సింగరేణి స్టేడియానికి ఆధునిక హంగులు | - | Sakshi
Sakshi News home page

సింగరేణి స్టేడియానికి ఆధునిక హంగులు

May 29 2025 1:27 AM | Updated on May 29 2025 1:27 AM

సింగర

సింగరేణి స్టేడియానికి ఆధునిక హంగులు

రూ.2కోట్లు ప్రకటించిన

సీఎండీ బలరామ్‌

ప్రత్యేక సంస్థతో

ప్రతిపాదనల రూపకల్పన

త్వరలో తుదిరూపం వచ్చే అవకాశం

సింథటిక్‌ ట్రాక్‌తోపాటు

స్టేడియం విస్తరణకు చర్యలు

కొన్ని సంగరేణి క్వార్టర్లను కూడా

తొలగించే అవకాశం

గోదావరిఖని: క్రీడాకారులకు అనుగుణంగా సింగరేణి స్టేడియాన్ని ఆధునిక హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని యాజమాన్యం నిర్ణయించింది. సింథటిక్‌ వాకింగ్‌ట్రాక్‌తో పాటు క్రికెట్‌ ప్లే గ్రౌండ్‌, వాలీబాల్‌ కోర్టు, ట్రాక్‌ విస్తరణ కోసం మైదాన్ని విస్తరించాలని కూడా నిర్ణయించింది. ఇందుకోసం సీఎండీ బలరాం ఇటీవల రూ.2కోట్లు ప్రకటించారు. దీంతో రాబోయే తరానికి ఉపయోగపడేలా సింగరేణి జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం స్టేడియంలోని కట్టడాలు, రాబోయే రోజుల్లో విస్తరిస్తే ఎలా మార్చాల్సి ఉంటుందనే అంశంపై నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఈమేరకు స్పోర్ట్స్‌ అథారిటీ కంపెనీ ప్రతినిధులు మంగళవారం స్టేడియాన్ని పరిశీలించారు.

సింథటిక్‌ ట్రాక్‌పైనే దృష్టి..

ప్రధానంగా సింథటిక్‌ వాకింగ్‌ ట్రాక్‌పై యాజమాన్యం దృష్టి సారించింది. 400 మీటర్ల వాకింగ్‌ ట్రాక్‌ లేదా 800మీటర్ల వాకింగ్‌ట్రాక్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మైదానం చుట్టూ సింథటిక్‌ వాకింగ్‌ట్రాక్‌, మధ్యలో క్రికెట్‌ గ్రౌండ్‌, ఫుట్‌బాల్‌ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

క్వార్టర్ల తొలగింపుపై ఆలోచన

జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం విస్తరణలో భాగంగా మైదానాన్ని ఆనుకుని ఉన్న సీఈఆర్‌క్లబ్‌ ఎదుట గల సింగరేణి క్వార్టర్లను తొలగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే స్టేడియం వెనకాల ఉన్న కొన్ని క్వార్టర్లను కూడా తొలగించే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి స్పోర్ట్స్‌ అథారిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం

జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం అభివృద్ధి కోసం రూ.2కోట్లు కేటాయిస్తారు. ఈప్రాంత క్రీడాకారులతోపాటు సింగరేణి ఉద్యోగులకు అనుకూలంగా స్టేడియంలో అన్నిఏర్పాట్లు చేస్తాం. సింథటిక్‌ వాకింగ్‌ట్రాక్‌ ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఎమ్మెల్యే సూచనల మేరకు ఈప్రాంత క్రీడాకారుల కోసం స్టేడియం విస్తరణ పనులు శరవేగంగా సాగుతాయి.

– లలిత్‌కుమార్‌, ఆర్జీ–1 జీఎం

సింగరేణి స్టేడియానికి ఆధునిక హంగులు 1
1/1

సింగరేణి స్టేడియానికి ఆధునిక హంగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement