అర్జీలు సకాలంలో పరిష్కరించాలి
● ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● ప్రజావాణికి 146 దరఖాస్తులు
సిరిసిల్ల అర్బన్: ప్రజావాణికి వచ్చిన అర్జీలు సకాలంలో పరిష్కరించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నిఽఖితతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. మొ త్తం 146 దరఖాస్తులు వచ్చాయి. ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టొద్దని, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు వి ధిగా ప్రజావాణికి హాజరుకావాలని స్పష్టం చేశారు.


