వెల్లువలా వినతులు
● వివిధ సమస్యలపై 167 అర్జీలు ● దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్లటౌన్: సుదీర్ఘకాలంగా తమ సమస్యలు అపరిష్కృతంగా ఉంటున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా స్పందిస్తూ ప్రజావాణిలో వచ్చే అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా నలు మూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి 167 దరఖాస్తులు వచ్చాయి. సీపీవోకు 1, జిల్లా వ్యవసాయాధికారి 1, జిల్లా పౌర సరఫరాల అధికారి 5, జిల్లా విద్యాధికారి 3, జిల్లా వైద్యాధికారి 10, మైనార్టీ సంక్షేమాధికారి 1, డీఆర్డీవో 3, జిల్లా సంక్షేమాధికారి 4, ఈడీఎం 1, గృహనిర్మాణ శాఖకు 6, ఎల్డీఎం 4, సెస్ ఆఫీస్ 4, మెడికల్ కాలేజీ 1, ఎంపీడీవో ఇల్లంతకుంట 2, గంభీరావుపేట 5, కోనరావుపేట 2, ముస్తాబాద్ 3, తంగళ్లపల్లి 12, వేములవాడ రూరల్ 1, ఎల్లారెడ్డిపేట 4, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల 11,మున్సిపల్ కమిషనర్ వేములవాడ 3, ఆర్డీవో సిరిసిల్ల 6, ఆర్డీవో వేములవాడ 4, ఎస్డీసీ 16, ఎస్పీ కార్యాలయం 3, తహసీల్దార్ బోయినపల్లి 5, చందుర్తి 3, ఇల్లంతకుంట 8, గంభీరావుపేట 3, కోనరావుపేట 3, ముస్తాబాద్ 2, సిరిసిల్ల 3, తంగళ్లపల్లి 9, వీర్నపల్లి 1, వేములవాడ 4, వేములవాడరూరల్ 2, ఎల్లారెడ్డిపేటకు 6, డీసీఎంఎస్‌కు ఒక్కో దరఖాస్తు చొప్పున వచ్చాయి.


