
అక్రమంగా పట్టా చేసుకుండ్రు
ఊరిలో మా మామ పేరిట 9 ఎకరాల స్థలం ఉంది. ఆయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. వారిలో చిన్నకూతురు మినహా ఎవరూ బతికిలేరు. వారసత్వంగా మాకు సంక్రమించాల్సిన భూమిని కొందరు నా ప్రమేయం లేకుండానే వారి పేరిట పట్టా చేయించుకున్నారు. నా పోషణ గురించి పట్టించుకోవడం లేదు. నాకు న్యాయం చేయాలి.
– జూలూరి మల్లవ్వ, సముద్రలింగాపూర్
ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలి
జిల్లాలోని చాలా ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు పాటించడం లేదు. వైద్యుల అర్హతల వివరాలు ప్రదర్శించడం లేదు. ధనార్జనే ధ్యేయంగా ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. డబ్బుల కోసం రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– అంగూరి రంజిత్, సిరిసిల్ల
నా స్థలాన్ని కబ్జా కానీయొద్దు
మాకు జిల్లాకేంద్రం విద్యానగర్ బైపాస్ రోడ్డులో సర్వేనంబర్ 517లో స్థలం ఉంది. నేను ఉపాధి నిమిత్తం మా స్థలంలో హోటల్ పెట్టుకోవాలని చూస్తుంటే ఓ బీఆర్‌ఎస్ నాయకుడు బెదిరిస్తున్నాడు. అదే సర్వేనంబర్‌లో వారికి ఉన్న భూమి బైపాస్‌రోడ్డులో పోయింది. అప్పుడు పరిహారం కూడా పొందారు. ఇప్పుడు నిరుపేద అయిన నా స్థలాన్ని కాజేయాలని చూస్తుండ్రు. కలెక్టర్ న్యాయం చేయాలి.
– షేక్ జలీల్, విద్యానగర్

అక్రమంగా పట్టా చేసుకుండ్రు

అక్రమంగా పట్టా చేసుకుండ్రు