
పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ఓబులాపూర్ ఆరోగ్య ఉప కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రజిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాధి నిరోధక టీకాల రికార్డులు, వ్యాక్సిన్ కోల్డ్ చైన్‌ను పరిశీలించారు. సకాలంలో గర్భిణీలకు, ఐదేళ్లలోపు చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయాలని సూచించారు. జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి సంపత్‌కుమార్, పీహెచ్‌సీ మెడికల్ అధికారి అఫీసా, సిబ్బంది జ్యోతి పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయండి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలో వారం రోజుల్లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని పౌరసరఫరాల టాస్క్ ఫోర్స్ టీం అధికా రి లక్ష్మారెడ్డి, జంగయ్య సూచించారు. వెంకటాపూర్‌లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలను బుధవారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రికార్డులు, రైతుల నుంచి సేకరించిన ధాన్యం, రైస్‌మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైస్‌మిల్లులను విజిట్ చేసి ధాన్యం దిగుమతి గురించి తెలుసుకున్నారు. డీటీసీఎస్ అశోక్, ఇన్‌చార్జి డీపీఎం శ్రీనివాస్, ఏపీఎం మల్లేశం, సీసీ పద్మ పాల్గొన్నారు.
మాంసం విక్రయాలపై నియంత్రణ ఉంచాలి
సిరిసిల్లటౌన్: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో వెటర్నరీ డాక్టర్ గుర్తించకుండా సాగుతున్న మాంసం విక్రయాలను నియంత్రించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కోరారు. ఈమేరకు బుధవారం సిరిసిల్ల మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ పోసు వాణికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. పట్టణంలో నిబంధనల విరుద్ధంగా పశువైద్యులు ధ్రువీకరించకుండా మేక, గొర్రె మాంసాన్ని విక్రయిస్తున్నారని దీంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు చనిపోయిన జీవాలను కోసి అమ్ముతున్నారని, ఆడగొర్రెలను కోసి పొట్టేలుగా చెబుతూ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్లాటర్‌హౌస్ నిర్మించినా అక్కడ గొర్రెలను కోయడం లేదన్నారు. ఎలిగేటి రాజశేఖర్, బూర్ల సందీప్ పాల్గొన్నారు.
27న కథారచనపై వర్క్‌షాప్
సిరిసిల్లకల్చరల్: కథలు ఎలా రాయాలి అనే అంశంపై ఈనెల 27న తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో కథా కార్యశాల(వర్క్‌షాప్) నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త బుధవారం ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి మినీ కాన్ఫరెన్స్‌హాల్‌లో జరిగే ఈ వర్క్‌షాప్‌లో జిల్లాకు చెందిన కథారచయిత పెద్దింటి అశోక్‌కుమార్ కీలకోపన్యాసం చేస్తారని పేర్కొన్నారు. ఈ వర్క్‌షాప్‌నకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్, సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి, రచయితలు కాలువ మల్లయ్య, వెల్దండి శ్రీధర్ హాజరవుతారని తెలిపారు.
పంట మార్పిడితో సుస్థిర ఆదాయం
బోయినపల్లి(చొప్పదండి): రైతులు పంట మార్పిడితో సుస్థిర ఆదాయం పొందవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బోయినపల్లి రైతువేదికలో బుధవారం రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. వానాకాలం సాగుకు రైతులను సమాయత్తం చేసేందకు వీలుగా పలు అంశాలపై వారికి అవగాహన కల్పించారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను సాగుచేయాలని సూచించారు. ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ మదన్‌మోహన్‌రెడ్డి, ఏడీఏ రామారావు, శాస్త్రవేత్త రాజేంద్రప్రసాద్, ఎంఏవో ప్రణిత, మండల పశువైద్యాధికారి సతీశ్, ఏఈవోలు శ్రీదేవి, లక్ష్మణ్, రావెప్ విద్యార్థులు ఉన్నారు.

పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ

పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ