
పంటమార్పిడితో సుస్థిర ఆదాయం
● వ్యవసాయ శాస్త్రవేత్తలు ● చంద్రంపేటలో అవగాహన సదస్సు
సిరిసిల్ల: రైతులు పంట మార్పిడితో అధిక దిగుబడులు సాధిస్తూ.. సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సతీశ్ పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణ శివారులోని చంద్రంపేటలో మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ‘రైతు ముగింట్లో శాస్త్రవేత్తలు–అన్నదాతల అవగాహన’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అధునాతన వ్యవసాయ సాంకేతిక విధానాలు వివరించారు. యూరియా వాడకాన్ని తగ్గించాలని, పచ్చిరొట్ట పంటలు వేసుకోవాలని సూచించారు. అవసరం మేరకే రసాయనాలను వినియోగించుకోవాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల రశీదులను భద్రపరచుకోవాలన్నారు. శాస్త్రవేత్త డాక్టర్ సంపత్, వ్యవసాయాధికారి సందీప్, వ్యవసాయ విస్తరణ అధికారులు లతశ్రీ, రాజ్‌కుమార్, వ్యవసాయ విద్యార్థులు సతీశ్, సౌమ్య, మాజీ కౌన్సిలర్ రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ బాలయ్యయాదవ్, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.