గ్రామాల అభివృద్ధికి సహకారం
● ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బోయినపల్లి(చొప్పదండి): నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి సహకారం అందిస్తామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండలంలోని కొత్తపేట, మల్కాపూర్ గ్రామాల సర్పంచులు ఇల్లెందుల రాజేశం, మడ్లపల్లి తులసితోపాటు మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు మిట్టపల్లి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో శనివారం చేరారు. వీరికి కండువాలు ఎమ్మెల్యే కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డీసీఎ మ్మెస్ మాజీ చైర్మన్ ముదుగంటి సురేందర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వన్నెల రమణా రెడ్డి, మడ్లపల్లి గంగయ్య, దుర్గారెడ్డి, సువీన్‌యాదవ్, సురేందర్‌రెడ్డి, కొలుపుల ప్రవీణ్ ఉన్నారు.
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని వెంకట్రావుపేటకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ గ్రామస్తులు శనివారం సిరిసిల్ల డిపో అధికారులకు వినతిపత్రం అందించారు. గ్రామస్తులు మాట్లాడుతూ వెంకట్రావుపేట మీదుగా కొండాపూర్ వరకు బస్సు నడిపితే రెండు గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. సర్పంచ్ మంతెన గీతాంజలి, ఉపసర్పంచ్ బుట్టి వంశీ, వార్డు సభ్యుడు కుమ్మరి దేవదాస్ పాల్గొన్నారు. వేములవాడ బస్టాండ్ నుంచి కనగర్తి మీదుగా కోనరావుపేట వరకు అదనంగా ఒక ట్రిప్పు వేయాలని సర్పంచ్ మల్యాల స్వామి దాసు, ఉపసర్పంచ్ శంకర్, వార్డు సభ్యులు బెంద్రం శ్రీనివాస్‌రెడ్డి, లింగంపెల్లి ప్రసాద్ కోరారు.
సిరిసిల్లకల్చరల్: జిల్లాకు చెందిన ఇద్దరు కవులకు అలిశెట్టి ప్రభాకర్ సాహిత్య పురస్కారాలు వరించాయి. కథా రచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌ను అలిశెట్టి స్మారకార్థం ఇచ్చే జీవన సాఫల్య పురస్కారానికి ఎంపిక చేసినట్లు జగిత్యాలకు చెందిన కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్యపీఠం నిర్వాహకులు తెలిపారు. మానేరు రచయితల సంఘం సభ్యురాలు, కవయిత్రి మడూరి అనిత సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. జనవరి 11న జగిత్యాలలోని శివసాయి రెసిడెన్సిలో జరిగే కార్యక్రమంలో పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు పీఠం అధినేత గుండేటి రాజు ప్రకటించారు.
సిరిసిల్లటౌన్: కేంద్ర ప్రభుత్వం దేఽశంలోని సహజ సంపదను కార్పోరేట్లకు ముట్టజెప్పుతుందని సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. స్థానిక కార్మిక భవనంలో శనివారం నిర్వహించిన బద్దం ఎల్లారెడ్డి వర్ధంతికి హాజరై నివాళి అర్పించారు. వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై దమనకాండ కొనసాగిస్తుందన్నారు. వందేళ్ల ఉత్సవాలను జనవరి 11న ముస్తాబాద్‌లో, సిరిసిల్లలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతీయ నాయకుడు కలవేణి శంకరన్న, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సుదర్శన్, గుంటి వేణు, కేవీ అనసూర్య, పంతం రవి, మీసం లక్ష్మణ్, సోమ నాగరాజు, తీపిరెడ్డి తిరుపతిరెడ్డి, మంద అనిల్ పాల్గొన్నారు.
సిరిసిల్ల అర్బన్: లెప్రసీ సర్వే డబ్బులతోపాటు గతంలోని బకాయిలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్ చేశారు. జిల్లాలోని ఆశవర్కర్లు శనివారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ ఆశవర్కర్లకు ఫిక్స్‌డ్ వేతనం రూ.18వేలు, డ్యూటీ సమయంలో వాహన సౌకర్యం కల్పించాలని కోరారు. అన్నల్‌దాస్ గణేశ్, మూషం రమేశ్, సూరం పద్మ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి సహకారం
గ్రామాల అభివృద్ధికి సహకారం
గ్రామాల అభివృద్ధికి సహకారం


