క్రీడాకారులకు అభినందనలు | - | Sakshi
Sakshi News home page

క్రీడాకారులకు అభినందనలు

Dec 30 2025 8:46 AM | Updated on Dec 30 2025 8:46 AM

క్రీడ

క్రీడాకారులకు అభినందనలు

గీతా శ్లోక పఠనంలో రాష్ట్రస్థాయి బహుమతి ● లింగంపేటలో విషాదం ‘మాజీ సర్పంచుల సమస్యలు తీర్చాలి’

సిరిసిల్ల: జాతీయస్థాయి క్రీడాపోటీల్లో పాల్గొన్న జిల్లాకు చెందిన క్రీడాకారులను ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ సోమవారం అభినందించారు. ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన 49వ జాతీయస్థాయి క్రీడాపోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన జట్టులో జిల్లాకు చెందిన క్రీడాకారులు ఐదుగురు పాల్గొన్నారు. వీరిని ఇన్‌చార్జి కలెక్టర్‌ అభినందించారు. జిల్లా యువజన అధికారి రాందాస్‌, జట్టు కోచ్‌ సంపత్‌గౌడ్‌, అసిస్టెంట్‌ కోచ్‌ జగన్‌ మోహన్‌ ఉన్నారు.

సిరిసిల్లటౌన్‌: ముక్కోటి ఏకాదశి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో శ్రీ రుషి ప్రభాకర్‌ విద్యా కేంద్రంలో రాష్ట్రస్థాయి గీత శ్లోక పఠన పోటీలు నిర్వహించారు. సిద్ధ సమాధి యోగా బ్రహ్మోపదేశకులు ఆచార్య దయాకర్‌ ఆధ్వర్యంలో బాలబాలికలకు నిర్వహించగా సిరిసిల్ల చిన్మయ బాలవిహార్‌ విద్యార్థిని కుడిక్యాల తేజస్వి ప్రథమ బహుమతి గెలుచుకుంది. తేజస్విని బాలవిహార్‌ ఆచార్యులు చిన్మయ మిషన్‌ సిరిసిల్ల ప్రధాన కార్యదర్శి నల్ల సత్యనారాయణ, అధ్యక్షుడు సజ్జనం శ్రీనివాస్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లకావత్‌ మోతిలాల్‌, కోశాధికారి మేరుగు మల్లేశం, కార్యవర్గ సభ్యులు జక్కని రమేశ్‌, వెంగళ కమలాకర్‌, చేపూరి బుచ్చయ్య, అంజనాదేవి, దేవయ్య అభినందించారు.

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

చందుర్తి(వేములవాడ): ఇద్దరు భార్యలు విడాకులు తీసుకోవడంతో ఒంటరిగా బతుకున్న వ్యక్తి మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటకు చెందిన ఇందూరి రాములు(45)కు గతంలో రెండు వివాహాలు కాగా.. ఇద్దరు భార్యలు విడాకులు తీసుకున్నారు. 2017 నుంచి మతిస్థిమితం కోల్పోయాడు. తల్లి సత్తవ్వ పలు దవాఖానాలలో చూపించినా నయం కాలేదు. ఒంటరితనం భరించలేక సోమవారం ఇంట్లోని దూలానికి ఉరివేసుకున్నాడు. అనంతరం వచ్చిన తల్లి ఇంట్లోకి వెళ్లగా కొడుకు దూలానికి వేలాడుతూ కనిపించడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సై రమేశ్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తల్లి సత్తవ్వ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

సిరిసిల్లటౌన్‌: తమకు రావలసిన బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తాజా మాజీ సర్పంచుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. తమ సమస్యల సాధనకు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో సర్పంచులను అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా సర్పంచుల పెండింగ్‌ బిల్లులు విడుదల చేయకపోవడం కక్ష సాధింపు చర్యగా పేర్కొన్నారు.

సీపీఆర్‌పై అవగాహన

వేములవాడఅర్బన్‌: అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్‌ చేసి ప్రాణాలు నిలపవచ్చని లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు చీకోటి సంతోష్‌ పేర్కొన్నారు. వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో సోమవారం విద్యార్థులకు, అధ్యాపకులకు సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. డాక్టర్‌ నాగర్జున, రాజేశ్వరీ, వంశీకృష్ణ, ప్రిన్సిపాల్‌ ప్రభాకరాచారి, శంకరయ్య, శ్యామ్‌, కుమారస్వామి, మానస, శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

క్రీడాకారులకు   అభినందనలు1
1/3

క్రీడాకారులకు అభినందనలు

క్రీడాకారులకు   అభినందనలు2
2/3

క్రీడాకారులకు అభినందనలు

క్రీడాకారులకు   అభినందనలు3
3/3

క్రీడాకారులకు అభినందనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement