
విద్యార్థుల భవిష్యత్‌కు పునాదులు వేయాలి
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల: ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థుల భవిష్యత్‌కు పునాదులు వేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. జిల్లా కేంద్రంలోని గీతానగర్ స్కూల్‌లో ఉపాధ్యాయులకు ఐదు రోజుల వేసవి శిక్షణ శిబిరాన్ని మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గణితం, ఏఐ టూల్స్‌లో పిల్లలు వెనుకపడకుండా వినూత్న పద్ధతుల్లో వారికి అర్థమయ్యేలా బోధన సాగించాలన్నారు. విద్యార్థులు రెగ్యులర్‌గా పాఠశాలకు హాజరయ్యేలా ఫాలో అప్ చేయాలని పేర్కొన్నారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాలున్నా, ఇంటర్‌లో ఫెయిల్ అవుతున్నారని, విషయ పరిజ్ఞానంలో ముందస్తు నుంచి విద్యార్థులను బలోపేతం చేస్తే వైఫల్యాలను నిరోధించవచ్చని తెలిపారు. విద్యాశాఖలో ఒకే రోజు మార్పు సాధ్యం కాదని, నిర్వీరామంగా ప్రయత్నం చేస్తూ ఉండాలన్నారు. మంచి విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యతల్లో ఉన్న ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. డీఈవో జనార్దన్‌రావు తదితరులు పాల్గొన్నారు.