ఓపెన్‌ సిట్టింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ సిట్టింగ్‌

May 5 2025 8:52 AM | Updated on May 5 2025 8:52 AM

ఓపెన్

ఓపెన్‌ సిట్టింగ్‌

సిరిసిల్ల: జిల్లాలో మందుబాబులు బహిరంగంగానే మద్యం తాగుతున్నారు. జిల్లా కేంద్రం శివారులోని పెద్దూరు, రాజీవ్‌నగర్‌, చిన్నబోనాల, చంద్రంపేట, రెండోబైపాస్‌ రోడ్డు ప్రాంతాలు సాయంత్రం అయితే చాలు మందుబాబులతో హడావుడిగా మారిపోతున్నాయి. వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటిబాట పట్టిన మహిళలు మందుబాబుల కనిపిస్తుండడంతో భయాందోళన చెందుతున్నారు. మరికొందరైతే ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడే మందుబాటిళ్లతో సిట్టింగ్‌ పెడుతున్నారు. ప్రధానంగా కార్మిక క్షేత్రం సిరిసిల్ల పట్టణం శివారు కాలనీలో ఈ పరిస్థితులు ఉన్నాయి. చంద్రంపేట బస్టాండ్‌కు సమీపంలోనే ఓ బెల్ట్‌షాపులో ఓపెన్‌గానే మద్యం సిట్టింగ్‌లు పెడుతున్నారు. పెద్దూరు శివారులో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి.

గ్రామాల్లో బెల్ట్‌జోరు

మండల కేంద్రాల్లో వైన్‌షాపులకు అనుబంధంగా సిట్టింగ్‌ రూమ్స్‌ ఉండగా.. గ్రామాల్లో అనధికారికంగా నిర్వహిస్తున్న బెల్టుషాపుల్లోనూ బార్లను తలపించేలా సిట్టింగ్‌లు ఉంటున్నాయి. గ్రామాల్లోని బెల్టుషాపుల నిర్వాహకులు ఎక్కువ మందు విక్రయించుకునేందుకు మందుబాబుల కోసం టేబుళ్లు, కుర్చీలు, కూలర్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గ్రామంలో ఐదు నుంచి పది వరకు అనధికారిక బెల్టుషాపులు ఉన్నాయి. ప్రతీ షాపులో రోజుకు తక్కువకు తక్కువగా రూ.10వేల వరకు మందు విక్రయిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో అనధికారికంగా బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. ముస్తాబాద్‌ మండలం ఆవునూర్‌, కొండాపూర్‌ గ్రామాల్లో అయితే అర్ధరాత్రి సైతం బెల్టుషాపుల్లో మందుబాబులు కనిపిస్తున్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని చెరువుకట్టలే అడ్డాలుగా మందుబాబులు బహిరంగంగానే మద్యం తాగుతున్నారు. పోలీసులు బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నా మందుబాబులు మారడం లేదు.

జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం

గ్రామ శివారులు, వాగులే అడ్డాలు

దాడులు చేస్తున్నా ఆగని మందుబాబులు

ఓపెన్‌ సిట్టింగ్‌ 1
1/3

ఓపెన్‌ సిట్టింగ్‌

ఓపెన్‌ సిట్టింగ్‌ 2
2/3

ఓపెన్‌ సిట్టింగ్‌

ఓపెన్‌ సిట్టింగ్‌ 3
3/3

ఓపెన్‌ సిట్టింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement