
అనర్హులకు ఉద్యోగాలిచ్చారు
ఇటీవల వైద్య కళాశాలలో ల్యాబ్ అట్టెండ్, డీఈవో పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి.. అర్హతలున్న మమ్మల్ని వదిలేసి ఇతరులకు ఉద్యోగాలిచ్చారు. ఎంపిక విధానంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అర్హులకే ఉద్యోగాలివ్వాలి.
– దరఖాస్తుదారులు
రేషన్‌కార్డులో తప్పులు సవరించాలి
మేము హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు చాలా ఏళ్ల క్రితం వచ్చాము. మారెల్ల లావణ్య, మారెల్ల యశ్వంత్‌కుమార్ పేర్లతో అక్కడ రేషన్‌కార్డు ఉండేది. అది బ్లాక్ కావడంతో సిరిసిల్లలో కొత్తగా కార్డు తీసుకున్నాం. దానిలో మారెల్ల యశ్వంత్‌కుమార్ బదులుగా మారెల్ల శివకుమార్‌గా, జిల్లా పేరు కూడా తప్పుగా పడింది. – మారెల్ల లావణ్య, సిరిసిల్ల

అనర్హులకు ఉద్యోగాలిచ్చారు