అందుబాటులో సాగుకు సరిపడా యూరియా | - | Sakshi
Sakshi News home page

అందుబాటులో సాగుకు సరిపడా యూరియా

Dec 30 2025 7:02 AM | Updated on Dec 30 2025 7:02 AM

అందుబ

అందుబాటులో సాగుకు సరిపడా యూరియా

● ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ● ఎస్పీ మహేశ్‌ బీ గీతే ● ఏఎస్పీ రుత్విక్‌సాయి ఉత్తమ సేవలకు గుర్తింపు స్టాండింగ్‌ కౌన్సెల్‌ దరఖాస్తుల గడవు పొడగింపు

● ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల: జిల్లాలో యాసంగి సీజన్‌ పంటల సాగుకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ సోమవారం తెలిపారు. యూరియా విషయమై రైతులు ఆందోళన చెందొద్దన్నారు. పంటల సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు సరఫరా చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎరువులు పక్కదారి పట్టకుండా చూడాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని సొసైటీలు, ప్రైవేటు డీలర్ల వద్ద యూరియా అందుబాటులో ఉందన్నారు. జిల్లాలో యాసంగి సాగుకు 21 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటి దాకా 10,991 మెట్రిక్‌ టన్నులు పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో ప్రైవేటు డీలర్లు 223, సహకారం సంఘాల(పీఏసీఎస్‌) షాపులు 54, డీసీఎంఎస్‌ దుకాణాలు 16, ఏఆర్‌ఎస్‌కే పరిధిలో 13 ఎరువుల షాపులు ఉన్నాయని వెల్లడించారు. అన్ని షాప్‌లలో రోజూ ఉదయం ఆరు గంటల నుంచి విక్రయాలు మొదలుపెట్టాలన్నారు. ఎరువులకు సంబంధించిన సమస్యలు ఉంటే రైతులు టోల్‌ ఫ్రీ నంబరు 18005995779లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఆనందోత్సాహాల మధ్య వేడుకలు చేసుకోవాలి

సిరిసిల్ల క్రైం: జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఎస్పీ మహేశ్‌ బీ గీతే సూచించారు. న్యూ ఇయర్‌ వేడుకల పేరుతో ప్రజాభద్రతకు భంగం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. డిసెంబర్‌ 31న జిల్లా వ్యాప్తంగా డ్రంకెన్‌ డ్రైవ్‌, వాహన తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు, అధిక శబ్ద పరికరాలు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డీజేలపై నిషేధం అమలులో ఉంటుందని తెలిపారు.

భక్తులకు సంపూర్ణ రక్షణ

వేములవాడ: రాజన్న, భీమన్న దర్శనాలకు వచ్చే భక్తులకు, ముక్కోటి ఏకాదశి సందర్భంగా వచ్చే వారికి సంపూర్ణ రక్షణ కల్పిస్తామని ఏఎస్పీ రుత్విక్‌సాయి పేర్కొన్నారు. భీమన్నగుడి ప్రాంతం, భీమేశ్వర సదన్‌, క్యూలైన్లు, తాత్కాళిక ఉత్తరద్వారం, జాతర సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించే ప్రాంతాలను సోమవారం ఈవో రమాదేవితో కలిసి పరిశీలించారు. చేపట్టాల్సిన బందోబస్తుపై టౌన్‌ సీఐ వీరప్రసాద్‌, ట్రాఫిక్‌ ఎస్సై రాజుకు దిశా నిర్ధేశం చేశారు.

గంభీరావుపేట(సిరిసిల్ల): అంతర్జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా ఉత్తమ సేవలందిస్తున్న సింగిల్‌విండోలను గుర్తించారు. గంభీరావుపేట, ఇల్లంతకుంట సింగిల్‌విండోలను ఎంపిక చేశారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చేతుల మీదుగా కొండూరు రవీందర్‌రావు, రాజిరెడ్డి ప్రశంసాపత్రాలు అందుకున్నారు.

వేములవాడ: వేములవాడ మున్సిపాలిటీకి స్టాండింగ్‌ కౌన్సెల్‌ నియామకానికి సంబంధించి న్యాయవాదుల ప్యానెల్‌ దరఖాస్తుల సమర్పణ గడవును జనవరి 3 వరకు పొడగించారు. ఈమేరకు సీనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌కుమార్‌ జాదవ్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు అందిన దరఖాస్తుల్లో ఓసీ 1, బీసీ 2, ఎస్సీ 2 మాత్రమే అందాయని పేర్కొన్నారు. మహిళల కేటగిరీ దరఖాస్తు అందకపోవడంతోపాటు ఎస్టీ కేటగిరీకి చెందిన ఒక దరఖాస్తు తిరిగి పంపించినట్లు పేర్కొన్నారు. ఒక మహిళా కేటగిరీ, ఒక ఎస్టీ కమ్యూనిటీ దరఖాస్తు కోసం గడవు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అందుబాటులో సాగుకు సరిపడా యూరియా
1
1/3

అందుబాటులో సాగుకు సరిపడా యూరియా

అందుబాటులో సాగుకు సరిపడా యూరియా
2
2/3

అందుబాటులో సాగుకు సరిపడా యూరియా

అందుబాటులో సాగుకు సరిపడా యూరియా
3
3/3

అందుబాటులో సాగుకు సరిపడా యూరియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement