
కానిస్టేబుల్ నుంచి ఎస్సైగా..
హుజూరాబాద్ మండలం రాంపూర్‌కు చెందిన వేముల లక్ష్మణ్ తల్లి అరుణ కూలీ పని చేస్తుండగా, తండ్రి సోడాలు విక్రయిస్తుంటాడు. ఇంటర్ వరకు చదివిన లక్ష్మణ్ 2018లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. కరీంనగర్, సిరిసిల్లలో విధులు నిర్వర్తిస్తూనే ఓపెన్ డిగ్రీ పూర్తి చేశారు. సిరిసిల్లలో మూడేళ్ల క్రితం పీసీగా పనిచేసిన లక్ష్మణ్ అదే స్టేషన్‌లో ట్రెయినీ ఎస్సైగా వచ్చారు. ప్రస్తుతం ఎల్లారెడ్డిపేట పీఎస్సైగా పనిచేస్తున్నారు. కూలీ పనులు చేసుకునే కుటుంబం నుంచి కానిస్టేబుల్‌గా, ఎస్సైగా ఎదిగిన లక్ష్మణ్ నేటి యువతకు స్ఫూర్తికి నిలుస్తున్నారు. లక్ష్మణ్ కవల సోదరుడైన రామ్ మిషన్ భగీరథలో ఏఈఈ, మరో సోదరుడు ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు.