రాజన్నకు శోభ.. నేతన్నకు ధీమా
డెవలప్‌మెంట్
వాచ్
ఏడాదిలో అభివృద్ధి అడుగుజాడలు
వేములవాడలో ఆలయ విస్తరణకు శ్రీకారం
నేతన్నలకు యారన్ బ్యాంకు
‘ఇందిరా మహిళా శక్తి’ చీరల ఆర్డర్లతో ఉపాధి
బీడు భూములకు మల్కపేట నీరు
అపెరల్ పార్క్‌లో మహిళలకు మరో ఉపాధి కేంద్రం
నర్మాలలో బిస్కట్ తయారీ పరిశ్రమ ప్రారంభం
ఇందిరా మహిళా శక్తి చీరను ప్రదర్శిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు(ఫైల్)
వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులు(ఫైల్)
సిరిసిల్ల: కాలగమనంలో మరో ఏడాది కలిసిపోతుంది. 2025లో జిల్లాలో అభివృద్ధి పనులకు అడుగుజాడలు పడినా.. ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై చర్చ సాగుతూనే ఉంది. అభివృద్ధి విషయంలో అనేక అంశాలు మన కళ్ల ముందు మెదులుతున్నాయి.
800 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులకు ఈ ఏడాది అడుగులు పడ్డాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేములవాడకు వచ్చి శంకుస్థాపన చేసిన పనుల్లో భాగంగా రూ.76కోట్లతో పనులు సాగుతున్నాయి. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో ఆలయ అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. వచ్చే వందేళ్లకు సరిపడే వసతులతో అభివృద్ధి చేయాలని ప్రణాళికతో పనులు సాగుతున్నాయి. ఇరుకుగా ఉన్న వేములవాడ పట్టణ రోడ్లను ఎన్నడూ లేని విధంగా విస్తరిస్తున్నారు. దశాబ్దాలుగా రాజకీయ క్రీనీడలో రోడ్ల విస్తరణ ప్రహసనంగా మారింది. కానీ ఈసారి ఏకంగా అడుగులు పడ్డాయి. రోడ్డు విస్తరణలో ఇళ్లు నష్టపోతున్న వారికి రూ.40కోట్లు పరిహారంగా అందించారు. రోడ్డు నిర్మాణానికి రూ.8.50కోట్లు కేటాయించారు. ఆలయంలో నిత్యపూజలు కొనసాగిస్తూనే భీమన్న ఆలయంలో దర్శనాలు చేయిస్తున్నారు.
వస్త్రోత్పత్తిదారులకు అరువుపై నూలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ మార్కెట్‌యార్డులో నూలుడిపో ఏర్పాటు చేసింది. ప్రభుత్వమే నేరుగా నూలు కొని నేతన్నలకు అందిస్తుంది. ఈ ఏడాది 1.20కోట్ల మహిళలకు ‘ఇందిరా మహిళా శక్తి’ చీరలు ఇచ్చేందుకు నేతన్నలకు ఆర్డర్లు ఇచ్చింది. ఇప్పటికే టెస్కో అందించిన రెండు ఆర్డర్లు పూర్తయ్యాయి. మూడో ఆర్డర్ చీరల ఉత్పత్తి మొదలైంది. వస్త్రోత్పత్తి రంగానికి రూ.550 కోట్ల విలువైన ఆర్డర్లను ప్రభుత్వం అందించింది. ప్రభుత్వమే నాణ్యమైన నూలు అరువుపై అందించడంతో మధ్యతరగతి వస్త్రోత్పత్తిదారులకు ఊరట లభించింది. మరోవైపు ఇతర ప్రభుత్వ శాఖల వస్త్రాల ఆర్డర్లు, స్కూల్ యూనిఫామ్స్ ఆర్డర్లు యథావిధిగా అందా యి. నేతన్నలకు ‘వర్కర్ టు ఓనర్’ అమలైతే నిరుపేద నేతకార్మికులకు శాశ్వత ఉపాధి దొరుకుతుంది. వస్త్రోత్పత్తి ఆర్డర్లు ‘పుండు ఒక్క చోట ఉంటే.. మందు మరో చోట’ రాసినట్లుగా మారుతుంది.
రాజన్నకు శోభ.. నేతన్నకు ధీమా


