రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, బాబు జగ్జీవన్‌రామ్ వ్యవసాయ కళాశాల జిల్లెల్ల ఆధ్వర్యంలో చీర్లవంచలో సోమవారం రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులు పంటలకు సిఫారసు చేసిన మోతాదులోనే యూరియాను వినియోగించాలన్నారు. పచ్చిరొట్ట ఎరువులు, వర్మీకంపోస్టు, పేడ ఎరువులను వినియోగించాలన్నారు. చీడపీడల ఉధృతిని బట్టి సరైన మోతాదులో రసాయనిక మందుల వాడడంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బాబు జగ్జీవన్‌రామ్ వ్యవసాయ కళాశాల వ్యవసాయ శాస్త్రవేత్తలు డా.రజియా సుల్తానా, కె.భవ్యశ్రీ, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, మండల వ్యవసాయ అధికారి కె.సంజీవ్, ఏఈవో కరుణాకర్, మౌనిక, విత్తన అధికారి మౌనిక, విద్యార్థులు మణికంఠ, శాలిని, రైతులు పాల్గొన్నారు.


