ముక్కోటికి ముస్తాబు
సిరిసిల్లటౌన్/కోనరావుపేట(వేములవాడ): ముక్కోటి ఏకాదశి వేడుకలకు జిల్లాలోని వైష్ణవ ఆలయాలు ముస్తాబయ్యాయి. సిరిసిల్లలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. భారీ సెట్టింగులతో తిరుమల ఆలయం మాదిరిగా సప్తద్వారాలు, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 4 గంటల నుంచి ఉత్తరద్వారం ద్వారా భక్తులకు దర్శనం ఇస్తారని ఆలయ ఈవో మారుతిరావు తెలిపారు. కోనరావుపేట మండలం మామిడిపల్లిలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేకంగా ఉత్తర ద్వారం ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఇన్‌చార్జి దేవయ్య తెలిపారు.
సిరిసిల్లలోని వేంకటేశ్వరస్వామి ఆలయం
ముక్కోటికి ముస్తాబు
ముక్కోటికి ముస్తాబు


