
జ్వరం..ఒళ్లునొప్పులు
సిరిసిల్లటౌన్: జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. పల్లె..పట్నం తేడా లేకుండా జనాలు మంచం పడుతున్నారు. మండుటెండలు ఒక వైపు.. కురుస్తున్న వర్షాలు మరో వైపుతో వాతావరణంలో తీవ్రమార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా దోమలు పెరిగి జ్వరాలు వస్తున్నాయి. నీరు, ఆహారం కలుషితమై విరోచనాలు, మలేరియా, డెంగీ వ్యాధులు వస్తున్నాయి. జ్వర బాధితులతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. జిల్లా ఆస్పత్రికే నిత్యం 700 వరకు రోగులు ఓపీ సేవలు పొందుతున్నారు. వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో డెంగీ కేసులు బయటపడుతుండడం జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
లక్షణాలు..చికిత్స
సాధారణం నుంచి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు, వాంతులు, విరోచనాలు, కండ్లు లాగడం వంటి లక్షణాలతో జ్వరాలు వ్యాపిస్తున్నాయి. మూత్రంలో రక్తం రావడం, నాలుక నల్లబారడం, జ్వరం తగ్గకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో వెంటనే ఆస్పత్రిలో వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ఎన్‌ఎస్‌ఐ ఏజీ టెస్టు పాజిటివ్ వస్తే డెంగీ మొదటి దశలో ఉందని అర్థం. ఈ దశలో రెండు, మూడు రోజులు ఉంటుంది. ఐజీహెచ్ టెస్టు పాజిటివ్ వస్తే మోడరేట్ టు సివియర్‌గా పరిగణించి చికిత్స అందిస్తారు. ఈసమయంలో జాగ్రత్తలు తీసుకో వాల్సి ఉంటుంది. అన్ని రకాల జ్వరాలకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందుబాటులో ఉంది. ప్రైవేటుకు వెళ్లాల్సిన అవసరం లేదు. జ్వరాల తీవ్రత పెరిగితే జిల్లా ఆస్పత్రిలో కార్పొరేట్ వైద్యానికి దీటుగా మూడు షిఫ్టుల్లో 24 గంటలపాటు సిబ్బంది వైద్యసేవలు అందిస్తున్నారు. జిల్లాలో జ్వరాల తీవ్రత దృష్ట్యా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా వైద్యశాఖను అప్రమత్తం చేశారు.
వణికిస్తున్న వైరల్, డెంగీ కేసులు
జిల్లా ఆస్పత్రికి పోటెత్తుతున్న రోగులు
నిత్యం 700 మందికి పైగా ఔట్‌పేషంట్లు
ప్లేట్‌లెట్స్ తగ్గడంతో జనాలు బెంబేలు
ఈమె వీర్నపల్లి మండలం కంచర్లకు చెందిన దండుగుల లక్ష్మి. నాలుగు రోజుల క్రితం చాతి, తలనొప్పి తో పాటు పక్కబొక్కలు నొప్పిలేశాయి. విపరీతమైన జ్వరం వచ్చింది. ఊరిలోకి వైద్యశాఖ నుంచి వచ్చినోళ్లు గోలీలు ఇచ్చినా తగ్గలేదు. ఇంట్లో వాళ్లు వెంటనే సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చి పరీక్షలు చేశారు. ర్యాపిడ్ టెస్టులో డెంగీ పాజిటివ్ వచ్చింది. ఇన్‌పేషెంటుగా చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు.
డెంగీ నుంచి కోలుకుంటున్న
ఎనిమిది రోజుల క్రితం తలనొప్పి, కండ్లు గుంజుడం.. నడుం నొప్పి వచ్చింది. జ్వరం ఎక్కువైంది. జిల్లా ఆస్పత్రికి వచ్చినం. ఇక్కడ ఎలీసా టెస్టు చేస్తే పాజిటివ్ రావడంతో వైద్యం అందించారు.ఎలాంటి ఖర్చు లేకుండానే డెంగీ జ్వరం నుంచి కోలుకుంటున్న.
– మిర్యాల మంజుల, కంచర్ల
మెరుగైన చికిత్స అందిస్తున్నాం
ఇటీవల రెండు డెంగీ పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇతర విషజ్వరాలతో కూడా రోగులు వస్తున్నారు. ఆస్పత్రిలో అన్ని రకాల మందులు ఉన్నాయి. ఫ్లూయిడ్స్, ఇంజక్షన్లు, ఓఆర్‌ఎస్‌లు, యాంటిబయాటిక్స్ ఉన్నాయి. వెంటిలేటర్, ఆక్సిజన్ సౌకర్యం ఉంది. ఐసీయూలో పది పడకలు కేటాయించాం. జిల్లా ఆస్పత్రిలో అన్ని విభాగాల వైద్యులతో చికిత్స అందిస్తున్నాం. ప్రైవేటు కన్నా మెరుగ్గా వైద్యం అందిస్తున్నాం. – డాక్టర్ లక్ష్మీనారాయణ,
సూపరింటెండెంట్ జిల్లా ఆస్పత్రి, సిరిసిల్ల
ఈమె వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన శశికళ. ఈనెల 16న తీవ్ర జ్వరం, వాంతులు, ఒళ్లు నొప్పులతో సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి వచ్చింది. ర్యాపిడ్ టెస్టు చేయగా డెంగీ పాజిటివ్‌గా తేలింది. వైద్యులు వెంటనే ట్రీట్‌మెంట్ ప్రారంభించారు. ప్లేట్‌లెట్స్ సంఖ్య పడిపోకుండా 24 గంటలు సిబ్బంది పర్యవేక్షణలో చికిత్స అందుతోంది.

జ్వరం..ఒళ్లునొప్పులు

జ్వరం..ఒళ్లునొప్పులు

జ్వరం..ఒళ్లునొప్పులు

జ్వరం..ఒళ్లునొప్పులు

జ్వరం..ఒళ్లునొప్పులు