ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వండి
మాది బుడిగజంగాల కులం. మాకు ఎస్సీ కుల సర్టిఫికెట్లు మొన్నటి వరకు ఇచ్చారు. ఇప్పుడు ముస్తాబాద్ తహసీల్దార్ ఇవ్వడం లేదు. ఎవరో ఫిర్యాదు చేశారని ఆపారట. మాకు ఎస్సీ కుల ధ్రువీకరణపత్రాలను జారీ చేయాలి.
– బుడిగజంగాల ప్రతినిధులు, ముస్తాబాద్
కిలో కోత విధిస్తామంటున్నారు
వడ్లు బస్తాకు 42 కిలోలు తూకం వేశాం. అయినా మళ్లీ బస్తాకు కిలో వడ్లు తగ్గిస్తేనే లారీ నుంచి దించుకుంటామని రైస్‌మిల్లర్ అంటున్నాడు. నాలుగు రోజులుగా లారీని అన్‌లోడ్ చేయడం లేదు. ప్రతీ బస్తాకు ఇప్పటికే అదనపు వడ్లను జోకాం. అయినా.. ఇంకా కోత విధించి రైతులను ముంచాలని చూస్తున్నారు.
– గెంటె మహేశ్, వెంకటాపూర్
ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వండి


