శరణమయ్యప్పా
ముస్తాబాద్(సిరిసిల్ల): శరణం అయ్యప్ప.. నామస్మరణతో ముస్తాబాద్‌లోని అయ్యప్ప ఆలయం మారుమోగింది. శనివారం మహామండల పూజ ఉత్సవాలను రాజుగురు స్వామి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. 18వ శబరియాత్ర చేస్తున్న కొండ యాదగిరిగౌడ్, కోయ రాము, శ్రీనివాస్‌రెడ్డి, రామకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. అష్టాదశ కలషాభిషేకం చేశారు. మాజీ ఉపసర్పంచ్ వేముల రవీందర్ అల్పాహారం అందించారు. ఆలయ కమిటీ చైర్మన్ చీటి జితేందర్‌రావు, గురుస్వాములు చక్రధర్‌రెడ్డి, రాజిరెడ్డి, వెంకన్న, నాగరాజు, రాంగోపాల్, రాజిరెడ్డి, బాలసాని శ్రీను, అంజాగౌడ్, మహేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


