ఆలయాల అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

ఆలయాల అభివృద్ధికి కృషి

May 7 2025 12:03 AM | Updated on May 7 2025 12:03 AM

ఆలయాల అభివృద్ధికి కృషి

ఆలయాల అభివృద్ధికి కృషి

● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్‌కుమార్‌

ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట(సిరిసిల్ల): జిల్లాలో ఆలయాలను అధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో బద్దిపోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ వేడుకల్లో మంగళవారం పూజలు చేశారు. బండి సంజయ్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆలయాల స్థితిగతులపై నివేదిక సమర్పించాలని దేవాదాయశాఖ అధికారులను కోరినట్లు తెలిపా రు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు చందుపట్ల లక్ష్మారెడ్డి, జిల్లా కార్యదర్శులు మద్దుల బుగ్గారెడ్డి, బందారపు లక్ష్మారెడ్డి, నాయకులు సల్ల సత్యంరెడ్డి, రాగుల గాల్‌రెడ్డి, చందుపట్ల రాజిరెడ్డి, కిరణ్‌నాయక్‌, పొన్నాల తిరుపతిరెడ్డి, నంది నరేశ్‌, సంజీవరెడ్డి, సాయిలు పాల్గొన్నారు.

ధాన్యం పైసలు వెంటనే జమ చేయాలి

ధాన్యం కొని 20 రోజులైనా రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని, వెంటనే జమచేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కోరారు. గంభీరావుపేటలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. వడ్ల కొనుగో లులోనూ రాజకీయ జోక్యం పెరిగిందని, అధికా రులకు స్వేచ్ఛనిచ్చి కొనుగోలు చేపట్టాలని కోరా రు. కొనుగోళ్లపై ప్రశ్నిస్తున్న రైతులపై కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు డబ్బులను కేంద్రమే ఇస్తుంటే రైతులను ఎందుకు అరిగోస పెడుతున్నారని ప్రశ్నించారు.

రథోత్సవానికి రండి..

కొత్తపల్లిలో ఈనెల 13న నిర్వహించే శ్రీవేణుగో పాలస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కు ఆహ్వానపత్రిక అందించారు. నర్మాలలో మడేలేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాల్లో పాల్గొన్నారు. గంభీరావుపేటకు చెందిన దేవసాని కృష్ణ తండ్రి జనార్దన్‌ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ మండలాధ్యక్షుడు గంట అశోక్‌, నాయకులు రాజేందర్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, కోడె రమేశ్‌, కృష్ణకాంత్‌యాదవ్‌, కొక్కు దేవేందర్‌ యాదవ్‌, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement