ఎన్నికలతో ముగిసి..!
ఎమ్మెల్సీ, పంచాయతీ ఎన్నికలతో సందడి
వేములవాడ ఆలయంలో నిలిచిన దర్శనాలు
ట్యాపింగ్ కేసులో విచారణకు బండి, ఈటల
వామనరావు దంపతుల హత్య కేసులో సీబీఐ
క్రిప్టో కరెన్సీ పేరిట రూ.వందల కోట్ల వసూళ్లు
మయన్మార్‌లో చిక్కుకున్న 540 మంది విడుదల
ఆటలతో మొదలై..
పోలీస్ స్పోర్ట్స్ మీట్‌తో మొదలైన 2025.. ఎమ్మెల్సీ ఎన్నికలతో వేగం అందుకుని, పంచాయతీ ఎన్నికలతో ప్రశాంతంగా ముగిసింది. దక్షిణకాశీగా పిలిచే వేములవాడలో దర్శనాలు నిలిపివేయడం భక్తులకు తీవ్ర అసౌకర్యం కల్పించినా.. ఆలయాభివృద్ధి కోసం తప్పలేదు. సీబీఐ వామనరావు దంపతుల కేసు.. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంపై విచారణ ప్రారంభించింది. క్రిప్టో కరెన్సీ పేరిట వెలుగుచూసిన రెండు కుంభకోణాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కుదిపేశాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్, కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్‌ను ‘సిట్’ విచారించింది.
– సాక్షి ప్రతినిధి, కరీంనగర్


