
లే అవుట్ స్థలం మాయం చేశారు
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని లే అవుట్ స్థలాన్ని గత ప్రభుత్వ హయాంలో పెద్దల అనుయాయులు మాయం చేశారు. సర్వేనంబరు 525, 530/సీలో ఫైల్ నంబరు 1828/80లో 121 గజాల స్థలం ప్లాట్ నంబరు 13ను మున్సిపల్‌కు చెందిందిగా పేర్కొన్నారు. దాని విలువ రూ.40లక్షలు ఉంటుంది. కబ్జాకు గురైన మున్సిపల్ లే అవుట్ స్థలాన్ని గుర్తించి మున్సిపల్‌కు అప్పగించేలా చర్యలు తీసుకోవాలి.
– నాగుల శ్రీనివాస్, సిరిసిల్ల
ధాన్యం తరుగు అరికట్టాలి
మా గ్రామంలో ధాన్యం కొనుగోళ్లలో తరుగు తీస్తున్నారు. ఎందుకు తీయాల్సి వస్తుందో కూడా వివరణ ఇవ్వడం లేదు. నాతోపాటు గ్రామానికి చెందిన రైతులు ఓన్సులాల్, సజన్‌లాల్‌కు చెందిన 710 బస్తాలను లారీలో మిల్లుకు తరలించగా వాటిలోంచి 21 బస్తాలు తరుగు తీసినట్లు చెబుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో తరుగుపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
– భూక్య గజన్‌లాల్, వీర్నపల్లి

లే అవుట్ స్థలం మాయం చేశారు