
కొనుగోళ్లలో జాప్యం.. రోడ్డెక్కిన రైతన్న
ఇల్లంతకుంట(మానకొండూర్): ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై మంగళవారం మండలంలోని పొత్తూరులో రైతన్నలు రోడ్డుపై బైఠాయించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, గత నెల 11న గ్రామంలో కేంద్రం ప్రారంభించినా ఇప్పటివరకు కొనుగోళ్లు పూర్తి కాలేదని ఆరోపించారు. ఆది, సోమవారాల్లో తూకం వేసిన 4 వేల బస్తాల ధాన్యం లారీలు రాక కేంద్రంలోనే ఉండిపోయిందని, వర్షం పడితే ధాన్యం తడుస్తుందని పేర్కొన్నారు. ఈక్రమంలో మాజీ జెడ్పీటీసీ సిద్ధం వేణు రైతులకు సంఘీభావం తెలిపి ఐకేపీ ఏపీఎం వాణిశ్రీతో మాట్లాడారు. రెండురోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. రెండురోజులు లారీలు రాకపోవడంతో తూకం వేసిన ధాన్యం ఆగిందని, మంగళవారం లారీల్లో మిల్లులకు పంపించినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్, పట్నం శ్రీనివాస్, కుదురు శేఖర్, చెరుకు రాజు, నారాయణరెడ్డి, రాజయ్య, గౌరయ్య, రాజ మల్ల య్య తదితరులు పాల్గొన్నారు.