
15 గంజాయి కేసుల్లో నిందితుడి అరెస్ట్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో 15 గంజాయి కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎండీ హమ్మద్ (23)ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. మంగళవారం వివరాలు వెల్లడించారు. జిల్లాలోని సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి, బోయినపల్లి, చందుర్తి పోలీస్‌స్టేషన్ల పరిధిలో 15 కేసుల్లో హమ్మద్ నిందితుడని వివరించారు. సిరిసిల్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాలుగు, చందుర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మరో కేసులో పరారీలో ఉన్నాడని ఎస్పీ వివరించారు. హమ్మద్ సిరిసిల్లకు వస్తున్నాడనే సమాచారం మేరకు టౌన్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో విద్యానగర్‌లోని ఎల్లమ్మ చౌరస్తా వద్ద పట్టుకుని రిమాండ్‌కు తరలించామని ఎస్పీ తెలిపారు.
గంజాయి నిరోధానికి సహకరించండి
జిల్లాలో గంజాయి రవాణాపై పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. గంజాయి నిరోధానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములై సహకరించాలన్నారు. జిల్లాలో గంజాయి విక్రయించినా, సాగు చేసినా, రవాణా చేసినా, సేవించిన వారి సమాచారం 87126 56392 నంబర్‌కు అందించాలని ఎస్పీ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతానమి తెలిపారు. సమావేశంలో టౌన్ సీఐ కృష్ణ, కానిస్టేబుళ్లు శ్రీకాంత్, ఇంతియాజ్ ఉన్నారు.
ఐదు కేసుల్లో పరారీ
గంజాయి నిరోధానికి సమాచారం ఇవ్వండి: ఎస్పీ మహేశ్ బీ గీతే