
వారసత్వ పనిని ఇప్పించాలి
మాది తిప్పాపురం. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయంలో 60 ఏళ్లుగా మా వంశానికి చెందిన వారు 8 పాళ్లుగా పట్నాలు వేస్తున్నాం. అయితే మూడేళ్లుగా మా కులస్తులు ఎనిమిది పాళ్లు కాదని కొడుకులున్నోళ్లు మొత్తంగా 26 పాళ్లు చేశారు. నా కొడు కు అనారోగ్యంతో ఉంటున్నాడు. నాకు పాలు క ల్పించాలని కోరితే వారు ఒప్పుకోవడం లేదు. ఈ విషయమై వేములవాడ ఆలయ ఈవో సైతం వారికి చెప్పారు. అయినా వినడం లేదు.
– పి.అంజలి, వేములవాడ
ఉపాధి కల్పించాలి
మాది రగుడు గ్రామం. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన దివ్యాంగుడిని. మా నాన్న చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. అమ్మే నన్ను ఐటీఐ వరకు చదివించింది. ప్రస్తుతం లైసెన్స్‌డ్ సర్వేయర్‌కు దరఖాస్తు తీసుకున్నారు. నాకు లైసెన్స్‌డ్ సర్వేయర్‌గా ఉద్యోగం కల్పించి ఆదుకోవాలి.
– బూర మధు, రగుడు
చెరువుకట్టలు పునర్ నిర్మించాలి
గ్రామ శివారులోని పెద్దచెరువు, కొత్తచెరువులో పూడిక తీయాలి. పూడిక తీయగా చెరువు లోతు పెరుగుతుంది. పూడిక తీయకపోవడంతో చిన్నవర్షాలకే నిండి మత్తడి దూకుతున్నాయి. వెంటనే వాటిలో పూడిక తీసి కట్టలను పునర్ నిర్మించాలి. ఫలితంగా చెరువులోంచి నీరు వృథాపోకుండా అరికట్టవచ్చు.
– రవీందర్, చిన్నబోనాల

వారసత్వ పనిని ఇప్పించాలి

వారసత్వ పనిని ఇప్పించాలి