
ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్‌కు నోటీసులు
● నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు
సిరిసిల్ల: అనేక హామీలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ పేరుతో కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు పే ర్కొన్నారు. సిరిసిల్లలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం బీఆర్‌ఎస్ నేతలతో కలిసి ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక, పాలన చేతకాక దయనీయ స్థితిలో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, దేశానికి రోల్‌మోడల్‌గా నిలిపిన కేసీఆర్‌ను దోషిగా చూపించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పీసీ ఘోష్ కమిషన్‌తో నోటీసులు ఇప్పించారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే.. రిజర్వాయర్లు, సొరంగాలు, కాల్వలు, పంప్‌హౌజ్‌లని రెండు, మూడు ఫిల్లర్లు కుంగిపోతే వెంటనే రిపేరు చేయకుండా.. కేసీఆర్‌పై కోపంతో రైతులకు నీళ్లు ఇవ్వకుండా పొలాలు ఎండబెట్టారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ ప్రజాపాలన పేరిట సీఎం రేవంత్‌రెడ్డి తన నేర ప్రవృత్తిని చాటి చెప్పుకుంటున్నారని ఆరో పించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు రైతుబంధు రూ.15వేలు, కల్యాణలక్ష్మీలో తులం బంగారం, పెన్షన్లు డబుల్ ఇస్తామని చెప్పి ఒక్కటి అమలు చేయడం లేదన్నారు. బీఆర్‌ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, నాయకులు కుంబాల మల్లారెడ్డి, గుండ్లపల్లి పూర్ణచందర్, ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.