కిక్ బాక్సింగ్‌లో బంగారు పతకాలు
సిరిసిల్లటౌన్/సిరిసిల్లఅర్బన్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ పబ్లిక్ స్కూల్ ఐపీఎస్ అకాడమీలో అస్మిత ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ వెస్ట్‌జోన్ పోటీలలో జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చూపారు. మ్యూజికల్ ఫామ్ హార్డ్ స్టైల్ వెపన్ జూనియర్స్‌లో గంగణవేణి ప్రవళిక గోల్డ్ మెడల్ సాధించారు. సబ్ జూనియర్స్‌లో గజ్జెల శ్వేదిక కాంస్యం సాధించారు. తమిళనాడులో మార్చిలో జరిగే అస్మిత జాతీయస్థాయి ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. వీరిని వాకో కిక్ బాక్సింగ్ ఫెడరేషన్ ఇండియా అధ్యక్షుడు సంతోష్‌కుమార్ అగర్వాల్, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, మహిపాల్ అభినందించారు.
మాస్టర్ అథ్లెటిక్స్‌లో బహుమతి
సిరిసిల్లటౌన్: రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జిల్లా నుంచి కడారి అశోక్‌కుమార్ 10 కి.మీ పరుగు పందెంలో సిల్వర్ మెడల్ సాధించారు. కరీంనగర్‌లో జరిగిన పోటీల్లో పాల్గొని జాతీయస్థాయికి ఎంపికయ్యారు. మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి, గొట్టిముక్కుల శేఖర్, మునీందర్‌రెడ్డి అభినందించారు.
వాహనం అదుపు తప్పి యువకుడి మృతి
రాయికల్: రాయికల్ మండలం భూపతిపూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతలూరుకు చెందిన జటోతు భూమేశ్ (19) అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భూమేశ్ స్నేహితుడైన దినేశ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై రాయికల్ నుంచి చింతలూరు వైపు వెళ్తున్నారు. భూపతిపూర్ శివారులో వాహనం అదుపుతప్పి రేలింగ్‌కు ఢీకొనడంతో భూమేశ్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన దినేశ్‌ను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో భూమేశ్ కుటుంబ సభ్యులు రోధనలు మిన్నంటాయి.
కిక్ బాక్సింగ్‌లో బంగారు పతకాలు


