
ప్రజల అభీష్టం మేరకు వేములవాడ– ముంబయి బస్
వేములవాడ: ప్రజల అభీష్టం మేరకు వేములవాడ– ముంబయికి లహరి ఏసీ స్లీపర్ బస్సు సర్వీసు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం వేములవాడ ఆలయ పార్కింగ్ స్థలంలో రెండు ఏసీ బస్సులను విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝాతో కలిసి అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య పూజ అనంతరం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముంబయిలోని తెలుగు ప్రజల కోరిక మేరకు బస్సులను ప్రారంభిస్తున్నామని, రోజూ మధ్యాహ్నం 12.30 గంటలకు వేములవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.45 గంటలకు ముంబయి చేరుకుంటుందని, తిరిగి అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ముంబయి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు వేములవాడ చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు స్లీపర్ బెర్త్ రూ.2 వేలు, సీటుకు రూ.1,500, పిల్లలకు బెర్త్ రూ.1,600, సీట్ రూ.1,230 టికెట్ ఉంటుందని, ఈ ప్రాంతవాసులు వినియోగించుకోవాలని కోరారు. ఆలయ ప్రాంగణం నుంచి తిప్పాపూర్ బస్టాండ్ వరకు బస్సులో ప్రయాణించి ముంబయి వెళ్లే ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ఎస్పీ మహేశ్ బీ గీతే, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్లు, డిపో మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం
రుద్రంగి(వేములవాడ): ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ నుంచి ముంబయికి మంగళవారం ప్రారంభమైన ఏసీ బస్సుకు రుద్రంగిలో విప్, స్థానిక నాయకులు స్వాగతం పలికి పూజలు చేశారు. ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తూము జలపతి తదితరులు ఉన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్