
మానేరు ప్రాజెక్ట్ కెనాల్ షట్టర్ మూసివేత
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్‌లోని మానేరు ప్రాజెక్ట్ కెనాల్ షట్టర్‌ను మూసివేశారు. ముస్తాబాద్ నుంచి పోతుగల్ వెళ్లే డిస్ట్రిబ్యూటరీ–18 వద్ద మట్టిని పోశారు. దీంతో 18 కెనాల్ వైపునకు నీరు వెళ్లలేని పరిస్థితి. డిస్టిబ్యూటరీ–18 వద్ద కెనాల్ షట్టర్ మూసుకుపోవడంతో రానున్న ఖరీఫ్ సీజన్‌కు నీరు వెళ్లదని రైతులు పేర్కొంటున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి మట్టిని తొలగించాలని రైతులు కోరుతున్నారు.
ముగిసిన వార్పర్ల సమ్మె
● కుదిరిన కూలీ ఒప్పందం
సిరిసిల్ల: ఏడు రోజులుగా వార్పర్లు చేస్తున్న సమ్మె ఆదివారం ముగిసింది. పాలిస్టర్ అసోసియేషన్ భవన్‌లో పాలిస్టర్ అసోసియేషన్ ప్రతినిధులకు, వార్పర్ కార్మిక సంఘం నాయకుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన మహిళా ఇందిరా శక్తి చీరల బీములకు ఒక్కోదానికి కూలీని రూ.475 నిర్ణయించారు. జరీబీములు టాప్‌ది రూ.275గా నిర్ణయించారు. ఇది బీములో దారం పోగుల పొడవు 1250 మీటర్ల వరకు వర్తిస్తుంది. అంతకంటే ఎక్కువ పొడవు ఉంటే అదనపు కూలీ ఇవ్వాలని నిర్ణయించారు. ఈమేరకు వార్పర్ల కూలీ ఒప్పందం కుదరడంతో సమ్మెను విమరించారు. చర్చల్లో పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, కార్యదర్శి అంకాలపు రవి, ప్రతినిధులు గోవిందు రవి, దూడం శంకర్, వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సిరిమల్లె సత్యం, కార్యదర్శి మూషం రమేశ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, ప్రతినిధులు ఉడుత రవి, మచ్చ వేణు, బూట్ల వెంకటేశ్వర్లు, ఐరన్ ప్రవీణ్, అడిచర్ల రాజు పాల్గొన్నారు.
వెంకన్న పారివేట శోభాయాత్ర
బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని తడగొండ శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణంలో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారి పారివేట శోభాయాత్ర ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉత్సవ విగ్రహాలతో భజనలు, భక్తి గీతాలతో కనుల పండువలా ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో పూజారులు అనిల్ ఆచార్య, హరికృష్ణ ఆచార్య, సాయిశర్మ శ్రీనివాస, హునుమాన్ దీక్షా స్వాములు పాల్గొన్నారు.

మానేరు ప్రాజెక్ట్ కెనాల్ షట్టర్ మూసివేత

మానేరు ప్రాజెక్ట్ కెనాల్ షట్టర్ మూసివేత