కోర్టు ఆవరణలో ఆటో దొంగిలించిన వ్యక్తి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

కోర్టు ఆవరణలో ఆటో దొంగిలించిన వ్యక్తి అరెస్ట్‌

May 29 2025 1:25 AM | Updated on May 29 2025 1:25 AM

కోర్ట

కోర్టు ఆవరణలో ఆటో దొంగిలించిన వ్యక్తి అరెస్ట్‌

జగిత్యాలక్రైం: జిల్లా కోర్టు ఆవరణలో పార్కింగ్‌ చేసిన ఆటోను దొంగిలించిన నిజామాబాద్‌ జిల్లాకేంద్రంలోని గౌతమినగర్‌కు చెందిన జిలకర ప్రసాద్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ వేణుగోపాల్‌ తెలిపారు. నిర్మల్‌ జిల్లా దస్తురాబాద్‌ మండలం బుట్టపూర్‌కు చెందిన మగ్గిడి కృష్ణ ఈనెల 26న జగిత్యాల కోర్టు ఆవరణలో ఆటోను పార్కింగ్‌ చేశాడు. దానిని ప్రసాద్‌ చాకచక్యంగా దొంగిలించాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఈనెల 27న పట్టణ ఎస్సై గీత జిల్లాకేంద్రంలోని గాంధీనగర్‌ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ప్రసాద్‌ ఆటోలో వస్తూ అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడిన ఉంచి ఆటోను స్వాధీనం చేసుకుని నిందితుడిని బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎస్సై గీత, కానిస్టేబుళ్లు జీవన్‌, అనిల్‌, వంశీ పాల్గొన్నారు.

ఉద్యమకారులను ఆదుకోవాలి

పెద్దపల్లిరూరల్‌: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించి అన్నివిధాలా ఆదుకోవాలని ఉద్యమకారుల ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఐలయ్య కోరారు. స్థానిక అమరవీరుల స్తూపం వద్ద బుధవారం ఉద్యమకారులతో కలిసి నివాళి అర్పించారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత తమకు ప్రాధాన్యత దక్కుతుందని ఆశపడితే అప్పటి సీఎం ఉద్యమకారులను విస్మరించారని విమర్శించారు. కేవలం తమ కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చుకున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనైనా తమకు మేలు కలిగేలా చూడాలని కోరారు. ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌, నాయకులు సారయ్య, నల్ల మనోహర్‌రెడ్డి, రాజేశం, జ్యోతి, చంద్రకళ, సురేందర్‌రెడ్డి, భాస్కర్‌, సదాశివ, రాజిరెడ్డి, రాజు, కృష్ణ, సదయ్య తదితరులు ఉన్నారు.

ఫాజుల్‌నగర్‌ ప్రాంతంలో

పులి ఆనవాళ్లు

వేములవాడరూరల్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని ఫాజుల్‌నగర్‌ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లు ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈవిషయంపై వేములవాడ ఎఫ్‌ఆర్‌వో కలీలొద్దీన్‌ను వివరణ కోరగా వేములవాడ, కొడిమ్యాల, చందుర్తి ఫారెస్ట్‌ ప్రాంతంలో పులి తిరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోజుకు పులి 35 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని, అది ఫారెస్టు ప్రాంతంలో అనుకూలమైన ప్రాంతానికి వెళ్తుందని తెలిపారు.

కోర్టు ఆవరణలో ఆటో  దొంగిలించిన వ్యక్తి అరెస్ట్‌
1
1/1

కోర్టు ఆవరణలో ఆటో దొంగిలించిన వ్యక్తి అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement