ సిరిసిల్లటౌన్: అబద్దాలతో ప్రజల మనస్సులను బీజేపీ నేతలు గెలువలేరని కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్ విమర్శించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రతీ మండలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 85,485 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కానీ బీజేపీ నేతలు అబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీలు దొందూ దొందేనని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న మంచి పథకాలపై అబద్దపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, ఆడెపు చంద్రకళ, కల్లూరి చందన, నేరెళ్ల శ్రీకాంత్‌గౌడ్, గడ్డం కిరణ్, అన్నల్దాస్ భాను, వంతడ్పుల రాము, అడ్డగట్ల శంకర్, మేకర్తి నారాయణ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి● బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి ముస్తాబాద్(సిరిసిల్ల): కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కోరారు. ముస్తాబాద్ మండలం బందనకల్‌లో ఆదివారం ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నరేంద్రమోదీ ప్రభుత్వం దేశాన్ని ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా తీర్చిదిద్దే పనిలో ఉందన్నారు. దేశభద్రత, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని పేర్కొన్నారు. పదకొండేళ్లుగా అత్యంత సురక్షిత దేశంగా భారత్ ఎదిగిందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మండల అధ్యక్షుడు సౌల్ల క్రాంతి, నాయకులు కస్తూరి మహిపాల్‌రెడ్డి, కరెడ్ల రమేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, కల్యాణ్, మహేశ్, కార్తీక్‌రెడ్డి, శ్రీకర్‌రెడ్డి, గోపి తదితరులు ఉన్నారు. -
అడవిని చూసొద్దాం
● సిరిసిల్ల అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లో పిల్లల సందడి ● వేసవిలో సందర్శనీయ ప్రాంతం ● అడవిపై అవగాహన.. జంతువుల సందర్శన ● ఆసక్తి చూపుతున్న విద్యార్థులుసిరిసిల్ల: విద్యార్థులకు అడవిని పరిచయం చేయడం.. ఫారెస్ట్ ద్వారా కలిగే లాభాలు వివరించడం.. జంతువులను చూడడం.. వీటన్నింటికీ సిరిసిల్ల అర్బన్ ఫారెస్ట్ పార్క్ వేదికగా నిలుస్తోంది. 125 ఎకరాల్లో రూ.6కోట్ల ప్రతిపాదనలతో పనులు ప్రారంభించగా.. సుమారు రూ.2కోట్లతో చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్ శివారులో కరీంనగర్–కామారెడ్డి ప్రధాన రహదారిని ఆనుకుని ఫారెస్ట్ పార్క్ ముఖద్వారం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి అర కిలోమీటరు అడవిలోకి వెళ్లగానే.. పిల్లలకు ఆట వస్తువులు, చెరువులో వంతెన.. ఊయలలు, నీటి కొలనులను ఏర్పాటు చేశారు. వేసవి కావడంతో ఎండిన అడవి కనిపిస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో మేత కోసం వచ్చే వన్యప్రాణులను దూరం నుంచే చూడవచ్చు. ఫారెస్ట్‌లో పిల్లల సందడి అర్బన్ ఫారెస్ట్‌పార్క్‌లో ఇటీవల సిరిసిల్లలోని ఓ ప్రైవేటు పాఠశాల పిల్లలు సందడి చేశారు. పార్క్‌ను సందర్శించి అడవి అందాలను ఆస్వాదించారు. అడవిలోని వివిధ రకాల చెట్లు, వన్యప్రాణులు, వాటి లక్షణాలు తెలుసుకున్నారు. సిరిసిల్ల ఫారెస్ట్ అధికారులు వన్యప్రాణులు, అడవి వాటి ప్రాముఖ్యతను పిల్లలకు అర్థమయ్యేలా వివరించారు. వర్షాకాలంలో పచ్చగా ఉండే అటవీ అందాలు మరింత కనువిందు చేస్తాయి. ఇప్పుడు ఆకులు ఎండి, నీరు అడుగంటి బోసిపోయి ఉంది. అయినా పిల్లలను ఆకర్షిస్తోంది. -
రైతుల సంక్షేమమే లక్ష్యం
కోనరావుపేట(వేములవాడ): రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కోనరావుపేట మండలం మల్కపేటలోని మల్కపేట రిజర్వాయర్ కుడికాలువ ద్వారా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆదివారం నీటిని విడుదల చేశారు. సభలో మాట్లాడుతూ మల్కపేట రిజర్వాయర్ కుడికాలువ ద్వారా కోనరావుపేట మండలం మల్కపేట, కనగర్తి, నాగారం, పల్లిమక్త, సుద్దాల, రామన్నపేట, మంగళపల్లి, వేములవాడ మండలం మారుపాక వరకు నీటిని విడుదల చేసినట్లు వివరించారు. ఇదివరకు మెయిన్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసి అక్కపల్లి, బుగ్గరాజేశ్వరతండా, అల్మాస్పూర్, రాజన్నపేట, దేవునిగుట్టతండా, గొల్లపల్లి బాకూరుపల్లి, తిమ్మాపూర్ వరకు నీటిని విడుదల చేశామన్నారు. సుమారు 5వేల ఎకరాలకు సాగునీరు విడుదల చేసినట్లు గుర్తుచేశారు. సిరిసిల్ల, వేములవాడ, కోనరావుపేట మండలాల్లోని 25,694 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని తెలిపారు. ఎడమకాలువ కోసం ఇప్పటి వరకు 70 ఎకరాలు సేకరించామని, మరో 70 ఎకరాలు భూసేకరించనున్నట్లు ప్రకటించారు. ధర్మారంలో 4 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ధ్రుడ సంకల్పంతో ఉందన్నారు. కోనరావుపేట మండలం ధర్మారంలో 4 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి కేంద్రం మంజూరు చేసిన విషయాన్ని తెలిపారు. ఇప్పటికే రూ.30లక్షలతో ఎలక్ట్రిక్ బస్సు మంజూరు చేశామన్నారు. మహిళలు ముందుకొస్తే మండలానికో రైస్‌మిల్లును మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మల్కపేటలో మాజీ మంత్రి చల్మెడ ఆనందరావు కుటుంబీకులు నిర్మించిన రామాలయాన్ని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా నీటిపారుదలశాఖ అధికారి అమరేందర్‌రెడ్డి, ఈఈ కిశోర్, డీఈలు సత్యనారాయణ, వినోద్, శ్రీనివాస్, డీఆర్డీవో శేషాద్రి, ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, వైస్‌చైర్మన్ ప్రభాకర్, డైరెక్టర్లు, ఏఈలు సురేశ్, శ్రీశైలం, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు ఫిరోజ్‌పాషా పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మల్కపేట రిజర్వాయర్ కుడి కాలువ నుంచి నీటి విడుదల -
‘ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆత్మహత్యలు’
సిరిసిల్లటౌన్: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సిరిసిల్లలో నేతన్నల బలవన్మరణాలు జరుగుతున్నాయని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు కోడం రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం సుందరయ్యనగర్‌కు చెందిన పవర్లూమ్ అనుబంధ కార్మికుడు బత్తుల విఠల్ మృతిచెందగా బాధిత కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించి మాట్లాడారు. నేత కార్మికులకు ఉపాధి కల్పించి, ఆదుకుంటామని ప్రభుత్వం చెబుతుంటే.. అధికారుల అలసత్వంతో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. నిరంతరం ఉపాధి, మెరుగైన కూలీ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన చీరల తయారీ ఆర్డర్‌కు కార్మికుల కూలి నిర్ణయించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో ఇప్పటికే దాదాపు 16 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. నేతకార్మికులకు కూలి నిర్ణయించాలని, పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన 2023 సంవత్సరం 10 శాతం యారన్ సబ్సిడీ అందించాలని, వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిరిమల్ల సత్యం, బాస శ్రీధర్ పాల్గొన్నారు. -
ప్రమాదకర కల్వర్టు.. స్పందించిన కమిషనర్
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం బల్దియా పరిధిలోని ఫైవింక్లయిన్ చౌరస్తా సమీపంలో కొ త్త కల్వర్టు ప్రమాదకరంగా ఉండడం, ఇరువైపులా సైడ్‌వాల్ నిర్మించకపోవడంతోపాటు కనీ స ం రోడ్డుకు సమానంగా మట్టి కూడా పోయలేదు. దీంతో ప్రమాదాలు చో టు చేసుకుంటాయి. ఈ సమస్యపై మా ర్చి 21న ‘సాక్షి’లో కథ నం ప్రచురించగా, బల్దియా కమి షనర్ జె.అరుణశ్రీ స్పందించారు. మార్చి 25న కల్వర్టును పరిశీలించి యుద్ధప్రాతిదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. కృతజ్ఞతలు ఫైవింక్లయిన్ చౌరస్తా సమీపంలో కొత్తగా నిర్మించిన కల్వర్టు ప్రమాదకరంగా ఉంది. సమస్య పరిష్కారమయ్యేలా చొరవ తీసుకున్నందుకు ‘సాక్షి’కి కృతజ్ఞతలు. ము న్సిపల్ కమిషనర్, అధికారులు వెంటనే స్పందించారు. పనులు ప్రారంభించారు. 33వ డివిజన్ పరిధిలోని ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. – మద్దెల దినేశ్, ఫైవింక్లయిన్ ఏరియా, గోదావరిఖని -
కలిసుంటామని కడతేర్చాడు
జగిత్యాలక్రైం: నిండునూరేళ్లు కలిసి ఉంటామని.. ఏడడుగులు నడిచి ప్రమాణం చేసిన భర్తే కాలయముడై భార్యను హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలకేంద్రంలో జరిగింది. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించగా ఎట్టకేలకు పోలీసులు కేసును ఛేదించారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ వివరాలు వెల్లడించారు. ఇరవై ఏళ్ల క్రితం వివాహం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్‌కు చెందిన మమతను (35) ఇరవై ఏళ్ల క్రితం జగి త్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన అవుదుర్తి మహేందర్‌కు ఇచ్చి వివాహం చేశా రు. వివాహ సమయంలో కట్నకానుకలు ముట్టజెప్పారు. కానీ, ఆర్థిక సమస్యలు తలెత్తడంతో కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. మహేందర్ మద్యానికి బానిసై అప్పులు చేశాడు. రోజూ తాగి వచ్చి మమతను వివాహ సమయంలో కట్నం తక్కువగా ఇచ్చారని, పిల్లలు పుట్టడం లేదని తీవ్రంగా వేధించాడు. అతడితోపాటు తల్లి వజ్రవ్వ, తండ్రి లక్ష్మణ్, తమ్ముళ్లు అ నిల్, వెంకటేశ్ కూడా వేధింపులకు గురిచేసేవారు. మహేందర్ ఏ పని చేయకపోవడంతో మమత కరీంనగర్‌లోని ఓషాపింగ్‌మాల్‌లో ఉద్యోగం చే స్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇరవై రోజుల క్రితం పంచాయితీ తరుచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో 20 రోజుల క్రితం మల్లాపూర్‌లో పంచాయితీ నిర్వహించారు. దీంతో మమతను బాగా చూసుకుంటానని మహేందర్ కరీంనగర్‌లోని అద్దె ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం పుస్తెలతాడు ఇవ్వాలని మమతను కోరగా నిరాకరించింది. ఈనేపథ్యంలో మహేందర్ గతనెల 26న నల్లగొండ, వేములవాడ దైవ దర్శనానికని నమ్మించి, దైవ దర్శనం అనంతరం కొడిమ్యాలకు తీసుకెళ్లాడు. అదేరోజు నైలాన్ తాడును ఆమె మెడ చుట్టూ బిగించి హత్య చేశాడు. ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించేందుకు ఆమె మెడకు నైలాన్‌తాడు చుట్టి ఇంటి స్లాబ్‌కు కట్టాడు. పుస్తెలతాడు తీసుకొని గంగాధరలోని ఓ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని అప్పులు తీర్చాడు. ఈక్రమంలో పోలీసులు లోతుగా విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. శనివారం నిందితుడు మోటారుసైకిల్‌పై పారిపోతుండగా చెప్యాల ఎక్స్‌రోడ్ వద్ద అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులు, తమ్ములపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో మల్యాల సీఐ రవి, కొడిమ్యాల ఎస్సై సందీప్ పాల్గొన్నారు. పిల్లలు పుట్టడం లేదని భార్యను చంపిన భర్త ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం కేసును ఛేదించిన పోలీసులు.. ఐదుగురిపై కేసు -
వాహనాలు పార్కింగ్ వీడాయి
జగిత్యాలటౌన్: జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో చేపల మార్కెట్ లోపల వాహనాలు పార్క్ చేస్తుండటంతో కొనుగోలుదారులు నిలబడటానికి స్థలం లేకుండాపోయింది. ఈ సమస్యపై మార్చి 19న ప్రచురితమైన కథనానికి మున్సిపల్ కమిషనర్ స్పందన స్పందించారు. చేపల మార్కెట్ నుంచి వాహనాలు తొలగించాలని తమ సిబ్బందిని ఆదేశించారు. కమిషనర్ ఆదేశాలతో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతి వాహనాలను తొలగింపజేశారు. కాగా, వాహనాల తొలగింపుతో మార్కెట్లో సౌకర్యవంతంగా ఉందని, తక్షణమే స్పందించిన బల్దియా సిబ్బందితో పాటు వార్త ప్రచురించిన ‘సాక్షి’కి కొనుగోలుదారులు ధన్యవాదాలు తెలిపారు. -
అడ్డు తొలగింది.. రోడ్డు పడింది
కరీంనగర్‌కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలకసంస్థ 9వ డివిజన్ పరిధిలోని అలకాపురికాలనీ నుంచి సిరిసిల్ల బైపాస్ (ఎన్టీఆర్ చౌరస్తా) వైపు వచ్చే రోడ్డు ముగింపు వద్ద పనులు అసంపూర్తిగా వదిలేశారు. విద్యుత్ పోల్, లైన్లు అడ్డుగా ఉండడంతో పూర్తి చేయలేదు. సీసీ రోడ్ ఎత్తుగా, ఆర్అండ్బీ మెయిన్ రోడ్ దిగువన ఉండడం, కిందినుంచి నాలా వెళ్తుండడంతో, రెండింటికీ కనెక్టివిటీ లేక సీసీ రోడ్డు చివరలో పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో రాత్రివేళ వచ్చే వాహనదారులు ప్రమాదాలకు గురయ్యేవారు. ఓ వ్యక్తి అందులో శవమై తేలాడు కూడా. ఏళ్ల తరబడి సమస్య అలానే ఉండడంతో అలకాపురికాలనీకి చెందిన దుంపేటి రాము మార్చి 12న ‘సాక్షి’ ద్వారా వెలుగులోకి తీసుకురాగా, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ స్పందించారు. ట్రాన్స్‌కో అధికారులతో పలు మార్లు చర్చలు జరపడంతో, రోడ్డుకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని మార్చి 27న తొలగించారు. దీంతో సీసీ, మెయిన్‌రోడ్డులను కలుపుతూ కల్వర్ట్ నిర్మించి, రోడ్డు వేయడంతో సమస్య పరిష్కారమైంది. ధన్యవాదాలు మా కాలనీవాసులు నిత్యం ఎదుర్కొనే సమస్యను పరి ష్కరింపచేసిన ‘సాక్షి’కి ధన్యవాదాలు. సీసీ రోడ్డు ను ఆర్అండ్బీ రోడ్డుకు కలపకపోవడం, కింద నాలా ఉండడంతో ఆ గొయ్యిలో చాలా మంది పడి గాయపడ్డారు. ‘సాక్షి’ ‘వాట్సప్ చేయండి’ శీర్షికలో మా కాలనీ వ్యక్తి రాము సమస్యను తెలియచేయడంతో అధికారులు స్పందించి వైర్లు, పోల్‌ను తొలగించి రోడ్డు వేశారు. – లోకేందర్రావు, అలకాపురికాలనీ, కరీంనగర్ -
ప్రాణం తీసిన మామిడికాయలు
● చెట్టు పైనుంచి పడి వృద్ధుడు మృతి గోదావరిఖని: మామిడికాయలు తెంపడానికి చెట్టెక్కి ప్రమాదవశాత్తు కిందపడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. గోదావరిఖని వన్‌టౌన్ ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని చంద్రశేఖర్‌నగర్‌లో నివాసముంటూ వండ్రంగి పనులు చేస్తున్న నాగవెల్లి బాలయ్య(70).. శనివారం ఉదయం తన ఇంటి వెనకాల ఉన్న మామిడి కాయలు తెంపడానికి చెట్టు ఎక్కాడు. కర్రతో కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి చెట్టు పైనుంచి కింద పడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. కరీంనగర్‌కు తీసుకెళ్తుండగా బాలయ్య మార్గమధ్యంలో మృతి చెందాడు. బాలయ్యకు భార్య నాగవెల్లి సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. రోడ్డుప్రమాదంలో వృద్ధుడికి తీవ్రగాయాలుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పింఛన్ డబ్బు కోసం బ్యాంక్‌కు వస్తే, వాహనం ఢీకొని ఓ వృద్ధుడు ప్రాణాపాయ స్థితికి చేరాడు. స్థానికుల వివరాలు.. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్ గ్రామానికి చెందిన వృద్ధుడు రమావత్ బాల్య పింఛన్ డబ్బుల కోసం గొల్లపల్లిలోని బ్యాంక్‌కు వచ్చాడు. రోడ్డు దాటుతుండగా కామారెడ్డి నుంచి వస్తున్న మహారాష్ట్రకు చెందిన బొలెరో వాహనం వేగంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బాల్య అపస్మారక స్థితికి వెళ్లాడు. 108 వాహనంలో ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్గోదావరిఖని(రామగుండం): గోదావరిఖని ప్రశాంత్‌నగర్‌లో చీమల తిరుపతిపై హత్యాయత్నం చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ రమేశ్ తెలిపిన వివరాలు.. 2021లో ప్రశాంత్‌నగర్‌కు చెందిన బండారి మొగిలి హత్య కేసులో చీమల తిరుపతి, రాగుల రాజశేఖర్, బోనగిరి రాకేశ్ నిందితులు. బెయిల్‌పై విడుదలయ్యారు. కేసు ట్రయల్‌కు వస్తుందని రాజీ పడదామని ప్రధాన నిందితుడు తిరుపతిని రాజశేఖర్, రాకేశ్ కోరారు. అందుకు తిరుపతి ఒప్పుకోలేదు. తిరుపతిని హత్య చేస్తే గతంలోని హత్య కేసు నుంచి తప్పించుకోవచ్చని నిర్ణయించుకున్నారు. ఈనెల 2న తిరుపతి నడుపుతున్న ఆన్లైన్ సెంటర్‌కు రాజశేఖర్, రాకేశ్ వెళ్లి అతడిపై కత్తులతో దాడిచేసి పారిపోయారు. శనివారం నిందితులను పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. -
బాగైన చేతిపంపు.. తీరిన నీటి కొరత
బోయినపల్లి(చొప్పదండి): మండలకేంద్రంలోని ప్రైమరీ స్కూల్ పరిసరాల్లో ఉన్న చేతిపంపు పని చేయడం లేదని, ఆప్రాంతవాసులు ఇబ్బందులు పడుతున్నారని మార్చి 27న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. అదే రోజు ఎంపీడీవో జయశీల చేతిపంపును బాగు చేయించారు. అధికారులు త్వరగా స్పందించారు బోయినపల్లి ప్రైమరీ స్కూల్ పరిసరాల్లో బోరు చేడిపోయింది. మా సమస్యను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా, అధికారులు వెంటనే స్పందించారు. ఎంపీడీవో ఆదేశాలతో బోరుకు మరమ్మతు చేశారు. మా ఏరియా ప్రజలకు నీటి కొరత తీర్చిన ‘సాక్షి’కి సలాం. – మాడిచెట్టి శ్రీనివాస్, బోయినపల్లి -
ప్రాణం మీదికి తెచ్చిన మామిడికాయ వక్క
● ఊపిరాడక తల్లడిల్లిన బాలుడు పాలకుర్తి(రామగుండం): మామిడికాయ వక్క గొంతులో ఇరుక్కుని బాలుడు ఊపిరాడక నరకయాతన అనుభవించిన ఘటన శనివారం పాలకుర్తి మండలం రాణాపూర్ గ్రామంలో జరిగింది. 108 సిబ్బంది కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ పదినెలల వయసు ఉన్న బాలుడు ఇంట్లో మామిడివక్క మింగాడు. అది గొంతులో ఇరుక్కుని ఊపిరాడలేదు. వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు బైక్‌పై పెద్దపల్లికి తరలిస్తూ కన్నాల గ్రామానికి చేరుకున్నారు. అప్పుడే ఎదురుగా 108 వాహనం రావడంతో అందులో పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి బయలుదేరారు. మార్గమధ్యలో 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స ప్రారంభించారు. ఎయిర్వేను కొంతమేర క్లియర్ చేస్తూ పెద్దపల్లికి చేరుకున్నారు. పెద్దపల్లిలో పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందంటూ కరీంనగర్‌కు రెఫర్ చేయడంతో మరో అంబులెన్స్ ద్వారా కరీంనగర్‌కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం బాబు పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిసింది. కాగా ఈ విషయమై సోషల్‌మీడియాలో విభిన్న కథనాలు వైరల్ అయ్యాయి. చికిత్స పొందుతూ యువకుడు మృతిసైదాపూర్(హుస్నాబాద్): నాలుగేళ్ల ప్రాయంలో ఊహ తెలియక ముందే తల్లిదండ్రులను కోల్పోయాడు. 10 నెలల క్రితం తాత, 6 నెలల క్రితం నానమ్మ మృతిచెందారు. నా అనే వారు ఎవరూ లేరు. ఒంటరి తనం, అనారోగ్యం భరించలేక ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతిచెందాడు. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాలు.. సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన అనగోని సంపత్–సుజాత దంపతుల కుమారుడు వికాస్(27). నాలుగేళ్ల వయస్సులో తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతిచెందారు. అప్పటి నుంచి తాత, నాన్నమ్మ లక్ష్మయ్య, లక్ష్మి వద్ద పెరిగాడు. హుస్నాబాద్‌లోని ఓ షాపులో పని చేశాడు. అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 10 నెలల క్రితం తాత, 6 నెలల క్రితం నానమ్మ మృతిచెందారు. ఒంటరితనం, అనారోగ్యంతో ఐదురోజుల క్రితం గడ్డిమందు తాగాడు. చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం, అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. -
కులగణన నిర్ణయం చారిత్రాత్మకం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి సిరిసిల్లటౌన్: దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. సిరిసిల్లలోని తన నివాసంలో శనివారం ప్రెస్మీట్లో మాట్లాడారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా 60 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో ఉండి కులగణన చేయలేదని విమర్శించారు. పార్టీ పట్టణాధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, పొన్నాల తిరుపతిరెడ్డి, గజభీంకార్ చందు, కొండ నరేశ్, చొప్పదండి శ్రీనివాస్, దుమాల శ్రీకాంత్, వంతడుపుల సుధాకర్, సిరిసిల్ల వంశీ, మోర శ్రీహరి, ఊరగొండ రాజు, గుడ్ల విష్ణు పాల్గొన్నారు. వాహనపత్రాలు వెంట ఉంచుకోవాలి ● జిల్లా రవాణాశాఖ అధికారి వంశీధర్ బోయినపల్లి(చొప్పదండి): వాహనాల పత్రాలను వెంట ఉంచుకోవాలని జిల్లా రవాణాశాఖ అధికారి వంశీధర్ పేర్కొన్నారు. మండలంలోని కొదురుపాక చౌరస్తాలో శనివారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు సంబంధించిన లైసెన్స్‌లు పరిశీలించారు. డ్రైవర్లు సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని సూచించారు. కండక్టర్ లైసెన్స్ లేని రెండు ఆర్టీసీ బస్సుల కండక్టర్లపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సరైన వాహన పత్రాలు లేని మూడు సరుకు రవాణా వాహనాలను సీజ్ చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. పీసీలు సౌమ్య, ప్రశాంత్, హోమ్‌గార్డు ఎల్లయ్య ఉన్నారు. సమ్మె నోటీస్ అందజేత సిరిసిల్లటౌన్: సార్వత్రిక సమ్మె నోటీస్‌లను జిల్లా అధికారులకు అన్ని ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో శనివారం అందజేశారు. వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలలో 29 చట్టాలను మార్చి 4 కోడ్లుగా విభజించి కార్మికులకు తీరని అన్యాయం చేసిందన్నారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నాయకులు కడారి రాములు, అన్నల్దాస్ గణేష్, గొట్టె రుక్మిణీ, వెంగల శ్రీనివాస్, చిట్యాల మధు పాల్గొన్నారు. వేములవాడలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరంవేములవాడ: కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్(కేడీసీఏ) ఆధ్వర్యంలో ఈనెల 7 నుంచి జూన్ 6 వరకు వేములవాడలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు ఆగంరావు, ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు శనివారం ప్రకటనలో తెలిపా రు. 13 నుంచి 23 సంవత్సరాల్లోపు బా లురు, బాలికలకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 3 వరకు ఆసక్తి గల వారు పేర్లు నమో దు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 91772 59935లో సంప్రదించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి ● బీసీ సాధికారిత సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరేందర్ సిరిసిల్ల: స్థానిక సంస్థలకు 14 నెలలుగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారి త సంఘం అధ్యక్షుడు పొలాస నరేందర్ విమర్శించారు. ఈమేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం ద్వారా పల్లెలకు విడుదల కాకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చే శారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు లేక.. నిధులు రాక పల్లెల్లో వసతులు కరువయ్యాయని పే ర్కొన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి కేంద్రం నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
నెరవేరుతున్న ప్ర‘జల’ ఆశలు
సిరిసిల్ల: మెట్టప్రాంత రైతుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా మళ్లించి బీడు భూములను సస్యశ్యామలం చేస్తామనే పాలకుల ఐదు దశాబ్దాల హామీ కార్యరూపం దార్చుతోంది. ఈ ప్రాంత ప్ర‘జల’ ఆశలు నెరవేరుతున్నాయి. కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ కుడికాల్వ ద్వారా 12 గ్రా మాలకు సాగునీటిని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదివారం విడుదల చేయనున్నారు. ఈమేరకు నీటిపారుదలశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. కోనరావుపేట, వేములవాడ అర్బన్ మండలాల్లోని బీడు భూములను తొలిసారి గోదావరి జలాలు ముద్దాడనున్నాయి. కాల్వలను శుభ్రం చేసి కోనరావుపేట కనగర్తి–సుద్దాల గ్రామాల మధ్య కాల్వలో పేరుకుపోయిన మట్టిని నీటిపారుదల శాఖ అధికారులు ఇటీవల తొలగించారు. మల్కపేట రిజర్వాయర్ నీరు వేములవాడ అర్బన్ మండలం మారుపాక వెళ్లేలా పైపులైన్ పూర్తి చేశారు. మధ్యమానేరు నుంచి మల్కపేట వరకు 12.035 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తయ్యాయని, సొరంగంలో కాంక్రీట్ లైనింగ్ పనులు, సర్జిపూల్, పంప్‌హౌస్, డెలివరీ పైపులైన్ పూర్తి చేసి మల్కపేట రిజర్వాయర్‌లో ఒక్క టీఎంసీ నీటిని నింపినట్లు తెలిపారు. మల్కపేట నుంచి కెనాల్ ద్వారా మై సమ్మ చెరువు వరకు నీటిని విడుదల చేశామన్నారు. కాళేశ్వరం–9 ప్యాకేజీలో ఎత్తిపోతలు కాళేశ్వరం–9 ప్యాకేజీలో గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు వరకు గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు మూడు టీఎంసీల సామర్థ్యంతో మల్కపేట రిజర్వాయర్ నిర్మించారు. మల్కపేటకు మధ్యమానేరు నుంచి ఇప్పటికే నీరు వస్తుంది. ప్రస్తుతం మల్కపేట నుంచి కుడికాల్వ ద్వారా కోనరావుపేట మండలం మల్కపేట, కనగర్తి, నాగారం, పల్లిమక్త, సుద్దాల, రామన్నపేట, మంగళ్లపల్లి, వేములవాడ మండలం మారుపాక వరకు నీటిని విడుదల చేయనున్నారు. మల్కపేట కుడికాల్వ సామర్థ్యం 350 క్యూసెక్కులు కాగా.. 25,654 ఎకరాలకు సాగునీరు అందించనుంది. ఎత్తిపోతలపై ‘సాక్షి’ ఎన్నో కథనాలు జిల్లాను సస్యశ్యామం చేసే గోదావరి జలాల ఎత్తిపోతల పథకం పనులపై ‘సాక్షి’ అనేక సందర్భాల్లో గ్రౌండ్ రిపోర్టును అందించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–9 పనుల ప్రగతిపై ఎప్పటికప్పుడు కథనాలను ప్రచురించింది. 2013లోనే ఈ పథకానికి అప్పటి మంత్రులు సుదర్శన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు రగుడు వద్ద శంకుస్థాపన చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సుజల స్రవంతి పథకంగా నామకరణం చేసి పనులు ప్రారంభించగా.. ఆ పేరును కాళేశ్వరం–9వ ప్యాకేజీగా మార్చి పనులు చేశారు. సొరంగం పనులు, రిజర్వాయర్ పనులు పూర్తయినా బ్యాలెన్స్ పనులను, ఆర్థిక శాఖ ద్వారా నిధులు విడుదల చేయించి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పూర్తి చేయించారు. దశాబ్దాల నాటి ఎత్తిపోతల పథకం కార్యరూపం దాల్చింది. ‘ఎత్తిపోతల’కు కార్యరూపం ‘మల్కపేట’ నుంచి నేడు నీటి విడుదల విడుదల చేయనున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
తుప్పు పడుతున్నాయి
ఇది ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేసిన ట్రాక్టర్. ఠాణాలో స్థలాభావంతో బయ ట నిలుపుతున్నారు. పట్టుకున్న పెద్ద వాహనాల (లారీలు, ట్రాక్టర్లు, జీపులు)ను ఇలా ఠాణా బయట ఉంచుతున్నారు. వీటిపై పోలీసులు నిఘా పెట్టకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులు వాటి భాగాలను ఎత్తుకెళ్తున్నారు. దీంతో రికవరీ చేసుకునే సమయంలో అన్ని పార్టులు లేక వాహనదారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. అప్పటికే కోర్టు ద్వారా అనుమతులు పొందడ ఆలస్యం కావడం, మళ్లీ కొత్త పార్ట్స్ కొనడం ఇబ్బందిగా మారుతుంది. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలో వివిధ సందర్భాల్లో పట్టుబడ్డ వాహనాలు ఠాణాల్లోనే తుప్పుపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లోని పోలీస్స్టేషన్లలో పట్టుబడ్డ వాహనాలు 550 వరకు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం, కలప రవాణా, నాటుసారా తరలింపు, సరైన ధ్రువీకరణపత్రాలు లేని వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. కేసు విషయంలో కోర్టు వరకు పోవడం.. అక్కడ తీర్పు వచ్చే వరకు జాప్యమవుతుండడంతో ఠాణాల్లోనే వాహనాలు పాడవుతున్నాయి. కొన్ని ఠాణాల్లోని ఆవరణలో స్థలం లేక సీజ్ చేసిన వాహనాలను బయట మైదానంలో నిలుపుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాల బ్యాటరీలు, టైర్లు, ఇతర విడిభాగాలను ఎత్తుకెళ్తున్నారు. పట్టుకున్న వాహనాలపై పోలీసుల నిఘా లేకపోవడంతో విడిభాగాలు మాయమవుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరిమానాలు.. ఆపై పార్ట్స్ మాయం వాహనాలు పట్టుబడ్డ సమయంలో పోలీసులు కేసు నమోదు చేస్తుండడంతో బాధితులు కోర్టుకు వెళ్తున్నారు. అక్కడ జరిమానాలు చెల్లిస్తూ తమ వాహనాలను విడిపించుకుంటున్నారు. ఇదే సమయంలో ఠాణా పరిధిలో ఉన్న కొన్ని వాహనాల పార్ట్స్ మాయమవుతుండడంపై వాహన యజ మానులు ఆందోళన చెందుతున్నారు. కొత్తవి కొనేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని వాహన యజమానులు పేర్కొంటున్నారు. ఏళ్లుగా ఠాణాల్లోనే వాహనాలు వివిధ కేసుల్లో పట్టుబడుతున్న వాహనాలను కొందరు యజమానులు తీసుకెళ్లేందుకు ముందుకు రావడం లేదు. సారాయి తరలింపు, ప్రమాదాలు జరిగిన సమయంలో తుక్కుతుక్కయిన వాహనాలను రికవరీ చేసేందుకు వాహన యజమానులు ముందుకురావడం లేదు. ఇలా జిల్లా వ్యాప్తంగా 550 వాహనాలు ఠాణాల్లోనే ఉంటున్నాయి. కొన్ని వాహనాలు తుప్పుపట్టి ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. కేవలం ఎకై ్సజ్‌శాఖలో పట్టుబడ్డ వాహనాలను మాత్రమే అప్పుడప్పుడు వేలం వేస్తున్నారు. పోలీస్ అధికారులు పట్టుకున్న వాహనాలను వేలం వేయడం లేదు. పోలీస్ అధికారులు ముందుకొచ్చి వేలం వేసినా ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుందనే పలువురు అభిప్రాయపడుతున్నారు. ఠాణాల్లోనే వాహనాలు పట్టుకున్న వాహనాలపై నజర్ కరువు మాయమవుతున్న పార్ట్స్ ఆందోళనలో వాహనదారులు జిల్లాలో పట్టుబడ్డ వాహనాలు 550 -
నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
వేములవాడఅర్బన్: ఆస్పత్రికొచ్చే రోగులకు అన్నిరకాల నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. వేములవాడ ఏరియా ఆస్పత్రి వైద్యులతో శనివారం సమావేశమయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎల్వోసీల ద్వారా ఇప్పటి వరకు రూ.20కోట్లకు పైగా మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఓపీ సేవల కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. మోకాళ్ల సర్జరీలు విజయవంతంగా పూర్తి చేయడంపై వైద్యులను అభినందించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ పెంచలయ్య, వైద్యుడు సంతోష్‌చారి తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వంతో కలసిరండి వేములవాడ: ప్రజా ప్రభుత్వంతో కలిసిరావాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. వేములవాడ రూరల్ మండలం జయవరం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు 50 మంది శనివారం కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఆది శ్రీనివాస్ పార్టీ కండువా కప్పారు. కులగణన చేపట్టి దేశానికి తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో దీక్షలో కూర్చున్న విషయాన్ని గుర్తు చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. -
పత్తి రైతుపై విత్తన భారం
● ఐదేళ్లలో ప్యాకెట్‌పై రూ.200 పెంపు ● ఈ ఏడాది పెరిగిన రూ.37 ● జిల్లాలో 44వేల ఎకరాలకు పైగా సాగు ● జిల్లా రైతులపై ఏటా రూ.అర కోటి భారంచందుర్తి(వేములవాడ): పత్తి రైతులకు విత్తనాలు భారంగా మారుతున్నాయి. ఏటా కేంద్ర ప్రభుత్వం పత్తి విత్తనాల ధరలు పెంచుతుండడం రైతులకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే సమయంలో పత్తి మద్దతు ధర గురించి పట్టించుకోవడం లేదు. విత్తన ధరలు పెంచిన ప్రభుత్వం మద్దతు ధర సైతం పెంచాలని రైతులు కోరుతున్నారు. మార్కెట్లో 450 గ్రాముల పత్తి ప్యాకెట్ రూ.864 ఉండగా.. ప్రస్తుతం ప్యాకెట్ ధరను రూ.901కి పెంచింది. ఎకరానికి మూడు ప్యాకెట్లు వినియోగిస్తే ఏటా అదనంగా రూ.111 భారంగా మారుతుంది. ఇలా జిల్లాలో 44 వేల సాగు అవుతుండడంతో రైతులపై ఏటా రూ.50లక్షలకు పైగానే ఆర్థిక భారం పడుతుంది. గిట్టుబాటు ధర అంతంతే.. జిల్లాలోని 2.28 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతుండగా.. వరి 1.74లక్షల ఎకరాలు, పత్తి 44,650 ఎకరాలు, మిగతా మొక్కజొన్న, కందులు 7వేల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. గత మూడేళ్లుగా అధిక వర్షాలు పడుతుండడంతో పత్తికి తెగుళ్లు ఆశిస్తున్నాయి. దీంతో రైతులు విచ్చలవిడిగా క్రిమిసంహారక మందులు వాడుతున్నారు. అధిక వర్షాలు పంటల దిగుబడిపై ప్రభావం చూపుతుండడం, తెగుళ్ల నివారణకు వాడే క్రిమిసంహారక మందులతో వ్యయం పెరిగిపోతుంది. ఒకప్పుడు ఎకరాకు 8 నుంచి 14 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా.. ప్రస్తుతం 6 నుంచి 7 క్వింటాళ్లకు పడిపోయింది. ప్రస్తుతం సీసీఐ గరిష్టంగా క్వింటాల్‌కు రూ.7,521 పెడుతుంది. నాణ్యత లేదనే సాకుతో రూ.7,421లకే కొనుగోలు చేసింది. బహిరంగ మార్కెట్లో మాత్రం రూ.6,300 నుంచి రూ.6,500 వరకే కొంటున్నారు. పెరిగిన పెట్టుబడి వ్యయం విత్తనాల ధరతోపాటు ఎరువులపై కేంద్రం ఇచ్చే సబ్సిడీని తగ్గించడంతో కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఏకంగా రూ.360 నుంచి రూ.700 వరకు పెరిగాయి. ఇదే సమయంలో పత్తి ధరను మాత్రం క్వింటాల్‌కు రూ.310 మాత్రమే పెంచింది. వ్యవసాయంలో యంత్రాల వినియోగం పెరగడంతో ఇంధన ఖర్చు సైతం పెరిగింది. లూజ్ విత్తనాల వైపు రైతు చూపు కేంద్ర ప్రభుత్వం పత్తి విత్తనాల ధరలను పెంచడంతో రైతులు లూజ్ పత్తి విత్తనాలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు వ్యాపారులు లూజ్ పత్తి విత్తనాలను ఆంధ్ర ప్రాంతం నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ విత్తనాలను కిలోకు రూ.550 నుంచి రూ.700 ధరకు విక్రయిస్తుండడంతో వీటిపైనే రైతులు దృష్టి సారిస్తున్నా రు. కంపెనీ విత్తనాలు అయితే ఎకరాకిని రూ.3,604 ఖర్చు అవుతుండడంతో రైతులు భారంగా భావిస్తూ లూజ్ విత్తనాలు కొంటున్నారు. పత్తి విత్తన ప్యాకెట్ల ధరలు 2019 రూ.7102020 రూ.7302021 రూ.7672022 రూ.8102023 రూ.8532024 రూ.8642025 రూ.901విత్తనాల ధరలు తగ్గించాలి రైతులకు సాగు ఖర్చు ఏటా పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలను తగ్గించడంతో ఎరువుల ధరలు పెరిగాయి. పత్తి విత్తనాల ధరలు పెరుగుతుండడంతో ఏటా భారం పెరుగుతోంది. ఎరువులు, విత్తనాలపై సబ్సిడీ పెంచడం సాధ్యం కాకపోతే కనీసం పంటలకై నా గిట్టుబాటు ధరలు పెంచి ఆదుకోవాలి. – కటకం చంద్రయ్య, బండపల్లి -
ఉన్నత లక్ష్యంతో చదవాలి
సిరిసిల్ల: విద్యార్థులు పక్కా ప్రణాళిక చదివి ఉన్నత స్థానాలకు చేరాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆకాంక్షించారు. పదోతరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను శనివారం అభినందించారు. గంభీరావుపేట మండలం దమ్మన్నపేట మోడల్‌స్కూల్ విద్యార్థులు విష్ణుప్రియ 580, విగ్నారెడ్డి 573, వైష్ణవి 553, అలేఖ్య 551 మార్కులు సాధించారు. జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్ జెడ్పీ స్కూల్ విద్యార్థులు సాయిహర్షిత్ 573, భానుతేజ 562, నవజీత్ 561, సుశత 558, కావ్య 545, మైత్రి 531, భవ్య 535 మార్కులు సాధించారు. సీపీవో శ్రీనివాసాచారి, ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్, హెచ్ఎంలు పాల్గొన్నారు. పేదలకు ఆర్థిక సాయం అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న మూడు పేద కుటుంబాలకు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా శనివారం ఆర్థిక సహాయం అందించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో తంగళ్లపల్లి మండలం రామచంద్రాపూర్‌కు చెందిన దాసరి మల్లవ్వ, కోనరావుపేట మండలం కొలనూర్‌కు చెందిన కుమ్మరికుంట కళావతి, వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన సింగం నర్సయ్య అనారోగ్యంతో ఉన్నామని, ఆర్థిక సాయం అందించాలని కలెక్టర్‌కు విన్నవించారు. చలించిన కలెక్టర్ శనివారం ఒక్కో కుటుంబానికి రూ.25వేల చొప్పున చెక్కులు అందించారు. కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా విద్యార్థులకు అభినందనలు -
ఈఎస్ఐ, బీమా కల్పించాలి
ధూప దీప నైవేద్య పథకం కింద పనిచేసే అర్చకులకు ప్రభుత్వం ఈఎస్ఐ, ఆరోగ్య బీమా పథకాలను వర్తింప జేయాలి. ఈఎస్ఐ కూడా మాకు అమలు చేస్తే.. అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. వీటితోపాటు పేద అర్చకులకు ఇండ్ల నిర్మించి ఇవ్వాలని కోరుతున్నాం. – నాగరాజ్ శర్మ, డీడీఎన్ స్కీం అధికార ప్రతినిధి వేతనాలు పెంచాలి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అర్చకుల బాధలను తెలుసుకొని అర్చకులకు వేతనం కల్పించాలని ఉద్దేశంతో డీడీఎన్ స్కీమ్ ప్రవేశపెట్టారు. అది ఇప్పటివరకు విజయవంతంగా సాగుతోంది. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అర్చకుల బాధని అర్థం చేసుకొని డీడీఎన్ అర్చకులకు వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. – రామకృష్ణమాచార్యులు, జిల్లా అర్చక సంఘం అధికార ప్రతినిధి -
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కే పట్టం కట్టండి
● మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ● అనంతారంలో ‘ఎమ్మెల్యే ఆన్ వీల్స్’కు స్పందనఇల్లంతకుంట: స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ప్రజలు పట్టం కట్టాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే ఆన్‌వీల్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానకొండూరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ పొందాలంటే కేవైసీ చేయించాలన్నారు. అనంతారంలో గతంలో వ్యక్తిగతంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించుకున్నవారు సంబంధిత అధికారులతో ఎంబీ రికా ర్డు చేయించుకుంటే నిధులు మంజూరు అవుతాయ ని తెలిపారు. గ్రామంలో లూజ్‌వైర్లను సరి చేయాలని సెస్ ఏఈ నగేశ్కుమార్ను ఆదేశించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ అనంతారం బిక్కవాగుపై నిర్మించిన బ్రిడ్జి పూర్తి చేసేందుకు రూ.44లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. సీసీరోడ్లకు రూ.25లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ భూమిపూజ జూన్ 5వ తేదీన అనంతారం నుంచి ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కే.భాస్కర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ సుదర్శన్‌రెడ్డి, సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, తహసీల్దార్ ఎంఏ.ఫారూఖ్, ఎంపీడీవో శశికళ తదితరులు పాల్గొన్నారు. -
చివరి గింజ వరకు కొంటాం
కోనరావుపేట: రైతులు పండించిన ఆఖరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళనకు గురి కావద్దని వేమువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండలం నాగారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సందర్శించి రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో వేగవంతంగా వడ్ల కొనుగోలు జరుగుతోందన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ధాన్యాన్ని తీసుకుని వస్తే వెంటనే కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ప్రతి రైతు వద్ద నుంచి ధాన్యం సేకరించి మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం తాలుతప్ప పేరుతో నిలువునా మోసం చేసిందని రైతులు విప్ దృష్టికి తెచ్చారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. దర్శావళి ఉత్సవాలకు రావాలి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామ శివారులో గల దర్శావళి దర్గా ఉత్సవాలకు రావాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలతో పాటు జిల్లా అధికారులకు శుక్రవారం ఉత్సవ నిర్వాహకులు అజీజ్‌బాయి, కాంగ్రెస్ నాయకులు ఆహ్వానం పలికారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితేలను వారి కార్యాలయాల్లో కలిసి ఉత్సవ ఆహ్వానపత్రికలను అందజేశారు. అనంతరం సిరిసిల్లలో గ్రంథాలయం చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్‌కు అందించారు. ఈ నెల 15న ఉర్సు ఉత్సవాలు ఉంటాయని, అదే రోజు మండల కేంద్రం నుంచి దర్శావళి దర్గా వరకు సందల్‌ను ఊరేగింపుగా తీసుకెళ్లడం జరుగుతుందని నిర్వహకులు అజీజ్‌బాయి తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ గుండాడి రాంరెడ్డి పాల్గొన్నారు. రైతులు ఆందోళన చెందొద్దు ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ -
ఎండతో అప్రమత్తంగా ఉండాలి
● వడదెబ్బ లక్షణాలుంటే.. ఆస్పత్రికి వెళ్లండి ● కలెక్టర్ సందీప్ కుమార్ ఝాసిరిసిల్ల: ఎండలతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోరారు. ఎండలు, వడగాలులతో జరిగే ప్రమాదాల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. వేసవికాలంలో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప ప్రజలు బయటికి రాకూడదని సూచించారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడ దెబ్బలు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. చిన్నారులు, వయోవృద్దులతో ప్రయాణం శ్రేయస్కరం కాదని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. ఇంటి నుండి బయటికి వస్తే తలకు ఎండ తగలకుండా గొడుగు, కండువా,టోపితో కవరు చేయాలని సూచించారు. అత్యవసర వైద్య సేవలకు 108 కు ఫోన్ చేయాలని అన్నారు. ఉపాధి హామీ పథకం పనులు కూలీలు ఉదయం 6 నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 6 గంటలు వరకు పనులు చేపించాలని, పనులు జరుతున్న ప్రదేశాల్లో రక్షణ, జాగ్రత్తలు పాటించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. భూభారతిలో వచ్చిన సమస్యలను పరిష్కరించాలి భూ భారతి చట్టం ప్రకారం ప్రజల నుండి వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. హైదరాబాద్ నుంచి వీసీలో సమీక్షించారు. ఈ నెల 5 నుంచి మే 20 వరకు జిల్లాలో ఒక్క మండలాన్ని పైలెట్‌గా తీసుకొని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూసమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవాలన్నారు. జూన్ 2వ తేదీ వరకు ఆ దరఖాస్తులను పరిష్కరించాలని మంత్రి కోరారు. నీట్ పరీక్షలపై జిల్లాలో నీట్ పరీక్ష కేంద్రాలను ముందుగా జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించి ఏర్పాట్లు పర్యవేక్షించాలని అన్నారు. సీసీ కెమెరాలు, అవసరమైన మేర పోలీస్ భద్రత కల్పించాలని అన్నారు. ప్రశ్న పత్రాలు స్టోర్ చేసే స్ట్రాంగ్ రూం వద్ద సీసీటీవీ ఉండాలని, పోలీస్ బందోబస్తుతో పరీక్ష కేంద్రాలకు ప్రశ్నా పత్రాలను తరలించాలని అన్నారు. పరీక్ష కేంద్రాల గేటు మధ్యాహ్నం 1.30 గంటలకు మూసి వేయాలని, ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాత మాత్రమే పరీక్ష కేంద్రం లోపలికి అనుమతించాలని, బయో మెట్రిక్ అటెండెన్స్ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. సిరిసిల్ల, వేములవాడ ఇన్చార్జి ఆర్డీవో రాధాబాయి, డీఆర్డీవో శేషాద్రి, హౌసింగ్ పీడీ శంకర్ పాల్గొన్నారు.