తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి
● సర్పంచ్‌లకు ప్రభుత్వం, పార్టీ అండ ● బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాల తప్పుడు ప్రచారాలను క్షేత్రస్థాయిలో సర్పంచ్‌లు తిప్పికొట్టాలని బీసీసంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికై న కాంగ్రెస్ సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమం శనివారం నగరంలోని డీసీసీ ఆఫీస్‌లో జరిగింది. ముఖ్య అతిథి మంత్రి పొన్నం మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలడం, దక్షిణ తెలంగాణ ప్రాజెక్ట్ కట్టకపోవడంపై జవాబు ఇవ్వాల్సి వస్తుందని బీఆర్‌ఎస్ ఎదురుదాడి చేస్తోందని విమర్శించారు. కేంద్రం ఉపాధిహామీ పథకానికి తూట్లు పొడవడం, గాంధీ పేరు తొలగించడంపై ఆదివారం గ్రామాల్లో గాంధీ ఫొటోతో నిరసనలు తెలపాలన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సర్పంచ్‌లు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు బీఆర్‌ఎస్, బీజేపీ విషప్రచారాలు తిప్పికొట్టాలన్నారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ సర్పంచ్‌లుగా 70 శాతానికి పైగా కాంగ్రెస్ గెలిచిందన్నారు. డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, ఎంపీలకు చెక్‌పవర్ ఉండదని, సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఉంటుందని, పాలనలో ప్రధాన పాత్ర ఉంటుందన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల స్ఫూర్తితో వచ్చే నగరపాలకసంస్థ ఎన్నికల్లో 66 డివిజన్‌లకు 40 నుంచి 50 స్థానాలు గెలవాలన్నారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సర్పంచ్‌లను సన్మానించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షు డు వైద్యుల అంజన్‌కుమార్, రాజన్న సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం, అర్బన్ బ్యాంక్‌చైర్మన్ కర్ర రాజశేఖర్, ఆర్‌టీఏ స భ్యుడు పడాల రాహుల్, మాజీ ఎమ్మెల్యేలు కోడూ రి సత్యనారాయణగౌడ్, ఆరెపల్లి మోహన్, వుట్కూ రి నరేందర్‌రెడ్డి, రుద్ర సంతోష్, వొడితెల ప్రణవ్, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, ఉప్పుల అంజనీప్రసాద్ పాల్గొన్నారు.


