దేవయ్యకు గద్దర్ ఐకాన్ అవార్డు
సిరిసిల్లకల్చరల్: జిల్లా కేంద్రానికి చెందిన జానపద గాయకుడు ఆకునూరి దేవయ్యకు సాయి అలేఖ్య సాంస్కృతిక సేవాసంస్థ గద్దర్ ఐకాన్ అవార్డును ప్రదానం చేసింది. రాష్ట్ర భాష, సాంస్కృతికశాఖ సౌజన్యంతో హైదరాబాద్ బిర్లా సైన్స్ సెంటర్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా శనివారం రాత్రి ఈ పురస్కారం అందుకున్నారు. ప్రభుత్వ సలహాదారు సముద్రాల వేణుగోపాలాచారి, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ గద్దర్ వెన్నెల, అలేఖ్య సంస్థ చైర్మన్ ఉపద్రష్ట అరుణఅశోక్, ఉప్పుల శ్రీనివాస్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.


